Space technical knowledge
-
స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం..
కాలేజీ రోజుల్లో కల కనని వారు అంటూ ఉండరు. ఆ కలకు కష్టం, అంకితభావం తోడైతే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘దిగంతర’ నిరూపించింది. అనిరుథ్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్ అనే కుర్రవాళ్లు కాలేజీ రోజుల్లో కన్న కలను స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం చేసుకొని తిరుగు లేని విజయాన్ని సాధించారు..‘దిగంతర మొదలైనప్పుడు, ఇప్పటికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు వినిపించే జవాబు... ‘దిగంతర’ అంటే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే సంస్థగానే ఎక్కువ గుర్తింపు ఉండేది. తాజా విషయానికి వస్తే... వినియోగదారులకు సేవలు అందించడం మాత్రమే కాకుండా మన దేశ రక్షణ ప్రయోజనాల విషయంలో మౌలిక సదు΄ాయాలను అందించే సంస్థగా అభివృద్ధి చెందింది. ‘అంతరిక్షంలో ఏం జరుగుతుంది?’ అనేది అర్థం చేసుకోవడానికి స్పేస్ డొమైన్ అవేర్నెస్ కంపెనీగా ఎదిగింది.దిగంతరకు సంబంధించిన ఐడియా కాలేజీ రోజుల్లోనే అనిరు«థ్ శర్మ, రాహుల్ రావత్‌లకు వచ్చింది. బెంగళూరులో శాటిలైట్ క్లబ్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్‌తో కలిసి ‘దిగంతర’ కలను సాకారం చేసుకున్నారు. విమానయానం, సముద్ర నావిగేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలు, నియమాలు ఉన్నాయి. అంతరిక్షానికి సంబంధించి అలాంటివి లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘స్పేస్ డొమైన్ అవేర్నెస్’కు ప్రాధాన్యత ఇస్తోంది దిగంతర.దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. స్పేస్ డొమైన్ అవేర్నెస్ వల్ల అంతరిక్షంలో ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. స్పేస్–మ్యాప్ (స్పేస్ మిషన్ ఎష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్), స్టార్స్(స్పేస్ థ్రెట్ అసెస్మెంట్ అండ్ రెస్సాన్స్ సూట్) అనే రెండు సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేసింది కంపెనీ. అంతరిక్ష ఆధారిత సెన్సర్లు, గ్రౌండ్ ఆధారిత టెలిస్కోపిక్ అబ్జర్వేటరీల కాంబినేషన్‌ను ఉపయోగిస్తోంది దిగంతర.ఈ అబ్జర్వేటరీలలో మొదటిది లద్దాఖ్‌లో రానుంది. సెన్సర్ల నుంచి తీసుకున్న డెటా, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతరత్రా సంస్థల నుంచి సేకరించిన డేటాతో తన సొంత లైబ్రరీలను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ లైబ్రరీలను ఉపయోగించి విశ్లేషణలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.‘దిగంతర’కు ‘సింగపూర్ స్పేస్ అండ్ టెక్నాలజీ’లాంటి అంతర్జాతీయ కస్టమర్లు ఉన్నారు. మైత్రి(మిషన్ ఫర్ ఆస్ట్రేలియా–ఇండియా టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్)లో భాగంగా ఆప్టికల్ సెన్సర్ల సప్లైకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన స్పేస్ మెషిన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఆపరేషన్స్, సిచ్యుయేషనల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కటింగ్–ఎడ్జ్ టెక్నాలజీతో దూసుకు΄ోతున్న ‘దిగంతర’ అంతరిక్షానికి సంబంధించి అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ‘వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్’ అనేది ముగ్గురు మిత్రులకు ఇష్టమైన మాట. ఆ మాటకు అర్థం ఏమిటో ‘దిగంతర’ విజయం చెప్పకనే చెబుతోంది.ఇవి చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? -
సామాన్యుడికి సాయపడాలి
ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలకు ప్రధాని సూచన సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి సాయపడే ఆవిష్కరణలు చేయాలని అధికారులు, శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చులో సరళమైన విధానంతో పేదలకు టెక్నాలజీ అందించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. ‘స్పేస్ టెక్నాలజీకి, సామాన్యుడికి మధ్య స్పేస్ (అంతరం)’ ఉండకూడదన్నారు. సుపరిపాలనలో టెక్నాలజీదే కీలక పాత్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పరిధిలో సాంకేతిక రంగాల్లో అన్వేషణలకు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘స్పేస్ టెక్నాలజీ’పై అంతరిక్ష విభాగం సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఒకే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1,600 మంది అధికారులు, శాస్త్రవేత్తలు హాజరై స్పేస్ టెక్నాలజీపై మేధోమథనం చేయడం ఇదే తొలిసారి.. * విశ్వవ్యాప్తంగా దేశం గర్వించే స్థాయిలో అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు లక్ష్యాన్ని సాధించారు. * మనం ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నామో విమాన పైలట్‌కు మానిటర్లో ఎలాగైతే ముందుగా తెలుస్తుందో, అలాగే మానవరహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద మానిటర్లు ఏర్పాటు చేసి శాటిలైట్‌కు అనుసంధానం చేస్తే రైల్వే డ్రైవర్లు అప్రమత్తమవుతారు. తద్వారా ఘోరప్రమాదాలను నివారించవచ్చు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇంజనీర్లు ఈ దిశగా కొత్త టెక్నాలజీని అభివృద్ధిచేశారు. ఇది త్వరలో అమల్లోకి తెస్తాం. * పోస్టల్ నెట్‌వర్క్‌ను శాటిలైట్‌తో అనుసంధానం చేసి చాలా సాధించవచ్చు. సామాన్యుల అవసరాలకు తగ్గట్లు విజ్ఞానం, విద్యావిధానం, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలలో టెక్నాలజీని ఉపయోగించాలి. * కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల కోసం యువతను ఆహ్వానించాలి. ప్రభుత్వ విభాగాల్లో సెల్ ఏర్పాటు చేసి ఆవిష్కరణలకు దారిచూపే ఆలోచనలను స్వీకరించాలి. * మాంఝీ అనే వ్యక్తి 45 ఏళ్ల పాటు కొండను తొలచి 50 కి.మీ ప్రయాణాన్ని 2కి.మీ. ప్రయాణానికి తగ్గించాడు. అప్పుడంటే టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీని వాడి దగ్గరిదారులు(షార్ట్వే) తెరవచ్చు. * ఎర్రచందనం అక్రమ రవాణాపై హై రిజల్యూషన్ కెమెరాలతో నిఘా పెట్టొచ్చు. ఖనిజాల తవ్వకం, రోడ్డు పన్ను వసూళ్లు, జాతీయ రహదారుల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను శాటిలైట్ అనుసంధానం ద్వారా నిరోధించవచ్చు. * సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేదాకా ప్రజాప్రతినిధులను సాంకేతికపై అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలి. * విశాఖలో హుద్‌హుద్ తుపానుపై శాటిలైట్ సాయంతో ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చారు. దీంతో తక్కువ నష్టం జరిగింది. * ఈ క్యాలెండర్ ఇయర్లోనే పేదలకు సాయపడేలా ఒక్క స్పేస్ అప్లికేషన్‌ను అయినా అభివృద్ధిచేయాలి. * విక్రమ్ సారాభాయ్ గొప్ప దార్శనికుడు. ప్రపంచవిపణిలో పోటీపడేందుకే భారత్ అంతరిక్షరంగంలో అడుగుపెట్టిందని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సామాన్యుల జీవితాలను బాగు చేసేందుకే అంతరిక్ష పరిజ్ఞానాన్ని భారత్ వినియోగిస్తోందని ఆయన నిరూపించారు.