sheri lingampalli
-
ప్రభాస్ గెస్ట్‌హౌస్ స్ధలంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
-
ప్రభాస్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన రెవెన్యూశాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో ప్రభాస్ భూమి వివాదం కేసులో తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్లో అధికారులు వివరించారు. కౌంటర్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ గత బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. -
ప్రభాస్ వ్యాజ్యంపై రేపు హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న కేసును ఆయన తరఫు న్యాయవాది గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో రేపు (శుక్రవారం) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్ బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. -
సబిత సోదరుడికి బీజేపీ గాలం!
తాండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ గెలుపునకు అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న అసెంబ్లీ స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఈసారి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను పార్టీ అధిష్టానం లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కి కమలనాథులు వల వేస్తున్నారు. తాండూరు నుంచి ఆయనను బరిలోకి దించాలని ఆపార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నర్సింహారెడ్డితో బీజేపీ రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నర్సింహారెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభిస్తేనే రంగంలోకి దిగుతానని నర్సింహారెడ్డి సన్నిహిత వర్గాలతో ప్రస్తావించినట్టు సమాచారం. ఆసక్తిగా మారిన రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే తాండూరు నుంచి టీడీపీ తరపున తన సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డిని పోటీ చేయించాలని మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే తాండూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించి నర్సింహారెడ్డిని బరిలోకి దించేందుకు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే నాయకుడు ఒకరు వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. నర్సింహారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగితే తాండూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నర్సింహారెడ్డికి అవకాశం ఇవ్వొద్దని టీడీపీ ప్రజాప్రతినిధి అయిన జిల్లా కీలక నేత ఒకరు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాండూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ విషయమై నర్సింహారెడ్డి ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బీజేపీ నాయకులు తనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.