RSS activist
-
తేజస్వి సూర్య హత్యకు కుట్ర.. ఆరోజు ఏం జరిగింది
సాక్షి, బెంగళూరు: హిందూ సంఘాల నేతలను హత్య చేసి బెంగళూరు నగరంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు ఎస్‌డీపై కార్యకర్తలను విచారణ చేపట్టగా కుట్ర విషయం వెలుగుచూసింది. నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు... టైలర్‌గా పనిచేసే ఆర్టీ.నగర శాంపుర మెయిన్‌రోడ్డు నివాసి ఇర్ఫాన్ అలియాస్ మహ్మద్ ఇర్ఫాన్, ఆర్టీ.నగర భువనేశ్వరినగరకు చెందిన సయ్యద్ అక్బర్‌అలియాస్ మెకానిక్ అక్బర్, ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే కేజీ.హళ్లి గోవిందపుర, గాందీనగర నివాసి అక్బర్‌బాషా అక్బర్, లింగరాజపుర సివిల్ కాంట్రాక్టర్ సయ్యద్‌సిద్దికి అక్బర్, ఆర్టీ.నగర శాంపుర మెయిన్‌రోడ్డులో ఎలక్ట్రికల్ ఇంటీరియల్ పనులు నిర్వహించే సన అలియాస్ సనావుల్లా ష్‌రీఫ్, శివాజీనగర చాందినీచౌక్ సౌండ్‌సిస్టమ్స్ దుకాణంలో పనిచేసే సాధిక్ ఉల్ అమీన్ అలియాస్ సౌండ్ సాధిక్లు నిందితులు. వీరంతా తమ వృత్తుల్లో కొనసాగుతూ మరో వైపు ఎస్డీపీఐ కార్యకర్తలుగా చలామణిలో ఉన్నారు. వీరు గత ఏడాది డిసెంబరు 22 న కలాసీపాళ్య న్యూలేఔట్ కంబారగుండి రోడ్డులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వరుణ్‌పై నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నిందితులను విచారణ చేపట్టగా బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య, వాగ్మి యువబ్రీగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సూలబెలెలను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వెలుగు చూసింది. ఆరోజు ఏం జరిగిందంటే.. బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య, వాగ్మియు వబ్రిగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సూలబెలెలు డిసెంబరు 22 తేదీన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతుగా టౌన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో నిందితులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న వరుణ్‌ను వెంబడించారు. కంబారగుండి రోడ్డులో అడ్డుకుని మారణాయుధాలతో తల, గొంతు ఇతర భాగాల్లో దాడి చేసి ఉడాయించారు. తొలుత రాళ్లదాడి..అనంతరం హత్యకు పథకం హిందూ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించే సమయంలో రాళ్లదాడికి పాల్పడితే ప్రజలు చెల్లాచెదరవుతారని, ఆ సమయంలో హిందూ సంఘాల నేతలు మాత్రమే ఉంటారని ఆ సమయంలో వారిని హత్య చేస్తే మత కలహాలు జరిగినట్లు ప్రజలు భావించేలా నిందితులు కుట్ర పన్నారు. ముందు జాగ్రత్తలు ఎస్డీపీఐ కార్యకర్తలు తమ దురాగతాలపై సాక్ష్యాలు, ఆధారాలు లభించకుండా ముందు జాగ్రత్తలు పాటించారు. తమ సెల్ఫోన్లను ఇంట్లోనే పెట్టి వెళ్లేవారు. ముఖం కనబడకుండా హెల్మెట్ ధరించేవారు. దురాగతాలకు పాల్పడేందుకు చోరీలకు పాల్పడిన వాహనాలను వినియోగించేవారు. వాహనాల నెంబర్ప్లేట్లకు నల్లరంగుతో రాసేవారు. పథకాన్ని అమలు చేయడానికి వెళ్లే సమయంలో రెండు మూడు జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్‌లను ఒకదానిపై ఒకటి ధరించేవారు. ఘటనకు పాల్పడేటప్పుడు ఒక రకం దుస్తులు, ఘటన అనంతరం టీషర్ట్ వేసుకునేవారు. కొద్దిదూరం వెళ్లి టీ షర్ట్స్ తొలగించి వాహనాలను మార్చి ఇంటికి వెళ్లే సమయంలో మరో రకం దుస్తులు ధరించేవారు. ఇలా పట్టుకున్నారు వరుణ్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసేందుకు పశ్చిమవిభాగ డీసీపీ బీ.రమేశ్, చిక్కపేటే ఉపవిభాగ ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో చామరాజపేటే పోలీస్‌స్టేషన్ సీఐ బీజీ.కుమారస్వామి, కలాసీపాళ్య సీఐ శివకుమార్, ఎస్ఐలు నారాయణ, కృష్ణమూర్తి, మూర్తి, శృతి, మంజునాథ్, రవీశ్ తతదితరులతో కూడిన ప్రత్యేకబృందం ఏర్పాటైంది. ఘటనా స్థలం నుంచి వెయ్యి మీటర్ల వరకు మధ్యలో ఉన్న 700 సీసీ కెమెరాలనుంచి 850 గంటల నిడివి ఉన్న ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు వాడిన పేపరు, సిగరెట్, వాడి పడేసిన హెల్మెట్, దుస్తులు, వినియోగించిన వాహనాలు, వాహనాలకు పెట్రోల్ వేసిన బిల్లులతో పాటు మొత్తం సమాచారం సేకరించి నిందితులను పట్టుకున్నారు. నిందితులపై కలాసీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 143, 147,148,149,307 తో పాటు దేశద్రోహానికి పాల్పడే యుఏపీఏ, ఐసీసీ సెక్షన్ 120, 153ఏ, 295 సెక్షన్లు కింద అదనంగా క్రిమినల్ కేసులు నమోదు చేశామని భాస్కర్‌రావ్ పేర్కొన్నారు. -
ఆరెస్సెస్ కార్యకర్త కుటుంబం దారుణ హత్య
-
తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఓ స్కూలు టీచర్ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. వివరాలు.. ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బంధు ప్రకాశ్ పాల్(35) అనే వ్యక్తి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య(ప్రస్తుతం గర్భిణి), ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ ముగ్గురు వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్న వీరిని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రకాశ్ ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పశ్చిమ బెంగాల్ ఆరెస్సెస్ కార్యదర్శి మాట్లాడుతూ... గోపాల్ ఇటీవల కొన్ని రోజులుగా తాము నిర్వహించే ‘వీక్లీ మిలన్(వారాంతపు సమావేశం)’లో పాల్గొంటున్నాడని తెలిపారు. ఇక ఈ పాశవిక హత్యపై బీజేపీ నేత సంబిత్ పాత్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన పాల్, ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆయన భార్య, వారి కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. కానీ లిబరల్స్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆ 59 మంది మమతా బెనర్జీకి ఎందుకు లేఖ రాయడం లేదు అంటూ దేశంలో అసహనం పెరిగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ప్రముఖులను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక గోపాల్ కుటుంబం హత్యకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతీ ఒక్కరూ వారి శాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అదే విధంగా హంతకులను త్వరగా అరెస్టు చేసి, వారికి తగిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పాల్ కుటుంబం హత్యకు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. West Bengal: A teacher, his wife and child were murdered by unidentified miscreants in West Bengal's Murshidabad district yesterday. As per RSS West Bengal secretary Jishnu Basu, he was also an RSS worker and was recently associated with a 'weekly milan'. — ANI (@ANI) October 10, 2019 -
శబరిమల ప్రవేశం : అపచారం.. అపచారం
శబరిమల : సాక్షాత్తు సుప్రీం కోర్టే అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చినప్పటికి భక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా.. నేడు జరిగే ప్రత్యేక పూజల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం మహిళలు వచ్చారు. కానీ 10 - 50 ఏళ్లలోపు బాలికలను, మహిళలను ఆలయంలోకి రాకుండా హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది అయ్యప్ప భక్తులు గుంపుగా వెళ్లి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అడ్డున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక అపరాధం చోటు చేసుకుంది. మహిళను అడ్డుకునేందుకు వెళ్లిన సదరు అయ్యప్ప భక్తుల గుంపుకు నాయకత్వం వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు వల్సన్ థిల్లంకెరి ఓ అపచారం చేశారు. అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బంగారు మెట్ల మీద వల్సన్ నిల్చున్నాడు. అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా తల మీద ఇరుముడి కెట్టును ధరించాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని మాత్రమే బంగారు మెట్ల మీద నడిచి.. స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. కానీ వల్సన్ సాధరణ వ్యక్తిలాగా శబరిమల వచ్చారు. కేవలం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చూడ్డం కోసమే వచ్చిన వల్సన్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను అడ్డగించే క్రమంలో ‘ఇరుముడి కెట్టు’ లేకుండానే పవిత్ర బంగారు మెట్ల మీద నిల్చున్నాడు. అయితే మహిళలను అడ్డుకునే విషయంలో అత్యుత్సాహంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. -
‘ఆరెస్సెస్’ కేసులో కోర్టుకు..
థానే: రాష్ట్రీయస్వయంసేవక్‌సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. గాంధీజీ హత్య వెనుక హస్తముందని ఆర్ఎస్ఎస్ భివండీలో 2014లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమ సంస్థకు పరువు నష్టం కలిగించాయంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంతే కేసు వేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన భివండీ సివిల్ జడ్జి.. ఈ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించగా లేదని రాహుల్ బదులిచ్చారు. పూర్తిస్థాయి విచారణ ఆగస్టు 10 నుంచి ప్రారంభంకానుంది. తదుపరి విచారణ సందర్భంగా ఫిర్యాదు దారు సమర్పించిన రాహుల్ ప్రసంగానికి సంబంధించిన పత్రాలు, వీడియో రికార్డింగ్‌లను సాక్ష్యంగా స్వీకరించాలా వద్దా అనే అంశంపై కోర్టుం తీర్పు చెప్పనుంది. ఈ కేసును కొట్టివేయాలంటూ 2016లో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక్కరు చేసిన నేరాన్ని సంస్థకు ఆపాదించరాదనీ, తన వ్యాఖ్యలపై రాహుల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున తదుపరి విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తేల్చింది. గురువు అడ్వాణీనే అవమానించారు వ్యక్తిగత జీవితంలో గురువు స్థానం ఎంతగొప్పదో హిందూమతం చెబుతుందనీ, అలాంటిది ప్రధాని మోదీ ఏకంగా తన గురువు అడ్వాణీనే అవమానించారని రాహుల్ విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో మాట్లాడారు. ‘మోదీకి గురువు, మార్గదర్శకుడు అడ్వాణీయే అని అందరికీ తెలుసు. అధికారిక కార్యక్రమాలప్పుడూ మోదీ ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు. అటల్జీ దేశం కోసం పాటుపడ్డారు. ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా మొట్టమొదటిగా నేనే వెళ్లి పరామర్శించా’ అన్నారు. -
‘భారత్ మాతా కీ జై’ అంటూ ఆత్మాహుతి
జైపూర్: కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారనే నిరసనలతో గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల మనస్తాపంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రఘువీర్ శరణ్ అగర్వాల్ (45) ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని వైశాలీ నగర్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తనను తాను కాల్చుకున్న అనంతరం దాదాపు 100 మీటర్ల దూరం ‘భారత్ మాతా కీ జై’ అంటూ శరణ్ పరుగెత్తడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అతని ఒంటిపై నీరు పోసి మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన మంటల కారణంగా అతని శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితున్ని మొదటగా సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్ మంగళవారం ఉదయం మరణించారు. శరణ్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారనీ.. ఆయన మృతి వెనుక ఆర్థిక, కుటుంబ పరమైన కారణాలు కూడా ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. కలతే కారణం కావొచ్చు.. కులం, మతం ఆధారంగా రిజర్వేషన్లు, దళితులు చేపట్టిన భారత్‌బంద్ హింసాత్మకంగా మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన విధ్వంసకర పరిస్థితుల పట్ల చరణ్ కలత చెంది ఉంటారని ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 10న మరోమారు భారత్ బంద్ అనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు పాల్పడొచ్చని అభిప్రాయపడింది. -
కేరళలో ప్రశాంతంగా సాగిన బంద్
-
పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్
భివండీ: ఆరెస్సెస్ కార్యకర్త వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్ర భివండీలోని స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ’ఆరెస్సెస్ వాళ్లే మహాత్మా గాంధీని చంపారు’ అని రాహుల్ భివండీలో 2014 మార్చి 6న అన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. మార్చి 3న రాహుల్ వాదనను నమోదు చేస్తామని తెలిపిన కోర్టు అప్పటివరకు కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘మహాత్మా గాంధీని చంపిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. ఖాదీ కేలండర్ నుంచి గాంధీ బొమ్మను తొలగించిన సిద్ధాంతంపైనే నా పోరాటం’అని పేర్కొన్నారు. -
మైసూరులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య
-
త్రివేండ్రంలో స్తంబించిన ప్రజాజీవనం
-
‘రాహుల్‌పై దాడి సిగ్గుచేటు’
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన దాడిని ప్రతిపక్ష నేత కె.జానా రెడ్డి, శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. రాహుల్‌పై దాడి సిగ్గుచేటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. దాడులకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీతాపూర్‌లో గాడ్సేకు గుడి కట్టారని, రాహుల్‌పై దాడికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కారణం కావచ్చని పొంగులేటి ఆరోపించారు.