state politics
-
సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఆకస్మిక పర్యటన సొంత పార్టీతో పాటు అంతటా చర్చనీయాంశమైంది. అమిత్‌షా నేడు మంగళవారం జరిగే బసవ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఇందులో సీఎం బొమ్మై, పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా ఉంటారు. అనంతరం అమిత్ షా ఆర్టీ నగరలోని సీఎం బొమ్మై ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. వరుస సమస్యల నేపథ్యంలో గత నెల రోజుల్లో రెండుసార్లు సీఎం బొమ్మై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు సర్కారు సమస్యలను కూడా ఏకరువు పెట్టినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా బొమ్మై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు సర్కారులోని లుకలుకలను పరిష్కరించడానికి ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరుతో ఆయన ఆకస్మిక పర్యటనకు నాంది పలికినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వరుసగా ఏదో ఒక కుంభకోణం బొమ్మై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. కొన్నినెలల కిందట బిట్‌కాయిన్ స్కాం, తాజా ఎస్ఐ పరీక్షల కుంభకోణం, ఆ మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య వల్ల సీనియర్ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయడం తదితరాలు పార్టీ హైకమాండ్‌ను ఆలోచనలో పడేశాయి. దీంతో మొదట ఇంటిని చక్కదిద్దుకోవాలని నిశ్చయించింది. పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన మార్పులు, కొత్తగా చేరికలు, ప్రచార కార్యక్రమాలపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఫలితంగా పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. పాలనలో మార్పులు తెస్తాం : సీఎం రానున్న రోజుల్లో పరిపాలనలో పెనుమార్పులు తీసుకొస్తామని సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం విధానసౌధలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ సామర్థ్య అభివృద్ధి సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి పథకాలు చేరాలి, అప్పుడే ప్రజాప్రభుత్వ ఆశయాలు నెరవేరుతాయన్నారు. కాగా, కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోకి చేర్చుకొంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పడం అవివేకమని విమర్శించారు. మహారాష్ట్రలో కన్నడభాషను అధికంగా మాట్లాడే ప్రాంతాలను గుర్తించి వాటిని కర్ణాటకలోకి చేర్చుకోవడంపై తాము కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు బొమ్మై చెప్పారు. (చదవండి: కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?) -
రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాం ధీ, మనతా బెనర్జీ, జయలలితలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరు సల్పి తిరుగులేని నేతలుగా ఎదిగిన విషయం, 1,600 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల పట్టుదలను మహి ళా కార్యకర్తలు గుర్తు చేసుకోవాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లోని మహిళా విభాగం బాధ్యతలు నిర్వర్తించేవారు ఇల్లిల్లూ తిరిగి కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. మహానేత వైఎస్సార్ మహిళల సాధికారత కోసం పడ్డ కష్టం ఏ ముఖ్యమంత్రీ పడలేదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం పావలా వడ్డీ రుణాలు తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కల్యాణ లక్ష్మి పథకం బ్రోకర్ల పాలైందన్నారు. రాష్ట్రంలో మహిళలను జాగృతం చేసేందుకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తీవ్రంగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె. అమృత సాగర్ మాట్లాడుతూ మహిళలు కనిపిస్తే ‘ఈ గ్రామ పంచాయతీ’ల్లో 10 వేల మంది మహిళలకు ఉద్యోగాలు అని మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలిచ్చారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ స్నాచర్లు విజృంభిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కు రక్షణ కరువైందని వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకూ స్థానం లేదన్నారు. మహిళలకు మేలు చేసే పథకాలు కేసీఆర్ ఒక్కటి కూడా తీసుకురాలేక పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం శ్యామల, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల మహిళా విభాగాల అధ్యక్షురాళ్లు ఇందిర, బి. పద్మ, పలువురు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆ స్పీకర్ కథ ముగిసింది.. ఇక జైలులోనే..!
యూఎస్ఏ: న్యూయార్క్ రాజకీయాల్లో సుధీర్ఘకాలంపాటు ఒక వెలుగు వెలిగిన షెల్డాన్ సిల్వర్ చరిత్ర దాదాపు ముగిసిపోయింది. ఇక్కడ స్పీకర్ గా కూడా పనిచేసిన ఆయన జైలు పాలయ్యాడు. మోసం, బలవంతపు వసూళ్ల ఆరోపణల కింద మన్ హట్టన్ ఫెడరల్ కోర్టు జడ్జి వాలెరిక్ ఈ కాప్రోని షెల్డాన్కు పన్నేండేళ్ల జైలు శిక్షను విధించారు. దీంతో ఆయన ఇక జైలు జీవితం గడపడం తప్పనిసరైంది. దీంతోపాటు ఆయనకు కోర్టు 1.75 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధించింది. అలాగే, 5.3 మిలియన్ల డాలర్ల ఆస్తిని ప్రభుత్వం జప్తు చేయాలని ఆదేశించింది. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ గా షెల్డాన్ సిల్వర్ దాదాపు రెండు దశాబ్దాలపాటు నిర్వహించాడు. ఆయనను అరెస్టు చేసేంతవరకు కూడా ఆయన స్పీకర్ బాధ్యతల్లోనే ఉన్నాడు. 2015 జనవరిలో షెల్డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన అధికారాన్ని ఉపయోగించి దాదాపు 4 మిలియన్ డాలర్లను లంఛంగా తీసుకున్నాడని, బెదిరింపులకు పాల్పడుతూ లెక్కలేనన్ని వసూళ్లు చేశారని షెల్డాన్ పై ఆరోపణలు నిరూపితమయ్యాయి. -
‘లాటరీ’పై రాజ్‌భవన్ కన్నెర్ర
- దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రాజకీయాలతో పాటు ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సింగిల్ నంబర్ లాటరీ వివాదంపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సీరియస్ అయ్యారు. ఈ విషయమై సంపూర్ణ నివేదికతోపాటు దర్యాప్తు జరుగుతున్న తీరుపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌషిక్ ముఖర్జీకి లేఖ రాశారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా కుంగదీసేందుకు కారణమైన లాటరీ వి వాదంలో ఐజీపీ, ఎస్పీ క్యాడర్ అధికారుల హస్తం ఉండ డం పట్ల తాను తీవ్ర కలత చెందినట్లు వజుభాయ్ రుడాభాయ్‌వాలా తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఐపీఎస్ స్థాయి అధికారులైన అలోక్‌కుమార్‌తో పాటు ఎస్పీ ధరణీష్ సస్పెండ్ కావడానికి దారితీసిన పరిస్థితుల పట్ల సమగ్ర వివరణను నివేదికలో పేర్కొనాలని వజుభాయ్ రుడాభాయ్ వాలా లేఖలో ఆదేశించారు. ఆ లేఖ అందుకున్న కౌషిక్ ముఖర్జీ సోమవారం రాత్రి గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. సీబీఐకి అప్పగించేది లేదు సింగిల్ నంబర్ లాటరీ వివాదానికి సంబంధించిన కేసు సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మీడియాతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగిల్ నంబర్ లాటరీ విషయంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ స్వయం ప్రేరితంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే తమకు అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు. ‘మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అమర్యాదగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అక్రమ లాటరీ దందా మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే యథేచ్ఛగా సాగుతోంది. అంతేకాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాటరీ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోతున్న విషయం తెలుసుకుని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం. ఈ విషయాలన్నీ మరిచి కుమారస్వామి అనవసర ఆరోపణలు చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత అక్రమాలకు పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జార్జ్ పేర్కొన్నారు. తనతోపాటు సిద్ధరామయ్య ఈ అక్రమాల్లో భాగస్వాములని పేర్కొన్న కుమారస్వామి, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. లాటరీ దందా నియంత్రణ కోసం ఏర్పాటైన ‘అబ్కారీ, లాటరీ విజిలెన్స్ వింగ్’ను ఇప్పటికే రద్దు చేశామని కే.జే జార్జ్ గుర్తుచేశారు. అయితే లాటరీ, మట్కా దందాలను అరికట్టడానికి వీలుగా ఎస్పీ నేతృత్వంలో పనిచేసే జిల్లా అపరాధ నియంత్రణా దళం (డీసీబీ)ను ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరులోని సీసీబీ మాదిరీ ఈ విభాగం పనిచేస్తున్నారు. డీసీబీ ఎక్కడైనా దాడులు చేసి మట్కా, లాటరీ దందాలను గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారిని ఇందుకు బాధ్యున్ని చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని కే.జే జార్జ్ వివరించారు. -
‘కథ’ మళ్లీ మొదటికి..!
బీజేపీ, శివసేన మధ్య చర్చలకు తెర * ప్రతిపక్షంలోనే ఉంటామని ఉద్ధవ్ స్పష్టీకరణ * కేంద్ర కేబినెట్లోనూ చేరని శివసేన ఎంపీ * రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటన * ప్రతిపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక * ఇరకాటంలో బీజేపీ సాక్షి, ముంబై: ఇన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలకు నేటితో తెరపడినట్లయ్యింది. ప్రతిపక్షంలోనే ఉంటామని ఆదివారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఇన్నాళ్లూ బీజేపీ, శివసేన మధ్య ‘పొత్తు’ విషయమై నడుస్తున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. తమ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుం టుందని, తమ పక్ష నాయకుడిగా ఏక్నాథ్ షిండే వ్యవహరిస్తారని ఉద్ధవ్ ప్రకటించారు. ఆయన ఆదివారం శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘సేవా భవన్’లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ అందరూ హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీతో పొత్తుపై చర్చించారు. ప్రభుత్వంలో చేరడం కన్నా ప్రతిపక్షంగా ఉంటేనే మంచిదని నిర్ణయించారు. అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. లేక పోయినా.. రాష్ట్రానికి న్యాయం చేస్తామని అన్నారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ పనిచేస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ ఒకవేళ ఎన్సీపీ మద్దతు తీసుకుంటే తాము ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ముందు ఎన్సీపీపై తమ వైఖరేంటో బీజేపీ స్పష్టం చేయాలని సవాలు విసిరారు. ఆ తర్వాతే కేంద్రంలో కొనసాగేది,లేనిదీ ఆలోచిస్తామన్నారు. ‘దేశంలో హిందువులను విడదీసేందుకు కుట్ర జరుగుతోంది.. హిందుత్వ వాదానికి కట్టుబడి ఉన్న ఇరు పార్టీలు విడిపోకూడదనే ఇన్నాళ్లూ మేం ప్రయత్నాలు చేస్తున్నాం.. రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం కావాలని కోరుకున్నాం.. కాని బీజేపీ ఆలోచన వేరేగా ఉంది.. వారు మమ్మల్ని అగౌరవంగా చూస్తున్నారు.. మా ఆలోచనలను చులకనగా భావిస్తున్నారు.. అందుకే మా దారి మేం చూసుకుందామని నిర్ణయించుకున్నామ’ని వివరించారు. గత అక్టోబర్ 15న శాసనసభ ఎన్నికలు జరగ్గా 19న ఫలితాలు వెలువడ్డాయి. అందులో బీజేపీకి 122 సీట్లు రాగా, శివసేనకు 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అప్పుడే ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ స్వయంగా ఎన్సీపీపై అవినీతి ఆరోపణలు చేయడం, ఎన్సీపీ సైతం ప్రధానిపై ప్రతి విమర్శలు గుప్పించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకుంటే ప్రజల్లో బీజేపీ పలుచనైపోయే ప్రమాదముందని ఆ పార్టీ స్థానిక నాయకులు వాదించారు. అలాగే శివసేనతో పొత్తును పునరుద్ధరించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ వంటివారు సైతం సూచించారు. దీంతో శివసేనతో బీజేపీ అప్పటినుంచి ‘పొత్తు’పై చర్చలు జరుపుతోంది. అయితే ఈ రెండు పార్టీలమధ్య పదవుల కేటాయింపులో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో పదవులు ఇచ్చి శివసేనను శాంతపరిచేందుకు బీజేపీ అధిష్టానం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. బీజేపీతో కలవబోమని, ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన స్పష్టం చేయడంతో బీజేపీ మైనారిటీ ప్రభుత్వం ఎవరి మద్దతు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.. ఇదిలా ఉండగా సోమవారం ఫడ్నవిస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. -
2004కు ముందు - 2009 తర్వాత
-
రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఎడిషన్ Part 5
-
రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఎడిషన్ Part 4
-
రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఎడిషన్ Part 3
-
రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఎడిషన్ part 2
-
రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఎడిషన్
-
రాష్ట్ర రాజకీయాల్లో రోజుకోమలుపు
గండుగులపల్లి(దమ్మపేట), న్యూస్‌లైన్: విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్లో అనిశ్చితి ఏర్పడిందని మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గండుగులపల్లిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, విభజన జరిగినా ఇరు ప్రాంతాల్లో తాము బలమైన శక్తిగా ఉంటామని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఒక విధంగా, కాంగ్రెస్‌లో విలీనమైతే మరొక విధంగా రాజకీయాలు మారే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో లోపాలు, అవినీతి ప్రభావం ఇరు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నామమాత్ర మేనని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నుంచి నాయకత్వం ఇతర పార్టీల ైవె పు వెళ్లినా తమకొచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో శత్రువులు సహజమని, ప్రతిపక్ష పార్టీల్లోని శత్రువులను ఎదుర్కోవడం కష్టం కాదని, పార్టీలో ఉంటూ పతనం కోరుకునే వారిని ఎదుర్కొవడమే కష్టమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, జనం మధ్యలో ఉండే వారు కొన్ని సందర్భాల్లో ఓటమిపాలైనా నిరుత్సాహపడకూడదని అన్నారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరని, తప్పుడు నిర్ణయం తీసుకోరని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడానికి యువత ఉత్సాహం చూపుతున్నారని, అందులో భాగంగానే కార్పొరేట్ ఉద్యోగి కందిమళ్ల కుమారనాగప్రసాద్ ఇటీవల తమ పార్టీలో చేరారని తెలిపారు. రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కావని, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చన్నారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దొడ్డాకుల రాజేశ్వరరావు, మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, నాయకులు దొడ్డా ప్రసాద్, అబ్ధుల్ జిన్నా, పానుగంటి రాంబాబు, వలీ పాష, కాసాని నాగప్రసాద్ లు పాల్గొన్నారు. -
ఈ నెల 10 తర్వాత కీలక పరిణామాలు: దామోదర
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చినా చర్చించకపోవడం మూర్ఖత్వం అవుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. కేంద్రంలో రెండు పెద్ద పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాయని తెలిపారు. అలాంటిది సీమాంధ్రుల్లో ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందో అర్థంకావడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తప్పకుండా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. చివరి రోజు వరకు సీఎం తన పదవిలో కొనసాగేందుకు కిరణ్ ప్రయత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో పలు కీలక పరిణామాలుంటాయని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. -
రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు
-
జననేతకు సంఘీభావం
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు జిల్లాలో జనం వెల్లువలా సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు.ఆదోనిలో చంద్రకాంత్‌రెడ్డి, మధుసూధన్ ఖాద్రి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డలో బీవీ రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. చాగలమర్రిలో నిజాముద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారు. శిరివెళ్ల మండలం వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో వెంకటాపురం వద్ద హైవే దిగ్బంధం చేపట్టారు. హాలహర్వి, దేవనకొండ మండలాల్లో అర్జున్, లుమాంబి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బనగానపల్లెలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బేతంచెర్లలో డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయ కర్త ఐజయ్య ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్, సంజీవయ్య నగర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహానంది సమీపంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయకళాశాల ప్రాంగణంలో సోమవారం విద్యార్థినీ, విద్యార్థులు రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. పాణ్యం బస్టాండ్ సమీపంలో మండల వైఎస్ఆర్సీపీ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని గౌరు చరితారెడ్డి సందర్శించి మద్దతు ప్రకటించారు. దీక్ష చేయడం భారతీయ పౌరునిగా జగన్ హక్కు డాక్టర్ బి. శంకరశర్మ, ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో నిరాహార దీక్ష చేయడం భారతీయ పౌరునిగా ఆయకున్న హక్కు. ఈ విషయం గురించి విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదు. ఆయనపై విమర్శలు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. ఆయన స్వప్రయోజనాలకు ఈ దీక్ష చేయడం లేదు. జగన్ దీక్షకు వైద్యులు సంఘీభావం తెలుపుతున్నారు. జైలులో ఉన్నంత మాత్రాన దీక్ష చేయకూడదా..? డాక్టర్ బాలమద్దయ్య, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఆరోపణల వల్లే జైలులో ఉన్నారు. ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. ఆయన తన మనోభావాలను వ్యక్తపరిచేందుకు హక్కు ఉంది. ఆయన ఒక పార్టీకి అధినాయకుడు. ఆ బాధ్యతనూ ఆయన నిర్వర్తించాల్సి ఉంది. కాబట్టి సమైక్యాంద్ర కోసం ఆయన దీక్ష చేస్తున్నారు. దీనిని అందరూ స్వాగతించాలి. -
పార్లమెంట్ సమావేశాల్తో ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు