superstition bill
-
‘అలా చేస్తే నవరత్నాలకు ఆర్ధిక భారం తగ్గుతుంది’
సాక్షి, విజయవాడ : చిత్తూరులోని కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులను స్వాగతిస్తున్నామని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిబాబ, కర్నూలు బాల సాయిబాబ ఆశ్రమాలపై కూడా ఇలాంటి దాడులు చేయించాలని సీఎంను కోరుతున్నామన్నారు. ఇటువంటి దాడుల వల్ల జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆర్ధికంగా భారం తగ్గుతుందని సూచించారు. ఆధునిక కాలంలో కూడా ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారని, ప్రకాశం, విశాఖ, తెలంగాణలలో జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శమన్నారు. సమాజంలోని దొంగబాబాలను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో 51a ఆర్టికల్‌లో అశాస్త్రీయ విధానాలను ప్రశ్నించాలని స్పష్టంగా ఉందంటూ.. ఏపీలో మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం తీసుకురావాలని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. -
మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాలి
వనపర్తి విద్యావిభాగం: రాష్ట్రంలో మూఢనమ్మకాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మూఢనమ్మకాల నిరోధన చట్టాన్ని ప్రవేశపెట్టాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కోశాధికారి జితేందర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో జనవిజ్ఞాన వేదిక వనపర్తి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని విడుదల చేయాలని వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎదుగుతున్నా మూఢనమ్మకాలను పాటించడంలో తగ్గడం లేదన్నారు. నేటికీ రాష్ట్రం నలుమూలలా ఎక్కడో ఒకచోట చేతబడి, బాణామతి, మంత్రాలు, క్షుద్రపూజలు వంటివి కొనసాగుతూ దాడులు, హత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మూఢనమ్మకాలతో జరుగుతున్న సంఘటనలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
శీతాకాల సమావేశాల్లోనే మూఢ నమ్మకాల వ్యతిరేక బిల్లు
నాసిక్: మూఢనమ్మకాల వ్యతిరేక బిలును చట్టరూపంలోకి తేవాల్సిన అవసరముందని దివంగత హేతువాది నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ నొక్కి చెప్పారు. నాగపూర్‌లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ చూడాలని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. తన తండ్రి నరేం ద్ర చనిపోయిన తర్వాత మూఢనమ్మకాలు పాటించడం, చేతబడిపై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని చట్టం రూపంలోకి మార్చాల్సిన సమయమొచ్చిందని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ హామీని ఇచ్చారని, ఒకవేళ ఈ బిల్లు ఓడితే అది సర్కార్ నైతిక ఓటమి అవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల ముందే దీనిపై ఏకాభిప్రాయం రావల్సిన అవసరముందని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడిపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేసిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20న పుణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాగ్రహం పెల్లుబకడంతో ఆత్మరక్షణలో పడ్డ సర్కార్ మూఢ నమ్మకాల, చేతబడిపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వివిధ ముసాయిదాల ద్వారా 2003లో అసెంబ్లీ ముందుకు వచ్చి న ఈ బిల్లు కోసం గత పదేళ్లుగా 29 సవరణలు చేశారు. మతాలను నమ్మించే పేరిట ప్రజలను మభ్యపెట్టేందు కోసం వినియోగిస్తున్న మూఢ నమ్మకాలను పాటించడం, చేతబడులను నిషేధిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని హమీద్ డిమాండ్ చేశారు.