Samaikya Rashtra Parirakshana Vedika
-
నేడు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బుధవారం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సమైక్యవాదం బలమెంతో చాటి చెప్పేందుకే ‘చలో హైదరాబాద్’ ధర్నాను నిర్వహిస్తున్నామని.. అసెంబ్లీ ముట్టడి తమ అజెండాలో లేదని చెప్పారు. మంగళవార ం ఏపీఎన్జీవో భవన్లో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజాప్రతినిధులకు మద్దతుగానే మహాధర్నా జరగనుందని చెప్పారు. గతంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా జరిగిన దాడుల నేపథ్యంలో... ఈ ధర్నాను ఉదయం 11కు ప్రారంభించి, సాయంత్రం 4 గంటలకు ముగిస్తామన్నారు. సమైక్యవాదులపై దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో ఓటింగ్ పెట్టించి, విభజన బిల్లును ఓడించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఉద్యోగులతో పాటు అన్నివర్గాలవారు ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘చలో హైదరాబాద్’కు షరతులతో అనుమతి సాక్షి, హైదరాబాద్: ఏపీ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తరఫున ఏపీఎన్జీఓలు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. హైదరాబాద్ మధ్య మండల డీసీపీ కమలాసన్‌రెడ్డి 15 షరతులను స్పష్టం చేసి, వాటిని కచ్చితంగా పాటిస్తామంటూ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించుకోవాలని, అసెంబ్లీ వైపు ఎవరూ వెళ్లరాదన్నవి ప్రధాన నిబంధనలు. పోలీసులు విధించిన షరతులివీ... నగరంలో శాంతి భద్రతలు సహా ఎలాంటి ఇతర అవాంఛనీయ పరిణామం తలెత్తినా ఎలాంటి నోటీసు లేకుండా తక్షణమే అనుమతి రద్దవుతుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ధర్నా సమయంలో వాటిల్లే ఆస్తి నష్టానికి, తలెత్తే అవాంఛనీయ సంఘటనలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి. ధర్నాకు వచ్చే, వెళ్లే సమయంలో నిర్వాహకులు, పాల్గొన్న వారితో సహా ఎవ్వరూ ర్యాలీలు నిర్వహించడం, నినాదాలు చేయడం కూడదు. ప్రసంగాలు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండకూడదు. ధర్నాలో పాల్గొనేవారు అనుమతించిన ప్రదేశం దాటి బయటకు వెళ్లకూడదు. ధర్నా వేదిక వద్ద రెండు బాక్సు తరహా స్పీకర్లు మాత్రమే వినియోగించాలి. ధర్నా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న, ఇతర ప్రాంతాల్లోని రోడ్లపై ఎలాంటి నిరసనలు చేపట్టకూడదు. ఇందిరాపార్క్ వద్ద నిరసన తెలుపుతున్న ఇతరులకు ఇబ్బందులు కలిగించరాదు. విధ్వంసానికి పాల్పడతారనే అనుమానం ఉన్నవారెవరినీ నిర్వాహకులు తమతో చేరడానికి అంగీకరించకూడదు. పదివేలకు మించరని వారే చెప్పారు: ‘చలో హైదరాబాద్’ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో నిర్వాహకుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుని, షరతులతో కూడిన అనుమతి ఇచ్చాం. లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలో ధర్నాలో పాల్గొనేవారు పదివేలకు మించరని వారే చెప్పారు. - వీబీ కమలాసన్‌రెడ్డి, మధ్య మండల డీసీపీ -
3న రాష్ట్ర బంద్.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు మలి విడత అసెంబ్లీలో చర్చకు రానున్న నేపథ్యంలో.. జనవరి 3న రాష్ట్ర బంద్‌కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పీవీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. సమైక్య ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు శనివారం వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఏపీఎన్జీవో భవన్లో జరిగిన ఈ భేటీకి ఎస్‌ఆర్‌పీవీ చైర్మన్ అశోక్‌బాబు, కాంగ్రెస్ ప్రతినిధిగా మంత్రి శైలజానాథ్, టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బాబూ రాజేంద్రప్రసాద్, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధిగా జగదీశ్ యాదవ్ , వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ నెల 21న జరిగిన భేటీకి హాజరైన పార్టీల్లో ఈసారి సీపీఎం, లోక్‌సత్తా హాజరుకాకపోగా.. ఎంఐఎం, వైఎస్సార్సీపీ దూరంగా ఉన్నాయి. ఉదయం 11కు ప్రారంభం కావాల్సిన ఈ భేటీ 12.30కు మొదలై గంటన్నర పాటు జరిగింది. అనంతరం భేటీ తీర్మానాలు, జనవరి 2 నుంచి 10 వరకు నిర్వహించ తలపెట్టిన సమైక్య ఉద్యమ కార్యాచరణను అశోక్‌బాబు విలేకరులకు వెల్లడించారు. ఈ భేటీలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైద్యుల జేఏసీ కన్వీనర్ కడియాల రాజేంద్ర, పంచాయితీరాజ్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ మురళీకృష్ణ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ఎస్‌ఆర్‌పీవీ కన్వీనర్ శ్రీరామ్, సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ తీర్మానాలు.. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యేతో జిల్లా కేంద్రాల్లో 2వ తేదీన ఉదయం 11కు ప్రమాణాలు చేయించడం. సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ సభలు నిర్వహించి, విభజనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించడం. వివిధ రాజకీయ పక్షాలు రూపొందించిన ఫార్మాట్లలో అఫిడవిట్లను ఎమ్మెల్యేల నుంచి సేకరించి.. ఆయా పార్టీల ప్రతినిధుల ద్వారానే రాష్ట్రపతికి అందజేయడం. ఉద్యమ కార్యాచరణ ఇలా: 2న ‘ఉద్యమ గర్జన’పేరిట విశాఖలో భారీ సభ. 3న రాష్ట్ర బంద్, అన్ని జిల్లా కేంద్రాలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షా శిబిరాల ప్రారంభం. 4న అన్ని జిల్లాల్లో మానవహారాలు. 6న రిలే నిరాహార దీక్షలు, ప్రదర్శనలు. 7న విద్యార్థులతో దీక్షలు, ప్రదర్శనలు, 8న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో దీక్షలు, 9న రైతులతో నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, 10న మహిళలతో నిరాహార దీక్షలు. -
విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో సత్యవాణి ప్రసంగం
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 6
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 5
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 4
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 3
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో మిత్రా ప్రసంగం
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 2
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 1
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS Part - 2
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS
-
నేడే ‘సమైక్య’ సభ
-
నేడే ‘సమైక్య’ సభ
సమైక్యవాదం వినిపించటానికి సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు.. ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ భద్రతతో సహా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభను సాయంత్రం ఐదు గంటల కల్లా ముగించాలని పోలీసులు గడువు విధించారు. గడువులోగా సభను ముగించటానికి ప్రయత్నించాలని.. సాధ్యం కాకుంటే గడువు పొడిగించేందుకు అప్పటికప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేయాలని ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమన్వయ కమిటీ నిర్ణయించింది. సభను కేవలం ఉద్యోగులకే పరిమితం చేశారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక కార్డు చూపించిన తర్వాతే పోలీసులు సభా ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. సభా ప్రాంగణంలోకి వెళ్లటానికి రెండు గేట్లు ఉన్నాయి. సగం జిల్లాలను ఒక గేట్ నుంచి, మిగతా జిల్లాలను మరో గేట్ నుంచి ఉద్యోగులు ప్రవేశించాలని జేఏసీ నేతలు ఆయా జిల్లాల నేతలకు సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా సభకు అనుమతించరు. సమన్వయ కమిటీలో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో పాటు.. ‘విభజన’ వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు కొంతమంది వివిధ రంగాల నిపుణులకు కూడా సభలో ప్రసంగించే అవకాశం ఇస్తారు. లక్ష మంది ఉద్యోగులు సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు కాని వారు స్టేడియం వెలువల నిలబడి సంఘీభావం తెలిపే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచే ఉద్యోగులను స్టేడియం లోనికి అనుమతిస్తారు. బ్యాగులు, నీళ్ల సీసాలు లోనికి తీసుకెళ్లడానికి వీలుండదు. స్టేడియంలోనే భోజనం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి పొట్టిశ్రీరాములు, సభా వేదికకు బూర్గుల రామకృష్ణారావు, స్టేడియం ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీకృష్ణదేవరాయ, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక వేదికకు గురజాడ అప్పారావు పేర్లు పెట్టారు. పారామిలటరీ పహారాలో స్టేడియం: ఏపీఎన్జీవోల సభకు పోలీసులు పటిష్ట భద్రతాచర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియం లోపలికి ఉద్యోగులు మినహా ఇతరులెవరూ అడుగుపెట్టకుండా పూర్తిగా పారా మిలటరీ పహారా ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియానికి వెళ్లే నాలుగు మార్గాలనూ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధి నుంచే ఇనుప కంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. సభకు వచ్చే ఉద్యోగులు ర్యాలీలుగా రాకూడదని, రోడ్ల వెంట నినాదాలు చేయకూడదని పోలీసుశాఖ ఇప్పటికే సూచించింది. ఏపీఎన్జీవో సభకు ఆటంకం కలిగించేందుకు తెలంగాణవాదులెవరూ స్టేడియం వరకూ చేరుకోకుండా పోలీసులు అంచెలవారీగా భద్రత ఏర్పాటుచేశారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసి తరలించేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. మొబైల్ కెమెరాలను కూడా ఏర్పాటుచేసి నిరంతర నిఘా పెడుతున్నారు. కొందరు పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా స్టేడియం లోపల ఉండే ఏర్పాట్లుచేశారు. అవగాహనాసదస్సు మాత్రమే: అశోక్‌బాబు ఒక ఉద్యమం వల్ల మరో ఉద్యమం పలచబడే అవకాశమే లేదని, సమైక్యవాదం వల్ల తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందని అనుకోవటం పొరపాటని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సమన్వయ కమిటీ చైర్మన్ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరినో కించపరచటానికో, రెచ్చగొట్టటానికో ఈ సభ నిర్వహించటంలేదని స్పష్టం చేశారు. తమది కేవలం అవగాహనా సదస్సు మాత్రమేనని, తమ వాదనను వినిపించటానికే పరిమితమని చెప్పారు. సభను అడ్డుకుంటామంటూ వివిధ సంఘాలు, పార్టీలు చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే ఉద్యోగులను కొన్ని శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి స్పందించకుండా సంయమనం పాటించాలని అశోక్‌బాబు సూచించారు. సభ సజావుగా సాగటానికి సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సభ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశామని, ఇప్పుడు లక్ష మంది వచ్చే అవకాశం ఉందంటే స్పందన ఎంతగా ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. సీమాం ధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇదీ నాలుగంచెల భద్రత... సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల వాహనాలు, రైళ్లను తెలంగాణవాదులు అడ్డుకోకుండా మొబైల్ పోలీసులతో పెట్రోలింగ్. హైవేల్లో, రైల్వేస్టేషన్ల వద్ద నిరంతర పెట్రోలింగ్. తెలంగాణ ప్రాంత జిల్లాల నుంచి నగరంలోకి భారీగా తరలిరాకుండా తనిఖీలు. ఎల్బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ బలగాలు. ఆందోళనకారులను గుర్తించేందుకు మొబైల్ వాహనాల్లో నిఘా కెమెరాలు. స్టేడియం చుట్టూ లోపలికి వెళ్లే మార్గాల్లో తనిఖీలకు ఏపీఎస్పీ, ఏఆర్ సాయుధ పోలీసులు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాల వద్ద క్షుణ్ణంగా సాయుధ పోలీసులతో తనిఖీ.