saifulla
-
ప్రభాకర్ చౌదరిపై తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నియోజకవర్గంలోని అధికార పార్టీలో మరోసారి చిచ్చు రేగింది. పార్టీ ఆవిర్భావం రోజు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వర్గీయులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. సైఫుల్లా నివాసంలో ఆయన తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా నేతృత్వంలో సమావేశమయ్యారు. సమావేశానికి పార్టీ నేతలు జయరాంనాయుడు, లక్ష్మీపతి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైవుద్దీన్, కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, లాలెప్పతో పాటు మరికొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కుటుంబసభ్యులు, కోఆప్షన్ సభ్యులు మున్వర్, కృష్ణ కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వీరంతా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో శ్రమించిన కార్యకర్తలకు నాలుగేళ్ల అధికారంలో ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ‘పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ చూసుకుంటుందని, తన కోసం పాటు పడినవారిని తాను చూసుకుంటాన’ని వ్యాఖ్యానిస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే కార్యకర్తల సంక్షేమంపై ఎమ్మెల్యేకు ఏమేరకు చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని జయరాంనాయుడు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన వారికి పదవులు కట్టబెట్టారని టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళీని ఉద్దేశించి మాట్లాడారు. ఏ రోజూ టీడీపీ జెండా మోయని గంపన్నకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారన్నారు. ఎమ్మెల్యే తీరుతో మరో 20 ఏళ్లు పార్టీ గెలిచే పరిస్థితి లేదని అంతా అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి, తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఆలోచిద్దామని జకీవుల్లా తెలిపినట్లు తెలిసింది. -
‘సోదరుడు వద్దని ఏడుస్తున్నా అతడు వినలేదు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నో శివారు ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు, బలగాలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, పోలీసు అధాకారుల, సైనిక బలగాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో ప్రత్యామ్నాయం లేక కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడని అధికారులు చెప్పారు. సొంత సోదరుడితో ఫోన్ చేయించి మాట్లాడించినా అతడు వినకుండా తిరగబడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర చేశారు. రైళ్లను పేల్చి వేసే కుట్రలు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బలగాలు ఇద్దరు ఉగ్రవాదులు లక్నో శివారులోని ఓ ఇంట్లో తల దాచుకున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు సైఫుల్లా అనే ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని కాన్పూర్ అని తెలుసుకొని ప్రాణాలతో బందించేందుకు దాదాపు పన్నెండుగంటలుపాటు తీవ్రంగా శ్రమించారు. తొలుత అతడిని లొంగిపోవాలని ఆదేశించినా వినకపోవడంతో సోదరుడితో ఫోన్ చేయించి తలుపు కిందంగా ఫోన్ అందించి మాట్లాడించే ప్రయత్నం చేశారు. సైఫుల్లా సోదరుడు ఖలీద్ ఫోన్లో ఏడుస్తూ బతిమాలిడినప్పటికీ అతడి మనసు కరగలేదు. దీంతో పోలీసులు తొలుత టియర్‌గ్యాస్, చిల్లీ పౌడర్ మిక్స్డ్ బాంబులు తదితరమైన ప్రయోగాలు చేశారు. దీంతో చివరకు పోలీసుల కాల్పుల్లో అతడు మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. అతడు ఎంతటి దుర్మార్గపు పనులో చేశాడు తమకు నిన్న సాయంత్రమే తెలిసిందని, తాము చెప్పిన మాట వినకుండా దుశ్చర్యలకు పాల్పడిన అతడి మృతదేహం తమకు వద్దని చెప్పారు. అతడి వద్ద పెద్ద మొత్తంలో బాంబులు, రైలు రాకపోకల వివరాలకు సంబంధించిన టైమ్ టేబుల్ స్వాధీనం అయింది. దీని ప్రకారం పెద్ద మొత్తంలో రైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగి ఎదురు కాల్పులకుదిగింది. అంతకుముందు వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు తుదముట్టించింది.