sp greivence
-
తిరుగుతున్నా కనికరం లేదా!
నెల్లూరు(పొగతోట): సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు పట్టుకుని తిరుగుతున్నా కనికరం లేదా అని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రావడం పోవడమే కానీ మాగోడు వినేనాథుడే కరువయ్యాడని వాపోయారు. పేదల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి వినతిపత్రాలు స్వీకరించారు. ఉద్యోగం నుంచి తొలగించారు ఎస్టీ కులానికి చెందిన నేను చిన్నతనం నుంచి కష్టపడి చదివాను. కొడవలూరు మండలం, సీఎస్‌పురంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీజీటీ (హిందీ, పార్ట్‌టైం)గా 2015లో చేరాను. 2017లో నేను పనిచేస్తున్న పోస్ట్‌ను గిరిజనేతర మహిళకు కేటాయించారు. వేరే మరో పోస్ట్‌లో పనిచేయమని అధికారులు చెప్పారు. ఈ విషయం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సీఎస్‌పురంలో కొనసాగించమని ఆదేశాలిచ్చారు. ఎలాంటి పొరపాటు చేయకపోయినా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. న్యాయం చేయాలి.– నాగమణి, వెంకటేశ్వరపురం గ్రామాన్ని తరలించండి అన్నవరం, గట్టుపల్లి పంచాయతీల్లో సుమారు 600 దళిత, గిరిజన కుటుంబాల వారం జీనవం సాగిస్తున్నాం. గ్రామాల సమీపంలో క్వారీ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇళ్లు పగుళ్లిచ్చి పెచ్చులూడుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. జిల్లా అధికారులు స్పందించి క్వారీని నిలుపుదల చేయండి లేదా గ్రామాన్ని తరలించండి.– అన్నవరం, గట్టుపల్లి గ్రామస్తులు, జలదంకి మండలం -
పురుగుమందుతో ఎస్పీ గ్రీవెన్స్‌కు యువకుడు
ఒంగోలు క్రైం: ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చేందుకు ప్రయత్నించటం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలకలం రేపింది. ఎస్పీ బి.సత్య ఏసుబాబు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది సహజ పరిశీనలో అతడి వద్ద పురుగుమందు డబ్బా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు పురుగుమందు డబ్బా స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని ఎస్పీ బి.సత్య ఏసుబాబు వద్దకు తీసుకెళ్లారు. అతడు తన కష్టాన్ని ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. చినగంజాం మండలం సంతరావూరుకు చెందిన వడ్డాణం రాఘవులు ఉన్నత చదువులు చదువుకున్నాడు. తల్లి ఛాయాదేవి, తండ్రి శ్రీరాములు మధ్య ఏర్పడిన మనస్పర్థలతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఇది తనకు మానసిక వేదన కలిగిస్తోందని వాపోయాడు. దీనికి తోడు తండ్రి శ్రీరాములు మరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఆస్తులు హారతి కర్పూరంలా కాజేస్తూ తమను దిక్కు లేని వారిగా చేస్తున్నాడన్నారు. మొత్తం 17 ఎకరాలు పొలం ఉంటే ఇప్పటికే ఐదెకరాలు అమ్మాడని, స్థానిక పోలీసులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటే అది సివిల్ వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్పీని రాఘవులు వేడుకున్నాడు. -
ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 వినతులు
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 12 వినతులు వచ్చాయి. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వినతులను స్వీకరించారు. త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ తగాదాలకు చెందినవి ఒకటి, సివిల్ తగాదాలు రెండు, పాతకేసుల పరిష్కారం కోరుతూ రెండు, ఇతర కారణాలతో ఏడు వినతులు వచ్చాయి. అలాగే, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పది వినతులు రాగా, వాటిలో నాలుగు తక్షణమే పరిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వివేకానంద, కె.భార్గవరావునాయుడు, విశ్రాంత ఎస్ఐ పి.రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, ఐసీడీఎస్, డీఆర్‌డీఏల నుంచి జ్యోతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.