school textbooks
-
ఈ పాఠాలు అవసరం
‘అ’ అంటే ‘అమ్మ’.. ‘ఆ’ అంటే ‘ఆవు’ పాఠాలు కాదు కావలసినవి. అమ్మకు సాయం చేసే ఇంటి సభ్యుల పాఠాలే కావాలని కేరళ ప్రభుత్వం పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. అమ్మ వంట చేస్తుంటే నాన్న ఆఫీసుకు వెళ్లే చిత్రాలతో ఉండే గత పాఠాలకు బదులు అమ్మకు వంటలో సాయం చేసే నాన్నలను ప్రవేశ పెట్టింది. ఆడపిల్లలను ఒక విధంగా, మగ పిల్లలను ఒక విధంగా కాకుండా అందరూ అన్ని పనుల్లో సమానమే అని చెప్పే పాఠాలు ఇప్పుడు అవసరం.అంకుర స్థాయిలో విద్యాబోధన వేసే ప్రభావాలు చాలా గట్టివి. గతంలో ఇవి తెలియకుండా లింగ వివక్షను ప్రతిపాదించేవి. లేదా పరిమితులను నిర్థారించేవి. లేదా ఎవరి పనులు ఏమిటో, ఎవరి స్థాయి ఏమిటో స్టీరియోటైప్ చేస్తూ ముద్ర వేసేవి. టెక్ట్స్‌బుక్స్‌లో ఎప్పుడూ అమ్మ ఎప్పుడూ వంట చేస్తూ. అక్కకు జడ వేస్తూ. ముగ్గు వేస్తూ, ΄÷లం గట్ల మీద నాన్నకు క్యారేజీ తీసుకువెళుతూ, రోలు దంచుతూ, వెన్న చిలుకుతూ కనిపించేది.నాన్న పడక్కుర్చీలో పేపర్ చదువుతూ ఉంటాడు. లేదా ఆఫీసుకు వెళుతూ లేదా ఆఫీస్‌లో పని చేస్తూ కనిపిస్తాడు. అంటే అబ్బాయిలు ఉద్యోగాలకి, అమ్మాయిలు ఇంటి పనికి పరిమితం కావాలని తెలియకనే మనసుల్లోకి ఎక్కేది. ఇప్పటికీ ఇలాంటి పాఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కాని కేరళ రాష్ట్రం ఈ పద్ధతిని వదిలి ‘జెండర్ న్యూట్రల్’ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది.ముందే నేర్పించండి‘టీచ్ దెమ్ అర్లీ’ అని కేరళ ప్రభుత్వం కొత్త ధోరణిని ఎంచుకుంది. చిన్న వయసులోనే స్త్రీ, పురుష అస్తిత్వాల మధ్య వివక్షను చెరిపేసే పాఠాలు చె΄్పాలని నిర్దేశించింది. మూడవ తరగతి మలయాళం, ఇంగ్లిష్ టెక్ట్స్బుక్కుల్లో ఇంటి పనుల పాఠం ఉంది. మూడవ తరగతి టెక్ట్స్బుక్లో కొబ్బరి తురుము తీస్తున్న నాన్న వంటగదిలో కనిపిస్తే ఇంగ్లిష్ టెక్స్›్టబుక్‌లో పాపకు ఇష్టమైన చిరుతిండిని సిద్ధం చేస్తున్న తండ్రి కనిపిస్తాడు.ఈ పాఠాలను ప్రస్తుతం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. ‘అయితే పాఠాల కంటే ముందు లింగ వివక్ష విషయంలో ఉపాధ్యాయులకు కూడా దృష్టి కోణంలో మార్పు తేవాలనే అవగాహనతో వేసవి సెలవుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం’ అని తెలిపాడు కేరళ ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ జయప్రకాష్. ఇది మాత్రమే కాదు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల జెండర్ల, వారి జీవన హక్కుల గురించి అవగాహన కలిగించే పాఠాలను కాలక్రమంలో స్కూల్ టెక్ట్స్‌బుక్కులు చేరుస్తామని కేరళ విద్యాశాఖ తెలిపింది.ఐదవ తరగతి లోపు 200 రోజులుఈ విద్యా సంవత్సరం కేరళ విద్యాశాఖ తీసుకున్న మరో కీలక నిర్ణయం 1 నుంచి 5 వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాలు చాలని నిబంధన విధించడం. ప్రాథమిక విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి లోపు పిల్లలకు 200 పని దినాల్లో 800 గంటల చదువు చాలు. అంతకు మించి చదివించడం వల్ల ఏం ప్రయోజనం ఉండటం లేదని ఉపాధ్యాయ సంఘం చేసిన సూచన మేరకు అక్కడి విద్యాశాఖ కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చింది.దీని వల్ల అన్ని స్కూళ్లు ఐదవ తరగతి లోపు పిల్లలకు వారానికి ఐదు రోజులే పని చేస్తాయి. ఉపాధ్యాయ సంఘం మరో సూచన కూడా చేసింది. బడి గంటలు పెంచి హైస్కూల్ తరగతులకు కూడా 200 రోజుల పని దినాలు చేయాలని. హైస్కూల్ సిలబస్‌లు పూర్తి కావాలంటే సంవత్సరంలో 1000 గంటలు పాఠాలు సాగాలని అందుకు వారానికి ఐదు రోజులు ఎక్కువ పీరియడ్లు చెప్పి శని, ఆదివారాలు సెలవు ఇవ్వొచ్చని సంఘం సూచించింది. దీనికి విద్యాశాఖ అనుమతించలేదు గాని పరిశీలనకు తీసుకుంది. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
కొత్త పుస్తకాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ముద్రించిన కొత్త పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకూ చేరుకున్నాయి. అక్కడి నుంచి మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది. ఎంఈవోల నుంచి పాఠశాలలకు తరలించి.. విద్యార్థులు స్కూళ్లకు రాగానే 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యాకానుక కిట్లతో కలిపి వారికి అందజేసేలా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశం మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 3.48 కోట్ల పుస్తకాలు రెడీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేసేందుకు 3,48,54,791 పుస్తకాలను సిద్ధం చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా అన్ని రంగాల్లో పనులు స్తంభించడం, మందగించడం వంటి పరిస్థితులు ఏర్పడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారింది. ఈ తరుణంలోనూ పాఠశాల విద్యాశాఖ వాటిని అధిగమించి పిల్లలకు సకాలంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయించడం విశేషం. పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్ వల్ల కేవలం టీచర్లు మాత్రమే రోజు విడిచి రోజు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు రెండో వారం తరువాత స్కూళ్లలో తరగతులు దశలవారీగా ప్రారంభమయ్యేలా కార్యాచరణను రూపొందించారు. పూర్తిస్థాయిలో ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు ప్రస్తుతం అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నారు. 1–5 తరగతులకు మూడు సెమిస్టర్లు ఉండగా.. 6, 7, 8 తరగతులకు రెండు సెమిస్టర్లు ఉన్నాయి. 9, 10 తరగతులకు ఒకే సెమిస్టర్ విధానం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన మొత్తం పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయి జిల్లాలకు చేరాయి. మొత్తం 13 జిల్లాలకు కలిపి 3,31,39,341 పాఠ్య పుస్తకాలకు గాను 3,19,62,419 పాఠ్యపుస్తకాల ముద్రణ ఆయా ప్రింటింగ్ సంస్థలు పూర్తిచేసి జిల్లాలకు తరలించాయి. జిల్లాల్లో ఇప్పటికే 28,92,372 పాఠ్య పుస్తకాలు మిగులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాలు కలుపుకొని మొత్తం 3,48,54,791 పుస్తకాలు జిల్లాల్లో ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో నవంబర్, డిసెంబర్ వరకు కూడా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందేవి కావు. కానీ.. ఇప్పుడు పాఠశాలలు తెరిచే నాటికే సిద్ధం చేయించడం విశేషం. -
జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందజేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ... సామాజిక శాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని చెప్పారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీష్‌రెడ్డి సభకు హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. పుస్తకాలు ధర మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదన్నారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై విధంగా సమాధాన మిచ్చారు.