silk industry
-
Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు
సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది. 2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్ రీలర్ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది. పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏటా రికార్డు స్థాయి ధరలు.. గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
సిరుల పట్టు.!
మదనపల్లె సిటీ: పట్టుసాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గత ఏడాది వైరస్‌లతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ధరల పెరుగుదలతో ఉత్సాహంగా ఉన్నారు. చైనా నుంచి ముడిపట్టు దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా దానికి డిమాండ్ పెరిగింది. జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్‌లో బయ్యర్ల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనట్లు కిలో సగటున రూ.650 నుంచి రూ.700 పైగా ధర పలుకుతోంది. పట్టుగూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవే ధరలు మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని రీలర్లు చెబుతున్నారు. గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో రెండవ అతి పెద్ద పట్టుగూళ్ల మార్కెట్ మదనపల్లె. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడికి ప్రతి రోజు 2 వేల నుంచి 1500 క్వింటాళ్లకు పైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. మదనపల్లె, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక ప్రాంతాల నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ధరల పెరుగుదలతో ఖుషీ మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్లో శనివారం గరిష్టంగా కిలో రూ.700 పలికింది. ఇటీవల చైనా నుంచి సిల్కు దిగుబడి తగ్గడంతో దేశీయ సిల్కుకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో సిల్కు ధరలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అత్యధికంగా రూ.3 వేల వరకు ఉన్న దేశీయ నాణ్యమైన సిల్కు ధర ప్రస్తుతం రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం పట్టుగూళ్ల ధరలపైనా పడి రైతులు లాభాలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్ (కిలో బైవోల్టిన్ గూళ్లకు రూ.50) కూడా వారికి కలిసొస్తోంది. సంతోషంగా ఉంది ప్రస్తుతం పెరిగిన ధరలు సంతోషాన్నిస్తున్నాయి. పదేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ధరలు చూస్తున్నాం. గతంలో ఇలాంటి ధరలు చూడలేదు. మల్బరీ సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయనేందుకు ఇప్పుడున్న ధరలే నిదర్శనం. ఏది ఏమైనా ఈ ధరలు మల్బరీ సాగు చేసిన రైతులందరికీ ఎంతో ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. – సోమశేఖర్, రైతు, తవళం, నిమ్మనపల్లె మండలం మంచి లాభాలు చూస్తున్నా నేను రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఎండల కారణంగా పురుగుల పెంపకం కొంత ఇబ్బంది అనిపించినా ధరలు మాత్రం బాగున్నాయి. –హరికుమార్‌రెడ్డి, పట్టురైతు, పేయలవారిపల్లె, తంబళ్లపల్లె మండలం జాగ్రత్తలతో మంచి దిగుబడి పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడం శుభపరిణామం. ఈ తరుణంలో రైతులు శాస్త్రీయ పద్దతులు, జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి. ముఖ్యంగా మల్బరీ కొరత రాకుండా తోటల పెంపకంపై దృష్టి పెట్టాలి. –రవి, ఇన్చార్జి ఏడీ, పట్టుపరిశ్రమశాఖ,మదనపల్లె. -
ఏపీ: సెరీ కల్చర్ అభివృద్ధికి సర్కారు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని (సెరీకల్చర్) మరింతగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో టస్సార్ పట్టు పురుగుల పెంపకం ద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో రెండో స్థానంలో ఉంది. ముడి పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా మన రాష్ట్రానికి బెస్ట్ బైవోల్టైస్ సెరీకల్చర్ ప్రాక్టీసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డు లభించింది. మల్బరీ విస్తరణకు ప్రోత్సాహకాలు రాష్ట్రంలో 1,19,050 ఎకరాల్లో 68,921 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అనంతపురంలో 48,922 ఎకరాలు, చిత్తూరులో 46,400 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. తూర్పు ఏజెన్సీ పరిధిలోని 7,500 ఎకరాల్లో టస్సార్ సాగు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 59,079 టన్నుల పట్టుగూళ్లు, 8,420 టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు పరిశ్రమపై ఆధారపడి 13.09 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,053.70 కోట్ల స్థూల విలువ సాధించిన పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన రెండేళ్లలో 13,500 ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి రాగా.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో 10వేల ఎకరాల్లో మల్బరీ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.51.920 కోట్ల అంచనాతో కార్యాచరణ సిద్ధం చేశారు. ‘సిల్క్ సమగ్ర’ పథకం కింద రూ.35.47 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ (ఎస్డీఎస్) కింద రూ.12.29 కోట్లను ప్రతిపాదించారు. ఇప్పటికే ఎస్డీఎస్ కింద రూ.12.29 కోట్లు విడుదల చేయగా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.19.86 కోట్లు కేటాయింపులు జరిపారు. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ మొక్కలు వేసుకునేందుకు రూ.10,500, షెడ్‌కు రూ.3 లక్షలు, పరికరాలకు రూ.57,500, మందుల కోసం రూ.3,750 చొప్పున రైతులకు అందిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న తెల్ల పట్టుగూళ్లకు కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్ కూడా ఇస్తోంది. కొత్తగా మూడు ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు గత ప్రభుత్వ హయాంలో తగిన ప్రోత్సాహం లేక నిస్తేజంగా తయారైన పట్టు పరిశ్రమకు ప్రస్తుత ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవడంతో మూలనపడ్డ మగ్గాలు సైతం మళ్లీ నేత నేస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో పెద్దఎత్తున పట్టు పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు హిందూపురం, తాడిపత్రి, కుప్పం, శాంతిపురం, ధర్మవరంలలోనే పట్టు ఆధారిత పరిశ్రమలున్నాయి. గడచిన రెండేళ్లలో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల పెట్టుబడులతో మదనపల్లి, పెద తిప్పసముద్రం, చేబ్రోలులో కొత్తగా ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ధర్మవరంలో మరో పరిశ్రమ రాబోతుంది. రైతులు ముందుకు రావాలి పట్టు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మల్బరీ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక్కసారి మొక్కలు వేస్తే కనీసం 20 ఏళ్ల పాటు ప్రతినెలా ఆదాయం వస్తుంది. తొలి ఏడాది 600 కేజీలు, రెండో ఏడాది 800 కేజీల చొప్పున పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమేపి వెయ్యి నుంచి 1,200 కేజీల వరకు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పట్టుగూళ్లకు మంచి రేటు పలుకుతోంది. సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునిస్తుంది. – సి.అరుణకుమారి, అడిషనల్ డైరెక్టర్, సెరీకల్చర్ -
దసలి ‘పట్టు’.. మొదటిస్థానం కొట్టు..
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో దసలి పట్టు సాగు తెలంగాణకే తలమాణికంగా మారింది. రాష్ట్రంలోనే దసలి పట్టు కాయ దిగుబడికి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టు పరిశ్రమ పెట్టింది పేరు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా దసలి పట్టుసాగుకు కొంత నష్టం వాటిల్లినప్పటికి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి చేరువులో దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. చెన్నూర్ పట్టు కేంద్రానికి వివిధ అటవీ ప్రాంతాల నుంచి దసలి పట్టు కాయలను రైతులు తీసుకొస్తున్నారు. త్వరలోనే బహిరంగ వేలం.. చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నల మండలాల్లో పండించిన దసలి పట్టు కాయను చెన్నూర్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో దిగుబడి కొంత త గ్గిందని రైతులు పేర్కొంటున్నా రు. ఎకరం విస్తీర్ణంలో గల మద్ది చెట్లకు 20 వేల దసలి కాయల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది 15 నుంచి 18 వేల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. భూములు లేని గిరిజన రైతులే.. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం దసలి కాయ సాగును ప్రొత్సహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయను పండించే విధానంపై శిక్షణనిచి్చంది. గత 30 ఏళ్లుగా ఈ జిల్లాల్లో సుమారు 1000 మంది రైతులు 7500 ఎకరాల్లో దసలి పంటను పండిస్తున్నారు. కుమురంభీం జిల్లాలోని గొల్లతరివి, కౌటల, బెజ్జురు, మంచిర్యాల జిల్లాలోని నెన్నల మండలంలోని మన్నెగూడెం, కోటపల్లి మండలంలోని కొత్తపల్లి, రాజారం, పారుపల్లి, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలంలోని ముల్కలపేట చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, లింగంపల్లి గ్రామాలో దసలి పట్టు కాయ పండిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ఏడాది ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ అధికారులు దసలి పట్టు సాగుకు అనుమతించలేదు. ఏడాదికి మూడు పంటలు.. దసలి పట్టు కాయ పంట 45 రోజుల్లో చేతికి వస్తుంది. రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. దసలి పట్టు కాయలో బైలొల్టిన్, ట్రైవొలి్టన్ అనే రెండు రకాలు ఉన్నాయి. బైవొల్టిన్ దసలి కాయకు ధర వెయ్యికి రూ. 2000 వేల నుంచి రూ. 2500 వేల వరకు పలుకుతుండగా ట్రైవొలి్టన్ కాయ ధర రూ. 1700 నుంచి రూ.1900 వరకు ఉంటుంది. బైవొల్టిన్ దసలి గుడ్లపై 50 శాతం సబ్సిడీ ఉండడంతో రైతులు బైవొల్టిన్ పట్టు పంటను ఎక్కువ శాతం పండిస్తున్నారు. ట్రైవొలి్టన్ గుడ్లకు (విత్తనాలకు) సబ్సిబీ ఎత్తి వేశారు. అలాగే గత ఏడాది గుడ్డు ధర రూ. 6 ఉండగా ప్రస్తుతం రూ. 12కు పెంచారు. గుడ్ల ధర రెండింతలు కావడంతో పంట సాగు ఖర్చు పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. వేలంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల వ్యాపారులు (ఫైల్) రైతుల శ్రమే పెట్టుబడి.. దసలి పట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమే పెట్టుబడి. రైతులు 2వేల నుంచి 3 వేల రూపాయలతో గుడ్లను కోనుగోలు చేస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా ఖర్చులు ఉండవు. గుడ్లు కొనుగోలు అనంతరం అవి పిల్లలు అయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి పట్టు పురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. పట్టుపురుగులు ఆకులను తింటు 20 రోజులకు దసలి పట్టు కాయగా మారుతాయి. పట్టు పురుగులను పక్షులు తినకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి. రెండు నెలల పాటు కష్టపడితే కాయ చేతికి అందుతుంది. ఒక్కో రైతు 20 నుంచి 30 వేల కాయను పండిస్తారు. దసలి కాయ మంచి దిగుబడి వస్తే ఒక్కో రైతు సంవత్సరానికి పెట్టుబడులు పోను రూ. 70వేల నుంచి రూ.80 వేలు సంపాదిస్తారు. ప్రథమ స్థానంలో మంచిర్యాల జిల్లా.. రాష్ట్రంలోని భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రైతులు దసలి పట్టు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా రైతులు దసలి పట్టు కాయ సాగు చేస్తూ సాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రాంతంలో పండించిన పట్టు కాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనుండడం విశేషం. ఇక్కడి పట్టు కాయకు మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రథమ స్థానంలో మంచిర్యాల జిల్లా.. రాష్ట్రంలోని భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రైతులు దసలి పట్టు సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా రైతులు దసలి పట్టు కాయ సాగు చేస్తూ సాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ ప్రాంతంలో పండించిన పట్టు కాయ కొనుగోలు వేలంలో ఇతర రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనుండడం విశేషం. ఇక్కడి పట్టు కాయకు మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. వెయ్యి కాయలకు రూ. 4 వేలు ఇవ్వాలి ఇంటిల్లిపాది 45 రోజులు కష్టపడి దసలి పురుగులను కాపాడితే కాయ చేతికి వస్తుంది. కాయ కొసి అమ్ముకునే సరికి రెండు నెలలు అవుతుంది. దీనికి రూ. 25 వేల నుంచి రూ. 35 వేలు వస్తున్నాయి. ఈ ఏడు పంట సరిగా లేదు. బహిరంగ వేలంలో వెయ్యి కాయలకు రూ. 4 వేలు పలికితే రైతుకు లాభం చేకూరుతుంది. ఆరు నెలల పాటు ఖాళీగా ఉంటున్నాం. పట్టుదారం తీసే యంత్రాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. – బాగాల మధునక్క, మహిళ రైతు, కోటపల్లి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం.. చెన్నూర్ పట్టు పరిశ్రమ దసలి పట్టు సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆరు నెలల పాటు పనులు కల్పించాలనే ఉద్ధేశంతో ఉపాధి హామీ పనుల్లో రైతులను భాగస్వాములు చేసేందుకు డీఆర్డీఏ పీడీతో మాట్లాడా. ముడి సరుకులు ఇక్కడే పండిస్తుండడంతో మహిళలకు దారం తీసే పనులు కల్పించాలని దారం తీసే యంత్రాలను కూడా కొనుగోలు చేశాం. త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభిస్తాం. – బాషా, ఏడీ, సెరికల్చర్, చెన్నూర్ -
సేంద్రియ మల్బరీతో లాభాల పట్టు!
ఎదుగూ బొదుగూ లేని కాంట్రాక్టు ఉద్యోగం కన్నా.. లోతైన అవగాహనతో సేంద్రియ సేద్యం చేయటమే ఉత్తమమం. అందులోనూ సాధారణ పంటల కన్నా నెల నెలా ఆదాయాన్నిచ్చే సేంద్రియ మల్బరీ సాగే మేలని ఓ యువ రైతు రుజువు చేశారు. అంతేకాదు, ఉత్తమ రైతుగా పురస్కారాన్ని అందుకోవటం విశేషం. ఆదర్శ రైతు స్ఫూర్తిదాయక గాథ ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. మామిడి సైదులు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో సేంద్రియ మల్బరీ సాగు చేసుకుంటూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన సైదులు.. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సెరికల్చర్ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్(కాంట్రాక్టు ఉద్యోగి)గా ఆరేళ్లు పనిచేశాడు. ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో 2006లో ఉద్యోగం మానేసి మల్బరీ రైతుగా మారారు. నల్లగొండ పట్టు పరిశ్రమ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారం, సలహాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో నాలుగు ఎకరాల మల్బరీ తోట సాగు చేస్తున్నారు. ఆకు నాణ్యత కోసం వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు వాడుతున్నారు. సంవత్సరానికి కనీసం 7 పంటలు తీస్తున్నారు. 300 గుడ్లు చాకీ చేసి 45 రోజుల్లో ఒక పంట తీస్తున్నారు. పంటకు అన్ని ఖర్చులూ పోను రూ.75 వేల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా నికరాదాయం పొందుతున్నారు. వీలైనంత వరకు పనులన్నీ భార్య భర్త ఇద్దరే చేసుకుంటారు. పంట చివరి 7 రోజుల్లో మాత్రం నలుగురు కూలీల సహాయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో పలువురు రైతులు పట్టు శాఖ అధికారుల తోడ్పాటుతో సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టు గూళ్ల ఉత్పత్తే లక్ష్యంగా.. గతంలో జిల్లాలో మల్బరీ రైతులు పట్టు పురుగులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పట్టు గుడ్లను ఉత్పత్తి చేసేవారు. దీనివలన రైతుకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. సైదులు పట్టు పురుగుల ఉత్పత్తి కోసం తన ఇంటి ఆవరణలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని టెక్నికల్ సర్వీస్ సెంటర్ సరఫరా చేస్తున్న పట్టు గుడ్లను తీసుకొచ్చి ట్రేలలో గుడ్లను పెట్టి, నల్లటి గుడ్డ కప్పి, గుడ్లు పగిలే దశలో వాటిని బయటకు తీస్తారు. మల్బరీ ఆకును చాకింగ్ మిషన్ ద్వారా కట్ చేసి శైశవ దశలో పురుగులకు మేతగా వేసి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల రైతులకు విక్రయించడం ద్వారా సైదులు అధిక లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన అధికారి కృష్ణవేణి తెలిపారు. మల్బరీ రైతులకు షెడ్ నిర్మాణానికి, డ్రిప్‌కు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల అధికారులను సంప్రదించవచ్చన్నారు. – చవగాని నాగరాజుగౌడ్, సాక్షి, పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా పట్టు పురుగుల విక్రయంతో అధిక లాభాలు గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో లాభసాటిగా మల్బరీ సాగు చేస్తున్నాను. గుడ్లను తీసుకొచ్చి ఇంటి దగ్గరే పట్టు పురుగులు పెంచుతున్నాను. ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాను. – మామిడి సైదులు (99599 33842), మల్బరీ రైతు, లింగాల, సూర్యాపేట జిల్లా -
వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
ఈ ఏడాది 3,100 ఎకరాల విస్తరణ లక్ష్యం పట్టు పరిశ్రమశాఖ జేడీ సి.అరుణకుమారి అనంతపురం అగ్రికల్చర్: వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని పట్టు పరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి ‘సాక్షికి తెలిపారు. ఈ ఏడాది 3,100 ఎకరాల్లో కొత్తగా మల్బరీ విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాలు ప్రారంభం కావడం, గరిష్ట ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో రేషం పెంపకానికి రైతులు మొగ్గు చూపిస్తున్నారని ఆమె తెలిపారు. ట్రీప్లాంటేషన్ పద్ధతి వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడినా సమస్య ఉండదన్నారు. ట్రీప్లాంటేషన్కు ఎకరాకు సబ్సిడీ రూపంలో రైతులకు 22,500 అందజేస్తామన్నారు. రైతులకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుండటంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ప్రతిపాదించామన్నారు. క్రాస్‌బ్రీడ్ (సీబీ) రకాన్ని తగ్గించి బైవోల్టీన్ రకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 44 లక్షల బైవోల్టీన్ గుడ్లు ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉపాధిహామీ కింద 250 షెడ్లు మంజూరయ్యాయన్నారు. గతంలో మాదిరిగా అన్ని రకాల పథకాలు రాయితీతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మల్బరీకి మించిన లాభదాయకమైన పంట మరొకటి లేనందున రైతులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. -
సహకారమా? విలీనమా?
► పట్టు పరిశ్రమ సిబ్బందికి ఉద్యాన బాధ్యతలు ► నష్టం కలుగుతుందంటున్న పట్టుపరిశ్రమ శాఖ ► క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ► నేడు ఇరుశాఖలతో రాజధానిలో ఉన్నతాధికారుల సమీక్ష మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లాలో పట్టు పరిశ్రమ రోజురోజుకూ ప్రాభవం కోల్పోతోంది. ప్రభుత్వ సహకారం లభించకపోవడంతో నిర్వీర్యమవుతోంది. మొదట్లో 74మంది ఉన్న సిబ్బంది నేడు 24మందికి చేరారు. ఉద్యోగ విరమణ పొందిన స్థానాల్లో ఖాళీలను భర్తీచేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పట్టు పరిశ్రమశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యాన శాఖ బాధ్యతల్లో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివ రకే నిర్ణయించింది. తద్వారా రైతుల వద్దకు ప్రభుత్వ లక్ష్యాలను చేర్చవచ్చని భావిస్తోంది. ఇక విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి. దీనిపై ఆయా శాఖల రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. కాగా, గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే సమావేశంలో సమన్వయంతో పనిచేసే విధానంపై రెండు శాఖల సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిసింది. పట్టు పరిశ్రమకు గడ్డుకాలం జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన, మత్స్యశాఖల తరువాత పట్టుపరిశ్రమ తమ ఉనికిని చాటుతోంది. ప్రస్తుతం 280ఎకరాల్లో పట్టు తోటలు పెంచుతూ రైతులు లబ్ధిపొందుతున్నారు. కాగా, పట్టుపెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు, తోటల విస్తీర్ణంపై ప్రభుత్వం మొగ్గు చూపకపోవడంతో పరిశ్రమ రోజురోజుకూ నిర్వీర్యమవుతూ వస్తోంది. గతంలో 74మంది ఉన్న ఇబ్బంది చివరికి 23మంది మిగిలారు. ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు పట్టు తోటల విస్తీర్ణానికి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడంతో పట్టు రైతుల నుంచి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. త క్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందికి ఇతరశాఖల బాధ్యతలు అప్పగించడంపై ఈ శాఖ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని పట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమకు ఇన్చార్జ్ డీ డీగా గోపాల్ వ్యవహరిస్తున్నారు. ఆ శాఖకు ఆయనతో పాటు పరిశ్రమ అభివృద్ధి అధికారులు, సహాయ అభివృద్ధి అధికారులు, టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు మొత్తం కలిపి 23మంది సిబ్బంది ఉన్నారు. అయితే పట్టు పరిశ్రమ డీడీకి కాకుండా మిగితా సిబ్బందికి ఉద్యానశాఖ బాధ్యతలు అప్పగించనున్నారు. ‘పట్టు’కు సహకారం ఫలించేనా? జిల్లా ఉద్యానశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యాన అధికారి, విస్తరణ అధికారి పోస్టుల్లో పట్టు పరిశ్రమ నుంచి వచ్చిన సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇలా ఈ రెండుశాఖల సిబ్బంది తమ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రెండు శాఖల పనులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఆయా శాఖలపై పరస్పరం పట్టులేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పట్టు పరిశ్రమ సిబ్బందికి ఉద్యానశాఖ బాధ్యతలు అప్పగించడంతో ఉనికికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పట్టు పరిశ్రమ కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. -
లాభాలు పట్టుకోండి
ఖమ్మం వ్యవసాయం: పట్టుదల ఉంటే పట్టు పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా తోడ్పాటునిస్తోంది. పట్టు పరిశ్రమ నిర్వహణలో షెడ్ నిర్మాణం, నిర్వహణ ముఖ్యమైనది. పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలు పెంచుకోవాలి. జిల్లాలో మొత్తం 365 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 138 ఎకరాల్లో నూతనంగా మల్బరీ సాగు చేపట్టారు. తిరుమలాయపాలెం, ముదిగొండ, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కొత్తగూడెం, భద్రాచలం, కూసుమంచి తదితర మండలాల్లో పట్టుపరిశ్రమలను నిర్వహిస్తున్నారు. పట్టుపరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, పరిశ్రమల ఏర్పాటు, మల్బరీ తోటల పెంపకం గురించి జిల్లా పట్టుపరిశ్రమల అధికారి మడికంటి ఆదిరెడ్డి వివరించారు. ప్రభుత్వ చేయూత మల్బరీ తోటల పెంపకానికి, షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం సీడీపీ (క్యాటలైటిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పథకం కింద నిధులను మంజూరు చేస్తుంది. దీనికి రైతులు కనీసం 2 ఎకరాలు ఒక యూనిట్‌గా మల్బరీ తోటలను పెంచుకోవాలి. మల్బరీ సాగు చేసే రైతులు పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ విధిగా నిర్మించాలి. షెడ్ నిర్మాణానికి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనిలో సుమారు 50 శాతం నిధులను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుంది. షెడ్ 50ఁ20 పొడవు, వెడల్పు సైజులో నిర్మించాలి. షెడ్లో మెస్సు నిర్మాణానికి రూ.16 వేలు, పరికరాలు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్ నేత్రికలకు రూ.21,500లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది. పట్టుపరిశ్రమ శాఖ మల్బరీ మొక్కలను సరఫరా చేస్తుంది. జిల్లాలోని అశ్వారావుపేట, అక్కినేపల్లి, ఖమ్మం సమీపంలోని టేకులపల్లి, కొత్తగూడెం మండలంలోని గరిమళ్లపాడు నర్సరీల్లో మల్బరీ మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలోని నర్సరీల్లో వి-1 రకం మొక్కలు లభిస్తున్నాయి. ఎకరాకు 5,500 మొక్కలు పడుతాయి. వీటికి రూ.9,500 ఖర్చు వస్తుంది. వీటిలో పట్టుపరిశ్రమశాఖ రూ.6,750లను సబ్సిడీ కింద ఇస్తుం ది. అంటే రైతు మొక్క ల కోసం రూ. 2,250లను భరిస్తే సరిపోతుంది. ప్లాంటేషన్ మల్బరీ మొక్కలను జూన్ నుంచి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు. దుక్కిని లోతుగా దున్నాలి. 4 సార్లు దుక్కి దున్నితే మంచిది. దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. వర్మి కంపోస్టునూ వేసుకోవచ్చు. మొక్కల మధ్య, వరుసల మధ్య 3ఁ3 సైజు ఉండే విధంగా నాటు కోవాలి. మొక్క నాటిన తొలి రోజుల్లో వారానికి ఒక తడి ఇవ్వాలి. తరువాత 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వవచ్చు. నేల రకాలు, పట్టు పరిశ్రమశాఖ అధికారుల సూచనల మేరకు రెండునెలలకు ఒకసారి అవసరమైతేనే రసాయన ఎరువులు వాడాలి. 4 నెలలకు మొదటి పంట వస్తుంది. మొదటి సంవత్సరంలో మూడు పంటలు వస్తాయి. రెండో సంవత్సరం 5 నుంచి 7 పంటలు తీయవచ్చు. ఒకసారి మల్బరీ వేస్తే 12 నుంచి 15 ఏళ్ల వరకు దాన్ని మేతగా ఉపయోగించుకోవచ్చు. పట్టు పురుగుల పెంపకం సెంట్రల్ సిల్క్ బోర్డ్ విజయవాడ నుంచి పట్టుగుడ్లను సరఫరా చేస్తుంది. 100 పట్టుగుడ్ల ధర రూ.550 (మేలు రకమైన పట్టు గుడ్లు) నెల రోజుల్లో పట్టు గూళ్లు అల్లుకుంటాయి. ఆదాయం: ఎకరం మల్బరీ సాగు చేస్తే దాని ఆకుతో పెంచిన పురుగులతో సంవత్సరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది. ఒక కిలో పట్టు గూడు ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.340 వరకు ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సహకంగా కిలోకు రూ.50 చొప్పున అందిస్తోంది. మార్కెటింగ్ రైతులు పండించిన పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. తెలంగాణలోని జనగాం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్‌జంక్షన్, అనంతపురం, రామ్‌నగర్ (బెంగళూరు)లలో పంటను అమ్ముకునే అవకాశం ఉంది. ఏడాదిలో ఆగస్టు 15, జనవరి 26 మినహా అన్ని రోజుల్లో ఇక్కడ పంటను అమ్ముకోవచ్చు. నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుకాదు. -
సబ్సిడీ ‘పట్టు’!
జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలు.. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోటల పెంపకం పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలను ఏర్పాటుచేసింది. మొయినాబాద్ మండలంలోని నజీబ్‌నగర్, తాండూరు, వికారాబాద్ మండలంలోని అనంతగిరిపల్లి, దూలపల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటిలో మల్బరీ మొక్కలను, చాకీ వామ్స్ను పెంచి రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నారు. మల్బరీ మొక్కలను క్షేత్రంలోనే నాటువేసి అవి కొంత పెద్దవైన తర్వాత ఒక్కో మొక్కను రూపాయి పావలాకు అందజేస్తారు. ఎకరా పట్టు తోటలను సాగు చేయాలంటే ఐదువేల మల్బరీ మొక్కలు అవసరం. నజీబ్‌నగర్ క్షేత్రంలో సేం ద్రియ ఎరువులైన పేడ, వేపపిండిని ఉపయోగించి మొక్కలను పెంచుతున్నారు. దీంతో ఈ మల్బరీ మొక్కలకు ఎక్కువ చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. రైతులు మ ల్బరీ తోటలు నాటిన నాలుగో నెల నుంచి పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. రైతు ఒక ఎకరంలో మల్బరీ తోట సాగు చేసిన రెండో సంవత్సరం నుంచి పట్టు పురుగులను పెంచి పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి విక్రయించడం వల్ల సంవత్సరానికి రూ.లక్షా 20వేలనుంచి రూ.లక్షా 50వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సబ్సిడీకి అర్హతలివే.. పట్టు పరిశ్రమ చేపట్టే రైతులు వ్యవసాయ బావి గానీ, బోరు గానీ కలిగి ఉండి సంవత్సరం పొడవునా నీటి వసతి పుష్కలంగా కలిగి ఉండాలి. సొంత పట్టా భూమి కలిగిన అన్ని కులాలు, అన్ని కేటగిరీలకు సంబంధించిన రైతులు అర్హులు. ఇసుక భూములు, ఆమ్ల, క్షార భూములు మల్బరీ తోటలు పెంచేందుకు పనికిరావు. సమతుల భూములు అత్యంత శ్రేష్టమైనవి. నీటిని పారించేందుకు ఎరువులు వేసేందుకు అనువుగా ఉండాలి. మట్టి నమూనా పరీక్షలు చేయించటం అవసరం. మల్బరీ తోటకు రెండున్నర ఎకరాలు కేటాయించాలి. అక్కడే పట్టు పురుగులు పెంచేందుకు షెడ్లను నిర్మించుకోవాలి. పట్టు పరిశ్రమను చేపట్టే రైతులు సబ్సిడీ పొందేందుకు తప్పనిసరిగా 5 సంవత్సరములు మల్బీరీ తోటను పెంచి, పట్టు పురుగుల పెంపకం చేపట్టి, పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తామని అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పట్టు పరిశ్రమ శాఖ ద్వారా పొందిన సబ్సిడీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి ఏడాదికి 1000 నుంచి 1200 రింగుల పట్టు గుడ్లు పెంచి 600 కేజీల నుంచి 720 కేజీల నాణ్యత కలిగిన పట్టుగూళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. పట్టు పరిశ్రమ శాఖనుంచి సీడీపీ స్కీం కింద రైతులకు ఆయా పనులు చేసేందుకు సబ్సిడీ అందజేస్తారు. సబ్సిడీ కోసం రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను దరఖాస్తుతోపాటుగా సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాలి.