sahitya
-
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు
ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ శనివారం డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ 53 వ టెక్సాస్ సాహిత్య సదస్సు కోపెల్, టెక్సాస్ నగరంలో నిర్వహించారు. 'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సదస్సు జరిగింది. ఈ ''సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల'' సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ ''"రామ నామ ఉమ్మే....'' భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు. ఇటీవలే దివంగతులయిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ సంస్మరణగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు.తర్వాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ''సాహిత్యంలో నారీభేరీ''అంశం గా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ''రామాయణ కల్పవృక్షం ''కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు. అలాగే కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన వైనాన్ని ఉదాహరణంగా వివరించటమేగాక వారి రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని వివరణాత్మక ఉపన్యాసించడాన్ని గుర్తుచేశారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో పాటు, అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుంచిసమాధానాలను రాబట్టడంలో విజయవంతమయ్యారు.మహాకవి గురజాడ 162 వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకం రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని పోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరును సోమసుందర్ గారు అద్భుతంగా వివరించారు. ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని సోమసుందర్ అకాంక్షించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు. తర్వాత ''సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణంలో కృష్ణశాస్త్రి గారి రచన ప్రతిభా పాటవాల్ని" శ్రీ నరేందర్ చక్కగా విశ్లేషించడం జరిగింది. ''సాహిత్యము, దాని ప్రభావము-మానవజీవన పరివర్తన'' అనే అంశముపై విట్టల్ రామశర్మ గారి ప్రసంగము,,''శ్రీ రామ రక్ష'' అంశంపై డా వెంకట నక్త రాజు గారి ప్రసంగము, ''సమాజంపై గురువుల ప్రభావం''అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన '''శ్రీమతి ప్రేమలేఖ ''కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు .అనంతరం వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ విరచిత ''దేశమును ప్రేమించుమన్నా''గేయాన్ని దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల , చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించడం జరిగింది. డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు, అలాగే మంచి విందు భోజనాన్ని అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ రెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి, చిన సత్యంల తోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ మరియు డాలస్,హ్యూస్టన్ ,ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు , సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు .(చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!) -
కేతు విశ్వనాథ రెడ్డి గారి తెలుగు కథలు!
నాకు ఇష్టమైన కథకుల కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నాకు దక్కిన అదృష్టాల్లో చిన్నతనాననే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం అని రాసి పెట్టబడి ఉంది. రెక్కలు అనే ఆ కథకు నా బొమ్మ ఎంత బాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా. కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను ' నాయనా ' అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో మా రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకించి పోతాను నేను. పెద్దలు, ఇష్టులు, నాకు దగ్గరువారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం పుష్కల బాగా ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కొకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి వందల ఫుట్నోట్స్ చేర్చి ఆ సాహిత్యాన్ని ఇంకాస్త ఎత్తు పెంచారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక , అచ్చుతప్పుల పురుగు పట్టి లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. చేయవలసినంత ఆ నాశనపు పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కొకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు. ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఇంకో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు. కదా, పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని ఎందుకో కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! బహుశా నాకు గల ప్రాంతీయాభిమానమేమో ! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డిగారి పుస్తకాల కవర్లకు చంద్ర గారి కొల్లాజ్ పొకడలు నాకు ఎప్పుడూ సంభ్రమాన్నే కలిగిస్తూ ఉండేవి. విశ్వనాథరెడ్డి గారు తన కాలేజీ ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా తన సేవలందించారు. పంజాగుట్టలో ఉండేది ఆ ఆఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అయితే నాకు గుర్తుండి కృష్ణారెడ్డి గారితో ఆంద్రజ్యోతి లో నా తొలి పరిచయం. శ్రీ రమణ గారిని కలవడం కొరకు రోజూ ఆ పత్రిక అఫీసు కి వెళ్ళేవాడిని, ఆ పక్కనే శ్రీ కృష్ణారెడ్డి గారు కనపడేవారు. అదే సి. సి. రెడ్డి గారి ఆఫీస్ లో అప్పుడప్పుడూ వంశీ అని ఒక పాత దర్శకుడు గారు కూడా కనపడేవారు. నాకు గుర్తు ఉండి అప్పట్లో "తను నేనూ సావిత్రి" అనే సినిమా తీస్తున్నా, టైటిల్ ఎలా ఉంది అని నన్ను ఒకసారి అడిగారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు. అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయిత గా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.--అన్వర్ సాక్షి(చదవండి: 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!) -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధి భీమారంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తమ కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తికి చెందిన వలుగుల ప్రభాకర్, కవిత దంపతుల పెద్దకూతురు సాహిత్య (17) భీమారంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె అదే కళాశాల హాస్టల్లోనే ఉంటోంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో గత సబ్జెక్టుల్లో సాహిత్య అనుకున్నంత మేరకు పరీక్షలు రాయలేదు. దీంతో సాహిత్య మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. భవనంపై నుంచి దూకి..? సాహిత్య, కళాశాల హాస్టల్ భవనం పైనుంచి శుక్రవారం తెల్లవారు జామున దూకి ఉండవచ్చని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాహిత్య కింద పడి ఉండటం గమనించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సూసైడ్ నోట్ లభ్యం.. ఇదిలా ఉండగా సాహిత్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జువాలజీ పరీక్ష రోజు చనిపోతున్నా’అని అందులో పేర్కొంది. అయితే పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆ సూసైడ్ నోట్ తన కూతురిది కాదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టారని తెలిపారు. భవనంపై నుంచి దూకితే చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. తమ కూతురు మృతదేహాన్ని గోప్యంగా ఎందుకు ఎంజీఎంకు తరలించారన్నారు. కళాశాల ఎదుట ఆందోళన తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. వారి ఆందోళనకు వి ద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సంజీవ, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్‌లు ఆందోళనకారులను శాంతింపజేశారు. సాహిత్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సంజీవ తెలిపారు. కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూసైడ్ నోట్‌ను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించనున్నట్లు చెప్పారు. నేత్ర దానం సాహిత్య నేత్రాలు దానం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ సిబ్బంది నేత్రాలు సేకరించారు. -
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పాటల పూదోటలో..సాహితీ పరిమళం
రాజవొమ్మంగి: అతి పిన్న వయసు నుంచి పాటలు పాడుతూ సంగీత ప్రియులకు గానమాధుర్యాన్ని అందిస్తున్న చాగంటి సాహితి రాజవొమ్మంగిలో పుట్టి పెరిగింది. తండ్రి చాగంటి రవిప్రసాద్ ఉద్యోగరీత్యా కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్‌లో వెళ్లాల్సి రావడంతో సాహితి అక్కడే సంగీతం నేర్చుకొంది. ఆమె రాజవొమ్మంగి మాజీ కరణం వాడ్రేవు సుబ్రహ్మణ్య జగత్పతి మనుమరాలు. తల్లి సీతాదేవి, తమ్ముడు శశాంక్ ఇక్కడికి వచ్చిన ఆమె దేశ విదేశాల్లో తనకు లభిస్తున్న ఆదరణను ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ► తల్లి సీతాదేవికి పాటలంటే ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్ల క్రితం మాట. అప్పట్లో పాడాలని, మంచి గాయనిగా ఎదగాలని ఉన్నా ఆమెకు పరిస్థితులు సహకరించలేదు. ► నేను పొత్తిళ్లలో ఉండగా అమ్మ హనుమాన్‌చాలీసా పాడేది. అలా గానం పట్ల ఆసక్తి పెరిగింది. చిన్న వయసులోనే ఆ చాలీసాను అవలీలగా పాడేసేదాన్ని. ► చంటిపిల్లగా ఉన్నప్పుడే అమ్మ సినిమాపాటలు, భక్తిగీతాలు పాడటం నేర్పింది. ఎవరికై నా తొలి గురువు అమ్మేకదా. కాకపోతే తాను గాయని కావాలన్న కోరిక నన్ను గాయనిగా చేసి తీర్చుకుంది. ఆమె రుణం తీర్చుకోలేనిది. ► అమెరికా వంటి దేశాల్లో కూడా ప్రోగ్రాం ఇస్తున్నాను. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో పాడిన పాటలు నాకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ► నాకు 4, 5 ఏళ్ల వయసులో చాలా వరకు అమ్మే సంగీతం నేర్పింది. ఆ తరువాత కాకినాడలో పెద్దాడ సూర్యకుమారి వద్ద కర్నాటక సంగీతం నేర్చుకున్నా. ఆ తరువాత హైదరాబాద్‌లో ఎంసీ మూర్తి వద్ద సుధీర్ఘంగా 10 ఏళ్ళ పాటు సంగీతం నేర్చుకొన్నాను. రామాచారి, శ్రీనిధి వెంకటేష్‌లు నా ప్రస్తుత సంగీత గురువులు. ► ఇప్పటివరకు సుమారు వంద పాటలు పాడాను. ప్రముఖ గాయనిలు లతామంగేష్కర్, ఆశ, జానకి మాదిరిగా పాటలు పాడుతూనే ఉండాలన్నది కోరిక. మణిశర్మ దర్శకత్వంలో పాటలు పాడే అవకాశం లభించడం నా అదృష్టం. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కీరవాణి నా అభిమాన సంగీత దర్శకులు. ► ఆచార్య, కాటంరాయుడు, ఆచార్య, భీమ్లానాయక్ తదితర సినిమాల్లో పాడిన పాటలు నాకు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. సరిగమప, లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి టీవీ షోల్లో పాడిన పాటలతో చిన్నతనంలోనే ఎంతో గుర్తింపు తెచ్చాయి. ► బద్రీనాథ్ సినిమాలో ఓ చిన్న శ్లోకం ఆలపించే అవకాశం రావడం మరిచిపోలేని మధుర సంఘటన. వాణీజయరాం, బాలసుబ్రహ్మణ్యం, కోటి వంటి ప్రముఖ గాయకులు భుజం తట్టి ప్రోత్సహించారు. ► 2020 నుంచి ఇప్పటివరకు మూడు ఆల్బమ్స్ చేశాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలే సంగీత ప్రయాణానికి చుక్కాని. -
చెస్ విజేతలు ఆశిష్, సాహిత్య
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అండర్-15 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆశిష్ రెడ్డి, సాహిత్య విజేతలుగా నిలిచారు. దోమలగూడలోని ఏవీ కాలేజిలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగారుు. అలాగే బాలుర విభాగంలో ఆర్ఎస్ ఆర్మోల్ రెండో స్థానంలో, తరుణ్, అఖిల్ కుమార్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో సారుుప్రియ, జి.చందన రెండు, మూడు స్థానాలు సాధించారు. -
నాన్నపై కవిత్వానికి రామకృష్ణకు పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ కవి, చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణను ‘గూటం తాతారావు విశిష్ట సాహిత్య పురస్కారం–2016’కు ఎంపిక చేసినట్టు పురస్కార కమిటీ న్యాయనిర్ణేతలు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, ఎస్ఆర్ పృథ్వి, గిడ్డి సుబ్బారావు, ఫణినాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు రామకృష్ణ నాన్నపై రాసిన దీర్ఘకవిత ‘అవ్యక్తం’ కవితా సంపుటి ఎంపికయ్యిందన్నారు. రెండేళ్లుగా నాన్న వస్తువుగా కవిత్వం రాసిన వారికి కీ.శే. గూటం తాతారావు కళావేదిక పురస్కారాలు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మకూరు రామకృష్ణ ¯ð ల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన వారు. చిత్రకారుడుగా సుప్రసిద్ధుడు. ఆయన కేంద్రీయ విద్యాలయం, విజయవాడ–2లో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నాలుగు కవితా సంపుటులను వెలువరించారు. సూర్యనారాయణకు గిడుగు భాషా సేవా సత్కారం తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కవి, తెలుగుభాషోపాధ్యాయుడు ముంగండి సూర్యనారాయణకు గిడుగు రామ్మూర్తి పంతులు భాషా సేవా సత్కారం చేయనున్నట్టు వారు వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆనంరోటరీ హాల్లో జరిగే గూటం తాతారావు జయంత్యుత్సవంలో వీటిని ప్రదానం చేస్తామని డాక్టర్ గూటం స్వామి, ఫణినాగేశ్వరరావు తెలిపారు.