Sir Arthur Cotton
-
Sir Arthur Cotton: డెల్టా రైతుల నుదుటి రాతలు మార్చిన మాన్యుడు
నిర్మానుష్యంగా బొమ్మూరు మెట్టమీద ఒక గుర్రపుశాల, ఒక పెద్ద ఇల్లు అక్కడ నుండి చూస్తే గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టతో పాటు ఉరకలేస్తున్న గోదారమ్మ సోయగాలను వీక్షించవచ్చు. నీటి మీద రాతలు రాయలేం గానీ నీటిని ఆపి ఆనకట్ట కట్టి డెల్టా ప్రజల నుదుటిరాతను మార్చిన ‘దేవుడు’ సర్ ఆర్థర్ కాటన్ నివసించిన పవిత్ర స్థలం. క్రీ.శ. 1803 సంవత్సరం మే 15న ఇంగ్లాండు అడ్డీస్ కాంబేలో హెన్రీ కాలేలీ కాటన్ దంపతులకు 10వ సంతానంగా జన్మించిన అర్థర్ కాటన్ 15 ఏళ్ళ ప్రాయంలోనే కేడెట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సౌత్ ఇండియాలోని మద్రాస్ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసులో ఉద్యోగం పొందారు. కరువుతో అల్లాడుతున్న మధుర, కోయంబత్తూరు, తిరునల్వేలి ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసారు. 1840లో కృష్ణానదిపై ఆనకట్టకు ప్రతిపాదనలు రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేసారు. 17, 18 శతాబ్దాల కాలంలో అతివృష్టి, అనావృష్టి వరదలు వంటి వాటి కారణంగా బంగాళాఖాత తీరప్రాంతమైన కోరంగి, విశాఖపట్నం, యానాం, తదితర ప్రాంతాలలో కొన్ని వేలమంది చనిపోవడం, కొన్ని నౌకలు కూడా జలసమాధి కావడం జరిగింది. 1844లో మచిలీపట్నంలో వచ్చిన తుఫానుకు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ధాన్యరాశులు సముద్రంలో కలిసిపోయి 15 వేల మంది ప్రజలు మరణించడంతోపాటు గోదావరి, కృష్ణా ప్రాంతాలలో ప్రజలు ఆకలిమంటలతో అల్లాడిపోయారు. అప్పటికే కాటన్ 1844, 1845, 1846 సంవత్సరాలలో నివేదికలు పంపించినా బ్రిటిష్ పాలనా యంత్రాంగం ఆమోదించలేదు. దీంతో స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి 1847లో ఆనకట్ట నిర్మాణం మొదలు పెట్టారు కాటన్. ఎన్నో కష్టనష్టాలకోర్చి రవాణా సౌకర్యం లేని ఆ రోజులలో తన గుర్రంపై తిరిగి ఆయకట్టు ఎత్తుపల్లాలను సరిచూచుకొని కాలువలు తవ్వి చివరి ప్రాంత ఆయకట్టుకు కూడా నీరందించేలా డెల్టా వ్యవస్థను, ఆలాగే డ్రైనేజీ సదుపాయం, లాకుల వ్యవస్థ నిర్మించి కాలువలలో ప్రవహించే నీరు వృధాకాకుండా రైతులకు ఎక్కువ నీరు ఉపయోగపడేలా డెల్టాను రూపొందించిన ఘనులు. 1852లో గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో అపర భగీరథుడిగా మిగిలి, ఘనకీర్తిని సంపాదించుకున్నారు. దేశచరిత్రలో తొలిసారిగా కృష్ణా, గోదావరి డెల్టాల వ్యవస్థను కాలువ ఆయకట్లు, డ్రైనేజ్ పద్ధతిలో నిర్మించి మార్గదర్శకులైనారు. గోదావరి ప్రాంతానికి చెందిన వీణం వీరన్న 1847లో కాటన్ దగ్గర సహాయ ఇంజినీర్‌గా పనిచేసి కాటన్‌కు తోడుగా ఉండి ఆయన కార్యక్రమాలను అమలు చేసిన తొలి తెలుగు ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిపోయినారు. 1840లోనే కృష్ణానదిపై ఆనకట్ట ప్రతిపాదనలు బ్రిటీష్ ప్రభుత్వానికి పంపించి సిఫార్సు చేయడమే కాకుండా ధవళేశ్వరం బ్యారేజ్ పూర్తయిన తర్వాత కృష్ణా ఆనకట్టను నిర్మించారు కాటన్. అందుకే గోదావరి, కృష్ణా ప్రాంత ప్రజలు దేవాలయాలకు వెళ్లినపుడు మొదటిగా అన్నం పెట్టినవాడే దేవుడిగా భావించి కాటన్ మహాశయుణ్ణి తలచుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రాంతాన్ని అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చడంలో కాటన్ కృషి మరువలేనిది. 1858, 1863, 1867 సంవత్సరాల్లో కాటన్ బ్రిటిష్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు గంగానదిపై, ఒరిస్సాలోని ముఖ్యనదులపై ఆనకట్టలు నిర్మించే అమోఘమైన సలహాలు ఇచ్చారు. ఈ కాలంలోనే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకూ భారతదేశంలోని అన్ని నదులను అనుసంధానం చేసి యావత్ భారతదేశాన్ని సస్యశ్యామలం చేసే వినూత్న నివేదికలను మ్యాప్‌లను తయారుచేసి ఆ విధంగా జలరవాణాను కూడా ప్రోత్సహించాలని ఆనాడే ఆకాంక్షించారు. రవాణా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే కాటన్ వందలాది మైళ్ళు గుర్రంపై తిరిగి ఈ మహాయజ్ఞాన్ని పూర్తిచేసారు. కారు చౌకగా లభించే జలరవాణా ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవస్థను రూపొందించిన మహానుభావుడు. ఈ ప్రాంత ప్రజలు తినే తిండిలో, తాగే నీటిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో వెల్లివిరిసిన నాగరికతలో ఆయనే కనబడతాడు. రైతు వ్యవసాయానికి అనుకూలంగా కృష్ణా, గోదావరి డెల్టాలను ఆధునీకరణ చేసి నీటి వృధాను తగ్గించి, కాటన్ మహాశయుని ఆశయాలను కాపాడి, మన ముందు తరాలను అందించడమే ఆయనకు మనమర్పించే నివాళి. - కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 -
గోదారోళ్ల గుండెల్లో కొలువై..
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలం అవుతున్న గోదావరి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మార్చాడు.. లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదారోళ్ల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించారు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు.. అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్ ఆర్థర్ కాటన్.. నేడు కాటన్ దొర 120 వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి వారి మదిలో ఆరాధ్య దైవంగా నిలిచారు సర్ ఆర్థర్ కాటన్. అఖండ గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదారోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కరువు కోరల్లో ఉండే ప్రాంతాన్ని పచ్చటి తివాచీ పరిచినట్టుగా మా ర్చారు. ఆనకట్ట నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చిన అపర భగీరధుడి పేర్గాంచారు. ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లు అయినా ఆ మహా నీయుడు చేసిన మేలు చిరస్థాయిగా గుర్తుండాలని గ్రామాగ్రామానా ఆయన శిలావిగ్రహాలు నెలకొల్పి స్మరించుకుంటున్నారు గోదారోళ్లు. 1803 మే 15న జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ 1899 జూలై 24న కన్నుమూశారు. దశ.. దిశను మార్చిన దొర ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసమని కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయాలపై 1847 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి 1.65 లక్షల డాలర్లు (రూ.5 లక్షలు) ఖర్చు చేశారు. నిర్మాణానికి రోజుకు 1300 మంది కార్మికులు పని చేసేవారు. ఆరంభంలో తక్కువ ఎత్తుగల గేట్లు ఏర్పాటు చేయడంతో కాటన్ 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జలరవాణాను వినియోగంలోకి తెచ్చారు. తర్వాత 1887లో ఆయకట్టును 7,94,824 ఎకరాలకు విస్తరించారు. తర్వాత ఆ యకట్టుని 9,99,132 ఎకరాలకు విస్తరించారు. అనంతరం దీనిని ఉభయగోదావరి జిల్లాల్లో 10,09,009 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా విస్తరించారు. 1961 ఈ ఆనకట్ట భద్రతను ఎస్సీ మిత్ర కమిషన్ పరిశీలించింది. దీని స్థానంలో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అందుకు రూ.26.59 కోట్లు అంచనా వేశారు. 1970లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీకి సమాంతరంగా 40 మీటర్లపై భాగంలో ప్రస్తుత ఆనకట్ట నిర్మించారు. దీనిని 1982 అక్టోబర్ 29న జాతికి అంకితం చేశారు. తూర్పుగోదావరిలో.. గోదావరి డెల్టా ఆయకట్టు (చేపల చెరువులు, తోటలు కలిపి) - 10,09,009 ఎకరాలు పశ్చిమగోదావరి జిల్లాలో.. పశ్చిమ డెల్టా ఆయకట్టు - 5,29,273 ఎకరాలు (సుమారు 2 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువుల విస్తరించాయి) పశ్చిమ డెల్టా ఆయకట్టులో ప్రధాన కాలువలు - 11 (గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ, కాకరపర్రు, గోస్తనీ, వేల్పూరు, నరసాపురం, ఏలూరు, అత్తిలి, జంక్షన్, వెంకయ్య వయ్యేరు, ఓల్డ్ వయ్యేరు, ఉండికాలువలు) (357 కిలోమీటర్లు) పంపిణీ కాలువలు పొడవు 2,020 కిలోమీటర్లు తూర్పు గోదావరిలో.. తూర్పు డెల్టా ఆయకట్టు - 2,45,333 ఎకరాలు సెంట్రల్ డెల్టా ఆయకట్టు - 2.01,898 ఎకరాలు పిఠాపురం బ్రెంచ్ కెనాల్ - 32,507 ఎకరాలు 65 మండలాలు.. 10 లక్షల ఎకరాలు కాటన్ దొర గోదావరి ప్రాంతంలో గుర్రంపై తిరుగుతూ చేతి కర్రతో గీసిన గీతలే నేడు డెల్టా ఆయకట్టు కాలువలుగా మారాయి. ఇప్పుడు రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న ప్రాజెక్టు ఇదే కావడం గమనర్హం. రెండు జిల్లాలో సాగు నీరు, తాగునీరు, పరిశ్రమలకు అవరసరమైన జలాలు ఈ ఆనకట్ట ద్వారానే సమకూర్చుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపల చెరువులతో కలిపి 10,09,009 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలో తూర్పుడెల్టా, సెంట్రల్ డెల్టా, పిఠాపురం బ్రెంచ్ కెనాల్ ద్వారా 4,79,736 ఎకరాలు, జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ద్వారా 5,29,273 ఎకరాల ఆయకట్టు సాగువుతుంది. ఈ ఆనకట్టలో 2.931 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. గోదావరి డెల్టాలో తూర్పుగోదావరిలో 36 మండలాలు, పశ్చిమ గోదావరిలో 29 మండలాలు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. 1862 నుంచి ఆనకట్ట పూర్తిస్థాయిలో ఆపరేషన్లోకి వచ్చింది. ధవళేశ్వరం ఆర్మ్‌కి 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్‌కి 43, మద్దూరు ఆర్మ్‌కి 23, విజ్జేశ్వరం ఆర్మ్‌కి 39 గేట్లు చొప్పున ఏర్పాటుచేశారు. ఒక్కోగేటు ఏకంగా 27 టన్నుల బరువు ఉంటుంది. ఆయకట్టుని తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే మూడు డెల్టాలుగా విభజించారు. -
‘కాటన్ రుషయేనమః’
కదిలే నీరు కర్మమార్గానికి చిహ్నం. నీరు కదలకుండా ఉంటే దుర్వాసన వస్తుంది. కదిలితేనే నీటికి ప్రయోజనం. అలాగే మనిషి కర్మమార్గంలో నలుగురిని సంతోషపెట్టేటట్లుగా ప్రవరిస్తేనే జన్మకు సార్ధకత. పుస్తకాలు చదివి, పెద్దల మాటలు విని, మనసుని విశాలం చేసుకుని భక్తితో వికసనం పొందాలి అని చెప్పడానికి వికసిస్తున్న పద్మం, భగవంతుడిని చేరుకోవడం లక్ష్యమని చెప్పడానికి హంస. ‘తన్నో హంస ప్రచోదయాత్’ అని కూడా రాసుంటుంది. అలాగే జ్ఞానానికి సంకేతంగా ఉదయిస్తున్న సూర్యుడు. యోగమార్గంలో మనిషి వెళ్ళి తరించాలని చెప్పడానికి చుట్టుకున్న నాగుపాము... ఇదంతా రామకృష్ణ మిషన్ లోగోలో కనిపిస్తుంది. ఇది మొత్తం చెప్పేదేమిటంటే... ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నీ బాధగా భావించి, చేయగలిగిన ఉపకారం చేసిపెట్టాలి. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మానుంచి నౌకలో వస్తున్నాడు. చీకటిపడింది. విశాలమైన ఆకాశం వంక, మెరుస్తున్న నక్షత్రాలవంక తదేకంగా చూస్తుంటే... అతనిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ‘‘ఏవేవో చిన్న చిన్న పనులు చేసి మనం ప్రపంచానికి చాలా ఉపకారం చేసామనుకుంటాం. కానీ ఆకాశం, నక్షత్రాలు, భూమి, నదులు, జీవులు... అన్ని ఏర్పాట్లతో, ఇంత సృష్టి చేసిన భగవంతుడిని సంతోషపెట్టడానికి నేనేం చేయాలి’’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ మథనంలోంచి ఒక పరిష్కారం దొరికింది. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడమే.. అంటే మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకగలగడమే పరిష్కారం..’’ అనిపించింది. వెంటనే వెళ్ళి తమ మత పవిత్ర గ్రంథం ఒకటి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడినుంచి ఆయన జీవనపథం మారింది. ఒకరోజు విశాఖ సాగరతీరంలో దూరాన అప్పుడే వచ్చిన ఒక పడవను దొంగలు చుట్టుముట్టి, ప్రయాణికులను, సరుకును దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడింది. దగ్గర్లో ఉన్న ఒక దుడ్డు కర్ర చేతపుచ్చుకుని తెగించి వాళ్ళమీదపడ్డాడు. అంతే, దొంగలు పారిపోయారు. మనిషిగా ప్రవర్తించినందుకు ఆ రాత్రి ఆనందంతో పొంగిపోయాడు. ఆ తరువాత ఆయన గోదావరిమీద ఆనకట్టను కట్టడానికి పడిన కష్టం, రైతుల సంక్షేమం కోసం ఆయన పడిన తాపత్రయం అనన్య సామాన్యం. తరువాత కాలంలో ఆయన ఒకసారి గోదావరిమీద పడవలో వెడుతుంటే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనంలో భాగంగా..‘‘కాటన్ రుషయేనమః’ అనడం ఆయనకు వినిపించింది. ఆయనేమంటున్నాడని పక్కన ఉన్నవాళ్ళను అడిగాడు. మీకు నమస్కారం చెప్పుకుంటున్నాడు, అని తెలిపారు. వెంటనే ఆయన నేరుగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ‘కాటన్‌కు ఎందుకు నమస్కరిస్తున్నావ్’’అని అడిగాడు.‘‘లోకక్షేమం కోసం ఎవడు తపిస్తాడో, కష్టపడతాడో వాడే రుషి. లక్షల ఎకరాల సాగుకు కారణమయిన ఆనకట్ట కట్టిన కాటన్ కూడా వాల్మీకిలాగా, వ్యాసుడిలాగా నా దృష్టిలో రుషే. అందుకే ఈ మంత్రం జపించాను’’ అని ఆయన జవాబిచ్చాడు. ఈ దేశ ప్రజల సంస్కారం, కృతజ్ఞతా భావం చూసి కాటన్ విస్తుపోయాడు. తోటి మనిషికి సాయపడాలన్న తపన, కృషి ఉంటే మామూలు మనుషుల్ని కూడా రుషులలో, దేముళ్ళల్లో చేర్చి నెత్తికెత్తుకుంటుంది సమాజం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అపర భగీరథ.. మరువదు ఈ గడ్డ
అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలమవుతున్న గోదావరి ప్రాంతాన్నిధాన్యాగారంగా మార్చాడు.. లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదావరి వాసుల మదిలో అజరామరంగా నిలిచిపోయాడు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరిజిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు..అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్ ఆర్థర్ కాటన్.. నేడు కాటన్ దొర119వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి, కొవ్వూరు : సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి గోదావరి జిల్లాలు దేశానికే అన్నపూర్ణగా పేరుతెచ్చుకునేందుకు ఆ మహనీయుడి దూరదృష్టి, చలువే కారణం. కాటన్ మేలు ఎప్పటికీ మరిచిపోకూడదన్న సంకల్పంతో గోదావరి వాసులు ఎక్కడికక్కడే ఆయన శిలా విగ్రహాలు నెలకొల్పారు. ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్మరించుకుంటున్నారు. 1803 మే 15న జన్మించిన కాటన్ 1899 జూలై 24న మృతి చెందారు. దశ.. దిశను మార్చిన దొర సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసం కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయాలపై 1847 నుంచి ఐదేళ్లపాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి 1,65,000 డాలర్లు (రూ.5 లక్షలు) ఖర్చుచేశారు. రోజుకు 1,300 మంది కార్మికులు పనిచేశారు. ఆరంభంలో తక్కువ ఎత్తుగల గేట్లు ఏర్పాటు చేయడంతో కాటన్ 4.38 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జలరవాణాను విని యోగంలోకి తెచ్చారు. తర్వాత 1887లో ఆయకట్టును 7,94,824 ఎకరాలకు విస్తరించారు. తర్వా త ఆయకట్టును 9,99,132 విస్తరించారు. అనంతరం దీనిని విస్తరించి ఉభయగోదావరి జిల్లాల్లో 10,09,009 ఎకరాలకు సాగునీరు అందించేలా తీర్చిదిద్దారు. 1961లో ఆనకట్ట భద్రతను ఎస్సీ మిత్ర కమిషన్ పరిశీలించింది. దీని స్థానంలో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అందుకు రూ.26.59 కోట్లు అంచనా వేశారు. 1970లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీకి సమాంతరంగా 40 మీటర్లుపై భాగంలో ప్రస్తుత ఆనకట్ట నిర్మించారు. దీనిని 1982 అక్టోబర్ 29న జాతికి అంకితం చేశారు. 65 మండలాలు.. 10 లక్షల ఎకరాలు రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఏౖMðక ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. రెండు జిల్లాల్లో సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు అవరసరమైన జలాలు ఆనకట్ట ద్వారానే సమకూరుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో చేపల చెరువులతో కలిపి 10,09,009 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. దీనిలో తూర్పుగోదావరిలో తూర్పుడెల్టా, సెంట్రల్ డెల్టా, పిఠాపురం బ్రెంచ్ కెనాల్ ద్వారా 4,79,736 ఎకరాలు, జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ద్వారా 5,29,273 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. 2.931 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో ఆనకట్ట నిర్మించారు. గోదావరి డెల్టాలో తూర్పుగోదావరిలో 36 మండలాలు, పశ్చిమలో 29 మండలాలు ఆయకట్టు ఈ బ్యారేజీ పరధిలో ఉన్నాయి. 1862 నుంచి ఆనకట్ట పూర్తిస్థాయిలో ఆపరేషన్లోకి వచ్చింది. ధవళేశ్వరం ఆర్మ్‌కి 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్‌కి 43, మద్దూరు ఆర్మ్‌కి 23, విజ్జేశ్వరం ఆర్మ్‌కి 39 గేట్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో గేటు 27 టన్నుల బరువు ఉంటుంది. ఆయకట్టును తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే మూడు డెల్టాలుగా విభజించారు. ఆనకట్టను పరిరక్షించుకోవాలి గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సా గునీరు అందించిన మహనీయుడు కాటన్. ధవళేశ్వరం బ్యారేజీ నిర్వహణను ప్రభుత్వ ం గాలికి వదిలేసింది. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి పటిష్ట కట్టడాన్ని కాపాడుకోవడమే ఆయనకు నిజమైన నివాళి. కాటన్ వర్ధంతి, జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.– విప్పర్తి వేణుగోపాల్, గోదావరి హెడ్‌వర్క్స్ రిటైర్డు ఈఈ, ధవళేశ్వరం అంతా ఆయన చలువే కాటన్ మహాశయుడు బ్యారేజీ నిర్మించడంతో ఉభయగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో సిరులు పండుతున్నాయి. రెండు జిల్లాలు రాష్ట్రానికి అన్నపూర్ణగా మారా యంటే అదంతా ఆయన చలువే. ప్రస్తుత ప్రభుత్వాలు కాటన్ స్ఫూర్తిగా ప్రాజెక్టులు నిర్మించాలి.– పెనుమాక జయరాజు, రిటైర్డు ఉద్యోగి, కొవ్వూరు అన్నంపెట్టిన మహనీయులు కాటన్ మహాశయుడు ముందుచూపుతోనే డెల్టాలో సిరులు పండుతున్నాయి. నేటి పా లకులకు మాటలు తప్ప పనులు చేయాలన్న ధ్యాస లేదు. ఇందుకు పోలవరం ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పవచ్చు. కాటన్ ఆంగ్లేయుడు అయినా ఉభయగోదావరి జిల్లాలకు అన్నంపెట్టిన మహనీయుడు.– కాపకా పాపారావు, రైతు, కాకరపర్రు, పెరవలి మండలం చేతికర్రతో గీసిన గీతలే కాలువలు నాడు కాటన్ చేతికర్రతో గీసిన గీతలు నేడు డెల్టాకు ప్రధాన కాలువలయ్యాయి. సున్నపురాయితో నిర్మించిన ఆనకట్టలు ఇప్పటి కీ చెక్కుచెదరలేదు. కాటన్ స్ఫూర్తితో ఇరిగేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.– చిక్కాల బ్రహ్మజీరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,లాక్ సూపరింటెండెంట్ అసోసియేషన్, నిడదవోలు -
కాటన్ కన్నా.. నిజాం మిన్న!
సాక్షి, హైదరాబాద్: నిజాం రాజును తరచూ పొగడ్తలతో ముంచెత్తే ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం శాసనసభ వేదికగా మరో అడుగు ముందుకేసి మరీ కీర్తించారు. రజాకార్ల దురాగతాలంటూ నిజాం పాలన తీరుపై చెడు ప్రచారం జరిగిందని.. కానీ ఆయనది గొప్ప గుణమన్నారు. ‘‘నిజాంను పొగిడితే నన్ను నయా నిజాం అంటూ కొందరు విమర్శిస్తున్నారు. నేను చెప్పేదొ క్కటే. సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారు. వాస్తవాలతో దాన్ని నేను తిరగరాస్తా..’’అని ప్రకటించారు. హిందూ ముస్లిం సహా అన్ని మతాలవారూ కలసి జీవించడం మినహా మరో మార్గం లేదని.. పరస్పరం ఏహ్యభావం తొలగి సంతోషంగా కలసి జీవించే పరిస్థితి రావాలన్నారు. నిజాంను కీర్తిస్తే తప్పా.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం వారసుల విన్నపం మేరకు తాను నిజాం సమాధిని దర్శించానని.. దీనిపై అప్పట్లో తనను చాలా విమర్శించారని కేసీఆర్ చెప్పారు. ‘‘నిజాం సమాధిని ఎందుకు సందర్శించారంటూ ఓ ఆంధ్రా విలేకరి నన్ను అడిగారు. అప్పుడు నేను ‘మీరు కాటన్ దొర ఉత్సవాలు ఎందుకు చేస్తర’ని అడిగిన. దాంతో ఆ విలేకరి ‘కాటన్ మాకు ఆనకట్ట కట్టించాడు. సాగుకు అవకాశం కల్పించాడు’అని చెప్పిండు. మరి 200 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ ప్రభుత్వంలోని మిలటరీ ఇంజనీర్ కాటన్‌ను పూజిస్తే... నిజామాబాద్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నిజాంను కీర్తించడం తప్పా? కాటన్ మనోడు కాదు. కానీ ఉజ్వల తెలంగాణ చరిత్రలో నిజాం పాలన భాగం. ఆయన మనవాడు. హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత నిజాం రాజ్‌ప్రముఖ్‌గా ఉండగా.. ఓసారి ఆయన డ్రైవర్‌కు చేయి విరిగింది. ఇక్కడ బొక్కల (ఎముకల) ఆస్పత్రి లేక మద్రాసుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన నిజాం.. తాను రాజుగా ఉండగా హైదరాబాద్‌లో బొక్కల దవాఖాన కట్టకపోవటం తప్పేనంటూ.. నిజాం బొక్కల దవాఖాన (ప్రస్తుత నిమ్స్)ను నిర్మించిండు. దానికి స్థలమిచ్చి, సొంత డబ్బులతో నిర్మించిండు. చైనాతో యుద్ధం తర్వాత మన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తనకు చెందిన ఆరు టన్నుల బంగారాన్ని నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి ఇచ్చిండు. తిరిగి చెల్లిస్తానని శాస్త్రి అన్నా ఒప్పుకోలేదు. ఇది వాస్తవం. నిజాం పాలన గొప్పతనం జనంలోకి పోయేలా చరిత్రను తిరగరాస్తం..’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
'కాటన్ తర్వాత ఆ ఘనత వైఎస్సార్‌దే'
నెల్లూరు : ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి తర్వాత నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్ గొప్పతనాన్ని వివరించారు. నెల్లూరు పట్టణంలో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ.. వైఎస్సార్ మంజూరు చేసన సంగం బ్యారేజీ పనులను ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తిచేయలేదని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విమర్శించారు. బ్రిటీషు ఇంజినీర్ ఆర్థర్ కాటన్ ఏపీని సస్యశ్యామలం చేసిన తర్వాత అటువంటి ఘనత మళ్లీ వైఎస్సార్‌కే దక్కిందని ఆయన సేవల్ని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. -
రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి
- 15న రాజమండ్రిలో వేడుకలు... జల వనరుల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించిన సర్ ఆర్థన్ కాటన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న రాజమండ్రిలో కాటన్ 212 జయంతి వేడుకలను నిర్వహించడానికి జల వనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొననున్నారు. కాటన్‌తో పాటు ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రామకృష్ణయ్య, కేఎల్ రావు జయంతులను కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆధునికీకరణకు నిధులేవీ?
అమలాపురం :ఈ సీమవాసుల భాగ్యరేఖ నుదుటిపై కాదు.. నీటిబొట్టుపై రాసి ఉంటుంది. దాన్ని తొలుత రాసిన వాడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన సృష్టించిన గోదావరి డెల్టాకు కాలువలు, చానళ్లు, బోదెలు జీవనాడులు. క్షామ పీడిత ప్రాంతంలో సిరులు కురిపించి.. డెల్టావాసుల తలరాతలు మార్చిన భాగ్యరేఖలు. పచ్చని పంటపొలాలు.. పాలవెల్లువలతో డెల్టా రైతుల కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయంటే అందుకు ధవళేశ్వరం ఆనకట్ట, తరువాత కాలంలో బ్యారేజ్ ఎంత కారణమో.. బ్యారేజ్ వద్ద నుంచి నీరు పంట చేలకు అందించే పంట కాలువలు, చానళ్లు, బోదెలు అంతే కారణం. కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ, కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుతున్న ఆ కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోక కుచించుకుపోవడంతో డెల్టా రైతులు అవస్థలు పడుతున్నారు. నష్టాల పాలవుతున్నారు. పూర్తయినవి అతి తక్కువ పనులే.. గోదావరి డెల్టా పంటకాలువలు, మురుగునీటి కాలువలు పూడుకుపోయి, నానాటికీ చిక్కి శల్యమవుతున్నాయి. దశాబ్దాలుగా కనీస మరమ్మతులకు నోచుకోని ఈ కాలువల ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు పూర్తయి ఉంటే డెల్టా పూర్వవైభవం సంతరించుకునేది. అయితే టెండర్లు ఖరారు కాకపోవడం, ఖరారైన చోట పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్లు దోపిడీ కోసం కేవలం మట్టిపనులు మాత్రమే చేయడం, అందుకు అధికారులు వత్తాసు పలకడం, రైతులు సకాలంలో రబీ పూర్తి చేయకపోవడం, లాంగ్ క్లోజర్‌కు సమయం లేదని చిన్నచిన్న పనులతో సరిపెట్టడం వెరసి డెల్టా ఆధునికీకరణ మరుగున పడిపోయింది. జిల్లాలో రూ.1,670 కోట్లతో 2008లో మొదలైన ఈ పనుల్లో ఇప్పటి వరకు కేవలం రూ.319 కోట్ల పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. వీటిలో పంట కాలువలపై రూ.245 కోట్లు, మురుగునీటి కాలువలపై రూ.74 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. బాబు రాకతో కొండెక్కనున్న ఆధునికీకరణ! దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు తరువాత ముఖ్యమంత్రులుగా ఉన్న కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలలో మందగించాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఆధునికీకరణ పనులు కొండెక్కుతాయని రైతులు అనుమానిస్తున్నారు. ఈ పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, అధికారులు ఖర్చుపెట్టిన తీరు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. గత ఏడాది రూ.75 కోట్లతో పనులు చేయాలని తొలుత నిర్ణయించి, కేవలం రూ.30 కోట్ల పనులు కూడా చేయలేదు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. పశ్చిమ వాటా పోగా మన జిల్లాకు వచ్చేది రూ.15 కోట్లు కావడం గమనార్హం. ఈ కేటాయింపులు చూపి బాబు ఉండగా డెల్టా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం లేదని రైతులు ఒక అంచనాకు వస్తున్నారు. ఆధునికీకరణ పనులకు పెద్దగా కేటాయింపులు చేయని ప్రభుత్వం డెల్టాను ఎడారి చేస్తుందేమోనని రైతులు భయపడుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మొత్తం నిధులు కేటాయించి ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయం విశేషం. ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టం డెల్టాలో పంట, మురుగునీటి కాలువలు పూడుకుపోవడంతో రైతులు ఏటా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. ఖరీఫ్‌లో చేలు మునిగిపోవడం, రబీలో ఎండిపోవడం షరామామూలుగా మారింది. ఈ నష్టం ఏటా రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కనీసం పంటకాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్ల శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. డెరైక్ట్ పైప్‌లు(డీపీలు) పూడుకుపోతున్నా పట్టించుకునేవారు లేక శివారు, మెరక భూములకు నీరు చేరడంలేదు. ప్రస్తుత రబీలో సుమారు 15 వేల ఎకరాల్లో పంటదెబ్బతినే అవకాశం ఉందని అంచనా. నిధులు కేటాయించకపోవడంతో చానల్లు, డ్రైన్లు, పంటకాలువలు, పంటబోదెలను ఉపాధి హామీ పథకంలో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కూలీలు లెవెల్స్ పాటించకుండా ఇష్టానుసారం పనులు చేపట్టడంతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండడంలేదు.