slight changes
-
‘వాకా’లో కుదరదు
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం భారత్ నేరుగా పెర్త్‌కు వెళ్లి అక్కడే బయో బబుల్ సెక్యూరిటీలో ఉండి తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే పెర్త్ మైదానం ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కరోనాకు సంబంధించి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. క్రికెట్ జట్టుకైనా సరే... ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో భారత జట్టు ప్రణాళిక మారడం ఖాయమైంది. తాజా ప్రతిపాదన ప్రకారం భారత జట్టు తమ తొలి మ్యాచ్ అడిలైడ్ లేదా బ్రిస్బేన్లలో ఆడుతుంది. -
సీఎం జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మొదట రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయానికి ప్రారంభోత్సవం చేసి.. అనంతరం అలిపిరి వద్ద నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి తిరుమలకు వెళ్ళాల్సిఉంది..కానీ మారిన షెడ్యూల్ ప్రకారం పద్మావతి నిలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం వైఎస్ జగన్..పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా వస్తున్నారు. సీఎం రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
రైల్వే ‘ఫ్లెక్సీ ఫేర్’లో స్వల్ప మార్పులు
న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించే విధానం (ఫ్లెక్సీ ఫేర్)లో రైల్వే స్వల్ప మార్పులు తీసుకురానుంది. సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ల టిక్కెట్ కొంటే సాధారణ ధర కన్నా గరిష్టంగా 50 శాతం వరకు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. త్వరలోనే దీనిని 40 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 మధ్య ఆ రైళ్లలో 5,871 బెర్తులు ఖాళీగా మిగిలిపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీ ఫేర్ ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రతి 10 శాతం సీట్లు బుక్ అవుతున్న కొద్దీ మిగిలిన సీట్లకు చార్జీ 10 శాతం మేర పెరుగుతుంది.