Sindhudurg
-
ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నా..
పాల్ఘార్: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన పట్ల శివాజీని, శివాజీ అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.. శివాజీ అంటే కేవలం ఒక పేరు, ఒక పాలకుడు కాదని అన్నారు. ఆయన మనకు ఒక దైవం అని స్పష్టంచేశారు. ఈ రోజు ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. విగ్రహం కూలిపోవడం పట్ల శివాజీ అభిమానుల మనసులు గాయపడ్డాయని, వారందరినీ క్షమాపణ ఆర్థిస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో రూ.76,000 కోట్లతో నిర్మించే వాద్వాన్ ఓడరేవు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. మనం పాటించే విలువలను చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. దైవంలాంటి ఛత్రపతి శివాజీ కంటే మనకు ఇంకేదీ గొప్ప కాదని స్పష్టంచేశారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తన పేరు ఖరారు కాగానే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ను సందర్శించానని, శివాజీ సమాధి వద్ద ధ్యానం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. మరాఠా వీరుడు వీర సావర్కార్‌ను కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆరోపించారు. వారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన లక్ష్య సాధనలో ‘అభివృద్ధి చెందిన మహారాష్ట్ర’ ఒక కీలక భాగమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి కోసం గత పదేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహారాష్ట్ర శక్తిసామర్థ్యాలు, సంపదతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా ప్రయోజనం పొందాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పూర్తి అంకితభావం, నిజాయితీతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చేపల పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా వేలాది మంది మహిళల సాధికారతకు చేయూత అందించామని వివరించారు. చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా రికార్డుకెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 2014లో మన దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్ టన్నులుగా ఉందని, ఇప్పుడు 17 మిలియన్ టన్నులకు చేరిందని వెల్లడించారు. పదేళ్లలో ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్నారు. రూ.76,000 కోట్లతో వాద్వాన్ పోర్టు నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టు అవుతుందని చెప్పారు. అభివృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని మోదీ వ్యాఖ్యానించారు. రూ.1,560 కోట్లతో నిర్మించే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు సైతం ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.360 కోట్లతో రూపొందించిన వెస్సెల్ కమ్యూనికేషన్, సపోర్టు సిస్టమ్ ప్రారంభించారు. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ‘నూతన భారత్’కు దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో పూర్తిగా తెలుసని స్పష్టంచేశారు. -
మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ.. ఏడాదిలోపే కూలిన శివాజీ విగ్రహం
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.అయితే విగ్రహం కూలడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. కానీ గత రెండుమూడు రోజులుగా సింధుదుర్గ్ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం కూలడానికి కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక విగ్రహం కూలిన అనంతరం సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.Gujarat Model!!!The BJP's corrupt governance has insulted Chhatrapati Shivaji Maharaj and Maharashtra. A statue of Chhatrapati Shivaji Maharaj, inaugurated by PM Modi on December 4, 2023, collapsed today, with locals blaming poor construction.#RainfallinGujarat pic.twitter.com/wwD87Tblcv— Pritesh Shah (@priteshshah_) August 26, 2024 మరోవైపు ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రధాని ఆవిష్కరించిన శివాజీ విగ్రహం ఇలా ఉన్నట్టుండి కూలిపోవడంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంతి పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విగ్రహం కూలిపోయిందని.. నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేవలం కార్యక్రమం నిర్వహణపై మాత్రమే దృష్టి సారించిందని విమర్శించారు. -
గొలుసుతో చెట్టుకు కట్టేసి
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అడవుల్లో ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ మహిళ కనిపించింది. రోజులుగా ఆహారంలేక ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. పశువుల కాపరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ దగ్గర దొరికిన యూఎస్ పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కాయి కుమార్ ఎస్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్‌లో సోనుర్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అక్కడ అతనికి మనిషి మూలుగు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఓ మహిళ కాలికి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సావంత్‌వాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మహిళ దగ్గర యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు అడ్రస్‌తో ఆధార్ ఉందని, పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటోందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను.. ఇంట్లో గొడవల కారణంగా భర్తే.. 40 రోజుల కిందట అడవిలో వదిలేసి వెళ్లినట్లుగా ఆస్పత్రిలో ఆమె రాసిన వివరాల ఆధారంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె వీసా గడువు కూడా ముగిసిందని, విదేశీయుల స్థానిక నమోదు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు ఆమె భర్త, బంధువుల గురించి వించారించేందుకు కొన్ని బృందాలు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు. -
మత్స్యం.. బీభత్సం..
విఠలాచార్య సినిమాల్లోని చేప కాదు.. నిజమైనదే.. సోమవారం మహారాష్ట్రలోని సింధు దుర్గ్ ప్రాంతంలో మత్స్యకారులకు చిక్కిందీ చిత్రమైన చేప.. రంపంలాంటి పళ్లతో ఈ మత్స్యం.. బీభత్సంగా ఉంది కదూ.. భారీ ధరకు అమ్ముడుపోయిన దీనిని చూసేందుకు జనం, మీడియా విపరీతమైన ఆసక్తి కనబర్చారు.