sperm doner
-
కుమారుని డీఎన్ఏ టెస్టులో ‘జన్మరహస్యం’... తల్లి చేసిన పని ఇదే..
డిఎన్ఏ పరీక్షల తరువాత ఆ యువకునికి ఒక రహస్యం తెలియడంతో అతను హడలిపోయాడు. అతని తల్లి కూడా ఈ విషయాన్ని అతనికి తెలియకుండా దాచిపెట్టింది. డీఎన్ఏ టెస్టు అనంతరం అతనికి 35 మంది అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని తెలిసింది. దీంతో అతను తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకు ఈ విషయం ఎందుకు ఎప్పుడూ చెప్పలేదని నిలదీశాడు. అమెరికాకు చెందిన ఆ యువకుడు తన ఆవేదనను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశాడు..‘ఇది నన్ను పెంచిన తండ్రికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి.ఈ విషయం అతనికి ఇప్పటివరకూ తెలియదు. నాకు నా బయోలాజికల్ తండ్రిపై ఎటువంటి ఆపేక్షా లేదు. నన్ను పెంచిపోషించిన తండ్రిపైననే నాకు ప్రేమ ఉందని అన్నాడు. కాగా డీఎన్ఏ టెస్ట్ చేయించిన తరువాత అతనికి తన బయోలాజికల్ తండ్రితో పాటు 35 మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల ఆచూకీ తెలిసింది. కాగా అతని తల్లి గర్భందాల్చేందుకు డోనర్ స్పెర్మ్ వినియోగించింది. ఈ విషయం నా సవతి సోదరసోదీమణులకు తెలిస్తే వారు ఎంతో సంతోషిస్తారనుకుంటున్నాను అని తెలిపిన ఆ యువకుడు తన ఇతర తోబుట్టువులను, డోనర్‌ను కలుసుకున్నాడు. వారంతా ఆన్లైన్ మాధ్యమంలో కలుసుకుని చాట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసినవాంతా దీనిపై రకకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది ఎంతో ఆసక్తికరం. స్పెర్మ్ డొనేషన్, డీఎన్ఏ టెస్టుల విషయంలో ఎంతో ఆలోచించాల్సి వస్తోందని’ పేర్కొన్నాడు. మరొక యూజర్ ‘నా ఉద్దేశంలో ఏ విషయాన్నయినా రహస్యంగా ఉంచడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. ఈ కారణంగానే డొనేషన్ చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది’ అని అన్నాడు. మరో యూజర్ ‘ఇది ఎంతో విచిత్రంగా ఉంది. ఏకంగా 35 మంది తోబుట్టువులంటే నమ్మేలా లేదన్నాడు. -
వెతికి మరీ ఆమె స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది!
ఓ ఆస్ట్రేలియా మహిళ సుదీర్ఘంగా అన్వేషించి మరీ స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది. తనకు మొదటి బిడ్డ పుట్టడానికి వీర్యదానం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకుంది. బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకొచ్చిన వారి జాబితాలో స్కాట్ అండర్సెన్ అనే 45 ఏళ్ల రైతును ఆమె ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఈ జంటకు లీల అనే కూతురు జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. లీలా జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఎక్కడున్నాడని హర్ట్ ఆరా తీసింది. చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తమకు పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు. నిజానికి గతంలో ఇద్దరు వ్యక్తులతో ఆమె అనుబంధం నెరిపింది. ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ తనకు ఓ బిడ్డ ఉండి ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని హర్ట్ తెలిపింది. ఆమె జీవితకథ త్వరలోనే సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
వెతికి మరీ ఆమె స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది!
ఓ ఆస్ట్రేలియా మహిళ సుదీర్ఘంగా అన్వేషించి మరీ స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది. తనకు మొదటి బిడ్డ పుట్టడానికి వీర్యదానం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకుంది. బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకొచ్చిన వారి జాబితాలో స్కాట్ అండర్సెన్ అనే 45 ఏళ్ల రైతును ఆమె ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఈ జంటకు లీల అనే కూతురు జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. లీలా జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఎక్కడున్నాడని హర్ట్ ఆరా తీసింది. చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తమకు పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు. నిజానికి గతంలో ఇద్దరు వ్యక్తులతో ఆమె అనుబంధం నెరిపింది. ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ తనకు ఓ బిడ్డ ఉండి ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని హర్ట్ తెలిపింది. ఆమె జీవితకథ త్వరలోనే సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.