Sirpur Assembly Constituency
-
ఎవ్వరు అడ్డొచ్చినా.. మూడో సారి నేనే గెలుస్తా! : కోనేరు కోనప్ప
సాక్షి, ఆదిలాబాద్: అడవులు, కొండలతో నిండిన ఆ నియోజకవర్గానికి పదేళ్ళుగా కోనేరు కోనప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదేళ్ళుగా కోనప్ప చేసిందేమీ లేదని అక్కడి ప్రజలు నిట్టూరుస్తున్నారు. రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఉపాధి విషయాల్లో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కాని ఆ ఎమ్మెల్యే మాత్రం మూడో సారి నేనే గెలుస్తా అంటున్నారు. అయితే కోనప్పకు గట్టి ప్రత్యర్థి తగిలారు. అధికార పార్టీని ఓడిస్తానంటున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ అసెంబ్లీలో ఆ నియోజకవర్గం క్రమ సంఖ్య ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిర్పూర్ టి. నియోజకవర్గంలో నిజాం కాలం నాడే కాగిత పరిశ్రమ స్థాపించారు. గతంలో మూత పడిన ఆ పరిశ్రమను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి తెరిపించారు. ఈ నియోజకవర్గం చుట్టూ పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు వంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి. సిర్పూర్ నుండి 2014 నుంచి కోనేరు కోనప్ప అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదట బహుజన్ సమాజ్ పార్టీ తరపున గెలిచిన కోనప్ప..మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గులాబీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో కూడా కారు గుర్తు మీద విజయం సాధించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకుని బరిలోకి దిగారు. మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అంటున్నారు కోనేరు కోనప్ప. దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా.. కోనప్ప ఎమ్మెల్యే అయ్యాకే మూతపడ్డ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించారు. దీనవల్ల వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కాగజ్‌నగర్ లోని సర్కారు అసుపత్రిని అభివ్రుద్ది చేశారు. వార్థా నది పై బ్యారేజి నిర్మించడానికి నిధులు వచ్చేలా కృషి చేశారు. మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గూడెం వంతెన నిర్మించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయి. అయితే దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నా కోనప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదనే అపవాదు ఉంది. పేపర్ పరిశ్రమను తిరిగి ప్రారంభించినా దానివల్ల స్థానికులకు ఏమీ ఉపాధి కలగలేదని, ఇతర రాష్ట్రాల వాళ్ళకే అందులో ఉద్యోగాలు లభించాయని సిర్పూర్ లోని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజలకు తాగునీరు తీవ్ర సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల ప్రజలు అసుపత్రికి వెళ్లాలంటే రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివాసీ మహిళలు, తల్లులు పుట్టెడు అవస్థలు పడుతున్నారు. ఇంతకాలంగా ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కోనప్ప నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు ఏమీ లేదని మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. ఎమ్మెల్యే పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రైతులకు సాగునీటి కోసం వార్థా బ్యారేజ్ నిర్మిస్తామనే హామీ మాటలకే పరిమితమైంది. నియోజకవర్గం చుట్టూ నీరున్నా పంటపొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నీ ప్రతికూలంగా మారతాయని అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ.. ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత.. మరోవైపు కోనప్పపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో.. వీటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ జనరల్ కేటగిరీ సీటు. ప్రవీణ్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన ఓట్లు, పార్టీ పట్ల ఉన్న ఆదరణ దృష్ట్యా సిర్పూర్‌లోనే తలపడాలని ప్రవీణ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా మంచిపేరు తెచ్చుకున్న ప్రవీణ్‌కుమార్ పట్ల ఎస్సీ వర్గాల్లో ఆదరణ బాగా వ్యక్తమవుతోంది. ఎస్టీలు, బౌద్ధ మతాన్ని ఆచరించేవారు కూడా బీఎస్పీ పట్ల మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనమీద స్థానికేతరుడనే ముద్ర వేయడాన్ని ప్రవీణ్‌కుమార్ ఖండించారు. నియోజకవర్గంలోనే ఇల్లు కొనుక్కుని స్థానికంగానే ఉంటున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ తన సంస్థ స్వేరో కార్యకర్తలను మోహరిస్తున్నారు. సిర్పూర్లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్. ఎన్నికల బరిలో పాల్వాయి హరీష్ బాబు.. అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తో పాటు బిజెపి అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. హరీష్ బాబు తల్లితండ్రులిద్దరూ సిర్పూర్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా పాల్వాయి కుటుంబానికి ఇక్కడి ప్రజల్లో మంచి పేరుంది. ఒకప్పుడు వీరిది కాంగ్రెస్ కుటుంబమే అయినా.. గత ఎన్నికల్లో హరీష్‌బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాని మంచి ఓట్లే సాధించారు. ఈసారి బీజేపీ తరపున తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా హిందూ ఓట్ బ్యాంక్ తనకు మద్దతుగా ఉంటుందని, పైగా సర్కార్ మీద, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత తనకు అనుకూలమైతే గెలుపు ఖాయమని హరీష్ భావిస్తున్నారు. మొత్తం మీద మూడు పార్టీల అభ్యర్థులు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణలోనే ఖరీదైన ఎన్నికలు..! రసవత్తరంగా సిర్పూర్ పాలిటిక్స్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో పోలీస్‌శాఖ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కౌటాల(సిర్పూర్): కుమురంభీం జిల్లాకు ఓ వైపు మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. మరో వైపు ఆదిలా బాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. గతంలో సిర్పూర్లో మవోయిస్టుల దాడులతో ఎన్నికలు నిలిపివేసిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పా ల్వాయి పురుషోత్తంను కాగజ్‌నగర్ పట్టణంలోని తన కార్యాలయంలోనే మవోయిస్టులు కాల్చి చంపి న ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. జి ల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. అడపాదడపా మవోయిస్టు సానుభూతిపరులంటూ పో లీసులు కొందరిని పట్టుకుని కేసులు నమోదు చే స్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల వేళా ఎలాంటి అలజడులు లేకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ప్రారంభించారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఖరీదైన ఎన్నికలు..! పార్లమెంట్, అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీటీసీ, మున్సి పల్, కార్పొరేషన్.. ఇలా ప్రతీ ఎలక్షన్ ఖరీదైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వీటికి మినహాయింపు ఏమీ కాదు. డబ్బులు పంచడం ఏ స్థాయికి చేరిదంటే.. ‘మాకు నోట్లు అందలేదంటూ..’ కొంతమంది ఓటర్లు బహిరంగంగానే రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళనకు దిగే వరకు వెళ్లింది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఈసారి మరింత ఖరీదైనవిగా చరిత్రలో నిలుస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే కాస్ట్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పోలీస్‌శాఖ, ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో టాప్ టెన్ కాస్ట్లీ ఎన్నిక సెగ్మెంట్లను గుర్తించగా.. అందులో ఆశ్చర్యకరంగా సిర్పూర్ నియోజకవర్గం సైతం ఉండడం గమనార్హం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి నుంచే బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. చెక్‌పోస్టులు ప్రారంభం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ అవుతుండగా, అదే నెల 30న పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,47,634 మంది ఓటర్లు ఉండగా 597 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74 సమస్యాత్మక కేంద్రాలు, 46 మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాంకిడి, సిర్పూర్(టి)లోని హుడ్కిలి, వెంకటాపూర్, చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, రెబ్బెన, తాండూర్ మధ్య, దహెగాంలోని కల్వాడ, జైనూర్‌లో అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా వాహనాల రాకపోకలపై నిఘా ఉంచి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. -
సిర్పూరు రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
తెలంగాణలో తొలి నియోజకవర్గం అయిన సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కోనేరు కోనప్ప 2018లో మరోసారి విజయం సాదించారు. ఆయన గత ఎన్నికలలో బహుజన సమాజవాది పార్టీ తరపున పోటీచేసి గెలుపొంది, తదుపరి టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుపై 24144 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సిర్పూర్లో బిజెపి అభ్యర్ధి శ్రీనివాసులు 5813 మూడోస్థానంలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన కూడా కోనప్ప గెలిచారు. ఈయన కమ్మ సమాజిక వర్గానికి చెందినవారు. కాగా ఓటమి చెందిన హరీష్‌బాబు తల్లిదండ్రులు పురు షోత్తంరావు, రాజ్యలక్ష్మీ ఇద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కోనప్ప మూడుసార్లు గెలవగా, గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కెవి నారాయణ రావు రెండుసార్లు గెలిచారు. దాంతో ఐదుసార్లు కమ్మ నేతలు గెలిచినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ అంతటా 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తొలి నియోజకవర్గం అయిన సిర్పూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోవడం ఒక సంచలనం అయితే బిఎస్పి పార్టీ గుర్తుపై కోనేరు కోనప్ప 8837 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం మరో సంచలనంగా చెప్పాలి. 2014లో సిర్పూరులో కోనప్పకు 31359 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కావేటి సమ్మయ్యకు40196 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్ రావుకు 26956 ఓట్లు, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి రావి శ్రీనివాసరావుకు 19359 ఓట్లు వచ్చాయి. కోనప్ప రెండువేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. తదుపరి జరిగిన వివిధ పరిణామాలలో ఆయన మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో తిరిగి చేరినా, టిక్కెట్ రాని నేపధ్యంలో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఈయనతో సహా ఐదుసార్లు కమ్మ నేతలు గెలుపొందగా, వెలమ నేతలు మూడుసార్లు గెలిచారు. బీసీ నేతలు నాలుగుసార్లు, రెడ్డి నేతలు రెండుసార్లు, దళిత నేతలు మూడుసార్లు విజయం సాధించారు. రెండువేల తొమ్మిదిలో గెలుపొందిన సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకసారి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా కావేటి సమ్మయ్య తిరిగి పదిహేనువేలకుపైగా మెజారిటీతో రెండోసారి గెలిచారు. ఆ ఉప ఎన్నికలో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఐ సీనియర్ నేత మాజీ ఎం.పి ఇంద్రకరణ్‌రెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలక్ష్మి ఓడిపోయారు. తదుపరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. 1952 నుంచి సిర్పూరు నియోజకవర్గం ఉంది. తొలి రోజుల్లో ఈ ప్రాంతంలో సోషలిస్టు ప్రభావం అధికంగా ఉండేది. 1952, 57లలో సోషలిస్టు అభ్యర్దులు గెలుపొందారు. 1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. అంటే అప్పట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక జనరల్ అభ్యర్ధిని, ఒక రిజర్వుడు కేటగిరి అభ్యర్దిని ఎన్ను కోవాలన్నమాట. విశేషం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్దులు ఎస్.సి అభ్యర్థులే గెలుపొందారు. వీరిద్దరూ ఆ తరువాత కాలంలో ప్రముఖ నేతలుగా ప్రసిద్ధిగాంచారు. కోదాటి రాజమల్లు ప్రజాసోషలిస్టు పార్టీ అభ్యర్దిగా గెలుపొందితే, మరొకరు జి. వెంకటస్వామి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ప్రముఖ కార్మిక నేత జి. సంజీవరెడ్డి రెండుసార్లు, ఇంకో ప్రముఖ స్వాతంత్య్రయోధుడు కె.వి.కేశవులు రెండుసార్లు గెలుపొందగా, టిడిపి ఆవిర్భావం తరువాత కె.వి.నారాయణరావు రెండుసార్లు, పాల్వాయి పురుషోత్తంరావు రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలుపొందగా, పురుషోత్తంరావు భార్య పి. రాజ్యలక్ష్మి ఒకసారి టిడిపి తరపున గెలిచారు. తొలిసారి 1983లో టిడిపి అక్కడ గెలిచింది. అప్పటి నుంచి 2004లో కోనప్ప కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచేవరకు అక్కడ కాంగ్రెస్ ఐకి అవకాశం రాలేదు. మళ్ళీ 2009లో టిఆర్ఎస్ గెలవడం విశేషం. అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, సోషలిస్టు ఒకసారి, ప్రజాసోషలిస్టు పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలిచింది. ఇండిపెండెంట్ రెండుసార్లు గెలిచారు. కోదాటి రాజమల్లు ఇక్కడ ఒకసారి, లక్సెట్టిపేటలో సోషలిస్టుగా ఒకసారి, చిన్నూరు నుంచి కాంగ్రెస్ తరుఫున మూడుసార్లు మొత్తం ఐదుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన వెంకటస్వామి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. రాజమల్లు, కె.వి.కేశవులు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్లో మంత్రి పదవులు నిర్వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో జి.సంజీవరెడ్డి మంత్రిగా ఉన్నారు. వెంకటస్వామి రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేశారు. వెంకటస్వామి ఎమ్మెల్సీగా కూడా కొంతకాలం ఉన్నారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన పాల్వాయి పురుషోత్తంరావు 1999 నాటికి టిడిపిలో చేరిపోయారు. అయితే ఎన్నికలు జరగడానికి ముందే పురుషోత్తంరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన భార్యకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఒకసారి గెలిచిన ఆమె ఆ తరువాత 2004లో పోటీచేసి ఓడిపోయారు. సిర్పూరులో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. -
సిర్పూరు రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
తెలంగాణలో తొలి నియోజకవర్గం అయిన సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కోనేరు కోనప్ప 2018లో మరోసారి విజయం సాదించారు. ఆయన గత ఎన్నికలలో బహుజన సమాజవాది పార్టీ తరపున పోటీచేసి గెలుపొంది, తదుపరి టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుపై 24144 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సిర్పూర్లో బిజెపి అభ్యర్ధి శ్రీనివాసులు 5813 మూడోస్థానంలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన కూడా కోనప్ప గెలిచారు. ఈయన కమ్మ సమాజిక వర్గానికి చెందినవారు. కాగా ఓటమి చెందిన హరీష్‌బాబు తల్లిదండ్రులు పురు షోత్తంరావు, రాజ్యలక్ష్మీ ఇద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కోనప్ప మూడుసార్లు గెలవగా, గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కెవి నారాయణ రావు రెండుసార్లు గెలిచారు. దాంతో ఐదుసార్లు కమ్మ నేతలు గెలిచినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ అంతటా 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తొలి నియోజకవర్గం అయిన సిర్పూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోవడం ఒక సంచలనం అయితే బిఎస్పి పార్టీ గుర్తుపై కోనేరు కోనప్ప 8837 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం మరో సంచలనంగా చెప్పాలి. 2014లో సిర్పూరులో కోనప్పకు 31359 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కావేటి సమ్మయ్యకు40196 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్ రావుకు 26956 ఓట్లు, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి రావి శ్రీనివాసరావుకు 19359 ఓట్లు వచ్చాయి. కోనప్ప రెండువేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. తదుపరి జరిగిన వివిధ పరిణామాలలో ఆయన మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో తిరిగి చేరినా, టిక్కెట్ రాని నేపధ్యంలో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఈయనతో సహా ఐదుసార్లు కమ్మ నేతలు గెలుపొందగా, వెలమ నేతలు మూడుసార్లు గెలిచారు. బీసీ నేతలు నాలుగుసార్లు, రెడ్డి నేతలు రెండుసార్లు, దళిత నేతలు మూడుసార్లు విజయం సాధించారు. రెండువేల తొమ్మిదిలో గెలుపొందిన సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకసారి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా కావేటి సమ్మయ్య తిరిగి పదిహేనువేలకుపైగా మెజారిటీతో రెండోసారి గెలిచారు. ఆ ఉప ఎన్నికలో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఐ సీనియర్ నేత మాజీ ఎం.పి ఇంద్రకరణ్‌రెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలక్ష్మి ఓడిపోయారు. తదుపరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. 1952 నుంచి సిర్పూరు నియోజకవర్గం ఉంది. తొలి రోజుల్లో ఈ ప్రాంతంలో సోషలిస్టు ప్రభావం అధికంగా ఉండేది. 1952, 57లలో సోషలిస్టు అభ్యర్దులు గెలుపొందారు. 1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. అంటే అప్పట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక జనరల్ అభ్యర్ధిని, ఒక రిజర్వుడు కేటగిరి అభ్యర్దిని ఎన్ను కోవాలన్నమాట. విశేషం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్దులు ఎస్.సి అభ్యర్థులే గెలుపొందారు. వీరిద్దరూ ఆ తరువాత కాలంలో ప్రముఖ నేతలుగా ప్రసిద్ధిగాంచారు. కోదాటి రాజమల్లు ప్రజాసోషలిస్టు పార్టీ అభ్యర్దిగా గెలుపొందితే, మరొకరు జి. వెంకటస్వామి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ప్రముఖ కార్మిక నేత జి. సంజీవరెడ్డి రెండుసార్లు, ఇంకో ప్రముఖ స్వాతంత్య్రయోధుడు కె.వి.కేశవులు రెండుసార్లు గెలుపొందగా, టిడిపి ఆవిర్భావం తరువాత కె.వి.నారాయణరావు రెండుసార్లు, పాల్వాయి పురుషోత్తంరావు రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలుపొందగా, పురుషోత్తంరావు భార్య పి. రాజ్యలక్ష్మి ఒకసారి టిడిపి తరపున గెలిచారు. తొలిసారి 1983లో టిడిపి అక్కడ గెలిచింది. అప్పటి నుంచి 2004లో కోనప్ప కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచేవరకు అక్కడ కాంగ్రెస్ ఐకి అవకాశం రాలేదు. మళ్ళీ 2009లో టిఆర్ఎస్ గెలవడం విశేషం. అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, సోషలిస్టు ఒకసారి, ప్రజాసోషలిస్టు పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలిచింది. ఇండిపెండెంట్ రెండుసార్లు గెలిచారు. కోదాటి రాజమల్లు ఇక్కడ ఒకసారి, లక్సెట్టిపేటలో సోషలిస్టుగా ఒకసారి, చిన్నూరు నుంచి కాంగ్రెస్ తరుఫున మూడుసార్లు మొత్తం ఐదుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన వెంకటస్వామి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. రాజమల్లు, కె.వి.కేశవులు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్లో మంత్రి పదవులు నిర్వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో జి.సంజీవరెడ్డి మంత్రిగా ఉన్నారు. వెంకటస్వామి రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేశారు. వెంకటస్వామి ఎమ్మెల్సీగా కూడా కొంతకాలం ఉన్నారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన పాల్వాయి పురుషోత్తంరావు 1999 నాటికి టిడిపిలో చేరిపోయారు. అయితే ఎన్నికలు జరగడానికి ముందే పురుషోత్తంరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన భార్యకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఒకసారి గెలిచిన ఆమె ఆ తరువాత 2004లో పోటీచేసి ఓడిపోయారు. సిర్పూరులో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..