stidents
-
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితికి వెళ్లడం మనకే గర్వకారణం’
సాక్షి, విజయవాడ. పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన ప్రభుత్వ విద్యార్థులే ఐక్యరాజ్యసమితికి వెళ్లడం జరిగిందని.. ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. దీనిపై కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తద్వారా మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీ పడేలా చేస్తోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశ పుస్తకాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల ఖాళీల భర్తీపై కూడా త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. చిత్తశుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడా, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీమెన్స్ కంపెనీ గుజరాత్లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందని, అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారన్నారు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇచ్చి పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి జీపీఎస్ తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ దీనిపై సహృదయంతో ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. -
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-
మైనార్టీ బాలుర గురుకులంలో కలకలం!
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): హుజూరాబాద్‌లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి నలుగురు వి ద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ అర్బన్ జిల్లా వంగర గ్రామ పరిధిలోని పీవీ నగర్‌కు చెందిన షేక్ అక్తర్, షేక్ రఫీ, షేక్ ఇజ్రాయిల్, షేక్ షకిల్ హుజూరాబాద్‌లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. గురువారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచి పాఠశాల గోడ దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా వారు పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోని సీసీ కెమెరా పుటేజీలను సీఐ మాధవి పరిశీలించగా వేకువజామున 5.20 గంటల సమయంలో వెళ్లినట్లు, వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా విద్యార్థులు కాలినడకన వెళ్లినట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఇప్పల్‌నర్సింగాపూర్ సమీపంలోని తాటి వనం నుంచి విద్యార్థులు కాలి నడకన వెళ్తున్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ప్రిన్సిపాల్ సార్ కొట్టడంతోనే స్కూల్ నుంచి పారిపోయామని విద్యార్థులు సీఐ మాధవికి వివరించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ తెలిపారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
విద్యార్థుల చావులు కనిపించవా..?
–ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు – హాస్టళ్ల మూసివేతకు నిరసనగా రెండోరోజుకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్ష –వైఎస్సార్‌ఎస్‌యూ మద్దతు విజయవాడ (గాంధీనగర్) : రాష్ట్రంలో మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను పునఃప్రారంభించాలని, మెస్‌చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అలంకార్ సెంటర్లో చేస్తున్న నిరవధిక దీక్ష ఆదివారం రెండోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందన్నారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలోని సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థి మరణిస్తే మంత్రి రావెల కిషోర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. హాస్టల్ విద్యార్థుల చావులు ప్రభుత్వానికి కనిపించవా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే.. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడి ఉండేవారన్నారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు, రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ మాట్లాడుతూ మెస్‌చార్జీలు రూ. 750 నుంచి రూ.1500, కళాశాల విద్యార్థులకు రూ. 2వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు ప్రకటించింది. వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లు మూసివేసి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దన్నారు. మూసివేసిన హాస్టళ్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుమ్మా రామ్, కె.నాగేంద్రరెడ్డి, ఉదయ్‌కిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, టి.ప్రవీణ్, మహేష్, కోటబాబు, సుమంత్, రాణి పాల్గొన్నారు.