Rs 2 000 note
-
రూ.2,000 నోట్లు 98 శాతం వెనక్కి
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు 98 శాతం బ్యాంకుల్లోకి తిరిగొచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ రూ.6,970 కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్టు తెలిపింది. రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించడం గమనార్హం. ‘‘అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా, 2024 అక్టోబర్ 31 నాటికి రూ.6,970 కోట్లకు తగ్గాయి. అంటే 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లతో 98.04% వెనక్కి వచ్చాయి’’అని ఆర్బీఐ తెలిపింది. అన్ని బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్‌కు, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించడం తెలిసిందే. 2023 అక్టోబర్ 7 వరకు ఇందుకు అనుమతించింది. ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుకు ఇండియా పోస్ట్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. హైదరాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులోనూ ఈ సదుపాయం ఉంది. -
2,000 నోటు ఇక కనుమరుగే..!
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువగా రూ.2,000కు బదులు రూ.500 నోట్లే ఉంచుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కు తీసుకోడానికి ఇది సంకేతమనీ ఆ వర్గాలు సూచిస్తున్నాయి. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాధానం ఇస్తూ, రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలుపు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ► ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు ఏవీ లేనప్పటికీ, బ్యాంకులు తమకు తాముగా తమ ఏటీఎంలను తక్కువ విలువగల నోట్లతో నింపుతున్నాయి. ► ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ, తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్ల వినియోగాన్ని నిలుపుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ► నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్‌గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారం వ్యయాలపరంగా బ్యాంకింగ్‌పై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ అంశం కూడా బ్యాంకులు రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టడానికి కొంత వెనక్కుతగ్గేలా చేస్తోంది. ► సమాచార హక్కు చట్టం ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే, రూ.2,000కు సంబంధించి 2016–17లో 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించడం జరిగింది. 2017–18లో ఈ సంఖ్య 111.507కు పడిపోయింది. 2018–19లో ఇది మరింతగా 46.690 మిలియన్ నోట్లకు తగ్గింది. దీని ప్రకారం చూస్తే రూ.2,000 నోటును ఆర్బీఐ క్రమంగా వెనక్కు తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ► అధిక విలువ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ► 2016 నవంబర్‌లో కేంద్రం రూ.1,000, రూ.500 విలువ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ► రూ.2,000 నోటును ఉపసంహరించే ప్రతిపాదనఏదీ ప్రభుత్వం వద్ద లేదని గత ఏడాది డిసెంబర్లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, చెలామణీలో ఉన్న నోట్ల (ఎన్ఐసీ) విలువ 2016 నవంబర్ 4న రూ.17,74,187 కోట్లు. 2019 డిసెంబర్ 2 నాటికి ఈ విలువ రూ.22,35,648 కోట్లకు పెరిగింది. ► వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య చెలామణీలో ఉన్న నోట్ల విలువ సగటున 14.51 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే, 2019 డిసెంబర్ 2 నాటికి ఎన్ఐసీ రూ.25,40,253 కోట్లకు చేరి ఉండవచ్చు. -
2వేల నోటు ముద్రణ ఆపేసిన ఆర్బీఐ!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండువేల రూపాయల నోటు ముద్రణను ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2వేల రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుంది. దీనిని ఆరికట్టేందుకు కేంద్రం 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. తాజా నిర్ణయంతో ముద్రణ ఆగిపోయినా కూడా రెండు వేల రూపాయల నోట్లు చెలామణీలోనే ఉండనున్నాయి. మొత్తం 18.03లక్షల కోట్ల రూపాయల డబ్బు చెలామణీలో ఉండగా, అందులో 37 శాతం (6.73లక్షల కోట్లు) 2వేల రూపాయల నోట్లు ఉండగా, 43 శాతం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. కాగా, భారత్‌లో బ్లాక్‌మనీని ఆరికట్టడానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్.. అప్పుడు వాడుకలో ఉన్న 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకువచ్చింది. కాగా, గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం ఉపసంహరించనుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
2000 నోటు ముద్రణ ఆపేసిన ఆర్బీఐ!
-
మరో ఏటీఎంలో నకిలీ నోటు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరో ఏటీఎంలో నకిలీ నోటు వ్యవహారం కలకలం రేపింది. సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. గతనెలలో ఈ నకిలీ రూ.2వేల నోట్లు బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన సృష్టించిన ఘటన మరువకముందే గురువారం మరో నకిలీనోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక వినియోగదారుడు చందన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు చందన్ ఫిర్యాదు ఆధారంగా, 489 బి, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. దీనిపై లోతుగా పరిశీలన నిమిత్తం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే అత్యధిక విలువ కలిగిన నోట్లలో ఫేక్ నోట్లు వరుసగా వెలుగు చూడడంతో వినియోగదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకనెలరోజుల్లో ఇది రెండవ ఘటన కాగా, ఈ నకిలీ నోట్లపై 'మనోరంజన్ బ్యాంక్ , చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 6 న సంగం విహార్ లో బ్యాంకు ఖాతాదారుడు రోహిత్ కుమార్ ఎస్బీఐ ఏటీ ఏంలో డ్రా చేసినపుడు ఇలాంటి నకిలీ రూ. 2వేల నోటు వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఇషాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.