SMBs
-
చిన్న సంస్థలకు ఫేస్బుక్ రూ. 32 కోట్ల గ్రాంటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి, చిన్న సంస్థలు (ఎస్ఎంబీ) తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన తోడ్పాటునివ్వనున్నట్లు సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వెల్లడించింది. అయిదు నగరాల్లోని (హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు) 3,000 పైచిలుకు చిన్న వ్యాపారాలకు 4.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 కోట్లు) మేర గ్రాంట్ ఇనవ్వనున్నట్లు ఫేస్బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపారు. సింహభాగం నగదు రూపంలోను మిగతాది యాడ్ క్రెడిట్స్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రకాల వ్యాపారాలకు ఇది వర్తిస్తుందని, ఫేస్‌బుక్‌కు సంబంధించిన సాధనాలేమీ వాడని సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరిం చారు. గ్రాంటు ద్వారా పొందిన నిధుల వినియోగంపై ఎలాంటి షరతులు ఉండవని, ఆయా సంస్థలు తమకు కావాల్సిన విధంగా వినియోగించుకోవచ్చన్నారు. 2020 జనవరి 1 నాటికి కనీసం 2 నుంచి 50 మంది సిబ్బంది ఉన్న సంస్థలు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన సంస్థలకు సుమారు రూ. 63,000 నగదు, రూ. 38,000 విలువ చేసే ఫేస్బుక్ యాడ్ క్రెడిట్స్ లభిస్తాయి. చదవండి: వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్ -
మరోసారి ఇండియాకు గూగుల్ సీఈవో
న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఇండియాకు రానున్నారు. ఢిల్లీలో జనవరి 4 నిర్వహిస్తున్న స్మాల్ అండ్ మీడియం బిజినెస్ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరునున్నారు. ఈ ఈవెంటలో కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా ఇతర గూగుల్ సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో చాలా చురుకుగా ఉన్న గూగుల్ దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తోంది. టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని ఇటీవల ప్రకటించిన సుందర్ పిచాయ్ భారత్ లోని డిజిటల్ పవర్ ద్వారా ఎస్ఎంబీ-గూగుల్ భాగస్వామ్యంపై దృష్టిపెట్టనున్నారు. ఈ దిశగా ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్ కలిసి ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో రైల్వే శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని సుమారు 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వై ఫై సదుపాయాన్ని కల్పించింది. 2017 చివరి నాటికి దేశంలోని మరో 400 ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై సదుపాయం కల్పిస్తామని రైల్వే వర్గాలు వెల్లడించింది. కాగా గుగూల్ సీఈవో అయిన తరువాత సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్ లో భారత్ లో పర్యటించారు. అలాగే ఈ నియామకానికి కొద్ది రోజులు ముందు ఆండ్రాయిడ్ హెడ్ గా ఇండియాను సందర్శించారు.