sunithareddy
-
Viveka Case: ‘నాపై ఒత్తిడి తెస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేసినా.. ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. -
నాడు సంబంధం లేదని నేడు కుటుంబంపై నిందలా?
మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు.. ‘‘మా నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకే సంబంధం ఉండి ఉంటే పోలీసులు ఇప్పటికే బయటపెట్టేవారు. హంతకులను పట్టుకోకుండా సిట్ అధికారులు ఏదో దాస్తున్నారు. విచారణ సరిగా జరగడం లేదు. వీళ్లే చేశారంటూ కొన్ని రోజుల తరువాత మా కుటుంబ సభ్యులనే నిందితులుగా చూపించే అవకాశం కూడా ఉంది. ఆ భయంతోనే చెబుతున్నా. మా కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఆదినారాయణరెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేముంటే మాపైనే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కుట్రతో, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారన్న భయం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఉంటే ఆ అనుమానం వచ్చేది కాదు. సిట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం లేదు. రాజకీయంగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు.’’ – 2019 మార్చి 26న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ప్రకటన సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిలే తన తండ్రిని హత్య చేయించి ఉండవచ్చని గతంలో గట్టిగా ఆరోపించిన వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ ఒక్కసారిగా మాట మార్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2020 ఆగస్టులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో గతంలో చెప్పినదానికి పూర్తి భిన్నంగా సందేహాలు వ్యక్తం చేశారు. పూర్తి అవాస్తవాలు, ఊహాజనిత అంశాల ఆధారంగా ఆమె ఆరోపణలు చేయడం విస్మయపరుస్తోంది. కడప ఎంపీ టికెట్ వైఎస్ షర్మిలకుగానీ వైఎస్ విజయమ్మకుగానీ ఇవ్వాలని వివేకా భావించినట్టు ఆమె సీబీఐకి చెప్పారు. అయితే అదే అంశాన్ని గతంలో సిట్ దర్యాప్తు సందర్భంగా ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ ప్రయోజనాలే కారణమా? కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డి ఎన్నికల ఇన్చార్జ్గా వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహరించారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీలో పూర్తి ఏకాభిప్రాయం ఉంది. అవినాశ్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ పని చేశారని 2019 ఎన్నికల ముందు సునీతమ్మ వెల్లడించడం గమనార్హం. దానికి విరుద్ధంగా ప్రస్తుతం సీబీఐకి చెప్పడం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివేకా హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సునీత సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. వివేకా హత్య జరిగినప్పుడుగానీ అనంతరం సిట్ దర్యాప్తు సందర్భంగాగానీ ఆమె ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిలపైనే సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తుండటం వెనుక రాజకీయ ప్రయోజనాలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇక సునీత భర్త రాజశేఖరరెడ్డి గతంలో ఎన్నడూ వైఎస్సార్ కుటుంబ సభ్యులపైగానీ వైఎస్సార్సీపీ నేతలపైగానీ సందేహాలు వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం వైఎస్ కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం వెనుక ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు దాగున్నాయన్నది స్పష్టమవుతోంది. -
నేటి నుంచి సునీతారెడ్డి ప్రచారం
సాక్షి, యాలాల: జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మంగళవారం నుంచి.. మంత్రి మహేందర్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. 20 రోజుల పాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యాలాల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొదటి రోజు రాస్నం, ముద్దాయిపేట్, దేవనూర్, గోరేపల్లి, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. మొదటి విడత పర్యటన పూర్తయిన తర్వాత డ్వాక్రా మహిళలతో మండల స్థాయి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్నింగ్ వాక్‌లతో గిరిజన తండాలను సందర్శిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తన పర్యటనల్లో భాగంగా వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. -
కేసీఆర్‌కు సునీతారెడ్డి అంటే భయం : రేవంత్‌రెడ్డి
సాక్షి, నర్సాపూర్ (మెదక్): మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీతారెడ్డి అంటే సీఎం కేసీఆర్‌కు భయమని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో చేపట్టిన రోడ్ షో సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. సునీతారెడ్డి పైరవీలు చేయదని, పైసలు అడగదని ఆయన వివరిస్తూ అందుకే ఆమె అంటె కేసీఆర్‌కు భయమని చెప్పారు. పైరవీలు, పైసలు, బుడ్డి అడిగే వారంటే ఆయనకు ఇష్టమని చెప్పారు.కేసీఆర్ ఫాంహౌస్‌లో మందు కొడుతుంటె ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాపలా ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్, మదన్‌రెడ్డిలు ఎత్తిపోస్తరు తప్ప ఎత్తిపోతల పథకాలు తేరని విమర్శిచారు. కాగా టీఆర్ఎస్ నాయకులు జిల్లాలో ఎవరి మీద లేని దృష్టిని నర్సాపూర్‌పై పెడుతారని, ఇక్కడికి పైసల మూటలు దించుతారని ఆయన వివరించారు. రాబోయే 36రోజులు జాగ్రత్తగా ఉంటూ రాత్రి పూట యువకులు గస్తీ తిరగాలని, పగలంతా పార్టీ కోసం పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా ఇక్కడి నుంచి 8సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. రోడ్ షోకు వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఈసారి సునీతారెడ్డిని గెలిపిస్తారన్న నమ్మకం తనకు కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా తమ అభ్యర్తి సునీతారెడ్డిని గెలిపించాలని, తాను రెండో ఎమ్మెల్యేగా అందరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయె ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా నర్సాపూర్‌లో రెపరెపలాడాలని ఆయన కోరారు. ఆడబిడ్డకు అండగా వేల మంది బైక్‌లపై తరలి రావడ మంటే సునీతారెడ్డి మామ రాంచంద్రారెడ్డి, భర్త దివంగత లక్ష్మారెడ్డిల ఆశయాలకు అనుగుణంగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగానేనని ఆయన చెప్పారు. ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారని ఆయన ఆరోపించారు. కాగా మాజీ మంత్రి సునీతారెడ్డి తన హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజలకు సేవకురాలిగా.. తన జీవితం ప్రజా సేవకే అంకితమని మాజీ మంత్రి సునీతారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను నాయకురాలిని కాదని, ప్రజలకు సేవకురాలిగా మీ ముందుకు వచ్చానన్నారు. తనను నమ్మిన ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే తాను వారికి అందుబాటులో ఉంటానని ఆమె చెప్పారు. మీ సహాయ సహకారాలు చాల గొప్పవని, జీవితానికి చాలునని, తాను ధన్యురాలినని సునీతారెడ్డి చెప్పారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ తాము మంజూరు చేయించామని టీఆర్ఎస్ నాయకులు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. కాగా తాను 15సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వస్తారా? అని ఆమె టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో మరో 15 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. పార్టీ కోసం బైక్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. బైక్ ర్యాలీ శివ్వంపేట నుంచి నర్సాపూర్ రాగానే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి, సునీతారెడ్డిల వాహనాన్ని నిలిపి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిదులు మాణయ్య, ఆంజనేయులుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహెందర్‌రెడ్డి, మండల పారీ అద్యక్షుడు మల్లేశం, సంతోష్‌రెడ్డి, ప్రభాకర్, జయశ్రీ, లలిత తదితరలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ నేతల అలక..
పరిగి: జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి వైఖరిపై పరిగి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అలకబూనారు. సోమవారం గండేడ్ మండల సర్వసభ్యసమేవేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి(టీఆర్ఆర్)తో కలిసి ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయటం నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్కు సంబంధించి నియోజకవర్గం నుంచి ఐదుగురు జెడ్పీటీసీలు, సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యతనివ్వటంపై వారు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రి ఎదుట గోడు.. ఈ విషయంపైనే మంగళవారం నియోజకవర్గం నుంచి 50 మందికి పైగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఓ దశలో కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంటు కోసం కూడా యత్నించినట్లు సమాచారం. అయితే ముందుగా ఓ మాట జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డికి చెబితే బాగుంటుందని పరిగికి చెందిన సీనియర్ నాయకుడి సలహాతో అందరు వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసింది. గంటపాటు ఆయనతో చర్చించగా మరో సారి అలా జరగదని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇవ్వటం తో పరిగి శ్రేణులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచా రం. ఇదే సమయంలో గతంలో ప్రసాద్‌కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో అప్పటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి కలిసి కార్యక్రమాల్లో, ప్రెస్మీట్లలో పాల్గొన్నారనే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. -
రైల్వే లైన్ మంజూరు వైఎస్ పుణ్యమే..
మెదక్/టౌన్/రూరల్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ ఫలితంగానే అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ మంజూరైందని రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వేలైన్ ఏర్పాటు కోసం కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద 50 శాతం నిధులు ఇచ్చేందుకు, భూమిని సమకూర్చేందుకు సంసిద్ధత తెలిపార న్నారు. రైల్వేలైన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లిం చేందుకు గాను రూ.25 కోట్లతో రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మెదక్ ఎంపీ విజయశాంతితోపాటు రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, రైల్వే సాధన సమితి కృషి వల్ల మెదక్ ప్రజల కల నెరవేరిందన్నారు. ఈ లైన్ ఏర్పాటుతో పేదలకు, యువతకు, నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ ప్రాంత రైతులకు రసాయన ఎరువుల సరఫరాకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా లైన్ సాధించా: విజయశాంతి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైల్వేలైన్ కోసం 2009 నుంచి ఎంతగానో కృషి చేసినట్టు ఎంపీ విజయశాంతి అన్నారు. తన ఎంపీ లాడ్స్ నుంచి కోటి రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. మెదక్ నుంచి ఎంతోమంది ఎంపీలు గెలుపొందినా రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఇంతవరకు ముగ్గురు సీఎంలు, ఆరుగురు రైల్వే మంత్రులు, ముగ్గురు జీఎంలు మారినప్పటికీ తాను పట్టువదలకుండా కృషిచేసి రైల్వేలైన్ సాధించినట్టు చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు.. శంకుస్థాపన కోసం 3 నెలలుగా సీఎం అపాయింట్మెంట్ ఠమొదటిపేజీ తరువాయి అడుగుతున్నా అవకాశం దొరకలేదని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాదాల వివాదంలో తనను పట్టించుకోలేదన్నారు. అటు ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం చేస్తూనే ఇటు రైల్వే సాధన కోసం కృషి చేశానన్నారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ పరంగా ఆశించిన మేర పరిహారం చెల్లించేలా చూస్తానని తెలిపారు. రెండేళ్లలో పూర్తి చేస్తాం: జీఎం రైలు మార్గాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని రైల్వే జీఎం శ్రీవాత్సవ్ తెలిపారు. రైల్వేశాఖ ఏటా 110 మిలియన్ టన్నుల గూడ్స్‌ను, 307 మిలియన్ల ప్రయాణికులను రవాణా చేస్తుందన్నారు. రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరుస్తుందన్నారు. రైల్వేసాధన సమితి అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ. రైల్వేలైన్ కోసం తాము 14 యేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ స్మితా సబర్వాల్, రైల్వే అధికారులు, ఆర్డీఓ వనజాదేవి, సర్పంచ్ వెల్ముల మహేశ్వరి సిద్ధిరాములు పాల్గొన్నారు.