ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 వినతులు | 12 complaints filed in sp greivence | Sakshi
Sakshi News home page

ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 వినతులు

Published Mon, Aug 8 2016 11:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి - Sakshi

వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి

శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 12 వినతులు వచ్చాయి. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వినతులను స్వీకరించారు. త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ తగాదాలకు చెందినవి ఒకటి, సివిల్‌ తగాదాలు రెండు, పాతకేసుల పరిష్కారం కోరుతూ రెండు, ఇతర కారణాలతో ఏడు వినతులు వచ్చాయి. అలాగే, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పది వినతులు రాగా,  వాటిలో నాలుగు తక్షణమే పరిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వివేకానంద, కె.భార్గవరావునాయుడు, విశ్రాంత ఎస్‌ఐ పి.రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, ఐసీడీఎస్, డీఆర్‌డీఏల నుంచి జ్యోతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement