అనుమానాస్పద స్థితిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడి మృతి
తిరువళ్లూరు: చెన్నై నుంచి ఏర్కాడు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ముందు భాగంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శుక్రవారం రాత్రి 12 గంట లకు తిరువళ్లూరు రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. చె న్నై సమీపంలోని తిరువీకే నగర్ ప్రాంతానికి చెందిన లోకనాథన్ కుమారుడు పవిత్రన్. ఇతను తమిళనాడు రాష్ట్రం తరపున బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరువాన్మియూర్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో శుక్రవారం ఉదయం పాల్గొన్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నై నుంచి ఏర్కాడు వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రాత్రి 12 గంటలకు తిరువళ్లూరు చేరుకుంది. అయితే ఇంజిన్ ముందు భాగంలో యువకుడి మృతదేహ ం ఉన్నట్టు డ్రైవర్‌కు తెలిపారు. దీంతో ఇంజిన్ ముందు భాగంలో ఉన్న మృతదేహన్ని చూసిన డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. మృతుడి పర్సులోని ఐడీ కార్డు ఆధారంగా తిరువీకేనగర్ ప్రాంతానికి చెందిన పవిత్రన్‌గా గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా పవిత్రన్ పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
మ్యాచ్, ప్రాక్టీస్ కోసం నిత్యం చెన్నై వెళ్లే పవి త్రన్ పెరంబూరులోకో వరకు లోకల్ రైళ్లో వచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేవాడని తెలిసింది. ఇదే సమయంలో రాత్రి మ్యాచ్ ముగించుకుని, ఇంటికి వచ్చే క్ర మంలో పెరంబూరులోకో వద్ద లెవల్ క్రాస్ చేసే సమయంలో రైలు ఢీకొని మృతి చెంది ఉం డవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే క్రీడాకారుడి మృతిపై పలు అనుమానాలు వున్న నేపథ్యం లో పవిత్రన్‌ను రైలు ఢీకొని మృతిచెం దాడా ఎవరైనా హత్య చేసి రైలు ఇంజి న్‌పై పడేశారా అనే కోణంలో పోలీసు లు విచారణ జరుపుతున్నారు.