stock split
-
పెరుగుతున్న సంస్థల విలువ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధికేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు. -
షేర్ల విభజనకు ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) షేర్ల విభజనను చేపట్టనుంది. ప్రస్తుతం రూ. 10 ముఖ విలువతో ట్రేడవుతున్న షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజించేందుకు బ్యాంకు బోర్డు నిర్ణయించింది. తద్వారా బ్యాంకు షేర్లలో లావాదేవీలు(లిక్విడిటీ) పెరిగేందుకు వీలు చిక్కుతుందని ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది. షేర్ల విభజన నిర్ణయాన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని తెలిపింది. రిటైలర్లతోసహా మరింత మంది ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్లలో లావాదేవీలను చేపట్టేం దుకు విభజన నిర్ణయం దోహదం చేస్తుందని బ్యాంక్ చైర్పర్శన్ అరుంధతీ భట్టాచార్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగి పీఈ నిష్పత్తి పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 2.7% నష్టంతో రూ. 2,487 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటికే పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్లు సైతం షేర్ల విభజన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విభజన
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ షేరును 1:5 నిష్పత్తిలో విభజించేందుకు డెరైక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువగా 5 షేర్లుగా విడగొట్టనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఇదే తొలి షేరు విభజన కావడం గమనార్హం. షేర్ల లావాదేవీల్లో లిక్విడిటీ(సరఫరా) పెంచడమే ఈ చర్యల లక్ష్యమని బ్యాంక్ వివరించింది. కాగా, ఒక్కో అమెరికన్ డిపాజిటరీ షేరు(ఏడీఎస్) ఇప్పుడున్నట్లుగానే రెండు ఐసీఐసీఐ షేర్లకు సమానంగా కొనసాగనుందని... అయితే, తాజా విభజనతో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్) హోల్డర్ వద్ద నున్న ఒక్కో ఏడీఎస్కు ఈక్విటీ షేర్ల సంఖ్య 10కి పెరగనుందని ఐసీఐసీఐ వెల్లడించింది. వాటాదారులు, ఇతర నియంత్రణపరమైన అనుమతులకు లోబడి షేర్ల విభజన అమల్లోకి వస్తుందని.. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా, మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 1.31 శాతం (రూ.20.50) నష్టంతో రూ.1,547.70 వద్ద స్థిరపడింది.