మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.
అయితే విగ్రహం కూలడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. కానీ గత రెండుమూడు రోజులుగా సింధుదుర్గ్ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం కూలడానికి కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక విగ్రహం కూలిన అనంతరం సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Gujarat Model!!!
The BJP's corrupt governance has insulted Chhatrapati Shivaji Maharaj and Maharashtra. A statue of Chhatrapati Shivaji Maharaj, inaugurated by PM Modi on December 4, 2023, collapsed today, with locals blaming poor construction.#RainfallinGujarat pic.twitter.com/wwD87Tblcv— Pritesh Shah (@priteshshah_) August 26, 2024
మరోవైపు ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రధాని ఆవిష్కరించిన శివాజీ విగ్రహం ఇలా ఉన్నట్టుండి కూలిపోవడంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంతి పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విగ్రహం కూలిపోయిందని.. నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేవలం కార్యక్రమం నిర్వహణపై మాత్రమే దృష్టి సారించిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment