Sickle cell anemia
-
నీ కూతురికి అండగా నేనుంటా.. చిన్నారి కుటుంబానికి జగన్ భరోసా
-
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బడ్జెట్లో సికిల్ సెల్‌పై ప్రస్తావన.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి గురించి తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో సికిల్ సెల్ ఎనీమియాను సంపూర్ణంగా తుడిచిపెట్టేందుకు కార్యాచరణ ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం అమలుకు నోచుకుంటే ఈ వ్యాధి మరో పాతికేళ్లలో కనుమరుగు కావడం తథ్యమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటీ సికిల్ సెల్? మానవ శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యతగా సికిల్‌సెల్‌ను పేర్కొంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయి. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయి. న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్... వంటివి వ్యాధి లక్షణాల్లో కొన్ని. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుంది. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలవారు, ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వెద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకలు సాగించేవారు కూడా ఎక్కువే. మంచి నిర్ణయం.. వచ్చే 2047కల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. దీనిలో భాగంగా ఈ వ్యాధికి అత్యధికంగా గురయ్యే ఆదివాసీ ప్రాంతాల్లో 0–40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 7 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం వ్యాధి నిర్మూలనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న మా సొసైటీ ఈ మిషన్ అమలులో ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. – చంద్రకాంత్ అగర్వాల్, అధ్యక్షుడు, తలçమియా సికిల్‌సెల్ సొసైటీ. మేనరికపు వివాహాలు కూడా కారణమే తండాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు, దగ్గర బంధువుల్లో వివాహాలు కూడా కారణమే. ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, అవగాహన పెంచడం, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహదపడతాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నాం. – డాక్టర్ కె.సి గౌతమ్‌రెడ్డి, కన్సల్టెంట్ అంకాలజిస్ట్ అమోర్ అసుపత్రి. -
కొడుక్కి జన్యుపరమైన వ్యాధి.. బయటపడ్డ వివాహేతర సంబంధం
భువనేశ్వర్: కుమారుడి అనారోగ్యం భార్య వివాహేతర సంబంధాన్ని బట్ట బయలు చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో భార్యకున్న వివాహేతరసంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు(18) కొన్ని నెలల క్రితం నుంచి తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చూపించినప్పటికి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కుమారుడి అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తన కుమారుడిని ఢిల్లీ, గురుగావ్ ఫోర్టీస్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి హై-పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ(హెచ్పీఎల్సీ) టెస్ట్ చేయడంతో ఆ వ్యక్తి కుమారుడికి ‘సికిల్ సెల్ అనీమియా’ అని తెలిసింది. అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని తెలిపారు వైద్యులు. తల్లిదండ్రులిద్దరి నుంచి పిల్లలకు ఈ జబ్బు వస్తుందని వెల్లడించారు వైద్యులు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయాలని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు సదరు వ్యక్తి, అతడి భార్యకు టెస్ట్‌లు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెస్టుల్లో ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా తేలింది. ఇక అతడి భార్యలో సికెల్ సెల్ అనీమియా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులిద్దరిలో సికెల్ సెల్ అనీమియా మధ్యస్థ లక్షణాలు ఉంటేనే.. వారి ద్వారా వంశపారంపర్యంగా అది పిల్లలకు వస్తుంది. కానీ ఇక్కడ సదరు యువకుడి తల్లిలో మాత్రమే సికెల్ సెల్ అనీమియా లక్షణాలు గుర్తించారు వైద్యులు. ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్ చేశారు. అప్పుడు కూడా అదే ఫలితం రావడంతో ఈ విషయాన్ని కుర్రాడికి తెలిపారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడా యువకుడు. తనకు వచ్చిన జబ్బు.. అది ఎలా వస్తుందో తండ్రికి వెల్లడించాడు. ఈ క్రమంలో భార్య చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత దీని గురించి భార్యను నిలదీయగా.. ఆమె తన తప్పు అంగీకరించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని తెలిపింది. అతడి ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. సదరు మహిళకు, ఆమె ప్రియుడికి సికెల్ సెల్ అనీమియా ఉండటం వల్లే.. ఆ కుర్రాడికి కూడా అదే జబ్బు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు. -
మిత్రమా... ఇక రావా!
సాక్షి, కవిటి/శ్రీకాకుళం : ఉత్సాహంగా పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తమ సహచరుడు అర్ధంతరంగా మృతి చెందడాన్ని ఆ స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. తమతో ఆడుతూ పాడుతూ కలివిడిగా తిరిగిన బాల్యమిత్రుడు ఇక లేడన్న చేదు నిజం వారిని శోకసాగరంలో ముంచింది. మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన బలగ జగదీష్(16) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇతడు సికిల్‌సెల్ ఎనీమియా అనే వ్యాధితో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. ఇతడిని ఎంతో ఆప్యాయతా అనురాగాలతో చూసుకునే జగదీష్ తాతయ్య ఇటీవల ఆకస్మికంగా మృతిచెందాడు. దీంతో ఆ రోజు నుంచే తీవ్రంగా కుంగిపోయిన జగదీష్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తన తండ్రికి తలకొరివి పెట్టిన కారణంగా జగదీష్‌ను వైద్యానికి తీసుకువెళ్లలేకపోయిన బలగ నారాయణ, అతని భార్య తన కన్నకొడుకు కళ్లేదుటే మృతిచెందడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జగదీష్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్‌ను రప్పించారు. ఎందుకైనా మంచిదని స్థానిక ఆర్ఎంపీ బాలుడిని పరీక్షించారు. అప్పటికే అతని గుండె ఆగిపోయి మృతిచెందినట్టు నిర్ధారించడంతో వారంతా హతాశులయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మన్యంలో సి‘కిల్’సెల్
జంగారెడ్డిగూడెం : ఏజెన్సీ మూడు మండలాల్లో గత ఏడాది ఆర్తీ స్వచ్ఛంద సేవా సంస్థ సికిల్‌సెల్ అనీమియాపై సర్వే చేసి అనేకమందికి రక్తపరీక్షలు నిర్వహించింది. దానికి సంబంధించిన నివేదికను కనీసం వైద్యాధికారులు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాధిపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో అనీమియా కాకుండా తలసేమియా, సెప్టోమేసియా, జువైనల్ డయాబెటిక్ కేసులు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యాధిన బారిన పడేవారు ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు. పౌష్టికాహార లోపమే కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాలు, అమృతహస్తం, హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లు ఏర్పాటు చేసి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఇంకా రక్తహీనతతో ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో కూడా సికిల్‌సెల్ అనీమియా లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయూంలో జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రోగాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకునేవారు. దీనికోసం ప్రత్యేక కమిటీలు వేసి నిధులు కూడా కేటాయించారు. అయితే ఈ కార్యక్రమం అమలుపై దృష్టి సారించే అధికారులు కానరావడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు రక్తహీనతతో బాధపడే వారికి సరైన పరీక్షలు జరిపించి అది ఏ వ్యాధో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు జి.నాగదుర్గాదేవి. కొయ్యలగూడెం మండలం పిడకప్పగూడెంకు చెందిన నాగదుర్గాదేవి బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు 9వ తరగతిలోనే సికిల్‌సెల్ అనీమియా వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆమెకు ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నప్పటికీ ఇటీవల కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మందులు మానివేసినట్టు దుర్గాదేవి చెప్పింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి మల్లీశ్వరి కూలి చేస్తేనే గాని ఇల్లు గడవదని, సొమ్ములు చెల్లించలేక మందులు మానివేసినట్టు చెప్పింది. అయితే ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆమెకు నచ్చజెప్పి మందులు సక్రమంగా వాడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ యువకుడి పేరు పాయం నవీన్ (16) బుట్టాయగూడెం మండలం లంకపాకలకు చెందిన యువకుడు కేఆర్‌పురం గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివేవాడు. ఇతనికి చిన్నతనం నుంచి సికిల్‌సెల్ అనీమియా ఉందని తల్లి నూతన తెలిపారు. నవీన్‌ను మద్రాసు ఆసుపత్రిలో చేర్పించి ఖరీదైన వైద్యం చేయించామని తెలిపారు. ప్రతి రెండు నెలలకొకసారి రక్తాన్ని మార్పిడి చేసినట్టు తెలిపారు. 2014 డిసెంబర్ నెలలో తన బిడ్డ నవీన్‌కు మలేరియా, కామెర్లు రావడంతో మృతిచెందినట్టు ఆమె తెలిపారు. బిడ్డ ఆరోగ్య స్థితి బాగుపడుతుందని రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినప్పటికీ తమకు దక్కకుండా పోయినట్టు ఆమె కన్నీటి పర్యంతం అయింది. ఈ బాలుడి పేరు గంజి శ్రీను(14). బుట్టాయగూడెం అంబేద్కర్‌నగర్‌కు చెందిన శ్రీను సికిల్‌సెల్ అనీమియా బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆ బాలుడిని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ఆసుపత్రులలో చేర్పించి వైద్యం అందించేలా కృషి చేశామన్నారు. కాకినాడలోని ఆసుపత్రిలో చేర్పించి మూడు నెలల పాటు వైద్యం అందించినట్టు తెలిపారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో కూడా నెలరోజులు వైద్యం చేయించామన్నారు. ఇందుకోసం రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆ వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ కనీసం పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో ఇంటి వద్దే ఉంచామని, ప్రమాదశావత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందినట్టు తండ్రి వెంకటరావు తెలిపారు. -
మన్యంలో రక్తచరిత్ర
గిరిజనులను మింగుతున్న ‘జన్యు’వ్యాధి ‘సికిల్ సెల్ అనీమియా’తో చిన్నారుల మృత్యువాత ఉత్తరాంధ్ర ఏజెన్సీల్లో లక్షమందికి రోగ లక్షణాలు! పచ్చటి మన్యాన్ని ఓ మహమ్మారి మింగేస్తోంది... గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.. ఏజెన్సీలలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.. చిన్నారులే లక్ష్యంగా ప్రాణాలనే హరిస్తోంది.. మందులకు లొంగని ఆ రోగానికి మన్యమంతా ఖాళీ అవుతుంటే.. సర్కారు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఆదుకునే నాధుడు లేక గిరిజనుల వేదన అరణ్య రోదనే అవుతోంది... బి.గణేష్ బాబు, ’సాక్షి‘ ప్రతినిధి : సికిల్ సెల్ అనీమియా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్న భయంకరమైన వ్యాధి ఇది. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ జబ్బుకు ఇంతవరకు మందులు లేవు. ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈ రోగం బారినపడి చనిపోతున్నారు. అసలు ఏజెన్సీలో ఎంతమందికి ఈ వ్యాధి ఉంది? ఎందరు మరణించారు? లాంటి గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని గణాంక విభాగంలో ఈ రోగులు వివరాలను అడిగితే.. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి..? అని అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ జబ్బు అదుపునకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలో ఈ వ్యాధిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో దాదాపు 10 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో కనీసం 10 శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. యూనివర్సిటీ స్థాయిలో ‘హ్యూమన్ జెనెటిక్స్’ విభాగం జరిపిన పలు శాంపిల్ సర్వేల్లో ఏజెన్సీ పరిసరాల్లోని గిరిజనేతరుల్లోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మందులు లేవు.. పట్టించుకునేవారు లేరూ.. పాడేరు పరిసరాల్లో సికిల్ సెల్ అనీమియా రోగుల సంఖ్య భారీగా ఉంది. ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఆక్సిజన్ లభ్యతలో తేడాలుంటాయి. రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిఉంటుంది. పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఇటీవల రక్తం నిలువచేసే రిఫ్రిజరేటర్ చెడిపోయింది. అయినా పట్టించుకున్న నాధుడే లేడు. ఈ రోగానికి మందులు లేవు. సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం. పరీక్ష ఖరీదు పది రూపాయిలే... జబ్బు నిర్ధారణకు జరిపే రక్త పరీక్ష ఖరీదు రూ.10 లోపే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్లో కలపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా..? వంపు తిరిగి ఉన్నాయా..? అని తెలుస్తుంది. దీన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ల(పీహెచ్సీ)లోనే జరపవచ్చు. విశాఖ జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న పాడేరు, అరకు పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపడం లేదు. తరచూ అనారోగ్యానికి గురయ్యే రోగులు మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్ సెల్ అనీమియా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. సికిల్ సెల్ అనీమియా అంటే... సాధారణ మనిషి రక్తంలో ఎర్ర రక్త కణాలు పెప్పర్మింట్ల ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తనాళాల ద్వారా అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే కొందరిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు గుండ్రంగా కాకుండా ‘కొడవలి’(సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్ సెల్‌గానూ, ఒకటి మామూలుగానూ ఉన్నవారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. ఈ క్యారియర్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పుట్టే పిల్లల్లో రక్త కణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. వీరికి పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మామూలు రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే.. ఈ కణాల జీవిత కాలం కేవలం 20-25 రోజులే. ఇవి నశించి పోయే లోపు కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో రోగి రక్తహీనతకు గురవుతాడు. పైగా ఈ కణాలు వంపు తిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో ప్రవహించలేక ఆగిపోయి శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. దీంతో రోగి మరణిస్తాడు. ఈ జబ్బు బారినపడినవారు రక్తహీనతకు గురై పది, పదిహేనేళ్ల లోపే చనిపోతున్నారు. కొడుకు చనిపోయాడు.. కూతురుకూ వ్యాధి ఝాన్సీరాణి, క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఝాన్సీరాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. క్రాంతిరాజు గిరిజన కార్పొరేషన్లో సేల్స్‌మన్. మూడేళ్ల కిందట కొడుకు సురేశ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు ’సికిల్ సెల్ అనీమియా‘ అన్నారు. అన్ని రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013లో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే జబ్బు వచ్చింది. కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంపతులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇది వీరి ఒక్కరి సమస్యే కాదు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గూడెంలోను వందలాది కుటుంబాలు ఇలాంటి వ్యథను అనుభవిస్తున్నాయి.