Samaikyandhra Stir
-
జోరుగా సాగుతున్న సమైక్య ఉద్యమం
-
సమైక్య సమ్మెతో భారీగా తిరుమల ఆదాయానికి గండి
-
మంత్రి టీజీ వెంకటేష్ వాహనంపై చెప్పులు, రాళ్లతో దాడి
-
మంత్రి టీజీ వాహనంపై చెప్పుల దాడి
-
మంత్రి టీజీ వాహనంపై చెప్పుల దాడి
రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్‌కు సమైక్యాంద్ర ఉద్యమ సెగ తగిలింది. ఆయనను సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై చెప్పులు, రాళ్ల వర్షం కురిపించారు. కర్నూలులోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి టీజీ విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర ఉద్యమకారులు అక్కడికి చేరుకుని ఆయనను అడ్డుకున్నారు. సమైక్య ఉద్యమకారులపై అక్రమకేసులకు నిరసనగా వారీ ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి టీజీ రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని నినదించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన ఉద్యమం చేస్తున్న ఉద్యోగుస్తులంతా దొంగలేనని విమర్శించారు. సమైక్యవాదంతో పోరాడుతున్న నన్ను అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అక్కడి వెళ్లిపోతున్న టీజీ వెంకటేష్ వాహనంపై ఆందోళకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సమైక్యాంద్రే తమ లక్ష్యమంటూ నినాదాలు
-
14, 15 తేదీల్లో తిరుమలకు వాహనాల బంద్
సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని తిరుపతి ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన జేఏసీ సమావేశం ఉద్యమ తీవ్రతను పెంచుతూ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలతో పాటు, ద్విచ క్రవాహనాలను కూడా అనుమతించకూడదని నిర్ణయించింది. తిరుమలకు బంద్‌ను మినహాయించాలని కోరుతూ ఆర్డీవో రామచంద్రారెడ్డితో టీటీడీ అధికారుల సంఘం నేతలు టి.రవి, శేషారెడ్డి, చెంచులక్ష్మి చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమకు తిరుమలకు వచ్చే భక్తులపై వ్యతిరేకత లేదని, ఇక్కడ జరిగే బంద్ ప్రభావం ఢిల్లీకి తెలియూలనే ఉద్దేశంతోనే 48 గంటల పాటు తిరుమల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇందుకు మద్దతు ప్రకటించారని తెలిపారు. తిరుమలకు ఏ వాహనం వెళ్లకుండా ఉండేందుకు ప్రయివేటు టాక్సీల యూనియన్ను కూడా ఈ బంద్‌లో సహకరించాలని కోరనున్నామని చెప్పారు. భక్తులు కూడా ఈ రెండు రోజులు తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. తిరుపతిలో ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు విద్యుత్ సరఫరాను ఆపివేస్తామని, ఈ సమయంలో ప్రజలు కొవ్వొత్తులతో దేవదేవునికి అఖండ జ్యోతిని వెలిగించాలని కోరారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తాం
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అందులో భాగంగా 11న హైకోర్టు వద్ద మానవ హారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకున్నా బుధవారం మానవహారం నిర్వహిస్తామని చెప్పారు. న్యాయవాదులతోపాటు కోర్టు సిబ్బంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణవాదులైన న్యాయవాదులు ఇకపై తెలంగాణకు సంబంధించిన వారి కేసులనే వాదించాలని బార్ కౌన్సిల్ సభ్యుడు కె.రవీందర్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయవాదుల్లో 90 శాతం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని, మిగిలిన కొద్దిమందే ఇరు ప్రాంతాల వారి మధ్య చిచ్చుపెడుతూ వైషమ్యాలను పెంచుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో సమైక్యాంధ్ర న్యాయవాదులపై దాడి బాధాకరమన్నారు. ఏపీఎన్జీవోల బస్సులపై దాడులు సరికాదన్నారు. న్యాయవాది పద్మ మాట్లాడుతూ శాంతియుతంగా మానవహారం చేపడితే మహిళా లాయర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ చిదంబరం, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.హరినాథ్, న్యాయవాదులు కోటేశ్వరి దేవి, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో షర్మిళకు సంఘీభావం
-
రాజమండ్రిలో సమక్య గళం
-
తొడగొట్టిన తులసిరెడ్డి!
చేయెత్తి జైకొట్టుతెలుగోడా... అని ఓ తెలుగు కవి అంటే మన నేతాశ్రీలు ఏకంగా తొడగొడుతున్నారు. హుందాగా నడుచుకోవాల్సిన నాయకులు కనీస మర్యాద మార్చిపోతున్నారు. సంయమనం కోల్పోయి చవకబారు చేష్టలకు దిగుతున్నారు. బహిరంగంగా చిల్లర వ్యవహారాలకు దిగుతూ ప్రజల దృష్టిలో చులకనవుతున్నారు. వాగ్యుద్దాలు, విమర్శనాస్త్రాలతో ఇప్పటికే చట్టసభల గౌరవాన్ని మంటగలిపిన పాలకులు వీధి విన్యాసాలతో హుందాతనాన్ని విస్మరిస్తున్నారు. తొడ గొట్టడం, మీసం మెలేయడంలో మన నాయకగణం సినిమా హీరోలను మించిపోతున్నారు. సినిమా స్టార్లు తెరపై ఈ విన్యాసాలు చేస్తుంటే నాయకులు నేరుగా ప్రజల ముందే వీటిని అవలీలగా ప్రదర్శిస్తున్నారు. సినిమా తారల కంటే తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి సొంత జిల్లాలోనే తొడగొట్టి, మీసం మెలేసి సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పుట్టపర్తి సర్కిల్లో బుధవారం రాత్రి సమైక్య జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు ఆయనను చుట్టుముట్టారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపచేసుకుని ఉద్యమంలోకి రావాలని నినదించారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. ఈ గందరగోళ పరిస్థితిలో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు తులసిరెడ్డి సెక్యూరిటీ ఆయనను కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన తులసిరెడ్డి కారుపైకి ఎక్కి తొడగొట్టి మీసం తిప్పుతూ సవాల్ విసురుతున్నట్టుగా చేతులు ఊపారు. దీంతో అక్కడున్న జనం అవాక్కయ్యారు. ఆందోళనకారులు భావోద్రేకంతో చేసిన పనికి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తులసిరెడ్డి స్పందించిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తులసిరెడ్డి హుందాగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో జనం ముందు తొడగొట్టారు. అయితే వీరంతా సినిమావాళ్లు కావడం ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. -
సీఎం డెరైక్షన్లోనే సమైక్య ఉద్యమం: మురళీధర్‌రావు
ఇల్లంతకుంట/బెజ్జంకి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్లోనే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి, ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యల్ని విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం నాన్చుడు ధోరణి అవలంభించిన కాంగ్రెస్ సర్కారు రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డ్రామాలాడుతోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమానికి సీఎం కిరణే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలున్న ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడదీయవద్దంటున్న సీఎం గల్ఫ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఎందుకు రక్షించడం లేదని ప్రశ్నించారు. యూపీఏ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అంతవరకు తాము పోరాడుతామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
రెండోరోజూ అదే తీరు
* పలు కేంద్రాల్లో నిలిచిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ * పెరిగిన విద్యార్థుల హాజరు * నేటినుంచి మరో 3 కొత్త కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ మంగళవారం కూడా అనేక కేంద్రాల్లో కొనసాగలేదు. సీమాంధ్రలో మొత్తం 34 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయగా సమైక్య ఉద్యమం కారణంగా తొలిరోజు కేవలం 15 కేంద్రాల్లోనే ఈ ప్రక్రియ సజావుగా సాగింది. రెండోరోజు మరో కేంద్రంలో కూడా ధ్రువపత్రాల తనిఖీ నిలిచిపోయింది. అయితే ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైన విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరిగింది. రెండోరోజు సీమాంధ్రలో 14 కేంద్రాల్లో 3,529 మంది సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. అలాగే తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,268 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు నేతృత్వంలో మంగళవారం రాత్రి మండలిలో సమావేశం జరిగింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, మండలి కార్యదర్శి సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ పాల్గొన్నారు. అజయ్‌మిశ్రా సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు మరింత తోడ్పాటు అందించాలని కోరారు. కాగా బుధవారం నుంచి అదనంగా మరో 3 సహాయక కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ వర్సిటీ, విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ కళాశాల, ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను హెల్ప్‌లైన్ సెంటర్లుగా వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని, కొత్త కేంద్రాల ఏర్పాటు ఆ జిల్లాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని మండలి చైర్మన్ తెలిపారు. ఈ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాల్సిన ర్యాంకర్లకు షెడ్యూలును వెబ్సైట్లో పొందుపరిచారు. సీమాంధ్ర కు పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఇవి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో కూడా కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సర్టిఫికెట్ల తనిఖీ జరగని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈనెల 30లోపు ఎప్పుడు ఈ ప్రక్రియలో పాల్గొన్నా సరిపోతుందని వివరించారు. -
పెళ్లిళ్లకూ సమైక్య సెగ
* భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు, కూరగాయల ధరలు * రెట్టింపవుతున్న పెళ్లి బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగ పెళ్లిళ్లకూ తాకింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. ప్రైవేటు వాహనాలు, కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో బడ్జెట్ అంచనాలను మించుతోందని పెళ్లిళ్లు చేసే వారు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెల 21, 23, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. అయితే పరిస్థితులు అనూహ్యంగా మారి సీమాంధ్రలో సకలజనుల సమ్మె మొదలవ్వడంతో బస్సులు రోడ్డెక్కడంలేదు, దుకాణాలు తెరుచుకోవడంలేదు. దీంతో పెళ్లిళ్ల కోసం ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. కిలో మీటరుకు 6 నుంచి 15 రూపాయలుగా ఉన్న వాహనాల ఛార్జీలను ఏకంగా 20 నుంచి 30 రూపాయల వరకూ పెంచారు. అయినా కొన్ని చోట్ల వాహనాలు దొరకడం కూడా కష్టంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణా ప్రాంతం నుంచి పెళ్లికి వెళ్లాల్సిన వధూవరుల పరిస్థితి మరోలా ఉంది. ఆందోళనలు జరిగితే వాహనాలు నిలిపివేస్తారనే వారు భయపడుతున్నారు. షామియానాలు, ఇతర టెంట్ సామాన్లకు కూడా అనుకోని విధంగా గిరాకీ పెరిగింది. ప్రతీ చోట ఆందోళనల కోసం టెంట్లను తీసుకెళ్ళడంతో పెళ్లిళ్లకు అవి లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలామంది దేవాలయాలనో, కల్యాణ మండపాలనో ఆశ్రయించాల్సి వస్తోంది. కొండెక్కిన ధరలు ఉద్యమసెగతో కేటరింగ్ రేట్లు కూడా కొండెక్కాయి. నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న కేటరింగ్ రేట్లను ఒక్కసారిగా పెంచారు. ఆందోళనల కారణంగా తమకు నిత్యావసరాలు దొరకడమే కష్టంగా ఉందని, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, అందువల్ల ఒప్పందం మేరకు కేటరింగ్ చేయలేమని వారు తెగేసి చెబుతున్నారు. సీమాంధ్ర ఆందోళనలతో కూరగాయల రవాణా పూర్తిగా స్తంభించింది. వారంరోజుల క్రితం వరకూ కిలో రూ. 20 వరకు ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 50 పైగా పలుకుతున్నాయి. పచ్చిమిర్చి ఏకంగా రూ. 100 దాటింది. ఉల్లి ధర వారంలోనే 25 నుంచి 70 రూపాయలకు చేరింది.