substitute player
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
ఐపీఎల్ 2023లో కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2023లో బీసీసీఐ కొత్త రూల్ ప్రవేశపెట్టనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలుచేయనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఒక సబ్‌స్టిట్యూట్ లాగే అన్నమాట. అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ కొత్త రూల్‌ను వచ్చే సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ 14వ ఓవర్ ముగిసేలోపే ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాల్సి ఉంటుంది. కెప్టెన్, హెడ్‌కోచ్, మేనేజర్ ఈ విషయాన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, లేదా నాలుగో అంపైర్‌కు చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంటే.. ఆ గాయపడిన ప్లేయర్ మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఓ ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఓవర్ ముగిసిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన సందర్భాల్లో అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాలని అనుకుంటే.. వికెట్ పడిన తర్వాత లేదంటే ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాత్రమే చేయాలి. ముందుగానే ఈ విషయాన్ని నాలుగో అంపైర్‌కు చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి? రూల్ ప్రకారం రెండు టీమ్స్ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్‌తో భర్తీ చేయవచ్చు. ఇది కచ్చితం ఏమీ కాదు. ఒకవేళ వాళ్లకు అది ఉపయోగపడుతుందనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అతన్ని తీసుకున్న తర్వాత ఢిల్లీ టీమ్ 71 రన్స్‌తో ఆ మ్యాచ్ గెలిచింది. ఆ లెక్కన మ్యాచ్‌ల ఫలితాలను తారుమారు చేసే సత్తా ఇంపాక్ట్ ప్లేయర్‌కు ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. ఈ ప్లేయర్‌ను ముందుగానే 12 లేదా 13వ ప్లేయర్‌గా ప్రకటించాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తర్వాత ఈ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ తీసుకునే వీలుంటుంది. Time for a New season 😃 Time for a New rule 😎 How big an "impact" will the substitute player have this edition of the #TATAIPL 🤔 pic.twitter.com/19mNntUcUW — IndianPremierLeague (@IPL) December 2, 2022 చదవండి: షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి
సాధారణంగా క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ అంటే ఫీల్డర్ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్ ప్లేయర్'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జట్టు కెప్టెన్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యాటింగ్‌లో చెలరేగిన ఒక ఆటగాడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అతని స్థానంలో ఒక బౌలర్‌ను తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. తాజాగా బీసీసీఐ తెచ్చిన ''ఇంపాక్ట్ ప్లేయర్'' నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో తొలిసారి ఉపయోగించారు. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో ఢిల్లీ, మణిపూర్ మధ్య మ్యాచ్‌లో హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. త్వరలోనే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఐపీఎల్లో కూడా అమలు చేయనున్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ హితెన్ దలాల్(27 బంతుల్లో 47 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. యష్ దుల్ 24, హిమ్మత్ సింగ్ 25 పరుగులు చేశారు. అయితే బ్యాట్‌తో రాణించిన హితెన్ దలాల్ బౌలింగ్ చేయలేడు కాబట్టి కెప్టెన్ నితీష్ రాణా అతని స్థానంలో బౌలర్ హృతిక్ షోకీన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. ఇది ఢిల్లీ జట్టుకు లాభం చేకూర్చింది. బౌలింగ్‌లో షోకీన్(3-0-13-2) చెలరేగడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. షోకీన్‌తో పాటు మయాంక్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీయడం.. నితీష్ రాణా, లలిత్ యాదవ్‌లు చెరొక వికెట్ తీయడంతో మణిపూర్ 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కాసేపటికే మణిపూర్ కెప్టెన్ లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ కూడా బౌలర్ బిష్వోర్జిత్ స్థానంలో బ్యాటర్ అహ్మద్ షాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. చదవండి: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా' గంగూలీ కథ ముగిసినట్లే..! -
కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్‌స్టిట్యూట్) బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్ లేదా హెడ్ కోచ్ లేదా మేనేజర్లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్ త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే క్రికెట్ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇకపై కరోనా సబ్‌స్టిట్యూట్?
లండన్: కోవిడ్–19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ప్రత్యేకమైన మార్పును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆశిస్తోంది. ఇప్పటివరకు మ్యాచ్‌ల్లో ఆటగాడు గాయపడితే కన్కషన్ ప్లేయర్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లను చూశాం. కానీ ఇప్పడు ‘కరోనా వైరస్ రీప్లేస్మెంట్ (సబ్‌స్టిట్యూట్)’ను అనుమతించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఈసీబీ కోరింది. తమ ప్రతిపాదనపై ఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని ఈసీబీ నమ్ముతోంది. ‘కోవిడ్–19 రీప్లేస్మెంట్ గురించి ఐసీసీ ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. దీనిని అంగీకరించాల్సిన అవసరముంది. జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందని మేం నమ్ముతున్నాం’ అని ఈసీబీ ఈవెంట్స్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తి అన్నారు. అయితే ఈ మార్పు నుంచి వన్డే, టి20లను మినహాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా దేశవాళీ సీజన్‌ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్న ఈసీబీ... బయో సెక్యూర్ వాతావరణంలో వెస్టిండీస్, పాకిస్తాన్లతో టెస్టు సిరీస్‌లను నిర్వహిస్తామని పేర్కొంది. ఇంగ్లండ్ ప్రభుత్వ అనుమతి, మార్గదర్శకాల ఆధారంగానే టోర్నీలు జరుపుతామని చెప్పింది. -
సాకర్‌కు సబ్స్టిట్యూట్ల కిక్
లాసానే: ఫుట్‌బాల్‌లో సబ్స్టిట్యూట్ల కిక్ పెరగనుంది. ఇప్పటికైతే ఇది తాత్కాలికమే అయినప్పటికీ ఇకపై ఐదుగురు ఆటగాళ్లు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే అవకాశం త్వరలోనే రానుంది. కరోనా వైరస్ తర్వాత పునఃప్రారంభమయ్యే ఫుట్‌బాల్ టోర్నీల నిబంధనల్లో ఈ కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఆటగాళ్లను గాయాల నుంచి రక్షించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన అమలు చేయనున్నారు. దీనిపై ఫుట్‌బాల్ నియమావళి రూపకర్తలు ఈ వారంలో ఆమోదముద్ర వేసి అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది తాత్కాలిక నిబంధనే అయినప్పటికీ కరోనాతో సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగే ఫుట్‌బాలర్లకు బిజీ షెడ్యూల్లో గాయాలు కాకుండా ఇది ఎంతో ఉపయోగపడనుంది. దీనికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (ఐఎఫ్ఏబీ) శుక్రవారం ఆమోదం తెలుపనుంది. గతవారమే ఈ అంశంపై ఐఎఫ్ఏబీ సానుకూలంగా స్పందించింది. ‘ఫిఫా ప్రతిపాదించిన ఈ ఐదుగురు సబ్స్టిట్యూట్ల అంశంపై ఆలోచిస్తున్నాం. మ్యాచ్ సమయంలో మూడు సందర్భాల్లో జట్లు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. ఒక వేళ ఎక్స్ట్రా సమయానికి దారితీస్తే ఆరో వ్యక్తిని కూడా వాడుకోవచ్చు’ అని తెలిపింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ముగ్గురు సబ్‌స్టిట్యూట్‌లకు మాత్రమే అనుమతి ఉంది. 2018 నుంచి అదనపు సమయంలో నాలుగో వ్యక్తిని అనుమతిస్తున్నారు. -
ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్ నుంచే అమలు!
లండన్: ఈ నెల చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో 2017 నుంచే సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్ షిప్’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్ సిరీస్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని అనుకుంటోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ వార్షిక సమావేశంలో చర్చించనుంది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా తలకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
అవును.. కప్పు తేవాల్సింది నువ్వే
అది ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. నిర్ణీత సమయం అయిపోయింది. రెండు జట్లలో ఏ ఒక్కళ్లూ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. అదనపు సమయం ఇచ్చారు. అవతల అర్జెంటీనా జట్టులో లియోనెల్ మెస్సీ లాంటి స్టార్ ఆటగాడు ఉన్నాడు. అయినా జర్మనీ మాత్రం తన నైతిక ధైర్యాన్ని కోల్పోలేదు. జర్మన్ కోచ్ జాకిమ్ లో నేరుగా తమ జట్టులోని మరియా గోయెట్జ్ వద్దకు వెళ్లాడు. ''ప్రపంచ కప్పును నిర్ణయించాల్సింది నువ్వే. మనకు ఆ కప్పు తేవాల్సింది నువ్వే'' అని చెప్పాడు. కొద్ది నిమిషాలు గడిచాయి.. అంతే, ఒక్కసారిగా దూసుకెళ్లిన గోట్జె టకామని గోల్ సాధించాడు.. జర్మనీ ఫుట్‌బాల్ ప్రపంచకప్పు గెలుచుకుంది. ''నువ్వు మెస్సీ కంటే గొప్ప ఆటగాడివని ప్రపంచానికి చూపించు. ఈ ప్రపంచ కప్పును నువ్వే నిర్ణయించు'' అంటూ గోయెట్జ్లో ఆత్మస్థైర్యం నింపాడు. ఈ విషయాన్ని కోచ్ లో స్వయంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత విలేకరులకు తెలిపాడు. గోల్ కొట్టగల సామర్థ్యం నీకే ఉందని చెప్పానని, అతడి మీద ఆ నమ్మకం కూడా తనకుందని లో అన్నాడు. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న మొదటి 11 మందిలో గోయెట్జ్ లేడు. తర్వాత మిరొస్లావ్ క్లోసెకు సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాడు. ఎక్స్ట్రా టైమ్‌లో గోల్ కొట్టి, అత్యంత నాటకీయమైన రీతిలో అర్జెంటీనాపై విజయాన్ని, తమ దేశానికి ప్రపంచ కప్పును అందించాడు. తన కుటుంబం, తన స్నేహితురాలు.. అందరూ తనమీద చాలా నమ్మకం పెట్టుకున్నారని, వాళ్లందరికీ కప్పు సాధించి తెస్తానని చెప్పానని, తమ జట్టు సాధించిన ఈ విజయానికి ఎంతో ఆనందంగా ఉందని గోయెట్జ్ చెప్పాడు. ఫైనల్స్‌లో అతడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.