Special puja
-
లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు దిష్టిపూజ
-
ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం
-
యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు
-
చెత్తబుట్టకు ప్రత్యేక పూజలు!
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చెత్తబుట్టకు అర్చకులు ప్రత్యేక అలంకరణ చేయడంతోపాటు దాదాపు పావుగంట సమయం వెచ్చించి పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, అర్చకులు కలిసి ఆ చెత్తబుట్టలో బంతిపూలు వేసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వరస్వామి, సంతోషిమాత ఆలయాలలో చెత్తబుట్టల ఏర్పాటు సందర్భంగా ఈ దృశ్యం సాక్షి కెమెరా కంటపడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
భక్తులతో భలే వ్యాపారం
సాక్షి, విజయనగరం : కార్తీకమాసం అనంతరం ఏడాదిలో అత్యంత పవిత్రంగా పూజాధికాలు నిర్వహించేది శ్రావణ మాసంలోనే. ఈ మాసంలో నాలుగు వారాల పాటు ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ దేవికి మహిళలు పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని భక్తి ప్రవత్తులతో పూజలు నిర్వహిస్తారు. అయితే, మహిళల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పూజాసామగ్రికి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. పెరిగిన ధరలు... హిందువుల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువగా పూజలు నిర్వహించే సీజన్లో పండ్లకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ వరకు ఆషాడ మాసమే. 2వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఆషాడం ముగిసిన వెంటనే వచ్చే మొదటి శుక్రవారం కావడంతో వినియోగదారుల తాకిడిని గమనించిన వ్యాపారులు ఒక్క సారిగా ధరలు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయించారు. అదే టెంకాయలు అయితే రూ.30 నుంచి రూ.35 ధరల్లో సైజ్‌ను బట్టి అమ్మకాలు చేశారు. ఇక అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పండ్ల ధరలు సైతం ఆకాశన్నంటాయి. కిలో యాపిల్ ధర రూ.150 నుంచి రూ.170కు విక్రయించారు. వాస్తవానికి ఆషాడం రోజుల్లో పూజలు నిర్వహించడం తక్కువగా ఉండటంతో వీటికి అంత డిమాండ్ ఉండేది కాదు. అయితే, శ్రావణ మాసం ఆరంభంలో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న ధరలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దారుణంగా పెంచేశారు.. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న పండ్ల ధరలను ఒక్కసారిగా వ్యాపారులు పెంచేశారు. డజను అరటి పళ్లు రూ.50 చెబుతున్నారు. అరడజను అయితే రూ.30కి తగ్గదంటున్నారు. నచ్చితే కొనండి లేదంటే పొమ్మంటున్నారు. ధరల నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అధికారులైనా దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – ఎన్.నాగభూషణం, ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం -
బొబ్బిలిలో శాస్త్రోక్తంగా ఆయుధ పూజ
-
శాస్త్రోక్తంగా ‘సన్నిధి శుద్ధి’
· ప్రారంభించిన ఈఓ, జెఈఓ, అర్చకులు, · ప్రధానాలయగోపురం వద్ద సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేకపూజలు · గర్భాలయ, అంతరాలయగోడలకు సుగంధ లేపన పూత · సుగంధ ద్రవ్యాలతో ఆలయప్రదక్షిణ శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో శుక్రవారం ‘సన్నిధి శుద్ధి’ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, అంతరాలయం, శనగల బసవన్న, ధ్వజస్తంభం, ఆలయ పరివారాలయాలన్నింటికీ సుగంధ ద్రవ్యలేపనం పూశారు. కర్పూరం, జాజికాయ, జాపత్రి, కస్తూరి, ఏలకులు, లవంగాలు, వట్టివేరు, చందనం, కుంకుమపువ్వు, కుంకుడు రసం తదితరవాటితో లేపనాన్ని తయారు చేసినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. ముందుగా ఈఓ నారాయణ గుప్త దంపతులు, జెఈఓ హరినాథ్‌రెడ్డి దంపతులు, అర్చకులు, వేదపండితులు ప్రధానాలయగోపురం వద్ద సుగంధ ద్రవ్యాలకు శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేకపూజలను నిర్వహించారు. ఆ తరువాత సుగంధ ద్రవ్యాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసిన అనంతరం సన్నిధి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయప్రాంగణం, అంతరాలయాలను అధికారులు శుద్ధి చేయగా, గర్భాలయాన్ని అర్చకులు శుద్ధి చేసి సుగంధ లేపనాన్ని పూతగా పూశారు. ధ్వజస్తంభం, ద్వారపాలకులు, ఆలయ శిల్పాలు, పంచలోహ, కాంస్య (కంచు)మూర్తులకు జలాలతో శుద్ధి చేసి సుగంధ లేపనాన్ని పూశారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇలాంటి సుగంధలేపన కార్యక్రమం వైష్ణవాలయాలలో నిర్వహిస్తుంటారు. ప్రప్రథమంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఆలయప్రాంగణమంతా సుగంధ పరిమళాలను వెదజల్లుతుందని, భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తుందనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. -
జయలలిత ఆరోగ్యం కోసం పూజలు
- ముక్కంటీశునికి 66 కేజీల వెండి వస్తువుల బహూకరణ శ్రీకాళహస్తి : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తమిళనాడు రేట్టరి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నీలకంఠం శనివారం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం 66 కేజీల 543 గ్రాముల వెండి ఆభరణాలను ఆలయానికి అందజేశారు. వీటిలో స్వామివారి పానుమట్టంతోపాటు 50 రకాల పూజ సామగ్రి ఉన్నాయి. వీటి విలువ రూ.32,66,459 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ సభ్యులు లోకనాథం నాయుడు, మల్లెమాల ప్రమీలమ్మ, పీఎం చంద్ర, డాక్టర్ ప్రమీలమ్మలు పాల్గొన్నారు. -
మాస్కో టు శ్రీకాళహస్తి
-
మాస్కో టు శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి (చిత్తూరు): ఇప్పటికే ఖండాంతరాలకు పాకిన శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి సోమవారం మరో రుజువు లభించింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసంతో రష్యాకు చెందిన 16 మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస్కో నగరం నుంచి వచ్చిన వీరు రూ.2,500 టిక్కెట్ కొనుగోలు చేసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయుంలోని స్వామి, అవ్మువార్లతోపాటు పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయు ఆవరణలో 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేసుకుంటే వివాహం కాని వారికి పెళ్లవుతుందనీ, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందని మాస్కోలో ఉంటున్న చెన్నైకి చెందిన వారు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చామని, ఆలయు శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. -
'వైఎస్ఆర్ చొరవతోనే హైదరాబాద్‌కు గోదావరి జలాలు'
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల పండి నేడు నగరానికి గోదావరి జలాలు వస్తున్నాయని మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ క్షేత్రగిరిపై గోదావరి జలాలకు శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. పైప్‌లైన్,సంపుల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోటి 40లక్షల జనాభా గల హైద్రాబాద్ నగరంలో నగరవాసులు త్రాగడానికి నీరు సరిపోక ఇబ్బందులు పడుతుంటే నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ దూరదృష్టితో నగర వాసుల దాహార్తి తీర్చడానికి తాను చేపట్టిన సుజల స్రవంతి పథకమే నేటి గోదావరి జలాలన్నారు. 2008 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.3720 కోట్ల వ్యయాన్ని వెచ్చించి 2009 సంవత్సరంలో సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారని అన్నారు. మరోవైపు క్రిష్ణా ఫేజ్-2 కొరకు వెయ్యి కోట్లు వెచ్చించి నగరానికి కొంతమేర నీటిని తీసుకొచ్చినప్పటికి గోదావరి జలాలు నగరానికి వస్తేనే నగరవాసులకు పూర్తి స్థాయిలో నీరు అందించగలమని, రాబోయే కాలంలో నీటి ఇబ్బందులు పూర్తిగా తీరుతాయని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సైతం ఆ దిశగా అడుగులు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేసేందకు ఎన్నో శాశ్వత పథకాలు ప్రవేశపెట్టామని అందుకు నిదర్శనమే గోదావరి జలాలు అన్నారు. సుజల స్రవంతి పథకం 90 శాతం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి అయ్యాయని టీఆర్ఎస్ ప్రభుత్వం 10శాతం పనులు చేసి తామే నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గోదావరి జలాలు నగరానికి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. నగరంలోనూ తాము చేపట్టిన అభివృద్ది పనులనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు తాము చేసినట్టు చెప్పుకుంటుందని, కేవలం రానున్న గ్రేటర్ ఎన్నికల కోసమే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పథకాలకు, అభివృద్ది పనులకు తమ పేరు చేర్చుకుని గొప్పలు చెప్పుకుంటుందని ఆమె మండిపడ్డారు. క్షేత్రగిరిపై గోదావరి జలాలకు కాంగ్రెస్ నేతల పూజలు ఘనాపూర్ క్షేత్రగిరిపై గోదావరి జలాల సంపు వద్ద శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.సర్వమత ఆచారాల్లో పూజలు చేశారు.అంతకుముందు క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి దర్శనము చేసుకుని పూజల్లో పాల్గొన్నారు.కాంగ్రెస్ నాయకుల పూజల సందర్బంగా క్షేత్రగిరిపై దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి పథకాలతో కూడిన ఫ్లెక్సీలను నాయకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నందికంటి శ్రీధర్, ఉద్దమర్రి నర్సింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, అనిల్, రవియాదవ్, శామీర్‌పేట జెడ్పీటీసి బాలేశ్, మేడ్చల్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు భవాని, మేడ్చల్, శామీర్‌పేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరదారెడ్డి, క్రిష్టారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో ఘనంగా గో పూజ
శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో శనివారం గోకులాష్టమి సందర్భంగా గో పూజలను నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని నిత్య సేవతో పాటు గోశాలలో 11గోవులకు,11 గోవత్సాల(ఆవుదూడలు)కు శ్రీసూక్తం, గో అష్టోత్తర మంత్రం, గోవులకు షోడశ ఉపచార పూజలను అర్చకులు, ఈఓ సాగర్‌బాబు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత వేదపరాయణలు జరిగాయి. పూజల అనంతరం నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర విశేషపూజలను చేశారు. మన వేదసంస్కృతిలో గోవులకు ఎంతో విశేషస్థానం ఉందని, మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు తదితరవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయని వేదపండితులు తెలిపారు. గోవు 33 కోట్ల దేవతలకు ఆవాస స్థానం కావడంతో గోపూజ వలన 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని ఈఓ తెలిపారు. గోపూజను ఆచరించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని, జగన్మాత లలితా పరమేశ్వరి గోవు రూపంలో భూమిపై సంచరిస్తుందని లలితా సహన్రామం తెలియజేస్తుందని వేద పండితులు పేర్కొన్నారు. తాను చేసిన ప్రతి పనిలో వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీకృష్ణపరమ్మాత ఆవుల మందలు అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి గోవులను కాసి గోపాలునిగా పేరుగాంచి గోవు యొక్క అనంత మహిమను లోకానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. -
పైడితల్లికి విశేష పూజలు
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు అయిన విజయనగరం పైడితల్లి అమ్మవారు మంగళవారం విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఇక్కడ ప్రతీ మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు ఆ రోజున ప్రత్యేక అలంకారం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి జామపండ్లతో అలంకారం చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో వేద పండితులు చండీయాగం నిర్వహించారు. ఈవో భానురాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
శ్రీగిరిలోసంక్రాంతి
శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీశైలాయం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆదివారం పంచాహ్నిక దీక్షతో ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.15 గంటలకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ఆజాద్ దంపతులు, ఆలయ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతి, కంకణ, తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాలలో లోక కల్యాణార్థం చేపట్టిన విశేష పూజల సందర్భంగా చండీశ్వరునికి కంకణధారణ చేశారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలని సంకల్పం చెప్పారు. అనంతరం దీక్షావస్త్రాలకు విశేష పూజలను చేసి ఉత్సవాల్లోపాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయ సిబ్బందికి ఈవో అందజేశారు. రాత్రి 7 గంటల నుంచి భేరిపూజ, భేరితాండన, సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా చేపట్టారు. మకర సంక్రమణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8.15 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. అంతకుముందు ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు విశేషపూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవున్ని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.