Spain Team
-
స్పెయిన్ ‘హ్యాట్రిక్’
డసెల్డార్ఫ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్ జట్టుకు ఫెరాన్ టోరెస్ ఏకైక గోల్ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. -
భారత్‌కు రెండో ఓటమి
మాడ్రిడ్: రియో ఒలింపిక్స్ కంటే ముందే ఏ ప్రత్యర్థినీ తక్కువ అంచనా వేయొద్దనే విషయం భారత హాకీ జట్టుకు అవగతమైంది. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న స్పెయిన్ జట్టుతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న స్పెయిన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (38వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... స్పెయిన్ జట్టుకు జోసెఫ్ రెమౌ (20వ ని.లో) పౌ క్వెమాడా (42వ ని.లో), సాల్వడోర్ పియెరా (53వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. అంతకుముందు స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌కు 1-4తో ఓటమి ఎదురైంది. -
భారత్ ప్రత్యర్థి స్పెయిన్
డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురైంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టుతో భారత్ తలపడనుంది. డేవిస్ కప్‌లో ఇప్పటివరకు భారత్, స్పెయిన్ ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. చివరిసారి 1965లో స్పెయిన్‌తో తలపడిన భారత్ 2-3తో ఓడిపోయింది. స్పెయిన్ జట్టులో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్, ప్రపంచ 15వ ర్యాంకర్ రొబెర్టో బాటిస్టా అగుట్, ప్రపంచ 21వ ర్యాంకర్ ఫెలిసియానో లోపెజ్ ఉన్నప్పటికీ... గాయాల కారణంగా నాదల్, ఫెరర్ బరిలో దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నాదల్, ఫెరర్ లేకపోయినప్పటికీ స్పెయిన్‌ను ఓడించాలంటే భారత క్రీడాకారులు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎలాంటి కోర్టుపై మ్యాచ్‌లు నిర్వహించాలో ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత ఏఐటీఏ నిర్ణయిస్తుంది.