The selection of candidates
-
సర్వం నారాయణ మంత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి నారాయణదే పెత్తనం కినుక వహించిన జిల్లా మంత్రి బొజ్జల ఎడతెగని పంతాలు, పట్టింపులు తేలని అభ్యర్థిత్వాలు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఇన్చార్జి మంత్రి నారాయణ, జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య విభేదాలు పొడచూపుతున్నాయా? సీట్ల కేటారుుంపులో ఇద్దరూ పట్టింపులకు పోతున్నారా? ఎన్నికల భారాన్ని మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక మంత్రి నారాయణకు అప్పగించడంతో బొజ్జల కినుక వహించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నారుు. చిత్తూరు, సాక్షి: తూర్పు రాయలసీమ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు పూర్తరుుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వామపక్ష అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. నారాయణే చూసుకుంటారులే.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రిని, తనను సంప్రదించకుండా అభ్యర్థుల పేర్లను ఎలా పరిశీలిస్తారంటూ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కినుక వహించారని సమాచారం. ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత సీఎం తనపై ఉంచారని, అందుకే తాను గెలుపు గుర్రాలను ఎంచుకుంటానని మంత్రి నారాయణ అంటున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఏరా ట్లు ఎలా ఉన్నాయని అధిష్ఠానానికి దగ్గరగా మెలిగే ఓ నాయకుడు మంత్రి బొజ్జలను అడగ్గా..’ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారాయణ భుజస్కంధాలపై ఉంచారుగా ఆయనే చూసుకుంటారు’లే అని ఎద్దేవా చేసినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఎవరికో ? అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. మంత్రుల భేదాభిప్రాయాలు అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి కారణమవుతోందని టీడీపీ నా యకులు అంటున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థిత్వాల్లో ఒకటి ’రెడ్డి’ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు, యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో గెలుపు సులభంకాదని పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సాకం నాగరాజు పేరు పరిశీలనలో ఉంది. ఆయన మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి రెండు సార్లు పోటీచేసి ఓడిపోరుున దేశారుుశెట్టి హనుమంత రావుకు టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి నారాయణ పట్టభద్రుల స్థానానికి తనకు అత్యంత ఆప్తుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాకం ఒప్పుకోకపోతే పట్టాభిని ఉపాధ్యాయ స్థానానికి, దేశారుు శెట్టిని పట్టభద్రుల స్థానానికి అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. -
టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికో..
అధిష్టానం పరిశీలనలో రవికుమార్, దయూకర్ పేర్లు రేసులో మరికొందరు నేతలు.. ఎవరికివారు ప్రయత్నాలు పార్టీలో చర్చ తర్వాతే నిర్ణయం వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి పోరు మొదలైంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేస్తూ సత్తా ఉన్న నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు ఖరారైన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. మన జిల్లాకు చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వారి పేర్లను అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీపడుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ సీనియర్ నేతలు గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరిలో ఒకరిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడిమల్ల రవికుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. అధినేత కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లోనూ పని చేసిన అనుభవాన్ని పార్టీ గుర్తిస్తుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్లో గతంలో కీలకంగా పనిచేసిన పసునూరి దయాకర్ పేరు కూడా టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. పసునూరి దయాకర్ సైతం గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని దయాకర్ భావిస్తున్నారు. ప్రయత్నాల్లో మరికొందరు... అధికార పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది నేతలు టీఆర్ఎస్ టిక్కెట్‌పై గురిపెట్టారు. స్థానిక నాయకులకే టిక్కెట్ వస్తుందని ముఖ్యనేతలు చెబుతుండడంతో జిల్లాలోని ఎస్సీ వర్గం ముఖ్యనేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్లో పనిచేస్తున్న చింతల యాదగిరి, జోరిక రమేశ్, జన్ను జకార్య, బోడ డిన్న, బొజ్జపల్లి రాజయ్య టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన జన్ను పరంజ్యోతి, రామగల్ల పరమేశ్వర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ రమేశ్ సైతం టీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్‌లతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య భార్య ఫాతిమామేరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ భార్య కవితాకుమారి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 28న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇవీ.. వీరి అనుకూలతలు గుడిమల్ల రవికుమార్ గతంలో పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై నమోదైన ఉద్యమ కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పసునూరి దయాకర్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
పొత్తు పొడిచేనా ?
సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. తమ పార్టీ సీట్లను ఆశిస్తున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు ముంబైలోని ఎన్సీపీ భవన్లో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అయితే ఇందులో మొత్తం 288 శాసనసభ నియోజక వర్గాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీట్ల పంపకంపై ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య ఇంతవరకు రాజీ కుదర లేదు. చివరకు ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మొత్తం 288 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూలు ఆహ్వానించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఈసారి రెండు పార్టీలు ఒంటరిగా బరిలో దిగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల కిందట ముంైబైలోని తిలక్ భవన్లో కాంగ్రెస్ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఔత్సాహిక అభ్యర్థుల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. వేళ్లపై లెక్కించే విధంగా అభ్యర్థులు రావడంతో ప్రతిపక్షాలకు విమర్శించేందుకు మంచి అవకాశం దొరికింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ కూడా 288 నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీన్నిబట్టి కాంగ్రెస్ కూడా ఒంటిరిగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నటు అనిపించింది. ఇప్పుడు ఎన్సీపీ నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాల్సిందే. మూడు రోజులపాటు జరిగే ఈ ఇంటర్వ్యూల్లో రాష్ట్రంలోని మొత్తం 288 నియోజక వర్గాల అభ్యర్థులను ఆహ్వానించామని పార్టీ ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. ఆ రోజు తమతమ నియోజకవర్గాల నివేదిక కచ్చితంగా వెంట తీసుకురావాలని దరఖాస్తుదారులను ఆదేశించారు. దీన్నిబట్టి ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీకి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా స్పష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కేటాయించాల్సిన స్థానాల విషయమై కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మిత్రపక్షాల మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతుండడం తెలిసిందే. దీంతో సీట్ల పంచాయితీని ఢిల్లీలోనే పరిష్కరించుకోవాలని ఇరు కాంగ్రెస్, ఎన్సీపీ (మహారాష్ట్ర) నాయకులు తుది నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు, ఎన్సీపీ నాలుగు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి కాంగ్రెస్ కంటే తమ పార్టీకే ప్రాబల్యం ఎక్కువ ఉందని ఎన్సీపీ వాదిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల కోసం తమకు 144 స్థానాలు ఇవ్వాల్సిందేనన్నది ఎన్సీపీ డిమాండ్. కాంగ్రెస్ మాత్రం 2009లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన వాటికంటే కంటే 10 స్థానాలు అధికంగా.. అంటే 124 స్థానాలు ఇస్తామని స్పష్టీకరించింది. దీంతో సీట్ల పంచాయితీ కోసం ఇరు పార్టీల నాయకులు ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షమైన ఎన్సీపీకీ 114 సీట్లు కేటాయించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో 124 సీట్లు ఇచ్చింది. దీంతో 2004 ఫార్ములానే ఈ ఎన్నికల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేవలం పది స్థానాలు ఎక్కువ ఇవ్వడం తమకు సమ్మతం కాదని ఎన్సీపీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడవచ్చని ఎన్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరికి వారు రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ ఇంటర్వ్యూలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే పొత్తు కొనసాగే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర్తి
సాక్షి, ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తిఅయ్యిందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఔరంగాబాద్‌లో ఆయన బుధవారం సాయంత్రం మరఠ్వాడా పరిధిలోని ఎనిమిది జిల్లాల పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, పదాధికారులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఏకంగా 42 స్థానాలు కైవసం చేసుకున్నాయి. దీంతో ఇరుపార్టీలు వచ్చే శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కాగా, ఏ ఏ శాసనసభ నియోజక వర్గాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు ఉద్ధవ్ చెప్పారు. ఎక్కడైతే తక్కువ ఓట్లు పోలయ్యాయో ఆ శాసనసభ నియోజక వర్గాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో శివసేన మరఠ్వాడా రీజియన్‌లో 27 స్థానాల్లో పోటీచేసి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచిన వారందరికీ తిరిగి టికెట్ ఇవ్వనున్నట్లు ఠాక్రే సూత్రప్రాయంగా తెలిపారు. అదేవిధంగా పర్భణి ఎమ్మెల్యే సంజయ్ జాదవ్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో అక్కడ శివసేన కొత్త అభ్యర్థిని బరిలో దింపాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర ్తయ్యిందని.. మిగతా 10 శాతం అభ్యర్థులను ఎంపికచేసే పనులు ఆగస్టులో పూర్తిచేసి తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత తమతమ నియోజకవర్గాలలో ప్రచార పనుల్లో నిమగ్నం కావాలని అభ్యర్థులకు ఆదేశాలివ్వనున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, కాషాయ కూటమి ఒప్పందం మేరకు బీజేపీ, శివసేనలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు.దీంతో శాసనసభ ఎన్నికల్లో తమదే పైచేయి చాటుకోవాలనే తపనతో శివసేన ఉంది. మరోపక్క మోడీ ప్రభంజనాన్ని మరోసారి రాష్ట్రంలో చూపించేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు తమ అభ్యర్థులు జాబితా ప్రకటిస్తామని బీజేపీ ఇటీవలే ప్రకటించింది. కాని శివసేన మాత్రం బీజేపీ కంటే ముందే 90 శాతం అభ్యర్థుల జాబితా సిద్ధంచేసినట్లు ప్రకటించింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా ముందడుగు వేస్తుండటం గమనార్హం. ఛగన్పై గరంగరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అంశంపై ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి ఛగన్ భుజబల్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర సదన్ పేరును లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మార్చేస్తే బాగుంటుందని భుజబల్‌కు చురకలంటించారు. నాసిక్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉద్ధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌లో జరిగిన గొడవ అక్కడి అక్రమాలకు సంబంధించినది. దానికి మతం రంగు పూసి కొందరు మరింత రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం క్యాంటిన్‌లోనే కాదు మొత్తం మహారాష్ట్ర సదన్‌లోనే జరగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. -
దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ముందంజలో ఉంది. వార్డు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాళహస్తి, పుత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. నగరిలో వార్డులకు బుధవారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రోజాతోపాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కూడా చైర్మన్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది. నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది. శ్రీకాళహస్తిలో మిద్దెల హరిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ పలు వార్డుల్లో నామినేషన్లు వేశారు. అన్ని వార్డుల్లోనూ వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. నాలుగో వార్డు అభ్యర్థిగా మిద్దెలహరి బరిలో ఉన్నారు. పుత్తూరులో డీఎన్ ఏలుమలై (అమ్ములు) 22వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిచే వారిలో ఏలుమలై ఒకరని అక్కడి ఓటర్లు చెబుతున్నారు. పలమనేరులో సీవీ కుమార్ భార్య శారద వైఎస్ఆర్ సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈమెను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో వార్డులకు వైఎస్ఆర్సీపీ తర ఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారంలోనూ వీరు ముందున్నారు. జిల్లావ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని మున్సిపాలిటీల్లో నాయకులను కోరుతున్నారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసినందున నామినేషన్ వేయకుండానే కొం దరు ప్రచారంలో పాల్గొనగా, నామినేషన్ వేసి కొంద రు ప్రచారంలో ముందున్నారు. కొందరు మంచిరో జు చూసి నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు కార్పొరేషన్ మేయర్‌గా.. చిత్తూరు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఇక్కడ తమిళ్ నాయకర్ సామాజిక వర్గానికి చెందిన వారిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపుతామని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం ప్రకటించింది. ఆ మేరకు చిత్తూరు ప్రజలు వైఎస్ఆర్ చేసిన సేవలు గుర్తుకు తెచ్చుకుని పార్టీని గెలిపించాలని నాయకులు ప్రచారం ప్రారంభించారు. చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకోలేని టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు వార్డులకు నామినేషన్లు దాఖలు చేసినా చైర్మన్ అభ్యర్థి ఎవరనే విష యం ప్రకటించలేదు. చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే కొం దరు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, పార్టీలో ముఖ్య నాయకులు చెబితే వినే పరిస్థితుల్లో మున్సిపల్ నాయకత్వం లేదని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు నాయకత్వంలోని పార్టీలోని వారికి ఓటడిగే హక్కులేదని పలువురు ఓటర్లు ముఖాన్నే చెబుతున్నారని, అయినా పార్టీలో ఉన్నాం కాబట్టి పోటీ చేస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క మున్సిపాలిటీకి కూడా చైర్మన్ అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు. కాంగ్రెస్ కనుమరుగు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే కనిపించడం లేదు. ఒకవేళ ఎవరైనా సొంతంగా నామినేషన్ వేసి తాను కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశానని చెబితే బీ ఫారం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. పుంగనూరులో ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున ఒక్క నామినేషన్‌కూడా దాఖలు కాలేదు. మదనపల్లెలో ఒకరు మాత్రమే నామినేషన్ వేశారు. పలమనేరులోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. శ్రీకాళహస్తిలో నలుగురు నామినేషన్లు వేశారు. ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ కనిపించే అవకాశం లేదు. ఎవరైనా పార్టీపై అభిమానంతో నామినేషన్ వేసినా వారికి ఓటేసేవారు లేరని ప్రజలు అంటున్నారు.