Subsidy system
-
‘ఉల్లి’కి ముకుతాడేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం, సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులను కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.100పైగా పలుకుతున్నా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా అధిక ధరకు కొనుగోలు చేసి, కిలో కేవలం రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి వరుస సమీక్షలలో ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో మన రాష్ట్రంలో వినియోగదారులను ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఉల్లి సరఫరా కొనసాగించడంపై లోతైన కసరత్తు జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగి, క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమస్యపై ఆరా తీసింది. కొంత మంది ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పాటు ట్రేడింగ్‌లో అధిక ధర కొనసాగేలా వ్యవహరిస్తూ.. జిల్లాలకు అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడాన్ని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం రవాణా, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖలు ఐక్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లు.. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణతో ఫోన్లో మాట్లాడి ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ మీద సమీక్షించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు నెలల క్రితమే స్పందించిన రాష్ట్రం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి లొల్లి చేస్తోంది. రోజు రోజుకూ ధరలు పెరిగిపోతుండటం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మార్కెట్లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై సీఎం జగన్ మూడు సార్లు సమీక్షించారు. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వాడాలని ఆదేశించారు. దీంతో కర్నూలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసి, సెప్టెంబరు 27 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.100 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 2100 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఇండెంట్ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఉల్లిపాయలు ఈ నెల 12 లేదా 13న ముంబయి పోర్టుకు రానున్నాయి. కార్యాచరణ ఇలా.. ► ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై మెరుపుదాడులు కొనసాగించాలి. ► నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి. ► బిల్లులు లేకుండా ఉల్లి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. చెక్‌పోస్టులు, డైలీట్రాన్స్‌పోర్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలి. ► అన్ని రైతుబజార్లలో రాయితీపై ఉల్లి విక్రయాలు కొనసాగించాలి. అవసరమైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు. విజిలెన్స్ విచారణలో తేలిందిదీ.. ► బయటి రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో మన అవసరాలు తీరకుండానే ఎక్కువగా తరలిస్తున్నారు. ► కర్నూలు జిల్లాలో పండే ఉల్లి పంటలో అత్యధికంగా తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి బైపాస్‌లో బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వేలం పాటలో ఉల్లిని పాడుకున్న ఎగుమతి దారుల ప్రతినిధులు సరుకును గ్రేడింగ్ చేసి, సంచి మార్చి తరలిస్తున్నారు. ► కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతులను కట్టడి చేయడంతో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉల్లి సంగతులు ► రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజు 800 టన్నుల ఉల్లి అవసరం అవుతోంది. ఈ లెక్కన ఏటా అటూ ఇటూ 3 లక్షల టన్నుల వినియోగం ఉంది. ► కర్నూలు జిల్లాలో ఏటా 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ► తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే అన్లోడ్ చేయకుండానే కొనుగోలు చేస్తున్నారు. వెంటనే నగదు ఇస్తుండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ► కర్నూలు మార్కెట్ కమిటీలో ఉల్లిని అమ్మకోవాలంటే నాలుగైదు రోజుల పాటు మార్కెట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి (ఈ ఏడాది కాదు). ఆ లోపు ఉల్లి దెబ్బతినేది. అందువల్ల తాడేపల్లిగూడెం వెళ్లేవారు. ► మొత్తం పంటలో 35 శాతం పంటను మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెస్తున్నారు. మిగతా పంటలో అత్యధికం పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ► గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 1.05 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి అయింది. ఈ ఏడాది నవంబర్‌లో దిగుమతైంది కేవలం 47 వేల టన్నులు మాత్రమే. ► దేశంలో పండే పంటలో ఎక్కువ రోజులు నిల్వ ఉండనివి ఒక్క కర్నూలు ఉల్లిపాయలే. మహారాష్ట్ర ఉల్లి, తమిళనాడులో పండే సాంబారు ఉల్లిపాయలు 90 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. ఎగుమతులు ఆపేయిస్తున్నాం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాం. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా చర్యలు తీసుకున్నాం. – పేర్ని వెంకట్రామయ్య(నాని), రవాణా శాఖ మంత్రి దిగుమతులు పెంచాం.. మన అవసరాలకు సరిపడా దిగుమతులపై చాలా రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రైతు బజార్లలో రాయితీపై ధరపై విక్రయిస్తున్నాం. కిలోపై వంద రూపాయాలకు పైగా భారం పడుతున్నా ప్రజల కోసం ప్రభుత్వం భరిస్తోంది. త్వరలో దిగుబడితో పాటు, దిగుమతులు కూడా అందనున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టి సారించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉల్లి ధర పెరుగుదలపై లోతుగా పరిశీలించాం. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి తోడు ట్రేడర్ల మాయాజాలం కూడా ఇందుకు కారణమవుతోందని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఈ విషయంపై ఏం చేస్తే బావుంటుందో ప్రభుత్వానికి సూచించాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు నెలలుగా అక్రమ నిల్వదారులపై దాడులు చేసి, సరుకు స్వాధీనం చేసుకున్నాం. – కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీజీ -
మరింత సక్రమంగా సబ్సిడీల వ్యవస్థ: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భారత పారిశ్రామిక రంగానికి హామీ ఇచ్చారు. సబ్సిడీల వ్యవస్థను మరింత హేతుబద్దీకరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఇప్పటికే వ్యయ నిర్వహణా కమిషన్‌తో పలు దఫాలు చర్చలు జరిపినట్లు తెలిపారు. కమిషన్ కూడా దీనిని తీవ్రంగా పరిశీలిస్తోందని, వ్యవస్థ పటిష్టతకు వ్యూహాలు రూపొందిస్తోందని అన్నారు. త్వరలో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయాలను తగిన విధంగా కేంద్రం అమలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, ఎల్పీజీ సబ్సిడీని నేరుగా వినియోగదారుకు అందించడం వంటి అంశాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. దేశంలో స్టాక్ మార్కెట్ల పరిస్థితి మెరుగుపడుతోందనడానికి తగిన సంకేతాలు ఉన్నాయని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు లక్ష్యాల మేరకు ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన ఒక ఆర్థిక సదస్సులో అరుణ్‌జైట్లీ శనివారం మాట్లాడారు. భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైట్లీ మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు... బీమా, జీఎస్టీ బిల్లుల ఆమోదంపై విశ్వాసం ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బీమా, వస్తువులు- సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. రాజ్యసభలో తగినంత మెజారిటీ లేనందువల్ల అవసరమైతే ఉభయసభల సమావేశం ద్వారా బిల్లుల ఆమోదానికి రాజ్యాంగబద్దంగా ఉన్న అవకాశాన్నీ వినియోగించుకుంటాం. భూ సేకరణ చట్టంపై నెలకొన్న సవాళ్లను కూడా రానున్న వారాల్లో అధిగమించగమని భావిస్తున్నాం. ముఖ్యమంత్రుల సమావేశంపై... 64 సంవత్సరాల క్రితం నుంచీ కొనసాగుతున్న ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ఆదివారం జరిగే ముఖ్యమంత్రుల సమావేశం చర్చిస్తుంది. రాష్ట్రాలకు మరింత సాధికారత కల్పించాలన్నది ఇందుకు సంబంధించి కేంద్రం ప్రధాన సంకల్పం. రేపటి (ఆదివారం) సమావేశం అనంతరం తీసుకునే నిర్ణయం ఏదైనా.. అది ఆర్థికంగా రాష్ట్రాల పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నాను. తయారీ రంగంపై దృష్టి అవసరం: కొచర్ తయారీ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందా కొచర్ సదస్సులో వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో కట్టడి చేయడానికి సరఫరాల సమస్యలను అధిగమించడం కీలకమని విశ్లేషించారు. -
‘ఉద్యానవనం’.. ఉద్యోగులు శూన్యం!
మోర్తాడ్ : జిల్లాలో ఉద్యానవన శాఖలోని ఖాళీలను, ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే పాలకుల హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉండిపోనున్నాయని స్పష్టమవుతుంది. జిల్లాలో 36 మండలాలు ఉండగా, కేవలం ఏడుగురు ఉద్యానవన శాఖాధికారులతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులందరికీ ఉ ద్యానవన శాఖ పథకాలు అందడం లేదని వెల్లడవుతోంది. జిల్లా అంతటికీ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ఒకటి , నాలుగు ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌లో ఏడీఏ పోస్టు ఉంది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలలో ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి అధికారి బదిలీ కాగా, ఇంతవరకు భర్తీ కాలేదు. ఆ ర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో మాత్రం ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు మూడు ఉన్నాయి. ఖాళీలతో లక్ష్యాలు చేరేనా వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడటం, పం టలకు గిట్టుబాటు ధరలు అంతగా లేకపోవడం తో చాలామంది రైతులు ఉద్యానవనాల పెం పుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ సంవత్సరం వంద హెక్టార్లలో పం డ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఉద్యోగులు తక్కువగా ఉండటంతో పండ్ల తోటల పెంపకం 50 శాతం కూడా సాగయ్యే సూచనలు కనిపించడం లేదు. మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ, బత్తాయి, జామ, నిమ్మ తదితర పండ్లతోటలను పెంచడంతో పాటు రైతులకు కూరగాయల విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో అందించడం ఉద్యానవన శాఖ విధి. పండ్ల తోటల పెంపకంతో పాటు వ్యవసాయ పరికరాలు, పసుపు రైతులకు తగిన సూచనలు సలహాలు, పని ముట్లను ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నారు. పైరవీలు చేస్తేనే పనులు జిల్లాల్లో 36 మండలాలకు కేవలం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఒక ఉద్యానవన అధికారితోపాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డు కన్సల్టెంట్లు ఉంటేనే రైతులకు పరిపూర్ణంగా సేవలు అందుతాయి. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ శాఖ ద్వారా అందించే పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పైరవీలు చేసిన వారికి మాత్రమే ఉద్యానవన పథకాల లబ్ధి చేకూరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖ ప్రయోజనాలు అందాలంటే ఉద్యోగుల సంఖ్యను త్వరితగతిన పెంచాల్సిన అవసర ముందని పలువురు సూచిస్తున్నారు. -
ఎల్‌నినో... ఏమి చేయునో
ఎరువుల పరిశ్రమపై రుతుపవనాల ప్రభావం రాబోబ్యాంక్ నివేదిక ముంబై: బలహీనంగా ఉన్న రూపాయి, ఎల్ నినో కారణంగా వర్షాలు ముఖం చాటేసేలా ఉండడం, సబ్సిడీ వ్యవస్థ... వెరసి ఎరువుల రంగంపై మరింత ప్రభావంపడే అవకాశాలున్నాయని బ్యాంకింగ్, ద్రవ్య సేవల సంస్థ రాబోబ్యాంక్ తాజా నివేదికలో పేర్కొన్నారు. ‘ఎరువులకు డిమాండు ఒత్తిడి ఉంది. సబ్సిడీల భారం భరించలేక ఎరువులు, రసాయనాల శాఖ సతమతం అవుతోంది. బలహీనమైన రూపాయి, రుతుపవనాలు ఎరువుల డిమాండుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని ఎరువుల పరిస్థితిపై రూపొందించిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపారు. ఈ రిపోర్టులోని ఇతర ముఖ్యాంశాలు: యూరియా సబ్సిడీల చెల్లింపులకు ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోంది. మునుపటి యూపీఏ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలకు 1,100 కోట్ల డాలర్లు కేటాయించింది. గతేడాది కూడా సబ్సిడీలు చెల్లించలేక సదరు మంత్రిత్వ శాఖ ఇక్కట్లను ఎదుర్కొంటున్నపుడు బ్యాంకులు రంగప్రవేశం చేసి రుణాలు సమకూర్చాల్సి వచ్చింది. యూరియాకు డిమాండు జూలై వరకు మందకొడిగానే ఉండవచ్చు. చైనా నుంచి ఎగుమతుల ప్రారంభం కోసం ఇండియా ఎదురుచూస్తోంది. ఏప్రిల్‌లో దేశంలో 6.75 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. మార్చితో పోలిస్తే ఇది 2 రెట్లు అధికం.ఎరువుల ధరల్లో క్షీణత కన్పిస్తోంది. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. భారత్‌లో ఫాస్ఫేట్ ఎరువుల పరిస్థితి ఏమంత బాగాలేదు. రూపాయి మారకం విలువ బలహీనపడితే ఫాస్ఫేట్ దిగుమతుల భారం పెరుగుతుంది. అన్ని రకాల ఎరువులదీ ఇదే పరిస్థితి.