setting
-
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో అద్భుత సెట్టింగ్
-
అమరావతిపై చంద్రబాబు కొత్త ఫాంటసీ
-
ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ చోరీలు..
ఇన్సూరెన్స్ ఏజెంట్లు, టెలికాలర్ల వద్దనుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త! దొంగల ముఠాలు రోజురోజుకూ హైటెక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. సిమ్ కార్డులనుంచి, బ్యాంకు ఖాతాల దాకా అంతా నకిలీ రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్న ముఠాలు... ఇప్పుడు ఏకంగా నకిలీ డాక్యుమెంట్లతో ఫేక్ కాల్ సెంటర్లను, ఆన్ లైన్ బిజినెస్ హౌస్ లనే తెరిచేస్తున్నారు. తాజాగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా లెక్కల్లో నేర్పును ప్రదర్శిస్తూ కోట్లను కొల్లగొట్టేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నదొంగల ముఠాలు ఓ ప్రీమియం ధర వద్ద అక్రమ లాజిస్టిక్స్ అందిస్తూ వ్యాపారాన్ని హాయిగా కొనసాగించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు వంద వరకూ నకిలీ కాల్ సెంటర్లు, బిజినెస్ హౌస్ లు భారత దేశం అంతటా వ్యాపించి, ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. మార్కెటింగ్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నకిలీ కంపెనీలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రీమియం కమిషన్ వసూలు చేస్తున్నారని UP STF అదనపు సూపరింటిండెంట్ త్రివేణి సింగ్ చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతోపాటు, UP STF బృదం స్థానిక కృష్ణానగర్, నోయిడాల్లో ఉన్న రెండు కార్యాలయాలపై దాడులు నిర్వహించి సుమారు వందమందిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మొత్తం పదకొండు కంపెనీలను నిర్వహిస్తూ.. దేశంలో అనేకమంది ఏజెంట్ల ద్వారా జనానికి వారి ఇన్సూరెన్స్ పాలసీలపై అధిక బోనస్ ఆశ చూపి ఎరవేస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ కాల్ సెంటర్లలో వినియోగిస్తున్న సుమారు 50 సిమ్ కార్డులు, ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బిజినెస్ హౌస్ ల ద్వారా కస్టమర్ల డేటాను సేకరించి 35 పైసలు మొదలు, ఐదు రూపాయల వరకూ అమ్మకాలు కూడ జరుపుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే పోలీసులకు తెలియకుండా ఉండేట్టు నకిలీ గుర్తింపు కార్డులతో ఉన్న సిమ్ లను ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ సిమ్ కార్డులను డూప్ కస్టమర్లకు కాల్ చేసేందుకు వినియోగిస్తున్నారని, టెలికాం కంపెనీ ఉద్యోగుల సహాయంతో వారం రోజుల వ్యవధిని తీసుకొని నకిలీ డాక్యుమెంట్లతో ఫోన్ కాల్స్ కూడ అందుబాటులోకి తెస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను కూడ తెరిపించి 15 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి ముఠాలు ఎవరికీ అనుమానం రాకుండా అందమైన ఖరీదైన ఇళ్ళలో తమ కార్యాలయాలను స్థాపించి జోరుగా దందా కొనిసాగిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా కేవలం మూడు నాలుగు నెలల లోపే అక్కడినుంచి దుకాణం ఎత్తేస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా వేలమందిని మోసగించి పదికోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మనీకేర్ వ్యాల్యూ ప్రైవేట్ లిమిటిడె పేరున జనకపురిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈ ముఠా.. కాల్ సెంటర్ ను మాత్రం హరినగర్ లో కొనసాగిస్తున్నారని, ఈ సంస్థలో సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులు టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సో ప్రస్తుత తరుణంలో డబ్బు ఎరవేసే ఏజెంట్లకు లొంగిపోకుండా జర జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కొత్త కానుక
చాలామంది... ఇంటిముందు అందమైన గార్డెన్ ఏర్పాటుచేసుకుని, అందులో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఆనందించాలని కలలు కంటారు. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మొక్కలను ఆరుబయట పెంచుకోవాలనే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే చాలామంది ఇండోర్ ప్లాంట్స్‌ని పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. అటువంటివారు మీ స్నేహితులు, బంధువులలో ఎవరైనా ఉంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి ఒక ఇండోర్ ప్లాంట్‌ని కానుకగా ఇవ్వండి. ఇచ్చి ఊరుకోకండి... ఈ కాగితాన్ని కూడా అందచేయండి. మిమ్మల్ని వారు ఎన్నటికీ మరచిపోరు. ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉండటమే కాకుండా, తాజా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తా యి. అందువల్ల ఇంట్లోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ, ఇంటికి తాజాదనాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగరీత్యా కాని, ఇంట్లో కాని చాలాసేపు పనిచేసిన తర్వాత, మొక్కల దగ్గర కూర్చుంటే చాలు అంత ఒత్తిడి తొలగిపోతుంద ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఏ మొక్కయినా పచ్చగా కళకళలాడుతుంటేనే అందంగా ఉంటుంది. ఇంకా... బలంగా, ఏపుగా కూడా ఉండాలి. అందుకు తగినంత నీరు, సూర్యరశ్మి, అనుకూల వాతావరణం, పరిసరాలు తప్పనిసరి. అయితే అన్నిరకాల మొక్కలకూ ఒకే సూత్రం వర్తించదు. కొన్ని మొక్కలకు ఎక్కువ ఎండ అవసరమైతే, మరికొన్ని మొక్కలకు తక్కువ ఎండ సరిపోతుంది. నర్సరీలో మొక్క కొనేటప్పుడు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నర్సరీ వ్యక్తిని అడిగి, ఆ ప్రకారంగానే మొక్కలను పెంచాలి. ఇండోర్‌ప్లాంట్స్ విషయంలో అందరూ చేసే ఒక తప్పు... నీటిని ఎక్కువగా, వేగంగా పోసేయడం. అలా చేయకూడదు. నీటిని నెమ్మదిగా పోయాలి. అలాగే ఎక్కువైన నీరు కుండీలో నుంచి సులువుగా బయటకు వెళ్లే మార్గం ఏర్పాటుచేయాలి. నీరు నిల్వ ఉండిపోతే వేళ్లు కుళ్లిపోతాయి. ఇంకా... చిన్నచిన్న కీటకాలు, బ్యాక్టీరియా వంటివి చేరతాయి. దోమలు గుడ్లు పెట్టి, ఇల్లంతా దోమలు వ్యాపించే అవకాశం ఉంటుంది. మొక్కలు చాలా సున్నితమైనవి. వాటిని ఒక్కసారిగా చీకటి నుంచి వెలుగులోకి, తక్కువ ఉష్ణోగ్రత నుంచి అధిక ఉష్ణోగ్రత ఉన్నచోటికి మార్చడం వలన లాభం కంటె నష్టాలే ఎక్కువ. వాటి పెరుగుదలకు సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దపెద్ద శబ్దాల సంగీతం కంటె, మృదువుగా ఉండే సంగీతం వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయని పరిశోధనలలో తేలింది. మొక్కలకు నీరు ఎక్కువైనా తక్కువైనా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. నీరు ఎక్కువైతే గాలి సరిగా అందక మొక్కలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయలేకపోతాయి. మరిన్ని వివరాల కోసం మైడెకొరేటివ్.కామ్ (mydrcorative.com) ను చూడవచ్చు.