super emergency
-
నిరసనలపై మమత ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి మూవీపై ముసురుకున్న వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పద్మావతి వివాదంపై స్పందించారు. పద్మావతి మూవీపై వ్యక్తమవుతున్న నిరసనలను దీదీ తోసిపుచ్చారు. మొత్తం వ్యవహారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పద్మావతి వివాదం దురదృష్టకరం...ఓ రాజకీయ పార్టీ భావప్రకటన స్వేచ్ఛను హరించే క్రమంలో వ్యూహాత్మక ప్రణాళికతో వ్యవహరిస్తుండటంతోనే దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొంది‘ అన్నారు. చిత్ర పరిశ్రమలోని వారంతా ఏకమై దీనిపై గళమెత్తాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. మరోవైపు పద్మావతి మూవీని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. చౌహాన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సమర్ధించడం గమనార్హం.చరిత్రను వక్రీకరిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. -
సూపర్ ఎమర్జెన్సీ.. కరెక్టే: తేజస్వి
పట్నా: పెద్దనోట్ల రద్దుతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ విధించినట్టుగా ఉందన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సమర్థించారు. 'నోట్ల రద్దు తర్వాత దేశమంతటా పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రధాని మోదీ హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అడ్డుకట్ట పడటం లేదు. అణగారిన వర్గాల పరిస్థితి, మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. వారికి ఏటీఎంలు కానీ, ఆధునిక టెక్నాలజీ కానీ అందుబాటులో లేదు. నోట్ల రద్దు వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ప్రధాని ప్రజల కష్టాల గురించి మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి సూపర్ ఎమర్జెన్సీని తలపిస్తున్నదని మమత పేర్కొన్న వ్యాఖ్యలు సరైనవేనని నాకు అనిపిస్తోంది' అని తేజస్వి బుధవారం విలేకరులతో అన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్ పై తీవ్రంగా ధ్వజమెత్తుతూ.. దేశంలో ఎమర్జెన్సీ, సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని మమతా బెనర్జీ మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.