Sri Jagannath Rath Yatra
-
జగన్నాథుడికి రేవంత్ రెడ్డి పూజలు
-
వైభవంగా పూరీ రథయాత్ర
ఊరేగింపులో పాల్గొన్న 10 లక్షల మంది భక్తులు తొలి దర్శనం చేసుకోని పూరీ శంకరాచార్య ప్రశాంతంగా సాగిన తొలిరోజు యాత్ర భువనేశ్వర్/పూరీ(ఒడిశా): ఒడిశాలోని పూరీ లో ఏటా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక శోభ, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఊరేగింపు తొలిరోజు ప్రశాంతంగా సాగింది. దేశ విదేశాలకు చెందిన సుమారు 10 లక్షల మంది భక్తులు రథాలపై ఊరేగుతున్న బలభద్ర, సుభద్ర, శ్రీజగన్నాథుని దర్శనం చేసుకున్నారు. బలభద్ర తాళధ్వజం, సుభద్ర దవుదళ్, శ్రీజగన్నాథుని నందిఘోష్ రథాలు సాయంత్రం సమయానికే గమ్యం చేరాయి. ఉదయం నిర్వహించిన పూజాదుల్లో సుమారు 2 గంటలపాటు జాప్యం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది భక్తులు రథాలపెకైక్కి దేవతామూర్తులను స్పృశించి దర్శనం చేసుకోవడాన్ని ఆపేయడం, శిష్య బృందం లేకుండా ఒంటరిగానే రథంపైకి ఎక్కి దర్శనం చేసుకోవాలని శ్రీమందిరం అధికారులు పూరీ శంకరాచార్యులకు లేఖ పంపడంతో ఆయన కినుక వహించిన నేపథ్యంలో యాత్ర ఆలస్యంగా మొదలైంది. గోవర్ధనపీఠం శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి రథాలపైకి వెళ్లి దేవుళ్లను దర్శించుకుని రథ ప్రదక్షిణ చేసేందుకు నిరాకరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జుయెల్ ఓరాం శంకరాచార్యకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శ్రీమందిరం గర్భగుడి నుంచి వరుస క్రమంలో సుదర్శనుడు, బలభద్రుడు, శ్రీజగన్నాథుని విగ్రహాల్ని సింహద్వారం గుండా రథాలపైకి తరలించారు. రథాలపై దేవతామూర్తుల్ని అధిష్టించాక శంకరాచార్యులు తొలి దర్శనం చేసుకోవడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆచారం. దేవుళ్ల తరలింపు తర్వాత రథాలను లాగడం ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్.సి. జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు జుయెల్ ఓరాం, ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు యాత్రను ప్రత్యక్షంగా తిలకించారు. ముఖ్యమంత్రి నవీన్, కేంద్ర మంత్రి జుయెల్ ఓరాం జగన్నాథుని నందిఘోష్ రథాన్ని లాగారు. రథాలు గుండిచా మందిరానికి చేరే సమయానికి చీకటి పడడంతో మూల విరాట్లను రథాలపై ఉంచి మిగిలిన సేవలు నిర్వహించారు. సోమవారం ఉదయం పూజలను రథాలపైనే పూర్తి చేసి మూల విరాట్లను గుండిచా మందిరంలోని అడపా మండపంపైకి తరలించనున్నారు. యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు 7 వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. సీసీటీవీలు, నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కాగా, రథయాత్రను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్రలో మోడీ కటౌట్ల ప్రదర్శన అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏటా కన్నుల పండువగా జరిగే జగన్నాథ రథయాత్రలో సీఎం హోదాలో పాల్గొనే నరేంద్ర మోడీ ఈసారి ప్రధాని కావడం వల్ల పాల్గొనలేకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆ లోటును తీర్చుకున్నారు. మోడీ కటౌట్లను రథయాత్రలో ప్రదర్శించారు. ఓ వ్యక్తికి మోడీ మాస్కును ధరింపజేసి మోడీ తరహాలో హావభావాలను ప్రదర్శింపజేశారు. దీంతో ఈ యాత్రను వీక్షించేందుకు వచ్చిన ప్రజలంతా మోడీ...మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మోడీ అత్యధికంగా 12 సార్లు పహింద్ విధి (రథమా ర్గాన్ని బంగారు చీపురుతో శుభ్రపరచడం) నిర్వహించారు. -
మూలవిరాట్టును స్పర్శించడం శాస్త్రసమ్మతం కాదు!
- స్వామి నిశ్చలానంద సరస్వతి జగద్విఖ్యాత శ్రీజగన్నాథుని రథయాత్రలో మూల విరాట్టును స్పర్శించి దర్శించుకునే వివాదాస్పద ఆచారం పట్ల శంకరాచార్య తుది నిర్ణయం ప్రకటించారు. మూల విరాట్టుని స్పర్శించడం శాస్త్ర సమ్మతం కాదని ఒరిస్సాలోని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రకటించారు. భగవంతుని దర్శనం పట్ల భక్తులు అధికారులతో హద్దు మీరి ప్రవర్తించడం తగదని హితవు పలికారు. స్కాందపురాణం, వామదేవ సంహిత, శ్రీమద్భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాల్లో దారు బ్రహ్మ స్పర్శకు పరిమితులు విధించినట్లు నిశ్చలానంద సరస్వతి వివరించారు. విశ్వవ్యాప్త అంతర్యామిని స్పర్శించడానికి, స్పర్శించకపోవడానికి నియమ నిబంధనలు లేవు. అయితే కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలతో ప్రతిష్ఠించిన మూల విరాట్టు దర్శనం, స్పర్శలకు శాస్త్రపరంగా స్పష్టమైన నియమ నిబంధనలు ఖరారవుతాయి. ఈ నియమ నిబంధనల ఉల్లంఘనతో మూలవిరాట్టులో దైవశక్తి లోపిస్తుంది. శాస్త్రీయమైన నియమ నిబంధనల ఉల్లంఘన జరిగితే సకాలంలో తగిన ప్రాయశ్చిత్త పూజాదులు నిర్వహించాలి. అలా చేయనిపక్షంలో హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లుతుందని శంకరాచార్య తెలియజేశారు. నియమనిష్ఠలతో ధర్మాన్ని ఆచరించడం నిజమైన ధార్మిక తత్వంగా పరిగణించబడుతుంది. ధర్మపరమైన నియమనిష్ఠల్ని ఉల్లంఘించడం దోషంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. తనను సందర్శించలేని భక్తులకోసం గర్భాలయం నుంచి మూలవిరాట్టు రథారూఢుడై భక్తుల మధ్యకు తరలి రావడం చాలా అరుదైన విషయం. అయితే మూల విరాట్టు ఉన్నంత కాలం రథాలు భగవంతుని ఆస్థానంగా వెలుగొందుతాయి. అగ్ని, విద్యుత్ వంటి శక్తులు విశ్వమంతటా వ్యాపించి ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ శక్తులను యాంత్రిక, సాంకేతిక ప్రక్రియలతో తాకితే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ మర్మాన్ని గమనించి భక్తజనులు రథాలపైకి వెళ్లి మూలవిరాట్టుని స్పర్శించి, ఆలింగనం చేసుకుని దర్శించుకుంటేనే తరిస్తామనే అపోహ నుంచి బయటపడాలని శంకరాచార్య కోరారు. శాస్త్రీయమైన మంత్ర, తంత్ర, యంత్ర శక్తులతో ప్రతిష్ఠించబడడంతో మూలవిరాట్టు కొన్ని పరిధులకు పరిమితమవుతుంది. నిత్యసేవలు, ఉత్సవాలు, పూజాదులకు సంబంధించి శాస్త్రీయమైన ధర్మాలు, ఆచారాలు, నియమనిబంధనలు ఆచరణలోకి వస్తాయి. వీటిని చిత్తశుద్ధితో ఆచరించడమే నిజమైన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి భావాలకు ప్రతీకగా భక్తులు గుర్తించాలి. రథాలపై దేవుళ్లకు శాస్త్రోక్తంగా సేవలు, పూజాదికాలకు అనుమతి, అర్హత కలిగిన గజపతి మహారాజా, దైతపతులు, సేవాయత్‌లు రథాలపైకి వెళ్లడం అనివార్యం. అయితే ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కావాలని కోరుకోవడం తగదని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి భక్తులకు సూచించారు. వచ్చే సంవత్సరం జరగనున్న రథయాత్ర నుంచి శంకరాచార్య మార్గదర్శకాల్ని అమలుజేసేందుకు దేవస్థానం అధికార మండలి సన్నాహాలు చేస్తోంది. - ఎస్వీ రమణమూర్తి, న్యూస్‌లైన్, భువనేశ్వర్