Riyaz Naikoo
-
నర హంతకుడిగా.. లెక్కల మాస్టారు
న్యూఢిల్లీ : కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చడం చాలా కాలం తర్వాత భారత భద్రతా బలగాలు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న అతడ్ని కశ్మీర్‌లోని సొంత గ్రామంలోనే మట్టుబెట్టడం మరో విజయం. అయితే ఓ లెక్కల మాస్టారు జమ్మూ కశ్మీర్‌కు చెందిన టాప్ మిలిటెంట్ కమాండర్లలో ఒకడిగా మారిన వైనం ఆశ్చర్యకరం. మార్పు తెచ్చిన జైలు జీవితం .. రియాజ్ నైకూ.. పంజ్గామ్లోని నైకూ మొహల్లాలో 1985లో జన్మించాడు. నలుగురు సంతానంలో అతడు రెండో వాడు. ఇంటర్లో 600లకు గానూ 464 మార్కులు తెచ్చుకున్న నైకూ ఇంజనీర్ అవ్వాలని అనుకునేవాడు. కానీ, గ్రాడ్యూయేషన్ అయిపోగానే ఓ ప్రైవేట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా చేరాడు. పేద విద్యార్థులకు ఉచితంగా తరగతలు కూడా చెప్పేవాడు. 2012లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత 2012 జూన్ 6న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. ఇప్పటివరకు అతనిపై 11 కేసులు ఉన్నాయి. ( హిజ్బుల్ కమాండర్ హతం ) భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. అయితే నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లానింగ్‌తో గత మంగళవారం రాత్రి అతన్ని హతమార్చారు. ( కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) -
‘రియాజ్..ఇక నరకంలో హాయిగా నిద్రపో’
న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన భారత సైన్యంపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతం గంభీర్ ప్రశంసలు గుప్పించారు. ‘రియాజ్ ఇక నరకంలో హాయిగా నిద్రపో..భారత సైన్యాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టవద్ద’ని గంభీర్ ట్వీట్ చేశారు. కాగా జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బేగ్‌పురా గ్రామంలో కరుడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను భారీ ఆపరేషన్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను చూసేందుకు రియాజ్ గ్రామానికి వచ్చాడనే సమాచారంతో అతడి ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో రియాజ్‌ను హతమార్చాయి.భారత సైన్యం సేవలను నిరంతరం కొనియాడే గౌతం గంభీర్ ఈ ఘటనను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు గట్టి సందేశం పంపారు. భారత సైన్యంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. చదవండి : ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత: గంభీర్ Sleep well in hell #RiyazNaikoo! Never provoke #IndianArmy! — Gautam Gambhir (@GautamGambhir) May 6, 2020 -
కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్ : ఈ ఏడాది జనవరి నుంచి భద్రతాబలగాలు జరిపిన మొత్తం 27 ఆపరేషన్లలో 64 మంది ఉగ్రవాదులను ఏరివేశామని కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న మరో 25 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని చెప్పారు. గత ఆరునెలలుగా కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్ రియాజ్ నైకూ(32) కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన రియాజ్ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే బుధవారం హతమయిన విషయం తెలిసిందే. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, గత నెల రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్తోపాటూ మొత్తం 18మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. -
హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సాగిందిలా.. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు. -
హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజహిదీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకూ మరణించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ ఎనిమిదేళ్లుగా భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్నాడు. రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చాడన్న సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రియాజ్‌ను మట్టుబెట్టాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టి బీగ్‌బోరా గ్రామాన్ని జల్లెడపడుతుండగా ఎన్కౌంటర్ జరిగిందని ఇది బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. బేగ్‌పురాలోని తన ఇంటిలో రియాజ్ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి. కశ్మీర్లో మిలిటెన్సీ పోస్టర్ బాయ్‌గా పేరొందని బుర్హాన్ వనీ మరణానంతరం హిజ్బుల్ పగ్గాలను రియాజ్ నైకూ చేపట్టారు. కాగా, పుల్వామాలో నైకూను మట్టుబెట్టిన అనంతరం జిల్లాలోని మరో గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఇక హంద్వారాలో కొద్దిరోజుల కిందట ఉగ్రమూకల దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : భీకర పోరు : ఐదుగురు జవాన్ల మరణం -
సోదరీమణులారా బీ కేర్‌పుల్...
కశ్మీర్: సోషల్ మీడియాలో సైనికులతో చాటింగ్ చేయ్యెద్దంటూ ఇస్తామిక్ ఉగ్రవాద సంస్థ ‘ హిజ్బుల్ ముజాహిదీన్ ’ కశ్మీర్ యువతులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకో ఓ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు కశ్మీర్లో వైరల్ అయింది. ‘ భద్రతా దళాలు, పోలీసులు కశ్మీర్ యువతులో సంబంధం ఏర్పాటు చేసుకొని మా గురించి సమాచారం లాగుతున్నారు. ముఖ్యంగా పాఠశాల యువతను టార్గెట్ చేశారు. వారితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అపరిచితులతో పరిచయాలు పెంచుకోకండి. మీతో చాట్ చేసి మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. వారు అడిగిన సమాచారం చెప్పకపోతే మీ రహస్యాలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సోదరీమణులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. మీ పిల్లలు భద్రతా దళాలతో సంబంధాలు పెట్టుకుంటే మిమ్మల్ని మేము విడిచిపెట్టం జాగ్రత్త’ అని హెచ్చరిస్తూ ఉన్న పది నిమిషాల ఆడియో క్లిప్ జమ్మూ-కశ్మీర్లో వైరల్ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను అందరికి షేర్ చేయాలని కూడా రియాజ్ నైకో కశ్మీర్ యువతను కోరారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆర్మీ మేజర్ నితిన్ లీతుల్ గోగోయ్ శ్రీనగర్‌లోని ఓ హోటల్లో ఓ యువతతో పట్టుబడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారానే వారు పరిచయం అయ్యారు.ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది. గోగోయ్ విషయాన్ని కూడా ఆడియో క్లిప్‌లో గుర్తుచేశారు. -
నెక్ట్స్ టార్గెట్.. వీళ్లే..!?
సాక్షి, కశ్మీర్ : కొంత కాలంగా కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు చాలా దూకుడు మీదున్నాయి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు.. నియంత్రణ రేఖ దాటుతున్న మిలిటెంట్లను ఎక్కడిక్కడ భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా అమర్నాథ్ యాత్రీకులపై దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్‌ను రెండు రోజుల కిందట శ్రీనగర్‌లో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. తాజాగా.. జమ్మూ కశ్మీర్లో హింసను ప్రోత్సహిస్తున్న టాప్-5 మిలిటెంట్ల జాబితాను భద్రతా బలగాలు విడుదల చేశాయి. మా నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనంటూ చెప్పకనే చెప్పాయి. జాకిర్ ముసా : కశ్మీర్ లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకిర్ ముసా. ఇతను ఆల్‌ఖైదా కశ్మీర్ విభాగానికి అధిపతి. మొదట్లో హిజ్బుల్ ముజాహిదిన్‌లో పనిచేశాడు. ఇతన్ని ఎన్కౌంటర్ చేస్తే.. టెర్రరిస్టుల రిక్రూట్మెంట్లు తగ్గుతాయని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. రియజ్ నాయికొ: రియాజ్ ప్రస్తుతం హిజ్బుల్ ముజాహిదీన్ కొత్త చీఫ్. భద్రతా బలగాలు, సరిహద్దు సైనికులు ఇతని కోసం డేగ కళ్లతో చాలా కాలంగా వెతుకుతున్నాయి. హిజ్బుల్ టెర్రరిస్టులను ఆపరేట్ చేస్తూ.. లోయలో ఎక్కడెక్కడ అల్లర్లు చేయాలో డిసైడ్ చేస్తుంటాడు. ఇతనికి లోయలోని సెక్యులర్ వాదులు అండగా ఉంటారు. సద్దామ్ పెద్దార్: షోపియాన్ జిల్లా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. జిల్లాలో ఉగ్రవాదం, జీహాద్వైపు ముస్లిం యువతను ఆకర్షించి.. వారిని రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగే ఆయుధాల సరఫరా చేస్తుంటాడు. గతంలో బుర్హాన్ వనీ గ్రూప్‌లో కీలకంగా పనిచేశాడు. జీనత్ ఉల్ ఇస్లామ్ షోపియాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల జీనత్ లష్కరే తోయిబా టాప్ కమాండర్‌గా పనిచేస్తాడు. షోపియాన్ జవాన్లపై జరిగిన దాడికి వ్యూహరచన చేసింది జీనత్ ఇస్లామే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఖలీద్ : పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్.. జైషే మహమ్మద్ డివిజనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. 2016 నుంచి ఉత్తర కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. మిలిటెంట్లను నియంత్రణ రేఖ దాటించడం, ఆయుధాలు, దాడులకు వ్యూహరచన చేయడం చేస్తాడు. ఇతనిపై భద్రతా బలగాలు ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశాయి.