slow motion
-
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
కాంతిని స్లోమోషన్లో చూడాలనుందా?
వాషింగ్టన్: కాంతిని అత్యంత స్లో మోషన్లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్‌ను కేప్చర్ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్ టెంపోరల్ రిజల్యూషన్‌లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్ లేజర్ పల్సస్ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫొటోగ్రఫీ (కప్) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేమ్స్‌ను బంధించే ఫెమ్టో సెకండ్ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్ వరకు బంధించవచ్చని కాల్టెక్ ఆప్టికల్ ఇమేజింగ్ లాబోరేటరీ(కాయిల్) డైరెక్టర్ లిహాంగ్ వాంగ్ వెల్లడించారు. టీ–కప్‌గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్‌లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. -
పీఎంఓలోనూ మందకొడితనమే!
విశ్లేషణ పాలనాధికారుల అవినీతి వెల్లడించే అధికారిని బతకనిచ్చే రోజులా ఇవి? ఐఎఫ్ఎస్ పాసై హరియాణాలో అటవీ శాఖలో పని చేస్తున్న సంజీవ్ చతుర్వేది అనే యువ అధికారి ఆ రాష్ర్టంలో అవినీతిపైన వివరంగా నివేదిక ఇచ్చాడు. సహచరులూ, నాయకులూ కూడా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. దీనిపై చర్యలను అడ్డుకునేందుకు చతుర్వేదిపైనే ఎదురు ఆరోపణలు చేసి పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. నాటి కాంగ్రెస్ అటవీ శాఖ మంత్రి జైరాం రమేశ్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన ఇద్దరు ఉన్నతాధికారుల దర్యాప్తు కమిటీని వేశారు. అవినీతిని రూపుమాపేందుకు, చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన సంజీవ్ చతుర్వేదిపైన కావాలని కుట్ర చేసి తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారని, ముందు ఈ కేసును తొలగించి, అవినీతిపరులపైన వెంటనే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కమిటీ సూచించింది. సంజీవ్ చతుర్వేదిపైన తప్పుడు కేసు తొలగించక తప్పలేదు. హరియాణా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అనుమతించవలసి ఉంటుంది. కానీ వారికి ఇష్టంలేదు. దీనిపైన మరొక న్యాయ అభిప్రాయాన్ని కోరారు, రాష్ట్ర అవినీతిని విచారించే అధికారం కేంద్రా నికి లేదని, కనుక ఆ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఆ నివేదికను పాటించాల్సిన పని లేదని హరియాణా ప్రభుత్వం వాదించింది. దీనికి కేంద్ర నాయకుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. రెండు ప్రభుత్వాలు మారాయి. హరియాణాలో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర అగర్వాల్ సమాచార హక్కును వినియోగిస్తూ సంజీవ్ చతుర్వేది వ్యవహారంలో చర్యలు ఏం తీసుకున్నారని పర్యావరణ మంత్రిత్వశాఖను ఆర్టీఐ కింద అడిగారు. మొదట ప్రధాని కార్యాలయం ఆయన అడిగిన సమాచారం వ్యక్తిగతమైందని వాదించింది. అయితే మూడో వ్యక్తి అయిన సంజీవ్ చతుర్వేదిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించింది. లేదన్నారు. కమిషన్ కార్యాలయం టెలిఫోన్లో సంజీవ్‌ను అభి ప్రాయం అడిగితే ఆయన అది తన వ్యక్తిగత సమాచారం కాదని, ఒకవేళ వ్యక్తి గత సమాచారమని అనుకున్నా, దాన్ని వెల్లడించడానికి తమకు అభ్యంతరమేదీ లేదని ప్రజా సమాచార అధికారికి చెప్పారు. ఆ మేరకు అడిగిన ఆ సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఇదివరకు ప్రధాన సమాచార కమిషనర్ శ్రీమతి సుష్మా సింగ్ కూడా ఈ విధంగానే సంజీవ్ చతుర్వేదికి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను పునఃసమీక్షిం చాలని పీఎంఓ కోరింది. దాన్ని కమిషన్ తిరస్కరించింది. మళ్లీ అదే డిమాండ్‌తో మరొక పిటిషన్ వేసారు. తాజాగా కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని కూడా పునఃసమీ క్షించాలని కోరారు. ఆ తరువాత మరొక పిటిషన్ వేస్తూ ఇదివరకటి సీఐసీ ఆదేశాన్ని ఇప్పటి సీఐసీ ఆదేశాన్ని కూడా పునఃసమీక్షించాలని కోరారు. దీన్ని సుభాష్ వ్యతిరేకించారు. పునఃసమీక్షించే అధికారాన్ని చట్టం సీఐసీకి ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తా విస్తూ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయరాదని వెంటనే ఈ పిటిషన్లు తిరస్కరించాలని కోరారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ విజయ్ శర్మ ఈ రెండు పిటిషన్లను తిరస్కరించి అభ్యర్థి కోరిన సమా చారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయాన్ని డిసెంబర్ మూడో తేదీన ఒక ఉత్తర్వు ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలిపారు. సంజీవ్ చతుర్వేది నివేదనల పైన, ఫిర్యాదులైపైన తీసుకున్న చర్యలేమిటి? ఇద్దరు సభ్యుల కమిటీ సిఫార్సు లను అమలు చేశారా? డీఓపీటీ అధికారులు కోరిన న్యాయనిపుణుల అభిప్రాయాన్ని లీక్ చేసిన వారెవరు? దానిపైన ఏచర్య తీసుకున్నారు? అవినీతి అధికారుల మీద సీబీఐ దర్యాప్తు చేయాలన్న సిఫార్సును అమలు చేయడానికి గత రెండు మూడేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయం గానీ హరియాణా ప్రభుత్వం గానీ ఏం చర్యలు తీసుకున్నది? అని సుభాష్‌చంద్ర అగర్వాల్ అడిగారు. పర్యావరణ మంత్రిత్వశాఖను అడిగిన సమా చారం, డీఓపీటీని అడిగిన సమాచారాన్ని వారు ఇచ్చారని, సీఐసీ ఉత్తర్వులను పాటించారని అగర్వాల్ తెలిపారు. కాని ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఇంకా సమాచారం అందలేదని ఫిర్యాదు చేశారు. ఈ సమాచార అభ్యర్థన రెండో అప్పీలులో చాలా కీలకమైన అంశాలున్నాయన్న సుభాష్ వాదనతో కమి షన్ ఏకీభవించింది. పరిపాలనా పరమైన, రాజ్యాంగ పరమైన అంశాలు ఎన్నో ఇమిడి ఉన్నా యన్నారు. డీఓపీటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కాగితాలో్ల అనేక వివాదాలు వెల్లడైనాయని చెప్పారు. అవినీతిని అంతం చేయడానికి, కొందరి పైన అవి నీతి ఆరోపణలు వచ్చినందున దర్యాప్తు జరిపించడం ద్వారా తాము అవినీతిని సహించబోమని పాలకులు తెలియజే యవలసిన అవసరం ఉందని వాదించారు. ఇద్దరు ప్రధాన కమిషనర్లు, ఒక సమాచార కమిషనర్ ఆదేశించిన మేరకు సుభాష్ కోరిన సమాచారాన్ని పక్షం రోజుల్లో ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీచేసింది. (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కేసు ఇఐఇఅఅ2015000525లో సీఐసీ డిసెంబర్ 29, 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్)