suspicious condition
-
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి
జునాగఢ్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లా చార్వాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విమల్ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్ వాదన మరోలా ఉంది. నితిన్‌ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్ నోట్‌ను సృష్టించారని ఆరోపించారు. నితిన్ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. -
అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగి ఉంటుంది.. లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. -
వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
-
మా అబ్బాయిది ముమ్మాటికీ హత్యే
టి.నరసాపురం : పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల వంశీకృష్ణ అనే విద్యార్థి ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఇక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన పడాల పాండురంగారావు, సుబ్బాయమ్మ మూడో సంతానం వంశీకృష్ణ. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలోని సెంచూరియన్ యూనివర్సిటీలో బీఎస్సీ (అగ్రికల్చర్) ఫైనలియర్ చదువుతున్నాడు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వంశీకృష్ణ గతనెల 18న ఇంటి నుంచి కళాశాలకు వెళ్లాడు. అతడు మృతిచెందినట్టు మంగళవారం ఉదయం అతడి స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో వంశీకృష్ణ చినతాత పడాల సత్యనారాయణ, అతని బంధువులు గండబోయిన కిషోర్, పి.రంగారావుతోపాటు పది మంది ఒడిశా వెళ్లారు. వంశీకృష్ణది హత్యే అని, కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పడాల సత్యనారాయణ అక్కడి పోలీసులను కోరారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అక్కడి డీఎస్పీ వీరికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి పర్లాకిమిడి వెళ్లాడు బుధవారం సాయంత్రం మృతదేహానికి పర్లాకిమిడిలో పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం ఉదయం మృతదేహాన్ని బొర్రంపాలెం తీసుకువస్తామని వంశీకృష్ణ బంధువులు తెలిపారు. ఈ నెల 9న ప్రాజెక్ట్ పనిమీద హైదరాబాద్ వెళ్లిన వంశీకృష్ణ 10న తిరిగి పర్లాకిమిడి చేరుకున్నాడు. 11న స్నేహితులు ఫోన్ చేయడంతో కళాశాలకు వెళ్లాడు. 12న ఉదయం కళాశాలలో వంశీకృష్ణ మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వంశీకృష్ణ తండ్రి రంగారావు మూడెకరాలు వ్యవసాయం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు వినోద్‌ను ఎంబీఏ చదివించగా కుమార్తె ఏలూరులో ఎంటెక్ చదువుతోంది. చివరగా 11న రాత్రి తమతో ఫోన్లో మాట్లాడిన వంశీకృష్ణ హైదరాబాద్ నుంచి క్షేమంగా ఒడిశా చేరుకున్నానని చెప్పాడని అన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఎలుగుబంటి మృతి
కల్యాణదుర్గం పట్టణ శివారులో ఓ ఎలుగుబంటి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఎవరైనా దానిని వలపన్ని చంపారా లేక అనారోగ్యం బాగలేక సహజరీతిలో మృతిచెందిందా అనేది మిస్టరీగా మారింది. సంఘటనాస్థలాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరీలు పరిశీలించారు. -
ఆరో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
శామీర్‌పేట్: ఆరో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతంలోని బోర్పేట్కు చెందిన మామిండ్ల రత్నాల, భాగ్యలక్ష్మి దంపతులు కొన్నేళ్ల క్రితం మండలంలోని అలియాబాద్క వలస వచ్చారు. స్థానికంగా ఓ స్పిన్నింగ్మిల్లో పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరు దత్తత తీసుకున్న మాధవి(12) లాల్గడిమలక్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. మంగళవారం స్కూల్ నుంచి వచ్చిన బాలిక ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంది. సాయంత్రం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన మాధవి తల్లిదండ్రులు విషయం గమనించి లబోదిబోమన్నారు. సీఐ సత్తయ్య ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఆగర్రు (పాలకొల్లు అర్బన్) : ఆగర్రు శివారు చిట్టివానిగర్వుకు చెందిన గుబ్బల పెద్దిరామ్ (27) అతని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు ఇవి.. పెద్దిరామ్ పెనుమంట్ర కేఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చదివాడు. అదే కళాశాలలో 2013 ఆగస్టు నుంచి లైబ్రేరియన్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కళాశాల విధులు ముగించుకుని బైక్‌పై తన చెల్లెలు కమల అత్తవారిల్లు అయిన యలమంచిలి మండలం కాజ వెళ్లాడు. చెల్లెలి పిల్లలను బుధవారం ఆసుపత్రిలో చూపించే నిమిత్తం తనతోపాటు రాత్రి 7 గంటలకు చిట్టివానిగర్వులో తన ఇంటికి తీసుకువచ్చా డు. అదే గ్రామంలోని అతని మిత్రు డు నేలపూడి ప్రదీప్ గల్ఫ్ నుంచి రావడంతో అతని వద్దకు వెళ్లి కబుర్లు చెప్పుకుని అక్కడే భోజనం చేశాడు. రాత్రి అతను ఇంటికి ఎప్పుడు చేరుకున్నాడో తల్లిదండ్రులకు తెలియదు. ఉదయం అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, అనసూయమ్మ చూసేసరికి పెద్దిరామ్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడిఉన్నాడు. అతని చెవి, ముక్కులోనుంచి రక్తం వచ్చింది. శరీరంపై గాయాలు లేవు. మృతుని ఇంటికి సమీపంలో రోడ్డుపై రక్తపు మరకలు పడి ఉండటం అనుమానాలకు తావి చ్చింది. పాలకొల్లు రూరల్ సీఐ ఆరిమిల్లి చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ పరిశీలన ఏలూరు నుంచి వచ్చిన వేలిముద్రల విభాగం ఎస్సై ఎం.రాజేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్వ్కాడ్ తీసుకువచ్చిన జాగిలం పేటలోనూ, అక్కడ నుంచి ఆగర్తిపాలెం వెళ్లే రోడ్డులోనూ, చందపర్రు వెళ్లే రోడ్డులో తిరిగింది. కూలి సొమ్ముతో డబుల్ ఎంఏ, బీఈడీ పెద్దిరామ్ చిన్నతనం నుంచి కష్టజీవి. తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు. అతను వ్యవసాయ పనులు చేస్తూనే డబుల్ ఎంఏ, బీఈడీ చదివాడు. ఉద్యోగం వచ్చిన తరువాత వివాహం చేసుకుంటానని స్నేహితులతో చెప్పేవాడు. జుట్టు కోసం వాడుతున్న మందు వికటించిందా! పెద్దిరామ్ తల జట్టు ఊడిపోయి బోడిగుండులా మారింది. జుట్టు కోసం అతను తలకు ఓ ద్రవం రాసుకునేవాడు. దానితోపాటు మాత్రలు వాడేవాడు. ఆ మాత్రలు అయిపోయాయని, రాజమండ్రి వెళ్లి తెచ్చుకోవాలని అతను మిత్రుడు ప్రదీప్ వద్ద ప్రస్తావించినట్టు పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి అదృశ్యం
దుగ్గిరాల (గుంటూరు) : ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండలంలోని రేవేంద్రపాడుకు చెందిన చుక్కపల్లి కోటేశ్వరరావు ఆదివారం రాత్రి సమయంలో బైకుపై మంగళగిరికి బయలుదేరాడు. అయితే రేవేంద్రపాడు సమీపంలోని కాలువ వద్ద ఆయన బైకు పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడి మృతి
తిరువళ్లూరు: చెన్నై నుంచి ఏర్కాడు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ముందు భాగంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శుక్రవారం రాత్రి 12 గంట లకు తిరువళ్లూరు రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. చె న్నై సమీపంలోని తిరువీకే నగర్ ప్రాంతానికి చెందిన లోకనాథన్ కుమారుడు పవిత్రన్. ఇతను తమిళనాడు రాష్ట్రం తరపున బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరువాన్మియూర్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో శుక్రవారం ఉదయం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నై నుంచి ఏర్కాడు వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రాత్రి 12 గంటలకు తిరువళ్లూరు చేరుకుంది. అయితే ఇంజిన్ ముందు భాగంలో యువకుడి మృతదేహ ం ఉన్నట్టు డ్రైవర్‌కు తెలిపారు. దీంతో ఇంజిన్ ముందు భాగంలో ఉన్న మృతదేహన్ని చూసిన డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. మృతుడి పర్సులోని ఐడీ కార్డు ఆధారంగా తిరువీకేనగర్ ప్రాంతానికి చెందిన పవిత్రన్‌గా గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా పవిత్రన్ పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. మ్యాచ్, ప్రాక్టీస్ కోసం నిత్యం చెన్నై వెళ్లే పవి త్రన్ పెరంబూరులోకో వరకు లోకల్ రైళ్లో వచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేవాడని తెలిసింది. ఇదే సమయంలో రాత్రి మ్యాచ్ ముగించుకుని, ఇంటికి వచ్చే క్ర మంలో పెరంబూరులోకో వద్ద లెవల్ క్రాస్ చేసే సమయంలో రైలు ఢీకొని మృతి చెంది ఉం డవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే క్రీడాకారుడి మృతిపై పలు అనుమానాలు వున్న నేపథ్యం లో పవిత్రన్‌ను రైలు ఢీకొని మృతిచెం దాడా ఎవరైనా హత్య చేసి రైలు ఇంజి న్పై పడేశారా అనే కోణంలో పోలీసు లు విచారణ జరుపుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య?
అద్దంకి : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో భావిలో శవమై తేలింది. భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పట్టణంలోని గుంజివారిపాలెంలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. పంగులూరు మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, లక్ష్మిల కుమార్తె రేణుక(24)కు పట్టణంలోని గుంజివారిపాలేనికి చెందిన మక్కెళ్ల పిచ్చియ్యతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రేణుక చిన్నప్పటి నుంచి రాజుపాలెం శాంతినగర్‌లో అమ్మమ్మ ధనమ్మ వద్ద పెరిగింది. పిచ్చియ్య వరంగల్ ప్రాంతంలో బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. రెండు నెలల క్రితం భార్య తన అమ్మమ్మ వద్దకు వచ్చి అక్కడే ఉంటోంది. దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఓ సారి రేణుక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భర్తను చూసేందుకు రేణుక అద్దంకిలోని గుంజివారిపాలేనికి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదుగానీ ఆమె తన భర్త ఇంటికి సమీపంలోని బావిలో శవమై తేలింది. స్థానికులు రేణుక మృతదేహాన్ని గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ బిడ్డను ఆమె భర్తే చంపి బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంటిపై చీర, దుప్పటి ఉండటం.. వాటికి కొద్ది దూరంలో రక్తపు మరకలు, బావి గిలకకూ రక్తం అంటి ఉండటంతో ఆమెది హత్యేనని బంధువులు చెబుతున్నారు. రేణుకను హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు.. స్థానికులతో కలిసి భర్త పిచ్చియ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అత డిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రేణుక ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తోలుకట్ట(మొయినాబాద్), న్యూస్‌లైన్: అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వేసిన విద్యుత్ కంచె ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. అయితే అర్ధరాత్రి సమయంలో విద్యార్థి పొలానికి ఎందుకు వెళ్లాడనేది అనుమానాస్పదంగా మారింది. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన షేక్ హైమద్ రజా(21) మొయినాబాద్ మండల కేంద్రంలో ఓ గదిలో అద్దెకు ఉంటూ మండల పరిధిలోని ఎత్బార్పల్లి రెవెన్యూలో ఉన్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గొవ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లివచ్చేవాడు. ఎత్‌బార్‌పల్లికి చెందిన పల్లె పద్మారెడ్డికి తోలుకట్ట రెవెన్యూ పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది. అందులో మొక్కజొన్న పంట వేశాడు. మొక్కజొన్న పంటను అడవిపందులు నాశనం చేయకుండా చేను చుట్టూ ఇనుపవైర్లు కట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం మొక్కజొన్న చేనులో పనిచేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి విద్యుదాఘాతంతో మృతి చెందిన షేక్ హైమద్ రజా కనిపించాడు. అతడు వెంటనే స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవిచంద్ర, ఎస్సై శంకరయ్య సిబ్బం దితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థి షేక్ హైమద్ రజా చొక్కా విప్పి చేతిలో పట్టుకుని, కాళ్లకు విద్యుత్ వైర్లు తగలడంతో కాలిన గాయాలతో మృతి చెంది బోర్ల పడి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముంబాయిలో ఉన్న మృతుడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. గురువారం అర్థరాత్రి సమయంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రైతు పద్మారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతిపై పలు అనుమానాలు విద్యార్థి మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. గురువారం కళాశాలకు వెళ్లిన షేక్ హైమద్ రజా ఆ తర్వాత పొలం వైపు ఎందుకు వెళ్లాడనేది తెలియకుండా ఉంది. విద్యుత్ తీగలు తగిలి పడిన సమయంలో అతడి చొక్క ఒంటిపైన లేకుండా చేతిలో ఉండటం, మొక్కజొన్న చేళ్లో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తుండడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మక్క బుట్టల కోసమైతే అర్ధరాత్రి సమయంలో వెళ్తాడా అనే అనుమానం కలుగుతుంది.