SLBC project
-
రెండేళ్లలోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ), డిండి ప్రాజెక్టుల పనులను సత్వరంగా పునరుద్ధరించి, రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుందని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు జరగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి గురువారం సచివాలయంలో ఆయన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 44 కిలోమీటర్ల సొరంగ మార్గం పనుల్లో 9 కిలోమీటర్ల మేర తవ్వకం జరగాల్సి ఉందని, రెండు వైపులా నుంచి సొరంగం తవ్వకాల పనులు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు అంటున్నాయని, ఆ మేరకు గడువు పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడం, పనులను వేగిరం చేయడానికి అధికారులతో కమిటీ వేయాలని ఆయన నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను కోరారు. అలాగే 95% పూర్తయిన డిండి ప్రాజెక్టుతో పాటు పెండ్లి పాకాల జలాశయం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు రూ.90 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కొత్త ఆయకట్టుకు నీరిచ్చే పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, జైవీర్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ‘జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లు’ సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి గురువారం రాత్రి ఆయన సచివాలయంలో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల వల్ల మత్స్య సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని భట్టివిక్రమార్క సూచించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. బ్లాక్ డే’
సాక్షి, నల్గొండ : ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాల్ వద్ద చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కోమటిరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కృషి చేసింది కాంగ్రెస్ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మేధావిలా మాట్లాడుతున్న కేసీఆర్ ఒక నియంత అని దుయ్యబట్టారు. కాగా మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు జలదీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. (ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి) సొంత జిల్లాకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడాన్ని కోమటిరెడ్డి ఖండించారు. ‘ముఖ్యమంత్రి కావాలనే నేతలను అవమానపరుస్తున్నారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం కాదు బ్లాక్ డే’ అంటూ విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. కరోనా నిబంధనల పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. దేవరకొండ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంలేదని, కేసీఆర్ హిట్లర్ కంటే ఎక్కువ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఆ రోజు చెప్పాం.. ఈ రోజు సాధించుకున్నాం’) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరిన కేసీఆర్‌కు కనీసం కనికరం లేకుండా పోయిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద వేలమంది ఉండొచ్చు.. కానీ ముగ్గురం సీనియర్ నాయకులం ఒక్కదగ్గర ఉంటే కేసీఆర్ కి ఎందుకు భయం అని నిలదీశారు. కేసీఆర్‌కు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే భయం వేస్తుందని, కేసీఆర్ నిర్లక్ష్యం,అసమర్థత వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకుపోతామని, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని ఉత్తమ్ ఆరోపించారు. (‘సీఎం కేసీఆర్ కొత్త కుట్ర ప్రారంభించారు’) పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జానారెడ్డి అన్నారు. దేవరకొండ ప్రాంతలో పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం కోసం వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్టీ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన చేయాలని అనుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విదంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు చేస్తే ప్రత్యేక రాష్ట్ర సాధన జరిగేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ది చెబుతామని, గాంధీ భవన్ లో సీనియర్ నాయకులతో చర్చించి తమ కార్యచన చెబుతామని జానారెడ్డి పేర్కొన్నారు. (ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?: ఉత్తమ్) -
ముందుకు పడని.. అడుగులు!
సాక్షి, నల్లగొండ: జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టును మినహాయిస్తే అత్యధిక శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారే అధికం. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ విద్యుత్ మోటార్లు ఇక్కడే ఉన్నాయి. సహజంగానే విద్యుత్ వినియోగం కూడా జిల్లాలోనే ఎక్కువ. తాజా బడ్జెట్లో జిల్లా ప్రాజెక్టులకు నామ మాత్రంగా కూడా నిధులు కేటాయించలేదు. ఒక్కో ప్రాజెక్టుకు కోట్ల రూపాయల్లో బకాయిలు ఉండగా, కనీసం సిబ్బంది జీత భత్యాలకు సరిపడినంత కూడా నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా ఇస్తున్న బడ్జెట్ కేటాయింపులు ఉద్యోగుల జీత భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులకే సరిపోతుండడంతో ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న విధంగా తయారయ్యాయి. జిల్లాలోని ఏఎమ్మార్పీ/ఎ స్ఎల్బీసీ, డిండి, ఉదయం సముంద్రం– బ్రా హ్మణ వెల్లెంల, మూసీ ప్రాజెక్టుల్లో కేవలం డిండి కి మాత్రమే ఓ మాదిరి కేటాయింపులు జరిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం 2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) 2010 వరకు పూర్తి కావాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ఇన్లెట్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లి గ్రామపంచాయతీ కేశ్యతండా ఔట్లెట్ వరకు 43కిలోమీటర్ల ఇన్లెట్ సొరంగ మార్గాన్ని, అలాగే నక్కలగండి తండా ఇన్లెట్ నుంచి నేరెడుగొమ్ము ఔట్లెట్ వరకు మరో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు ఉన్నాయి. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాకపోవడంతో 2012లో ప్రాజెక్టు నిర్మాణ కాల పరిమితిని 2017 డిసెంబర్ వరకు పెంచారు. ఇప్పుడు కాస్తా 2020 నాటి వరకు అవకాశం కల్పించారు. గత బడ్జెట్లో రూ.700 కోట్లుగా పేర్కొని రూ.500కోట్లకు సవరించారు. కాగా ఈ బడ్జెట్లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈప్రాజెక్టుకు ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.752.71 పేరుకుపోయాయి. ఏఎమ్మార్పీకి అనుసంధానించేలా రూపొందిం చిన ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా ఉన్న నక్కలగండి బండ్ నిర్మాణం పనులూ వేగం పుంజుకోలేదు. నాగార్జున సాగర్ లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీలోనే అంతర్భాగంగా ఉన్న ఉదయ సముద్రం–బ్రాహ్మణవెల్లెంలకు అసలు నిధులే ఇవ్వలేదు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం 2009లో నాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో మొదలైన ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల పనులు ముందుకు పడడం లేదు. ఆయకట్టేతర ప్రాంతమైన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వీటితో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం, నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలాలకు తాగునీటితో పాటు, సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ధ కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా చేపట్టారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా పనులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్లో పైసా విదిల్చలేదు. భూ సేకరణకు రూ.200 కోట్లు, మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250కోట్లు వెరసి రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. డిండి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీ టిని అందించేందుకు మూడున్నరేళ్ల కిందట మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో 7 టీఎంసీల సామర్థ్యం, చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి వద్ద 5.7 టీఎంసీలు, చింతపల్లి మండల కేంద్రంలో 1.9 టీఎంసీలు, గొట్టిముక్కల వద్ద 1.835 టీఎంసీలు, డిండి మండలం సింగరాజుపల్లి వద్ద 7 టీఎంసీల సా మర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభం కాగా ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.90.87 కోట్లు మా త్రమే కేటాయించారు. ఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరీ ఇంత చిన్న మొత్తంలో నిధులు కేటాయిస్తే పనులు పూ ర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ ప్రాజెక్టులో రూ.345.93కోట్లు పెండింగు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మూసీ మూసీ ప్రాజెక్టు 1963లోనే అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేకపోతోంది. ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం 41వేల 800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వడం. రూ.2.20కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలంటే కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నిర్వహణ నిధులు మినహా మరమ్మతుల కోసం ఇప్పటి దాకా ఇచ్చింది కేవలం రూ.19కోట్లు. వీటితో ఇతరత్రా పనులన్నీ పూర్తయినా, కాల్వల లైనింగ్ సహా ఇతర ఆధునీకరణ పనులు మొదలే కాలేదు. గత బడ్జెట్లో రూ.4.62 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సారి మరింత తగ్గించి రూ.4.17కోట్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని ప్రాజెక్టులకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రాజెక్టులు పూర్తయ్యి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, బీడు భూములకు సాగునీటిని ఎప్పటికి అందిస్తాయో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఎస్ఎల్బీసీ సొరంగం 2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును 2020 వరకు పూర్తిచేయాలని అవకాశం కల్పించారు. ఈ బడ్జెట్లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో దీనికి ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయ సముద్రం నకిరేకల్, తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగు,సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ద కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన దీనిని రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్లో పైసా విదిల్చలేదు. మొత్తం రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. డిండి.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతా లకు తాగునీ టిని అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న దీని పరిధిలో ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. వీటి పనులు ప్రారంభమైనప్పటికీ ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించాల్సి ఉంది. మూసీ మూసీ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతోంది. మొత్తానికి నీరు అందాలంటే ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలి. ఇందుకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ సారి బడ్జెట్లో రూ.4.17కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. -
డిండి..కదలదండి!
వంగిపోయిన నడుము.. వంకర కాళ్లు.. ఎటూ కదల్లేని దైన్యం.. వైద్యం చేయించుకోలని దుర్భర జీవితం.. ఎన్నాళ్లు బతుకుతామో కూడా తెలియని కష్టం.. ఇదీ పూర్వ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల దుర్భర పరిస్థితి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రాథమిక దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ అలైన్మెంట్ కూడా తేలలేదు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ బాధిత మండలాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ రెండున్నరేళ్లయినా ప్రాథమిక దశ కూడా దాటలేదు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రాజెక్టుపై సర్వే చేస్తున్న వ్యాప్కోస్ నిర్ణీ త గడువులో నివేదిక ఇవ్వకపోవడంతో అలైన్మెంట్ కూడా తేలలేదు. అయితే డిండికి దిగువన చేపట్టిన పనులు మాత్రం ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయి. మార్పులు, చేర్పులు.. వీడని చిక్కులు వాస్తవానికి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశమై అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 11 టీఎంసీలను మిడ్ డిండికి, డిండికి తరలించేలా డిజైన్ చేశారు. కానీ అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం శ్రీశైలం నుంచి ఓపెన్ చానల్, టన్నెళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసి డిండికి తరలించేలా డిజైన్ చేశారు. ఇదే సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో.. డిండికి పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. తర్వాత హైదరాబాద్ తాగునీటి అవసరాలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు 30 టీఎంసీలు అవసరమని లెక్కించి.. మొత్తంగా 60 టీఎంసీలను డిండి ద్వారానే తరలించేందుకు కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. తర్వాత ఏదుల కన్నా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే నయమంటూ మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒడిదొడుకుల ఎస్ఎల్బీసీ ఇక శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను తీసుకునేలా చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2004లో రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూసేకరణ సమస్యలు, వరదలతో పనులు జాప్యమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. అందులో శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సిన 43.89 కిలోమీటర్ల టన్నెల్లో.. ఇప్పటివరకు 30.46 కిలోమీటర్లు పూర్తయింది. మరో 13.46 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. దీనికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని అంచనా. ఈ దృష్ట్యా నక్కలగండి రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేస్తే అప్పర్ డిండి నుంచి వచ్చే మిగులు జలాలను నిల్వ చేసుకునే అవకాశముందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. -
ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌కు మోక్షమెప్పుడు ?
-
ఇక... భూసేకరణే అడ్డంకి!
దేవరకొండ : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిన్నమొన్నటి వరకు నెలకొన్న సందిగ్ధం..ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చతో వీడింది. 2016 లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇక్కడి ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన సొరంగమార్గం పనులను చేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు జేపీ అసోసియేట్స్, రాబిన్స్ నిర్మాణ వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేయడం.. మరోవైపు ఇక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు మొండిపట్టు పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే జీఓనంబర్ 13పై ఒక నిర్ణయానికి వస్తే ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది. ఇదిలాఉంటే ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే 200ఎకరాలు సేకరిం చగా ఆ భూములకు కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి నూతన భూసేకరణ చట్టం వర్తింపజేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో భూములు కోల్పోయే రైతులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీని అందించాలని, మార్కెట్ ధరలతో సమానంగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కోసం 3723 ఎకరాల భూమి అవసరముండగా, ఇప్పటికే రిజర్వాయర్ బండింగ్ నిర్మాణం కోసం 200 ఎకరాలను కొనుగోలు చేశారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులు తమకు అన్యాయం జరిగిందని, అప్పట్లో తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా అధికారులు భూమిని సేకరించారని, బత్తాయి తోటల రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇప్పుడు తమకు కూడా నూతన భూసేకరణ చట్టం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొలిక్కిరాని సర్వేనంబర్ 129 సమస్య.. 129వ సర్వేనంబర్‌లో ప్రభుత్వ రికార్డుల కన్నా, ఎక్కువ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలున్నా యి. అధికారులు సర్వే నిర్వహించగా భూమి తక్కు వ, పాస్‌పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో వారు ఈ విషయంలో ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికీ ఎనిమిది సార్లు సర్వే నిర్వహించారు. అయి నా వివాదం సద్దుమణగలేదు. ఈ రెండు సమస్యలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఆటంకంగా మారనున్నాయి. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే.. ప్రభుత్వం అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను మొట్టమొదటగా పరిష్కరించాలి. ప్రస్తుతం వెంటనే పనులు చేపట్టాల్సిన బండ్ నిర్మాణం ఇప్పటికే సేకరించిన 200 ఎకరాల భూముల్లోనే ఉంది. కాగా, అదే రైతులు వివాదానికి దిగుతున్నారు. వీరి సమస్యలు పరిష్కరించడం కీలకంగా మారింది. గతంలో భూసేకరణ అధికారులను చాలాసార్లు రైతులు అడ్డుకున్నారు. పనులు జరగకుండా ఆందోళనకు కూడా దిగారు. ఈ సమస్య చిన్నదే అయినా పరిష్కరించడానికి అధికారులకు నిబంధనలు అడ్డు వస్తున్నందున 129వ సర్వేనంబరు సమస్యను, ఇప్పటి వరకు సేకరించిన 200 ఎకరాల భూముల రైతులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఎన్నిసార్లు భూములు కోల్పోవాలి గతంలో నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో మేము రాయారం గ్రామంలో ఉండగా మా భూములు కోల్పోయాం. మళ్లీ ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎకరానికి వంద రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ యాభై ఏళ్ల తర్వాత మా భూములన్నీ సాగులోకొచ్చాక కేవలం లక్ష రూపాయలిస్తే ఏం సరిపోతాయి. ఇదెక్కడి న్యాయం? నూతన భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. - చిర్ర సుదర్శన్‌రెడ్డి, తెల్దేవర్పల్లి కాపుకొచ్చిన బత్తాయి తోటకు ఎకరాకు రూ.లక్షా60వేలు ఇచ్చారు ఏడు సంవత్సరాల పాటు బత్తాయి తోటను పెంచి పెద్దచేసి సరిగ్గా కాపు వస్తుందనుకున్న సమయంలో భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరా బత్తాయి తోటకు రూ.లక్షా 60వేలు ఇచ్చారు. సుమారు రూ.5 లక్షలు తోటకు పెట్టుబడి అయ్యింది. పరిహారం కింద వచ్చింది కూడా అంతంతే. మాకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చినట్టు ? కనీసం తెలంగాణ ప్రభుత్వంలోనైనా మాకు సరైన న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాం. - ఎన్.భరత్‌కుమార్, తెల్దేవర్పల్లి, మోత్యతండా