Setup boxes
-
ఏ ఆపరేటర్‌కైనా అదే సెట్‌టాప్ బాక్సు
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు. ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
సెట్‌టాప్ బాక్సులపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వీక్ష కులు జనవరి 31 కల్లా సెట్‌టాప్ బాక్సులు ఏర్పా టు చేసుకోవాలన్న నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టే సింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఏడాది జనవరి 31కల్లా వీక్షకులు సెట్‌టాప్ బాక్సులను సమకూర్చుకోవాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ నగరానికి చెందిన సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం గురువారం తన తీర్పును వెలువరించింది. -
సెటాప్ బాక్స్‌లు ఉన్నవారికే టీవీ ప్రసరాలు
-
సెట్‌టాప్ బాక్సులకు మరో 4 వారాలు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, విశాఖపట్నంలో టీవీలకు సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. ఎంఎస్‌వో(మల్టీసర్వీస్ ఆపరేటర్స్), ఎల్సీవో(లోకల్ ఏరియా కేబుల్ ఆపరేటర్స్)లు 4 వారాల్లో సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో గతంలో సెట్‌టాప్ బాక్సులను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేసుకోవచ్చునని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శికి మంగళవారం స్పష్టం చేసింది.