Subbamma
-
పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..
కర్లపాలెం(బాపట్ల): బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న తన బంగారాన్ని తనకు ఇవ్వాలని అడిగిన సొంత పెద్దమ్మను.. ఓ యువకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన గుంటూరు జిల్లా కొత్తపాలెంలో శనివారం చోటు చేసుకుంది. చందోలు ఎస్ఐ మణికృష్ణ తెలిపిన మేరకు.. కొత్తపాలెంకు చెందిన డేగల శ్రీనివాసరెడ్డి భార్య సుబ్బమ్మ (50)కు చెందిన 16 సవర్ల బంగారాన్ని చెరుకుపల్లి మండలం మార్వాకపాలెంలో ఉంటున్న ఆమె చెల్లెలు పగడం శ్యామల, చెల్లెలి కుమారుడు రాజశేఖరరెడ్డి మూడేళ్ల క్రితం బాపట్ల, చెరుకుపల్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఆ నగదును సుబ్బమ్మ, శ్యామల సొంత ఖర్చులకు వినియోగించుకున్నారు. కొంతకాలం తరువాత బ్యాంకుల్లో ఉన్న తన బంగారం విడిపించమని, తాను తీసుకున్న నగదును సుబ్బమ్మ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చింది. అయితే బంగారం తెచ్చి ఇవ్వకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి మట్టితోలే పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకుని కొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. సుబ్బమ్మ ట్రాక్టర్ తీసుకుని తన ఇంటి వద్ద పెట్టి.. బంగారం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ‘నిన్ను ట్రాక్టర్‌తో తొక్కి చంపేస్తాను.’ అంటూ రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ముందుకు పోనివ్వడంతో.. బంపర్‌పై కూర్చున్న సుబ్బమ్మ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయింది. స్థానికులు ఆమెను రాంబొట్లవారిపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు సుబ్బమ్మ -
ఈవారం కథ
తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు.‘‘ఎంత పోడు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు తప్ప పట్టించుకోడు. ఈ మనిషితో ఏగలేక సస్తున్నా..’’ తాటాకులు మడెం (ముడుచుకుపోయిన తాటాకులు వెడల్పు అయ్యేందుకు అమర్చే పద్ధతి) తొక్కుతున్న యానాది ఈరన్నతో అంటుంది సుబ్బమ్మ. అవేవీ పట్టించుకోకుండా అలవాటైపోయినట్లు నులకమంచంపైన కూర్చొని చుట్ట తాగుతున్నాడు నరసయ్య. ‘‘మొన్న కురిసిన దబాటు వాన (ఒక్కసారి పెద్దగా కురిసి ఆగిపోయేది)కు ఉన్న రెండు బస్తాల వడ్లు తడిసిపొయ్యాయి. రేపు అయ్యి మరాడిస్తే నూకలవుతాయి. ఏం తింటాడో..! దండెం మీదున్న బట్టలన్నీ తడవకుండా మూటగట్టి మంచం మీద పెట్టా. ఇల్లు మడుగు కాకుండా చినుకులు పడేచోట గిన్నెలు పెడ్తే ఖాళీలేక ఈయన పంచలో ఓ మూల ముడుక్కుని కూర్చొన్నాడు’’ సుబ్బమ్మ బరిగొడ్ల కట్టుమట్ట (గేదెలు కట్టేసిన గుంజ చుట్టూ ఉండే స్థలం) చిమ్ముతూ మాట్లాతూనే ఉంది. నరసయ్య తాగుతున్న చుట్ట చివరి కొచ్చేసరికి విసిరేసి‘‘బస్టాండులో ఉన్న షాపు దగ్గరకొచ్చెయ్యండి. డబ్బులిస్తా’’ అని ఈరన్నతో చెప్పి పైకి లేశాడు. చీపురు కట్ట వెనుక చేత్తో తట్టి, ముందుకు వెనక్కు అయిన పుల్లలను సరిచేసి, వెళ్తున్న మొగుడి వైపు ఓ చూపు చూసింది సుబ్బమ్మ. ఆ చూపు గురించి నరసయ్యకు బాగా తెలుసు, కాబట్టే వెనక్కు తిరిగి చూడకుండానే వెళ్లిపోయాడు. ఎంకటేశం, నాగన్న తాటాకు మోపులు విప్పి ఆకులు అందిస్తుంటే గుడికట్టినట్లు చాలా అందంగా ఒక్కో ఆకును విడమర్చినట్లు పేర్చుతున్నాడు ఈరన్న. పదకొండు మోపుల తాటాకును రెండు మడేలు తొక్కాడు. సుబ్బమ్మ తలా గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది. ‘‘బయట తాటాకు మోపు పన్నెండొందలు అమ్ముతుంది. ఒకప్పట్లా రెడ్లు బరవాస(ఊరకనే)గా ఇచ్చే రోజులు పొయ్యాయి. పాపం నరసన్న అయినా ఏం చేస్తాడు చెప్పు’’ అన్నాడు మజ్జిగ తాగుతూ ఈరన్న.‘‘ఏదో ఒకటి చెయ్యాలి కదా... ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వానపడ్డప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నా ఇంట్లోకి బయటకు తేడా లేకుండా పోయింది. పిల్లోడి పుస్తకాల సంచి కూడా తడిసిపోయింది. వాడు లబోదిబో అన్నాడు. కాస్త ఎండుగడ్డన్నా కరువు(ఇంటి పైకప్పులో గుంతలు పడిన స్థలం)ల దగ్గర ఏయించమన్నా.’’ సుబ్బులు తన బాధల గురించి చెప్తూనే ఉంది.‘‘ఇప్పుడే కదా మడెం తొక్కాం. రెండు వారాలైతే ఆకులు సదరం (హెచ్చుతగ్గులు పోవడం) అవుతాయి. సంక్రాంతి పండగనెల పెట్టబోతున్నారు. మాకు పెద్దగా పనులేం ఉండవు. ఎట్లా కప్పేందుకు యరమాల నారాయణ ఉన్నాడుకదా... రెండు దూలాల ఇల్లు. రెండు రోజులు పట్టిద్ది. చూద్దాం ఒకరోజులో...’’ అన్నాడు ఈరన్న.తాగిన గ్లాసులిచ్చి, బస్టాండుకు బయల్దేరారు.షాపులో గడ్డం చేస్తున్న నరసయ్య దగ్గరకు ఆచారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘నరసన్నా... ఆ వజ్జిరెడ్డిపాలెం రామయ్య, వెంకటనర్సు ఈ ఏడాది సంక్రాంతి పండగ బిందెతీర్థం మేళాం ఒప్పుకుంటున్నారు’’ అని ఆయాసం ఆపుకుంటూ చెప్పాడు. ‘‘అదెలా కుదురుద్ది! మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్లొచ్చి దూరితే ఎలా ఒప్పుకుంటా?’’ అంటూ చేస్తున్న గడ్డం సరిగా చేశాడో లేదో కూడా పట్టించుకోకుండా ఆచారితోపాటు జాలమ్మచెట్టు (రచ్చబండ) దగ్గరకు వెళ్లాడు నరసయ్య. అక్కడ ఊరి పెద్దలందరూ కూర్చొని ఉన్నారు. రామయ్య, వెంకటనర్సు నరసయ్యను చూసి ముఖాలు తిప్పుకున్నారు.‘‘ఒరే...! ఇదేం పాడుబుద్ధిరా మీకు..? పక్కోడి నోటికాడ కూడు తియ్యాలని చూస్తున్నారు. మీ ఊళ్లోకి మీరు పిలవంది మేం ఏ మేళానికైనా వస్తున్నామా?’’ నిలదీశాడు నరసయ్య. ‘‘అదికాదు నరసయ్య... బిందెతీర్థం అంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి పండగెళ్లిందాకా... రోజూ పని. పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి. ఒకటా రెండా మూడు గుళ్లు తిరగాలి. నీకు వయసు పెరుగుతుంది కదా..’’ అన్నాడు ఊరి పెద్ద వీరయ్య.అంటే ఈ నాటకం వెనుక వీరయ్య హస్తం ఉందన్నమాట అనుకున్నాడు మనసులో నరసయ్య.‘‘ప్రతి ఏడాదిలాగే, పక్కూరి నుంచి ఒక సన్నాయిని పిలుచుకుంటా’’ చెప్పాడు నరసయ్య.‘‘అదికాదు’’ అంటూ ఆదిరెడ్డి ఏదో చెప్పబోయాడు. నరసయ్యకు కోపం నషాలానికి ఎక్కింది.‘‘సరే... మీ ఇష్టం. ఈ బిందెతీర్థం వాళ్లకే ఇవ్వండి. ఇక ఊళ్లో ఏ చావొచ్చినా, పెళ్లొచ్చినాఏ కార్యం జరిగినా అన్నింటికి వాళ్లనే పిలిపించుకోండి’’ అని భుజాన ఉన్న కండువా విదిలించి, వెళ్లడానికి రెండడుగులు వేశాడు. ఆ మాట వెనకున్న అర్థం వీరయ్యకుబోధపడింది. ‘‘నరసయ్యా... నరసయ్యా’’ అని వెనక్కు పిలిచాడు.‘‘సరే... నీ ఇష్టం. అలాగే కానివ్వు’’ అంటూ పైకి లేచాడు. అతనితోపాటు మిగిలిన వాళ్లందరూ కదిలారు. నరసయ్య వైపు రామయ్య, వెంకటనర్సు కొరకొరగా చూశారు. అవేవీ పట్టించుకోకుండా ఆచారితో కలిసి షాపునకు బయల్దేరాడు నరసయ్య. ∙∙∙పండగ నెల పెట్టారు. రోజూ ఆచారి మూడున్నర గంటలకల్లా నరసయ్య ఇంటికొచ్చి నిద్రలేపే వాడు. నరసయ్య డోలు తీసుకొని బయటకొచ్చేవాడు. ఇద్దరూ బస్టాండు దగ్గరున్న కన్నేశ్వరస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అప్పటికే సన్నాయి వాయించడం కోసం మన్నూరు నుంచి వచ్చిన నాగలింగం గుడి దగ్గర ఉండేవాడు. ఆచారి కన్నేశ్వరస్వామి గుడిలోని బావి నీళ్లతో స్నానం చేసి, తడిబట్టలతో బావి చుట్టూ తిరిగి రాగిబిందె నిండా నీళ్లు నెత్తిన పెట్టుకుని రామలింగేశ్వర స్వామి గుడికి బయల్దేరేవాడు. పూజారితో పాటు నరసయ్య డోలు, నాగలింగం సన్నాయి వాయించుకుంటూ వీధిలో వెళ్లేవాళ్లు. రామలింగేశ్వరస్వామి గుడిలో ఉన్న శివలింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించి, ఆ గుడిలో ఉన్న బావిలోంచి నీళ్లు తీసుకొని మల్లికార్జునస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అక్కడ ఉన్న లింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించేవాడు ఆచారి. మళ్లీ అక్కడున్న బావిలోంచి నీళ్లు తీసుకుని తిరిగి కన్నేశ్వరస్వామి గుడికి వచ్చేవాళ్లు. పూజారి మల్లికార్జునస్వామి గుడి నుంచి తెచ్చిన నీళ్లతో కన్నేశ్వరస్వామిని పూజించేవాడు. పండగనెల పెట్టింది మొదలు పూర్తయ్యేవరకు ఇలా చేయడం ఆ ఊరి ఆచారం. బిందెతీర్థం మేళాం విని ఊళ్లో ఆడవాళ్లు నిద్రలేచే వాళ్లు. ఇంటి ముందు చిమ్మి పేడకల్లాపు చల్లేవాళ్లు. అందంగా రకరకాల ముగ్గులు వేసేవాళ్లు. నెలంతా బిందెతీర్థం వల్ల ఆచారికి నూటయాభై రూపాయలు. నరసయ్యకు రెండు వందలు. దాంట్లో వంద మన్నూరు నుంచి వచ్చిన నాగలింగానికి పోతుంది. తనకు వంద మిగులుతుంది. దానికన్నా ఊరి ఆచారం, దేవుడి మేళం అన్న తృప్తి కలుగుతుంది అంటాడు నరసయ్య. అన్నింటికి మించి మా ఊరు అనే ఆలోచనే నరసయ్యకు గొప్ప‘‘ఆకులు మడెం తొక్కించి నెలరోజులు దాటింది. వాళ్లేమో పది రోజుల్లో వస్తామని చెప్పారు. ఇంతవరకు అతీగతి లేదు. భోగి కూడా వస్తుంది. భోగికి ముసురు పట్టిందంటే వారం రోజులు తగ్గదు వాన’’ పొద్దున్నే మజ్జిగ చిలుకుతూ, పొది (కత్తులు, కత్తెర్లు, ఆకురాయి వంటి మంగలి సామాను ఉండే సంచి) తీసుకుని ఊళ్లోకి వెళ్తున్న నరసయ్యతో అంది సుబ్బులు. ‘‘అలాగేలే.. కనుక్కుంటా...’’ అంటూ వెళ్లబోతున్న నరసయ్యతో... ‘‘ఈ సారి వాన వచ్చిందంటే నువ్వు నేను మూటముల్లె సర్దుకొని ఆ దేవుడి పంచల్లోకి వెళ్లాల్సిందే’’ గట్టిగా చెప్పింది. పెళ్లాం చెప్పేదానిలో కూడా నిజం ఉంది. ఏడు కట్టలు తడపలు తెప్పించి వారం రోజులు అవుతుంది. బజారులో ఈరన్న కనిపిస్తే రమ్మని చెప్పాలి. ఎట్లా యరమాల నారాయణ ఇంటి దగ్గరే ఉంటాడు. ఎప్పుడు పిలిచినా వస్తాడు. అనుకుంటూ ఊళ్లోకి బయల్దేరాడు నరసయ్య. బుస్సు హోటల్ దగ్గర ఈరన్నటిఫిన్ తింటూ కనిపించాడు. ‘‘ఏం ఈరన్నా! ఇల్లేమన్నా కప్పేదుందా? లేదా?’’ అడిగాడు.‘‘ఈ రోజు జాలిరెడ్డి పసుపుతోటలో పనుంది. ఎల్లుండి కదా భోగి. రేపు వస్తాం. తడపలు నానేసి పెట్టు’’ అని చెప్పాడు ఈరన్న. ‘‘హమ్మయ్య..!’’ రేపటికి ముడిపడింది అనుకుంటూ సంతోషంగా టీ తాగేసి, గడ్డం చేయడానికి లింగారెడ్డి ఇంటికి బయల్దేరాడు నరసయ్య.అనుకున్నట్లుగానే ఈరన్న, ఎంకటేశం నాగన్నతోపాటు మరో ముగ్గుర్ని తీసుకొని పొద్దున్నే వచ్చాడు. నరసయ్య బిందెతీర్థం పని ముగించుకుని ఇంటిదగ్గరే ఉన్నాడు. అప్పటికే సుబ్బులు ఇంట్లో సామానంతా భద్రంగా మూటలు గట్టి మంచాలు బయటేసి వాటిపై పెట్టింది. ఈరన్న, ఎంకటేశం ఇల్లు ఎక్కి కట్లు కోసి, పాత తాటాకులు పూర్తిగా తీసేశారు. తర్వాత యరమాల నారాయణ పైకెక్కి ఎక్కడెక్కడ కట్లు వదులయ్యాయో చూసి, కొత్త తడపలతో గట్టిగా కట్టాడు. మూలవాసం (కింద చూరు నుంచి దూలం మీదుగా పై వరకు నాలుగు మూలలా ఉండే వెదురు కట్టెలు) ఒకటి పుచ్చినట్లు అనిపిస్తే కొత్తది వేసి బిర్రుగా కట్టాడు. అందరూ కలిసి పదిగంటలకల్లా ఇంటిని కప్పుకు సిద్ధం చేశారు. నాగన్న మిగిలిన ఇద్దరూ కొన్ని తడపలను ఒకదానితో ఒకటి ముడేసి పొడుగ్గా చేశారు. పట్నార తడపల్ని (తాటి బద్దల పైతోలుతో వలిచేవి, గట్టిగా ఉంటాయి) ప్రత్యేకంగా పక్కన పెట్టారు. యరమాల నారాయణ గోసి పెట్టుకొని సూరుకట్టు బద్ద (ఒక చివర బాణంలా ఉండి రంధ్రంతో, మూరపొడుగు ఉన్న వెదురు బద్ద) తీసుకుని ఇల్లెక్కాడు. ఈరన్న తడపలు (ఆకు కోసిన తర్వాత మిగిలిన తాటి మట్టలను దొరువుల్లో నానేస్తారు. వాటిని పల్చగా చీలుస్తారు) తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. నారాయణ హెచ్చుతగ్గులు చూసుకుంటూ ఆకుల్ని ఇంటిపైన ఒకదాని తర్వాత ఒకటి కప్పుగా అమర్చుతున్నాడు. ఆకులు గాలికి ఎగరకుండా సూరుకట్టు బద్దతో ఆకుల మధ్య నుంచి లోపలకు పొడిస్తే దాని రంధ్రంలో తడప గుచ్చుతున్నాడు లోపలున్న ఈరన్న. దాన్ని పైకి లాక్కుని కప్పుకున్న కర్రలకు అనువుగా మళ్లీ సూరికట్టు బద్దతో లోపలకు గుచ్చి ఇస్తే రెండు తడప కొసల్ని వెదురు కట్టెకు, ఆకులకు కలిపి గట్టిగా ఏనుగు ముళ్లేస్తున్నాడు ఈరన్న. తాటాకుతో ఇల్లు కప్పడం అద్భుతమైన కళ. నేర్చుకుంటే వచ్చేది కాదు. బతుకులో భాగం కావాలి. అక్షరం ముక్కరాని నారాయణ, బడి ఎలా ఉంటదో తెలియని ఈరన్నకు ఎలా అబ్బిందో (వచ్చిందో)... పదో తరగతి చదువుకుంటున్న నరసయ్య కొడుక్కు అర్థంగాక వింతగా చూస్తా ఉన్నాడు. సమయం రెండు అయింది. అందరూ పనులాపి, మళ్లీ సుబ్బులు పెట్టిన అన్నం తిన్నారు. అప్పటికి కప్పటం రెండు అరలే పూర్తయ్యాయి. ఇంకా అయిదు అరల పని ఉంది. వెంటనే పని మొదలు పెట్టారు. సాయంత్రం ఆరు అయినా కప్పు పూర్తికాలేదు. ఆకులు మిగిలి ఉన్నాయి. తడపలూ ఉన్నాయి. పొద్దే లేదు. అసలే యరమాల నారాయణకు చూపుతగ్గి ఏడాదైంది. అందులో కప్పాల్సింది నడికొప్పు. ఆకు సరిగా పడలేదంటే, సూరులోకి జారే నీళ్లన్నీ, నట్టింట్లో పడతాయి. ‘‘నరసన్నా! కష్టం...! ఇక రేపు భోగో గీగో...! పొద్దున్నే వచ్చి, ఈ పని చేసి అప్పుడే ఇళ్లకెళ్లి భోగి నీళ్లు పోసుకుంటాం’’ అన్నాడు ఈరన్న. నారాయణ చెప్పకపోయినా అతనిది అదే మాట. సుబ్బులు కూడా ఏమీ అనలేక పోయింది. నరసయ్య కూడా ‘‘సరే..!. రేపు పొద్దున్నే రండి...’’ అన్నాడు. రేపటి కోసం మిగిలిన తాటాకులన్నీ ఏరి మోపు కట్టాడు నాగన్న. తడపలూ పక్కనే పెట్టాడు. కాళ్లూ చేతులు కడుక్కుని అందరూ వెళ్లిపోయారు.తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు. ఆ రాత్రంగా ఏవీ పోకుండా ఇళ్లల్లో వాళ్లు కాపలా కాస్తుంటారు. కొందరు గుంపుగా కలిసి వీధుల్లో తిరుగుతూ ఉంటే, ఆకతాయి కుర్రాళ్లు దొంగతనం చేయడానికి ఏం దొరుకుతాయా అని మాటువేస్తుంటారు. పైగా ఆరోజు భోగిమంటల్లో వేయడానికి ఏం దొంగిలించినా తప్పు కాదు. సంప్రదాయం. నరసయ్య ఇంటికప్పు సగంలో ఉందని ఊళ్లో అందరికీ తెలుసు. కానీ అతడి మంచితనం గురించి తెలిసిన వాళ్లెవరూ ఆవైపు చూడరు. ఆ ధైర్యం నరసయ్యలో కొండంత ఉంది. కానీ ఎందుకైనా మంచిదని మంచం మోపు దగ్గరే వేసుకుని, చుట్ట తాగుతూ రాత్రంతా మేలుకున్నాడు. దొంగల గుంపు అటుగా వస్తే సరదాగా ‘‘ఏం దొరక లేదా?’’ అని పలకరించాడు. వాళ్లూ నవ్వుతూ ‘‘నరసన్న పడుకో... మీ ఇంటికి ఎందుకొస్తాం’’ అని వెళ్లిపోయారు. భోగి కదా అని ఆచారి మూడు గంటలకే వచ్చి పిలిచాడు. నరసయ్య డోలు తీసుకొని వెళ్తూ ‘‘ఇదిగో జాగ్రత్తా... ఆ తాటాకు మోపు అక్కడే ఉంది’’. అని పెళ్లానికి చెప్పాడు. పందిట్లో పడుకుని ఉన్న సుబ్బులుకు మాగన్నుగా (కొద్దిగా) నిద్ర పట్టింది. పిల్లలు మరో మంచం మీద నిమ్మచెట్ల కింద హాయిగా నిద్ర పోతున్నారు.‘‘ఏం నరసన్నా ఇల్లు పూర్తి కాలేదా...’’ అడిగాడు ఆచారి. ‘‘లేదు ఇంకొద్దిగా ఉంది. ఈ రోజు పొద్దున్నే అయిపోతుంది’’ అన్నాడు నరసయ్య.‘‘మరి తాటాకు మోపు... అక్కడే ఉంది. భోగి కదా...’’ అన్నాడు ఆచారి.‘‘మూడు దాటింది..! ఇంకెవరు వస్తారు?’’ అని ధీమాగా అన్నాడు నరసయ్య.ఆచారి కన్నేశ్వరిస్వామి గుడిలో నీళ్లు తీసుకుని రామలింగేశ్వరస్వామి గుడికి వస్తున్నాడు. ఆచారితో పాటు నరసయ్య, నాగలింగం భోగి పండుగనే సంతోషంతో ఉత్సాహంగా మేళం వాయిస్తూ ఉన్నారు. డోలుకుడివైపున్న మూతమీద పుల్ల దుబ్ దుబ్ అని శబ్దంచేస్తుంటే, అందుకు తగ్గట్టు ఎడం వైపున్న మూతపై అతడి బొట్టెలున్న (ప్రత్యేకంగా డోలు వాయించేటప్పుడు పెట్టుకునే తొడుగులు) వేళ్లు అద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. నాగలింగం సన్నాయిని తిప్పుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా ఊదుతున్నాడు. మంగళవాయిద్యాల చప్పుడికి లేచిన ఆడవాళ్లు, సంతోషంగా చిరునవ్వుతో వాళ్లను పలకరిస్తున్నారు. కల్లాపు చల్తున్న వాళ్లు, ముగ్గులేస్తున్న వాళ్లు, మేళం శబ్దానికి తలలు ఎత్తి చూసి ఆనందిస్తున్నారు. మల్లికార్జునస్వామి గుడి నుంచి బిందెతీర్థం కన్నేశ్వరస్వామి గుడికి తీసుకుని వెళ్తున్నారు ముగ్గురూ. ఆచారి నెత్తిన బిందెలో ఉన్న మంచినీళ్ల తీర్థం, నాగలింగం సన్నాయి, నరసయ్య డోలు.. వేకువజామున మేలుకొలుపు పాడుతోంది ఊరికి. వీధి మధ్యలో పెద్ద భోగిమంట. అప్పుడే ఎవరో వేసినట్లున్నారు. మంటల కొసల్లోంచి తాటాకు రవ్వలు గాల్లోకి లేస్తున్నాయి. నరసయ్యకు మనసులో ఏదో చెడు తోచింది. తీరా దగ్గరకు వెళ్లారు. మిగిలిన ఇల్లు కప్పడానికి ఉంచిన తాటాకులు అవి. మంటల్లో తగలబడి పోతున్నాయి. అప్పటి వరకు కళాత్మకంగా శివుడి ఢమరుక శబ్దాలను మోగించిన నరసయ్య డోలు హఠాత్తుగా మూగపోయింది. ‘‘నరసన్నా ఇవి నీ ఇంట్లో ఆకులే...’’ అరుస్తున్నట్లు అన్నాడు ఆచారి. ముందు వెనుక ఆలోచించకుండా నెత్తిమీదున్న బిందెతీర్థం మంటపై పోశాడు. శివలింగాన్ని సైతం శుద్ధి చేసే బిందెతీర్థం ఆ మంటను మాత్రం ఆర్పలేకపోయాయి.ఊరికోసం. దేవుడి కోసం బిందెతీర్థం మేళంకోసం గొడవపెట్టుకున్న నరసయ్య చూపు, గుండె ఆ మంటల్లాగే ఎగిసిపడుతున్నాయి. నాగలింగం సన్నాయి ఆపేసి బండరాయిలా నిలబడి చూస్తున్నాడు. మేళం ఆగిపోవడంతో అందరూ గుమిగూడారు. ఇళ్లల్లోంచి నీళ్లు తెచ్చి మంటలనైతే ఆపారు. కానీ, అప్పటికే ఆకులన్నీ బూడిదై పోయాయి.\నరసయ్యకు తెలుసు... ఎవరు ఆ పనిచేశారో...! ఎవరు చేయించారో...!?నిద్రలేచిన సుబ్బులు తాటాకుమోపు కనిపించలేదని అందర్నీ కోపంతో తిట్టిపోస్తుంది.రేపు ఊరి పెద్దమనుషులు ఆచారికి ఏ శిక్ష విధిస్తారో తెలియదు. ఎవరో పిలిచినట్లు ఆకాశంలో మబ్బులన్నీ కురవడానికి నల్లగా ఒకచోట చేరాయి.పూర్తిగా కప్పులేని ఇల్లు మాత్రం గోపురం లేని ఆలయంలా నిలబడి చూస్తోంది. ∙ -
కదిలిస్తే కన్నీరు..!!
కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500 జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, కడప 50 సార్లు తిరిగా.. నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో... నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఫించన్ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి... నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను. సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ.. నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. పెన్షన్ మంజూరు చేయాలి.. నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది. నా స్థలం అమ్ముకున్నారు.. నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు.. నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు. ఎన్నిసార్లు తిరగాలి.. నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను. భూమి కొనుగోలు చేసి అందించాలి... నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు. సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి... నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను. సిమెంట్ ఇవ్వకపోవడం ఏమిటి... నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్ ఇన్చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్ ఇవ్వడం లేదు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు.. నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు పండుతాయి. దీంతోపాటు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా. భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి.. నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. 500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే! నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు.. మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
-
సుబ్బమ్మ మరణానికి చంద్రబాబే బాధ్యులు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రుణమాఫీ, మద్య నిషేధంతో పాటు పలు హామీల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ఈ లేఖలో నిలదీశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ మరణించిన ముదునూరి సుబ్మమ్మకు వైఎస్జగన్ నివాళి అర్పించారు. ఆమె మరణానికి చంద్రబాబే బాధ్యులని ఆరోపించారు. వైఎస్ జగన్ లేఖ సారాంశం...‘గ్రామం మధ్యలో తమ ఇళ్ల మధ్యన, మీ ప్రభుత్వ ఆశీర్వాదాలతో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తుంటే పత్తేపురం గ్రామస్తులు కొన్నాళ్లుగా నిరసన తెలుపుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు పత్తేపురం ఆందోళన ఒక సూచిక మాత్రమే. రెండు రోజుల క్రితం చెరువులో దిగి సుమారు 20మంది మహిళలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. వారిలో ముదునూరి సుబ్బమ్మ కూడా ఉన్నారు. మీ ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురై ఆమె మరణించారన్న విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు. కాబట్టి సుబ్బమ్మది సహజ మరణమా? లేక మీ దుర్మార్గం వల్ల సంభవించిన మరణమా? బెల్టు షాపుల రద్దుకు సీఎం కాగానే సంతకం పెడతా అని మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటి సంతకాలకు అర్థమేమిటి ముఖ్యమంత్రి గారు?. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెడితే దాని అర్థం ఆ రోజు నుంచి రైతులందరికీ ఉచిత విద్యుత్ లభిస్తుందనే. కరెంటు బకాయిలు రద్దు అంటే మొత్తంగా కరెంట్ బకాయిలు అన్నీ ఆ క్షణం నుంచి రద్దు అయ్యాయనే. కానీ మీరు పెట్టిన సంతకానికి అర్థాలు వేరు. పూర్తిగా, బేషరతుగా వ్యవసాయ రుణమాఫీ అని ప్రకటించి.. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు ఇప్పటికి కేవలం రూ.12వేలు కోట్లు కూడా ఇవ్వలేదు. రైతుల వడ్డీలు, చక్రవడ్డీలు లెక్క వేస్తే అవే మీ రుణ మాఫీ కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. బెల్టు షాపులన్నీ రెండో సంతకంతో రద్దు అన్నారు. బెల్టు షాపులు రద్దు కాలేదు సరికదా.. గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూల్ల పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులిచ్చిన ప్రభుత్వం మీదే. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో మీరు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిన్నటివరకూ మీరు రూ.11వేల కోట్లకు పైగా మద్యం మీదే సంపాదించారు. మొబైల్ బెల్టు షాపుల ద్వారా ఇంటింటికీ, గొంతు గొంతుకీ దగ్గరగా.. ఫోన్ కొడితే మద్యం బాటిల్ వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. డబ్బు కోసం మీరు ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? ఇప్పటికి రాష్ట్రంలో 24 మద్యం డిపోలు ఉంటే మరో 9 డిపోలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీని అర్థం ఏమిటి? మీ మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగనీతులు సంగతేమిటి? మద్యం వల్ల కుటుంబాలు ఎలా సర్వనాశనం అవుతున్నాయో మీ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రవచనాలు సంగతేమిటి? మద్యం మీద మీరు సంపాదిస్తున్నది ఈ ఏడాది రూ.17 వేల కోట్లు, గతేడాది రూ.13,600 కోట్లు అంటే సగటున ఏటా రూ.15వేల కోట్లకు పైగా ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ఇంత డబ్బు గడిస్తూ నాలుగేళ్లలో కేవలం రూ.11వేల కోట్లే వ్యవసాయ రుణమాఫీకి ఇచ్చారంటే- మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా?.’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. నేరం చేసినవాడికంటే చేయించిన వాడికి ఎక్కువ శిక్ష ఉండాలన్న సూత్రం ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే అని...ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్ జగన్ బహిరంగ లేఖ పూర్తి సారాంశం... -
అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..
రొంపిచర్ల : గుంటూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం అన్నవదినను ఓ తమ్ముడు నరికి చంపిన దుర్ఘటనను మరిచిపోకముందే, మరో దుర్ఘటన అదే జిల్లాలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం వీరపట్నంలో సోదరి సుబ్బమ్మ, బావ రమేష్ రెడ్డిపై రామిరెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో రమేశ్‌రెడ్డి, అతడి భార్య సుబ్బమ్మ ఘటనాస్థలంలోనే చనిపోయారు. కాగా ఆస్తి వివాదాలే హత్యలకు కారణమని బంధువులు చెబుతున్నారు. మూడు ఎకరాల పొలం గురించి అక్క సుబ్బమ్మ, ఆమె సోదరుడు రామిరెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు, ఆ పొలాన్ని ప్రస్తుతం అక్కా,బావే సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి పథకం ప్రకారం సోదరిని ఇంట్లో, పొలంలో పనిచేసుకుంటున్న బావ రమేష్‌ను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
తొక్కిసలాటలో మహిళకు గాయాలు
బద్వేలు అర్బన్:నియోజకవర్గంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించే బద్వేలు పట్టణంలోని ఎస్బీఐ మెయిన్బ్రాంచ్ వద్దకు ప్రతిరోజూ జనం భారీగా తరలివస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలు బ్యాంక్‌లోకి దూసుకెళ్తుండడంతో తోపులాట జరుగుతోంది. రెండు రోజుల క్రితం తీవ్ర తోపులాట జరిగి ఐదుగురు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. బుధవారం కూడా బ్యాంక్ వద్ద తీవ్ర తోపులాట జరిగింది. బద్వేలు మండలం వీరపల్లె పంచాయతీలోని సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన మన్యం సుబ్బమ్మ (40) తోపులాటలో కిందపడి గాయపడింది. మెయిన్ గేటు నుంచి బ్యాంకు ప్రధాన ద్వారం లోకి వెళ్లే క్రమంలో సుబ్బమ్మ కిందపడడంతో ఆమెపైనే మరికొంతమంది మహిళలు పడ్డారు. దీంతో ఆమె నడుముభాగంలో , మోకాలిభాగంలో గాయాలై నడవలేని స్థితిలో సొమ్మసిల్లిపడిపోయింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు బ్యాంక్ వద్దకు చేరుకుని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. -
హవ్వ..‘పెద్ద’ మోసం
నోట్లు మార్పిస్తానని దుండుగుడి పరారు ఎస్బీఐ వద్ద కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు ధర్మవరంటౌన్ : పెద్దనోట్ల మార్పిడి వృద్ధులకు తీరని వేదనను మిగుల్చుతోంది. వృద్ధాప్యంలో ఆదరువు ఉంటుందని దాచుకున్న పెద్ద నోట్లను మార్చుకుందామని బ్యాంకు వద్దకు వెళితే ఓ అవ్వను ఏమార్చి రూ.2 వేలు ఎత్తుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన వృద్ధురాలు సుబ్బమ్మ వద్ద రూ.2వేల పింఛన్ సొమ్ము (రూ.500 నోట్లు 2, రూ.1000 నోటు 1)ఉంది. ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు శుక్రవారం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎస్బీఐ బ్రాంచి వద్దకు చేరుకుంది. పెద్ద నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియక బ్యాంక్ ఆవరణలో తికమక పడుతోంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ‘అవ్వా.. నోట్లు మార్చుకునేందుకు వచ్చావా..? క్యూలైన్ చాలా ఉంది. నీవు నిలబడ లేవు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వు నగదు మార్చుకుని కొత్త నోట్లు ఇస్తా’నని అన్నాడు. అతడి మాయమాటలను నమ్మిన వృద్ధురాలు డబ్బు, ఆధార్ జిరాక్స్ అతని చేతికి ఇచ్చింది. గంట, రెండు గంటలు గడిచినా అతను రాలేదు. అనుమానం వచ్చి బ్యాంక్ సిబ్బందికి చెబితే ఎవ్వరూ పట్టించుకోలేదు. బ్యాంకు ఆవరణలో కూర్చుని కంటతడి పెట్టింది. వృద్ధులను ఇన్ని అగచాట్లు పెడుతున్న ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసింది. ఇంత రద్దీగా ఉండే బ్యాంక్‌లో కనీసం పోలీసులు మచ్చుకైనా కానరాకపోవడంతో ఆమె గోడు వినే నాథుడే లేకుండాపోయారు. అధికారులు స్పందించి వృద్ధులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్ పెట్టి పోలీసుల నిఘా పెంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. -
చిరుద్యోగులతో చెలగాటం
ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని సంజీవనగర్ ఎస్సీ కాలనీలో ఉన్న 121వ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా సుబ్బమ్మ పనిచేస్తోంది. ఈమెకు నెలకు రూ.4,231 వేతనంతోపాటు రూ.3వేలు అంగన్వాడీ కేంద్రానికి బాడుగ, వంట వండినందుకు కట్టెల బిల్లు రూ.300, కూరగాయల బిల్లు రూ.487, టీఏ రూ.80 చొప్పున ప్రతి నెలా చెల్లించాల్సి ఉంది. జూలై నుంచి ఇప్పటి వరకు అధికారులు బాడుగ చెల్లించకపోగా ఆగస్టు నుంచి వేతనంతోపాటు మిగతా బిల్లులు ఇవ్వలేదు. పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు రోజు డబ్బు చెల్లించి పాలు పంపిణీ చేస్తోంది. వేతనంతోపాటు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రొద్దుటూరు: చాలీచాలని గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ప్రతి నెల వేతనం వస్తే కానీ కుటుంబాలు గడవని వారు ఎంతో మంది ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణప్రాంతాల్లో రూ.3వేల వరకు వెచ్చించి అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. వేతనం ఆలస్యమైనా ఇంటి అద్దె మాత్రం యజమానికి ప్రతి నెల తప్పక చెల్లించాల్సి ఉంది. అటు వేతనం రాక, ఇటు అద్దె బకాయిలు అందకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.20 నుంచి 30వేలు వేతనం తీసుకునే ఉద్యోగులే జీతం చెల్లింపులో నెల ఆలస్యమైనా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోలా కాకుండా ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. ప్రభుత్వం బియ్యం, నూనె సరఫరా చేస్తుండగా రోజు కూరగాయలు కొనుగోలు చేసి కార్యకర్తలు భోజనం వండిపెట్టాల్సి ఉంది. దీంతో వీరికి ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. అలాగే ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చేతి నుంచి డబ్బు చెల్లించి పాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి వీరికి పాల బిల్లులు రావాల్సి ఉంది. జిల్లా పరిధిలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 3,268 అంగన్వాడీ కేంద్రాలతోపాటు మరో 353 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తతోపాటు ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తకు రూ.4,200, ఆయాలకు రూ.2వేలు చొప్పున వేతనం చెల్లిస్తోంది. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది మార్చి నుంచి కేంద్రాలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే అర్బన్ ప్రాజెక్టుకు సంబంధించి 3 నెలల ఇంటిబాడుగలు మంజూరు కాలేదు. జిల్లాలోని 3,268 అంగన్వాడీ కేంద్రాలకుగాను సుమారు 2వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తుండటం గమనార్హం. బడ్జెట్ రాగానే చెల్లిస్తాం జిల్లా వ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కార్యకర్తలు, ఆయాలకు ఆగస్టు నెల నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ రాని కారణంగా జాప్యమవుతోంది. బడ్జెట్ రాగానే వేతనాలు చెల్లిస్తాం. గతంలో ఎన్నడూ ఇలా జాప్యం జరగలేదు. ఇంటి అద్దెలు ఆయా ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను బట్టి చెల్లించారు. - లీలావతి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ వెంటనే బకాయిలు చెల్లించాలి అంగన్వాడీ కార్యకర్తలకు వేతన బకాయిలతోపాటు ఇంటి బాడుగలు, మిగతా ఖర్చులను వెంటనే చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో చాలా మంది కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - ఏ.రాణెమ్మ, అంగన్వాడీ కార్యకర్త ఐసీడీఎస్ అంగన్వాడీ ప్రాజెక్టులు కేంద్రాలు కడప అర్బన్ 186 కడప రూరల్ 341 రాజంపేట 209 జమ్మలమడుగు 137 రాయచోటి 287 పులివెందుల 289 ముద్దనూరు 129 కమలాపురం 180 లక్కిరెడ్డిపల్లె 315 సిద్దవటం 154 రైల్వేకోడూరు 303 పోరుమామిళ్ల 259 ప్రొద్దుటూరు రూరల్ 328 ప్రొద్దుటూరు అర్బన్ 196