sun strock
-
మార్చిలోనే మండుతున్న సూరీడు.. భగభగ పక్కా! తీవ్రమైన వడగాడ్పులు
మార్చిలోనే సూరీడు మండిపోతున్నాడు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నాయి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు దాటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడి గాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య నిపుణులు, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతంలో వడగాడ్పులు ఉండబోతున్నాయి మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది.మధ్య భారతం, వాయవ్య రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతాయి. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అంచనాల ప్రకారం వడగాడ్పులు తరచుగా వీస్తాయి. రానున్న సంవత్సరాల్లో ఎండవేడిమి మరింతగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ఫసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల వేసవికాలం మరింత వేడిగా మారుతుందని అంచనాలున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పంట దిగుబడి లేక కరువు కాటకాలు ఏర్పడతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వేసవి కాలం ఎదుర్కోవడం అత్యంత దుర్లభంగా మారుతోందని హెల్త్ అండ్ క్లైమేట్ రెసిలెన్స్ ఎన్ఆర్డీసీ ఇండియా చీఫ్ అభియంత్ తివారీ చెప్పారు. గత ఏడాది మార్చి 100 ఏళ్లలోనే అత్యంత వేడి మాసంగా నమోదైతే, ఈ ఏడాది ఫిబ్రవరి 122 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టిందని అన్నారు. ఈ సారి వేసవిలో వడగాడ్పులు ఎక్కువగా ఉండడంతో గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ఆహార సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి జరగనున్నాయని ఆయన అంచనా వేశారు. విద్యుత్ కోతలు తప్పవా..? గత ఏడాది వేసవి కాలంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకొని సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుకోవచ్చునని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. ఇక రాత్రి వేళల్లో కూడా 217 గిగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకునే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రాత్రిపూట విద్యుత్ వినియోగం కంటే ఇది చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రిడ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకి బొగ్గు కొరత, జల విద్యుత్ ప్రాజెక్టులకి నీటి కొరత కారణంగా ఈ సారి వేసవి కూడా పెను విద్యుత్ సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయి. ఒడిశా బాటలో... మన దేశంలో ఒడిశా వేసవికాలంలో ఎదురయ్యే సమస్యల్ని ఒక ప్రణాళికా బద్ధంగా ఎదుర్కొని విజయం సాధించింది. ఇప్పటివరకు ఒడిశా మాత్రమే వేసవికాలాన్ని కూడా ఒక ప్రకృతి విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. 1998లో వేసవికాంలో వడదెబ్బకు ఏకంగా 2,042 మంది పిట్టల్లా రాలిపోయారు. ఆ తర్వాత ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య 91కి, తర్వాత ఏడాదికి 41కి తగ్గించగలిగింది. దీనికి ఒడిశా ప్రభుత్వం చేసిందల్లా ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట ఎవరూ తిరగకూడదంటూ నిబంధనలు విధించింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసింది. రాష్టంలోని వీధివీధిలోనూ చలివేంద్రాలు, పందిళ్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ కోతలు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా ముందుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పనులు చేసేలా చర్యలు తీసుకుంది. వడదెబ్బతో మరణించే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఒడిశా బాటలో నడిస్తే మంచిదన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉన్నాయి. వేసవి ప్రభావం ఇలా.. ► ప్రపంచ బ్యాంకు 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో వేసవి మరణాలు ఇక అధికం కానున్నాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు వడగాడ్పులతో వేడెక్కనున్నాయి. ► ఎండవేడిమికి 2000–04 నుంచి 2017–21 మధ్య 55శాతం మరణాలు పెరిగిపోయాయి. ► 2021లో ఎండలకి 16,700 కోట్ల కార్మికుల పని గంటలు వృథా అయ్యాయి. ► ఎండాకాలంలో కార్మికులు పనుల్లోకి వెళ్లకపోవడం వల్ల దేశ జీడీపీలో గత ఏడాది 5.4% ఆదాయం తగ్గిపోయింది. ► 2022లో దేశవ్యాప్తంగా 203 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. వందేళ్ల తర్వాత ఇదే అత్యధికం ► ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 28 రోజులు, రాజస్తాన్‌లో 26 రోజులు, పంజాబ్, హరియాణాలో 34 రోజులు చొప్పున వడగాడ్పులు వీచాయి. ► వేసవికాలం వచ్చిందంటే కార్చిచ్చుల సమస్య వేధిస్తుంది. 2017లో కొండప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1,244 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చులు దహిస్తే 2021 నాటికి మూడు రెట్లు ఎక్కువగా 3,927 హెక్టార్లు కార్చిచ్చుతో నాశనమయ్యాయి. ► ఇప్పటికే హిమానీనదాలు కరిగిపోతూ ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలు ముప్పులో ఉన్నాయి. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటే మరింత మంచు కరిగి ముప్పు తీవ్రత ఎక్కువైపోతుంది ► ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గత ఏడాది ఎంత తీవ్రతకి 300 పిట్టలు మృతి చెందాయి. వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవడానికి ఊళ్లపై పడి బీభత్సం సృష్టించే ఘటనలు పెరిగిపోతాయి. ► వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉండడం రబీ సీజన్ పంటలపై తీవ్రంగా ç్రప్రభావం పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఈ ఏడాది గోధుమ దిగుబడిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వడదెబ్బ
-
బస్సు పక్కన నిలిపి స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్
టెక్కలి రూరల్ : వడదెబ్బకు గురైన ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంతో బస్సును నిలిపి ఆయన స్పృహ కోల్పోయారు. దీంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం సోమవారం వెళుతోంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో డ్రైవర్ ఎం.డి ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నాయని గుర్తించిన ఆయన.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని భావించి బస్సును నెమ్మది చేస్తూ టెక్కలి సమీపంలోని రహదారి పక్కన నిలిపివేసి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఇది గమనించిన కండక్టర్.. డ్రైవర్ ఇలియాస్‌ను హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహరాజ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన డైవ్రర్‌ను ప్రయాణికులు అభినందించారు. -
మళ్లీ మంటలు..!
నల్లగొండ టౌన్ : ఎండలు మళ్లీ మండుతున్నాయి. భానుడు ప్రతాపానికి మార్చి, ఏప్రిల్ మాసాల్లో పగటి ఊష్ణోగ్రతలు జిల్లాలో 47 డిగ్రీలకు చేరడంతో జనం తల్లడిల్లిపోయారు. మే మొదటి నుంచి వరుణుడు కరుణించి జిల్లా అంతటా నాలుగు ఐదు రోజులు వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం పొందారు. వర్షాల కారణంగా జిల్లాలో 33 డిగ్రీల సెల్సియస్‌గా ఊష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను ఊరడించింది. తిరిగి ఈనెల 7నుంచి క్రమంగా ఊష్ణోగ్రతలుపెరిగిపోతున్నాయి. శనివా రం ఏకంగా 41.6 డిగ్రీల సెల్సియస్‌గా పగటి ఊష్ణోగ్రత నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. వడగాలులు, ఊక్కపోతతో ఉదయం 10 నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితుల ఏర్పడుతున్నాయి. పట్టణంలోని రోడ్లన్ని మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రాత్రి 10 వరకు కూడా వడగాలులు వీస్తుండడం వల్ల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎడాపెడా విద్యుత్ కోతలు... తెలంగాణ రాష్ట్రంలో సెకన్ కూడా విద్యుత్ కోతలు ఉండవని ముఖ్యమంత్రితో పాటు విద్యుత్ మంత్రి బాకాలు ఊది మీరి చెప్పుతుంటే జిల్లాలో విద్యుత్ అధికారులు ఎడాపెడా అనధికార కోతలు విధిస్తున్నారు. పట్టణంలో ఎప్పుడు విద్యుత్‌ను నిలిపివేస్తారో తెలియని పరిస్థితి. ఎండలు మండుతుండడం, ఉక్కపోతలు, విద్యుత్ కోతలు కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ అధికారులు ఎండలు మండుతున్న తరుణంలో మరమ్మతుల సాకుగా చూపుతూ మిట్ట మధ్యాహ్నం కోతలను విధిస్తుండడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలను దృష్టి పెట్టుకుని కోతలు విధించవద్దని కోరుతున్నారు. -
ఎండలు బాబోయ్ ఎండలు
గత కొన్నేళ్లలో నిలకడగా యూఎస్ ఓపెన్‌కు వర్షం, తుఫాన్ అంతరాయం కలిగించాయి. ఫలితంగా నిర్వాహకులు రెండు ప్రధాన స్టేడియాలకు పైకప్పు నిర్మించడం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాత్రం ఎండలు మండుతున్నాయి. ఎండ దెబ్బకు తాళలేక చాలామంది ఆటగాళ్లు మధ్యలోనే వైదొలుగుతున్నారు. ఈ విషయంలో గురువారం కొత్త రికార్డు నమోదైంది. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు మధ్యలోనే నిష్ర్కమించడంతో ఈ సంఖ్య 12కు చేరింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో విభాగంలో ఎండకు తట్టుకోలేక 12 మంది వైదొలగడం ఇదే ప్రథమం. 33 డిగ్రీల వేడిలో... రూబెన్ బెమెల్మాన్స్ (బెల్జియం)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 22 ఏళ్ల జాక్ సోక్ (అమెరికా) 6-4, 6-4, 3-6, 1-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే నిర్వాహకులు జాక్ సోక్కు ప్రథమ చికిత్స చేసి కోర్టు పక్కకు నీడలోకి తీసుకెళ్లారు. నీరసించిన సోక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జరిగిన మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) 4-6, 4-6, 0-1తో వెనుకబడిన దశలో ఎండ వేడిమికి వైదొలిగాడు. సోమవారం టోర్నీ మొదలైన తొలి రోజు నుంచి ప్రతీరోజు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తోంది. -
మండిపోతున్న ఎండలు
-
భగభగ
►మంగళవారం 43 డిగ్రీలు ►అల్లాడిపోతున్న జనం ►రోడ్లన్నీ నిర్మానుష్యం ►వడదెబ్బతో ఇద్దరి మృతి నెల్లూరు (అర్బన్) : భానుడు మండిపోతున్నాడు. తన ప్రతాపాన్ని పెంచేసి నిప్పులుగక్కుతున్నాడు. మే నెల కావడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సోమవారం నుంచి సూర్యుడు భగభగమండుతున్నాడు. సోమవారం 39.9 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండదెబ్బకు జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో కరెంటు కోతల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఉపశమనం కోసం చెట్లకిందకు చేరుతున్నారు. ఎండలు కారణంగా ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఎండ తగ్గాక బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఆగని వడదెబ్బ మృతులు ఎండలు కారణంగా వడదెబ్బకు గురై వృద్ధులు మృతిచెందుతున్న సంఘటనలు జిల్లావ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈనెల 2వ తేదీన ఓజిలిలో ఒకరు, 8న గూడూరులో ఒకరు, 10న దొరవారిసత్రంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు, 15వ తేదీ గూడూరులో ఒకరు మృతిచెందారు. ఒక్క మంగళవారం రోజే ఇద్దరు మృతిచెందారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు మృతిచెందారు. వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. వడదెబ్బ మృతులను తగ్గించాలంటూ డీఎంహెచ్ఓ భారతీరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దీని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు ఎవరూ చనిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వడదెబ్బతో నలుగురి మృతి
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం చందెపల్లికి చెందిన గం గరాజు సత్తయ్య(55) బుధవారం బైక్‌పై మూటకొండూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగివస్తూ ఎండకు సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఇదే జిల్లా మోత్కూర్ మండలకేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన కూరెళ్ల మల్లమ్మ(75), ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం పార్డి కంబారీవాసి ఎం. పోశయ్య(60), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కొల్లూర్‌వాసి షేక్‌అలిమా(40) వడదెబ్బతో మరణించారు.