sad incidents
-
సంతాపం.. సగం చేటు!
పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్ భ్రశ్యతే రూపం, సంతాపాత్ భ్రశ్యతే బలమ్’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా? -
అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?
పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి. అమ్మా.. ఎందుకిలా చేశావు? అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? వింజమూరు: స్థానిక జైభీమ్ నగర్లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్ నగర్‌కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. నాన్నా.. నేనేం పాపం చేశాను? నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్‌కుమార్ (14), ప్రేమ్‌కుమార్ పిల్లలున్నారు. సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్ ఆధారంగా ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమజ్జనంలో అపశ్రుతులు
చిన్న చిన్న అపశ్రుతులు మినహా ఆదివారం నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. నాంపల్లి పరిధిలో విధినిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందాడు. ట్యాంక్‌బండ్‌పై ఓ మహిళ ట్రాక్టర్‌పై నుంచి కిందపడి మృతి చెందింది. సుల్తాన్‌బజార్ ప్రాంతంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్: నిమజ్జనానికి వెళ్లి వస్తున్న ఓ ఆటో బోల్తాపడిన సంఘటన అబిడ్స్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన నిమజ్జనానికి వెళ్లిన ఆటో భక్తులతో కలిసి తిరిగివెళుతుండగా రామకృష్ణ థియేటర్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యా యి. నిమజ్జనం డ్యూటీలో ఉన్న పోలీసులు ఆటోను పైకి లేపి బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ఏఎస్సై మృతి నాంపల్లి: విధి నిర్వహ ణలో ఓ ఏఎస్సై గుండె పోటుతో మృతిచెందిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏఎస్సై నిమ్రా నాయక్(55) వినాయక నిమజ్జనం సందర్భం గా నగరంలో విధులు నిర్వహించేందుకు వచ్చా రు. హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరోడ్మాల్ బిల్డింగ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆది వారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న నిమ్రానాయక్ గుండెపోటుతో అస్వస్తతకు గురికావడంతో హబీబ్‌నగర్ పోలీసులు అతడిని సమీప ంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచ న మేరకు నాంపలి లోని కేర్ ఆస్పత్రికి తరిలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అతని స్వస్థలానికి తరలించారు. ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ టైరు కింద పడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. రెజిమెంటల్ బజార్‌కు చెందిన హేమలత (46) కుమారుడు అభిషేక్‌తోపాటు కాలనీవాసులతో కలిసి శనివారం రాత్రి వినా యకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై ట్యాంక్‌బండ్ వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌పై నిలుచున్న హేమలత ఇళ్లల్లో ఉంచి చిన్నవినాయకులను కిందకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్‌ను ముందుకు కదిలించడంతో ఆమె అదుపు తప్పి కిందపడింది. కంగారుపడిన డ్రైవర్ ట్రాక్టర్‌ను రివర్స్ చేయడంతో చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రక్కు డ్రైవర్ అరెస్ట్ సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: వినాయక నిమజ్జనోత్సవంలో బేగంబజార్ నుంచి భారీ గణనాధుని తరలించే ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్‌కు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. -
లంకల్లో విషాదం
ఆలమూరు : మండలంలోని గౌతమీ గోదావరి చెంతన ఉన్న లంకల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి వేర్వేరు చోట్ల ఈ విషాద ఘటనలు జరిగాయి. గల్లంతైన వారిలో నలుగురు విద్యార్థులే. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకట రమణ (35) సమీపంలోని లంకలో పనికి వెళ్లి తిరిగి వస్తూ గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైయ్యాడు. అతనితోపాటు ఉన్న కుమారుడు వరుసైన మట్టా సురేంద్ర (15) కూడా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. దాదాపు ఇదే సమయంలో బడుగువాని లంక వద్ద జరిగిన మరో ఘటనలో ముగ్గురు బాలలు గల్లంతయ్యారు. బడుగు వాని లంక గ్రామానికి చెందిన పెంటపాటి సిందుశ్రీ (9), ఆమె తమ్ముడు అనుదీప్ (7)తో పాటు కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన నేల వెంకట పవన్ (13) ఒకేచోట గోదావరి ఊబిలో చిక్కుకున్నారు. వారు వేసవి సెలవులకు బడుగువాని లంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చి సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో హోంమంత్రి, ఎమ్మెల్యే పరిశీలన లంకల్లోని గోదావరి రేవుల్లో ఐదుగురు గల్లంతైన వార్త దావానంలా వ్యాపించింది. హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకున్నారు. ఘటనల గురించి అధికారులను, స్థానికులను ఆరా తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హమీ ఇచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తక్షణం గాలింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. గోదావరిలోనీటి ప్రవాహాన్ని తగ్గించినట్లు తెలిపారు. అలాగే అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపడతారని వివరించారు. దుళ్లలో విషాదఛాయలు దుళ్ళ (కడియం) : స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నేల వెంకటపవన్ (13) బడుగువానిలంక వెళ్లి అక్కడ గోదావరిలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లి ఇందిర, తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌తో కలిసి అమ్మగారింటికి వెళ్ళిన పవన్ గల్లంతయ్యాడన్న వార్తను ఇక్కడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరో తేదీన పవన్పుట్టిన రోజు కావడంతో ఆరోజు దుళ్లలో ఏర్పాటు చేసిన ప్రార్థనకు అమ్మమ్మను, ఇతర బంధువులను ఆహ్వానించేందుకు అక్కడకు వెళ్ళిన పవన్ ఇలా గల్లంతుకావడంపై చుట్టుపక్కలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసిన పవన్ తండ్రి సుదర్శనరావు రైసుమిల్లు కూలీగా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సుదర్శన్‌తోపాటు, దుళ్ళలోని బంధువులు బడుగువానిలంక తరలివెళ్లారు.