sabhalu
-
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ
మెదక్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విద్యార్థి ర్యాలీతో పాటు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను హాజరవుతున్నారన్నారు. అలాగే 33 జిల్లాల నుంచి 350 మంది ప్రతినిధులు కూడా వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. -
వాళ్లను తోసెయ్యండి
గట్టిగా మాట్లాడితే ఈడ్చేయండి జన్మభూమి సభలో గోరంట్ల చిందులు వైఎస్సార్సీపీ నేతలపై ఖాకీల జులుం విచారణ పేరుతో అర్హులను తొలగిస్తే ఎలా..? బుచ్చయ్యపై మండిపడ్డ కందుల దుర్గేష్ పలు జన్మభూమి సభల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు నో మైక్ సమస్యలు చెప్పనీయని సభలెందుకని విపక్షాల బహిష్కరణ సాక్షి, రాజమహేంద్రవరం : జనం కోసమే జన్మభూములంటూ ఊదరగొడుతున్న దేశం నేత లు అవే సభల్లో ప్రశ్నిస్తుంటే పోలీసులతో దౌర్యన్యకాండకు దిగుతున్నారు శనివారం ధవళేశ్వరంలో జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ‘ప్రతిపక్ష పార్టీ వాళ్లు మాట్లాడేందుకు వీలులేదు.వాళ్లను తోసేయండం’టూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులను ఆదేశిం చారు. ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం పోలీసులు మాజీ ఎమ్మె ల్సీ కందుల దుర్గేష్, రూరల్ కో ఆర్డినేటర్లలో ఒకరైన ఆకుల వీర్రాజు(బాబు), వైఎస్సార్సీపీ కార్యకర్తలను సభా ప్రాం గణం నుంచి నెట్టేశారు. స్థానికంగా ఉన్న అర్హులైన పేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు చేయగా విచారణ పేరుతో ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించడమే వీరు చేసిన నేరమా అని లబ్ధిదారులు కూడా వాగ్వివాదానికి దిగారు. ∙రంపచోడవరంలో జరిగిన జన్మభూమి సభలో స్థానిక జెడ్పిటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచి వై.నిరంజనీదేవి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్థి కార్యక్రమాలు చేస్తుందని సర్పంచి సభలో చెప్పడంతో జెడ్పీటీసీ గ్రామాల్లో రేష¯ŒSకార్డులు, పింఛన్లు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం తెలియడంలేదా అని నిలదీశారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో జరిగిన జన్మభూమి సభలో పిఠాపురం ఎమ్మెల్యే వర్మను గతంలో ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదని లబ్థిదారులు నిలదీశారు. అయోమయంలో పోలవరం నిర్వాసితులు చింతూరులో జరిగిన జన్మభూమి సభలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే జన్మభూమిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను ఏం అడిగినా ఆయా శాఖల రికార్డులు తెలంగాణలో ఉన్నాయని చెప్పడంపై అధికారులపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో జరిగిన జన్మభూమి స«భ రసాభసగా మారింది. -
రగడ.. రగడ
జన్మభూమి–మా ఊరు గ్రామ సభలు రెండో రోజైన మంగళవారం వేడెక్కాయి. ప్రతిచోట నిలదీతలు, నిరసనలు మార్మోగాయి. సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ నాయకులు జన్మభూమి సభలో నిరసన వ్యక్తం చేయగా.. మరోచోట అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కంసాలి బేతపూడి గ్రామస్తులు గ్రామసభను అడ్డుకున్నారు. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి నరసాపురం తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ షాక్ ఇచ్చింది. మొగల్తూరు మండలం మోడి గ్రామంలో ప్రధానమైన వియర్ చానల్ పనులు పూర్తికాకపోవడం, «గ్రామంలోని దర్భరేవు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటించారు. అధికారులెవరినీ సభకు రానివ్వకుండా ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. వేదిక వద్ద బల్లలు, కుర్చీలను విసిరేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆ సభకు హాజరుకాకుండా మొహం చాటేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ తరలింపు విషయంలో ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలంటూ నరసాపురం మండలం కంసాలి బేతపూడిలో జన్మభూమి సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీటిసంఘం అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి గోబ్యాక్, గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. గ్రామస్తులు, మహిళలు పోలీసు జీప్ ఎదుట బైఠాయించగా.. కానిస్టేబుళ్ల సాయంతో మహిళలను పక్కకు లాగి జీపును పోనిచ్చారు. నిరసనకారులను వదలకపోవడంతో సీపీఎం నాయకులు నరసాపురం వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో సీపీఎం నాయకులు, రూరల్ ఎస్సై కె.సతీష్‌కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అవినీతి బట్టబయలైంది. ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో టీడీపీ సీనియర్ నాయకుడు బండి స్వరూప్, అదే పార్టీకి చెందిన సర్పంచ్ సర్లమామిడి నాగేశ్వరరావు వర్గాల మధ్య జన్మభూమి సభలో వివాదం తలెత్తింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదని బండి స్వరూప్ వర్గీయులు సర్పంచ్ నర్లమామిడి నాగేశ్వరరావును నిలదీశారు. దీంతో సర్పంచ్ వర్గీయులు నీరు–చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారంటూ బండి స్వరూప్‌పై విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు పోట్లాడుకుని వారి అవినీతిని బయటపెట్టుకున్నారు. యలమంచిలి మండలం చించినాడలో జన్మభూమి కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలంటూ మహిళలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పాలకవర్గానికి బాసటగా నిలిచారు. వారిని అడ్డుకోవడానికి జెడ్పీటీసీ బోనం వెంకట నరసింహరావు, తహసీల్దార్ వంటెద్దు స్వామినాయుడు ప్రయత్నించడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామసభలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటం లేదని తహసీల్దార్‌ను, ఇతర అధికారులను గ్రామస్తులు నిలదీ శారు. టి.నరసాపురం మండలం బండదవారిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు గంటలపాటు వాగ్వివాదం చోటుచేసుకోవడంతో జన్మభూమి సభ ఆలస్యమైంది. చింతలపూడి మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇళ్లు, పెన్షన్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారంపై అధికారులను రైతులు నిలదీశారు. యర్రంపల్లిలో చింతలపూడి ఎత్తిపోతల పథకంతోపాటు పీహెచ్సీ భవనాన్ని ఎందుకు ప్రారంభించ డం లేదని సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఊటసముద్రంలో నిర్వహించిన గ్రామసభలో నాయకపోడు గిరి జనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. దాదాపు 2 గంటలకు పైగా సభను జరగనివ్వకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు. జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు. జీలుగుమిల్లిలో కార్డులు ఇచ్చి కదలాలంటూ తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు.