మిస్టరీ వీడిన సచిన్ హత్యకేసు
నలుగురు నిందితుల అరెస్ట్
బెంగళూరు(బనశంకరి) : భవానీనగరలో ఈనెల 7న చోటు చేసుకున్న సచిన్ హత్యకేసును బనశంకరి పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి మునిరాజు అలియాస్ హువా, ముబారక్, నవీన్‌కుమార్, వరుణ్‌ను బనశంకరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డీసీపీ లోకేశ్ కుమార్ కథనం మేరకు.. కుమారస్వామిలేఔట్కు చెందిన సతీష్ అనే వ్యక్తికి భవానీ నగర్లో మెకానిక్ దుకాణం ఉంది. ఈ క్రమంలో తన బై రిపేరీ చేయాల శంకర్ అనే వ్యక్తి రూ.15 వేలు డబ్బు అందజేశాడు. అయితే బైకు మరమ్మత్తుచేయకపోగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్, అతని స్నేహితుడు సచిన్ మద్యం సేవించి ఈ నెల 7 తేదీ రాత్రి 11 గంటల సమయంలో భవానీనగర్‌కు బయల్దేరారు.
వీరు వస్తుండటాన్ని పసిగట్టిన సతీశ్ ఓ ఇంటిలో తలదాచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతంలో ముబారక్ అనే వ్యకి అనుమానాస్పదంగా కనిపించిన సచిన్, శంకర్‌ను ఆరా తీయగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ముబారక్, అతని స్నేహితులు మునిరాజు, నవీన్‌కుమార్, వరుణ్శివకుమార్లు సచిన్, శంకర్‌తో గొడవకు దిగారు.
ఓ దశలో మునిరాజు సచిన్‌ను కత్తులతో పొడిచి శంకర్ కుడి భుజంపై డ్రాగర్‌తో గాయపరిచాడు. శంకర్ అక్కడినుంచి ఉడాయించగా తీవ్రంగా గాయపడిన సచిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళన చెందిన ముబారక్ సచిన్ గాయాలపై కుంకుమ పూసి హత్యోదంతాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించాడు. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శివకుమార్ అలియాస్కుళ్లి, నవీన్ అలియాస్ మాము కోసం గాలిస్తున్నట్లు లోకేశ్‌కుమార్ తెలిపారు. నిందితులపై హత్య,దోపిడీకేసు నమోదు చేసినట్లు తెలిపారు.