భారత్‌కు రెండో ఓటమి | Rio Olympics preparation: Spain hands Indian hockey reality check before Rio | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో ఓటమి

Published Sat, Jul 30 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

భారత్‌కు రెండో ఓటమి

భారత్‌కు రెండో ఓటమి

మాడ్రిడ్: రియో ఒలింపిక్స్ కంటే ముందే ఏ ప్రత్యర్థినీ తక్కువ అంచనా వేయొద్దనే విషయం భారత హాకీ జట్టుకు అవగతమైంది. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న స్పెయిన్ జట్టుతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న స్పెయిన్‌తో జరిగిన  రెండో మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (38వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... స్పెయిన్ జట్టుకు జోసెఫ్ రెమౌ (20వ ని.లో) పౌ క్వెమాడా (42వ ని.లో), సాల్వడోర్ పియెరా (53వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. అంతకుముందు స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌కు 1-4తో ఓటమి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement