Siddharthajain
-
జిల్లా కలెక్టరా.. ఎన్టీఆర్ భవన్ కార్యదర్శా
సిద్ధార్థజైన్‌కు సభా హక్కుల నోటీసులు ఇస్తాం ఐఏఎస్సా? లేక టీడీపీ వారికి ‘అయ్యా ఎస్సా?’ నిబంధనలు పాటించకుంటే మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక తిరుపతి రూరల్: జిల్లా పరిపాలనాధికారిగా కాకుండా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కార్యదర్శిలా జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అత్యున్నత ఐఏఎస్ చదివిన సిద్ధార్థ జైన్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ఆయన ఐఏఎస్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలకు ‘అయ్యా ఎస్’ అనే స్థాయికి కలెక్టర్ పదవిని దిగజార్చుతున్నారని చెవిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారిక కార్యక్రమాలను సైతం టీడీపీ కార్యక్రమంలా మార్చుతున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 రోజుల్లో చాలా అధికారిక కార్యక్రమాలు జరిగాయని, ఇందులో మంత్రులతో పాటు అధికారిక ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్నారన్నారు. కానీ స్థానిక శాసనసభ్యులైన తనకు మాత్రం కలెక్టర్ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ నెం.348 ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు జరిగినా, మంత్రులు, వీఐపీలు పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడికి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. కానీ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల విషయంలో కలెక్టర్ ప్రోటోకాల్‌ని పాటించడం లేదని తెలిపారు. కలెక్టర్ తీరు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఆయనకు సభా ఉల్లంఘన నోటీసు ఇస్తామని, అసెంబ్లీ ముందు దోషిగా నిలబెడ తామని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించకుంటే శాసనసభ్యుల హక్కుకు భంగం కలిగించే ఏ అధికారినీ వదలమన్నారు. మంత్రులనూ అడ్డుకుంటాం ప్రోటోకాల్ పాటించకుంటే నియోజకవర్గాలకు వచ్చే మంత్రులను ఎక్కడికిక్కడ ప్రజలతో కలసి అడ్డుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికారిక కార్యక్రమాలవద్ద ఎలాంటి సంఘటనలు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉం టుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారప్రతినిధి చిన్నియాదవ్, చంద్రగిరి మండల కోఆప్షన్ మెంబర్ మస్తాన్, వాసు, సునీల్, గజ, ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి ప్రణాళిక
ఏలూరు : జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రికి మంగళవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జెడ్పీ అధికారులతో కొద్దిసేపు మంత్రి సమీక్షిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకంలో భాగంగా ప్రతి గ్రా మంలో రూ.2 కే 20 లీటర్ల సురక్షిత తా గునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అదికారులకు ఆదేశించారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ద్వారా ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తాడేపల్లిగూడెం శరవేగంగా అభివృద్ధి చెందుతోం దని, అయితే పట్టణ ప్రజలు వేసవిలో తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలి పారు. ఏలూరు కాలువ ద్వారా తాడేపల్లిగూడెం సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నింపుతున్నా వేసవిలో నీటి ఎద్దడి తప్పడం లేదన్నారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా పైప్‌లైను ద్వారా తాడేపల్లిగూడెంనికి నీరందించే విషయంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మిపతిరాజు, జయచంద్రబాబు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత ఏర్పాట్లపై అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమై మే 7న పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలూ ప్రత్యేక సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసి ప్రతిక్షణం పోలీస్ పహారాతో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతాచర్యలు అమలు చేస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌కు రెండు ద్వారాలు ఉంటే ఒక ద్వారాన్ని యుద్ధప్రాతిపదికపై ఇటుకల కట్టడంతో మూసివేసి కేవలం ఒక ప్రవేశద్వారాన్ని మాత్రమే ఉండేలా చూస్తామన్నారు. అగ్నిప్రమాదం, వరద ముంపునకు గురికాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సురక్షితమైన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని, సీఆర్పీఎఫ్ పహారాతో భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని ఎక్కాడా చిన్న లోపం లేకుండా సమగ్ర అవగాహనతో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. నిత్యం 32 రిపోర్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని, ముఖ్యంగా అభ్యర్థులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా అమలు చేయాలని సూచించారు. ఓటర్లకు గుర్తింపు కార్డులను అందించడంలో ఎన్నికల సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలో అవసరమైన స్లిప్‌లను పోలింగ్‌కు రెండురోజులు ముందుగానే అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఙస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, అత్యవసర సమయాలలో ప్రత్యామ్నాయంగా జనరేటర్లను కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.