T20 world cup 2016
-
'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్‌కప్ హీరో
2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్‌స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి బ్రాత్‌వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్‌వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్‌వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్‌వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్‌వైట్ వివరించాడు. చదవండి:అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా! తాజాగా ఈడెన్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు 'ఈడెన్' వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్‌వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్‌వైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. '' గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్‌వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్వైట్కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ''తాజ్'' అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్‌మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్‌ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్‌మహల్ వేదికగానే లవ్‌ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ''ఇండీ'' అని పేరు పెట్టాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
ఐదేళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకున్న బెన్ స్టోక్స్..
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవానికి.. ఐదేళ్ల తర్వాత లెక్క అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళితే.. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్(54), జోస్ బట్లర్(36), డేవిడ్ విల్లీ(21) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు తీశారు. Stokesy sends it into the stands 6⃣ Durham 41/2 after the powerplay. #ForTheNorth pic.twitter.com/a9fRAImyhg — Durham Cricket (@DurhamCricket) June 26, 2021 అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని రెండోసారి పొట్టి ఫార్మాట్లో ఛాంపియన్‌గా అవతరించింది. 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లీష్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన బ్రాత్‌వైట్ విండీస్‌కు అపురూప విజయాన్ని అందించాడు. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్టోక్స్, బ్రాత్‌వైట్ ప్రత్యర్థులుగా ఎక్కువగా ఎదురుపడలేదు. అయితే బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం స్టోక్స్‌కు టీ20 బ్లాస్ట్ రూపంలో వచ్చింది. ఈ లీగ్‌లో భాగంగా డర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్.. వార్విక్షైర్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 6,4,0,6 బాదేశాడు. ఐదేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నాడు. బ్రాత్వైట్లా వరుస సిక్స్‌లు బాదే అవకాశం రానప్పటికీ.. అతనిలానే భారీ షాట్లు ఆడుతూ ఒకే ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న స్టోక్స్.. 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేయడంతో డర్హమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం వార్విక్షైర్ 18.3 ఓవర్లలోనే 130 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. కాగా, ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో నిలిచిన స్టోక్స్.. చేతి వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. -
వెస్టిండీస్ మురిసే.. స్టోక్స్ ఏడిచే
లక్ష్యం 156 పరుగులు.. 107 పరుగులకే ఆరు వికెట్లు.. ఊరిస్తున్న లక్ష్యం..అడుగు దూరంలో ప్రపంచకప్.. బంతులా లేక బుల్లెట్లా అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్.. ఇది వెస్టిండీస్ పరిస్థితి. అయితే ఎవరూ ఊహించని విధంగా మహాఅద్భుతం జరిగింది. కాదు మహాద్భుతం జరిగేలా చేశాడు. అతడే కార్లోస్ బ్రాత్‌వైట్. ఆశలు చనిపోయిన స్థితి నుంచి ప్రతీ ఒక్క కరేబియన్ అభిమాని కాలర్ ఎగరేశాలా చేశాడు. అయితే బ్రాత్‌వైట్ ధాటికి బలైన బౌలర్ మాత్రం కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. అతడే బెన్ స్టోక్స్. అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించిన ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికైంది. ఆ మహా సమరం జరిగింది ఇదే రోజు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీకోసం.. సెమీఫైనల్లో టీమిండియాపై గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఫైనల్లో ఇంగ్లండ్ పోరుకు వెస్టిండీస్ సిద్దమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జాసర్ రాయ్(0), అలెక్స్ హేల్స్(1), ఇయాన్ మోర్గాన్(5)లు ఘోరంగా నిరుత్సాహపరచడంతో బ్రిటీష్ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జోయ్ రూట్(54) బాధ్యతాయుతంగా ఆడాడు. రూట్‌కు తోడు బట్లర్(36) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డేవిడ్ విల్లీ(21) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. బద్రీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శాముల్స్ ఒకేఒక్కడు.. ఇంగ్లండ్ విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టుకు ఇంగ్లండ్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. చార్లెస్(1), గేల్(4), సిమ్మన్స్(0) రస్సెల్(1), డారెన్ సామీ(2)లను వరుసగా పెవిలియన్‌కు పంపించి విండీస్‌ను పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ కష్టకాలంలో సీనియర్ బ్యాట్స్‌మన్ శాముల్స్(85నాటౌట్) ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటిరి పోరాటం చేశాడు. శాముల్స్కు బ్రావో(25) చక్కటి సహకారం అందించినా చివరి వరకు నిలబడలేకపోయాడు. అయితే రన్‌రేట్ పెరిగిపోతుండటంతో విండీస్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. బ్రాత్‌వైట్ విధ్వంసం 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో ఆ ఓవర్లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ వేసిన చివరో ఓవర్లో బ్రాత్‌వైట్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్‌కు విజయాన్ని, ప్రపంచకప్‌ను అందించిపెట్టాడు. బ్రాత్‌వైట్(34 నాటౌట్) వరుసగా సిక్సర్లు కొట్టడంతో షాక్‌కు గురైన బెన్ స్టోక్స్ మైదానంలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్ జరిగింది ఇదే రోజు కావడంతో ఐసీసీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా బ్రాత్‌వైట్ సిక్సర్లకు సంబంధించిన వీడియోనూ సైతం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆 They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC — ICC (@ICC) April 2, 2020 చదవండి: ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా? -
సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం
‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోటే ఉంటాయి..మోయక తప్పదు’అని ఓ సినిమాలో పేర్కొన్నట్టు భారత క్రికెట్ జట్టు, అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రెండు సంఘటనలు జరిగినవి ఇదే రోజు(మార్చి 31). ఆ రెండు జ్ఞాపకాల్లో ఒకటి టీమిండియా మనోవేదనకు గురైనది కాగా.. మరొకటి సరికొత్త చరిత్ర లిఖించిన అంశం. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ రెండు జ్ఞాపకాలను టీమిండియాతో పాటు అభిమానులు తమ గుండెల్లో మోస్తూనే ఉన్నారు. అవేంటో చూద్దాం.. 2016, మార్చి 31.. టీమిండియా అభిమానులు కలలో కూడా మర్చిపోలేని రోజు. ధోని చేతిలో టీమిండియా ఖాతాలో మరొక ప్రపంచకప్ ఖాయమని అనుకున్న ఆందరి ఆశలపై వెస్టిండీస్ నీళ్లు చల్లింది. టీ20 ప్రపంచకప్ 2016 సెమీస్‌లో భాగంగా విండీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విరాట్ కోహ్లి(89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) వీరతాండవం చేయగా.. రోహిత్ శర్మ (43), అజింక్యా రహానే (40) రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19 పరుగులకే క్రిస్ గేల్(5), శాముల్స్(8) వికెట్లను చేజార్చుకుంది. West Indies needed 73 runs from the last six overs against India #OnThisDay in 2016, in order to secure a spot in the #T20WorldCup final. 🎥 Watch how @Russell12A and @54simmo finished it with two balls to spare 👇 pic.twitter.com/I5ZAvdhiYJ — ICC (@ICC) March 31, 2020 మూడు ఓవర్లు ముగిసే సరికే విండీస్ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో విండీస్ గెలుపు అంత ఈజీ కాదని అందరూ అనుకున్నారు. కానీ పొట్టి క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన కరేబియన్ ఆటగాళ్లు ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు. తొలుత చార్లెస్ (52; 36 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి మిగతా ఆటగాళ్లకు బూస్టప్ ఇచ్చాడు. అనంతరం సిమ్మన్స్ (82 నాటౌట్; 51 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే విండీస్ విజయానికి 36 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన సమయంలో గెలుపు అవకాశాలు సమంగానే నిలిచాయి. కానీ సిమ్మన్స్ సహాయంతో అండ్రీ రసెల్ (43 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. మరో రెండు బంతులు మిగిలుండగానే విండీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన కోహ్లి ఒక వికెట్ దక్కించుకోవడం విశేషం. ఇక ఫైనల్‌కు చేరుకున్న విండీస్ అందరి అంచనాలను తలకిందులు చేసి ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలి క్రికెటర్‌గా సచిన్.. 2001, మార్చి31.. అంతర్జాతీయ, టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు. టీమిండియా గాడ్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత 13 మంది క్రికెటర్లు పదివేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా పదివేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్(259 ఇన్నింగ్స్‌ల్లో) ఇప్పటికీ కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో సారథి విరాట్ కోహ్లి(205 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్న విషయం తెలిసిందే. చదవండి: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా? రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా -
టీమిండియా చిరస్మరణీయ విజయం; వీడియో
సాక్షి, స్పోర్ట్స్: ఊహకందని స్థాయిలో.. ఊహించని రీతిలో.. చేజారిన మ్యాచ్‌ను టీమిండియా ఒడిసిపట్టుకున్న సందర్భం గుర్తుందా! నేటికి సరిగ్గా రెండేళ్ల కిందట.. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి. 2016, మార్చి 23.. : టీ20 ప్రపంచకప్ సెమీస్‌లోకి వెళ్లాలంటే బంగ్లాపై గెలుపు తప్పనిసరి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. లక్ష్యఛేధనలో ధాటిగా ఆడిన బంగ్లా.. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సివచ్చింది. ఒకటో బంతి సింగిల్, రెండు, మూడో బంతులు బౌండరీలు.. అంటే మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లా గెలుస్తుంది. కానీ పాండ్యా వేసిన నాలుగో బంతికి ముష్ఫికర్ క్యాచౌట్! ఫుల్ టాస్‌గా వచ్చిన ఐదో బంతికి మమ్మదుల్లా క్యాచ్‌ఔట్. ఇక చివరి బంతి.. ఒక్క పరుగు తీసినా మ్యాచ్ టై అవుతుంది. మిస్టర్ కూల్ ధోనీ బంగ్లా కలలపై నీళ్లు జల్లాడు. ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్ షువగతా మిస్ చేశాడు. నాన్‌స్ట్రైకర్ ముస్తాఫిజుర్ పరుగు పూర్తిచేసేలోపే.. కీపర్ ధోనీ తెలివిగా పరుగెతుడూ వచ్చి బెయిల్స్ ఎగరగొట్టాడు. రనౌట్. భారత్ ఒక్కపరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది. టీ20ల్లో చివరి మూడు బంతులకు మూడు వికెట్లు నేలకూల్చిన భారత రికార్డు ఇంకా పదిలంగానేఉంది. అఫ్కోర్స్ సెమీస్‌లో ఓడిపోయాం!: భారత్ వేదికగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ ఎగరేసుకుపోవడం తెలిసిందే. బంగ్లాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో మాత్రం కరీబియన్ల చేతిలో ఖంగుతిన్నది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో విండీస్ప్లేయర్లు రెచ్చిపోయి ఆడారు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిఉండగా బ్రాత్‌వైట్ సిక్స్‌బాదిన దృశ్యం క్రీడాభిమానుల మనసుల్లోనుంచి చెరిపేయలేనిది. -
‘ఒక్క పరుగు’కు రెండేళ్లు పూర్తి..
-
యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్
ముంబై: అనుకున్నట్లే జరిగింది. చీలమండ గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రేపు(గురువారం) ముంబైలో వెస్టిండీస్ తో జరగనున్న సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం యువరాజ్ స్థానంలో మనీశ్ పాండేను జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు నిర్ధారించారు. నిజానికి యువరాజ్ గాయపడ్డప్పుడే మనీశ్ జట్టులోకి వస్తాడని ఊహించినప్పటికీ బుధవారం సెలెక్టర్ల ప్రకటనతో అది ఖరారయింది. సెమీస్ లోకి ప్రవేశించేందుకు గత ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగన అమీతుమీ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఒక్కసారిగా కూలబడ్డ యువరాజ్ ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తొలి, మలి టీ20 వరల్డ్ కప్ ల్లో సత్తా చాటినంతగా యువరాజ్ ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన అతను.. కేవలం 63 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పాకిస్థాన్ పై సాధించిన 24 పరుగులే అత్యధిక స్కోరు. మూడు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసే అవకాశం రాని యువరాజ్ ఆసీస్ తో జరిగి మ్యాచ్ లో మాత్రం మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు. -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిది
మొహాలి: టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఊహించని వివాదానికి తెరలేపాడు. ఆటల్లోకి కశ్మీర్ అంశాన్ని లాగాడు. మంగళవారం మొహాలిలో పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ తమ జట్టుకు మద్దతుగా కశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చారని అతను పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడిన తర్వాత కామెంటేటర్, పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా ఆఫ్రిదితో మాట్లాడాడు. మీకు, మీ జట్టుకు ఇక్కడ ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తున్నాదా? అని అడిగాడు. ఇందుకు 'చాలామంది కశ్మీర్ ప్రజల' నుంచి మద్దతు లభిస్తోంది అంటూ అతను తెలిపాడు. 'మొహాలిలోనూ మీకు అభిమానులు ఉన్నట్టు కనిపిస్తోంది' అని రజా పేర్కొనగా.. 'ఔను. కశ్మీర్ నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చారు. ఇక కోల్‌కతా ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. వారు కూడా మద్దతు తెలిపారు' అని ఆఫ్రిది పేర్కొన్నాడు. టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 180 పరుగులు చేసింది. ఆఫ్రిది ఇప్పటికే పెద్ద వివాదంలో ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తుందని అతను పేర్కొన్న వ్యాఖ్యలు స్వదేశంలో అతన్ని ఇరకాటంలో పడేశాయి. దీనికితోడు భారత్ చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓడటం కూడా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతన్ని జట్టు సారథిగా తొలగిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఔను, ఆఫ్రిదిని పీకేస్తాం!
కరాచీ: టీ-20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది క్రికెట్ కెరీర్ కు తెరపడినట్టే కనిపిస్తోంది. భారత్ లో ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే ఆఫ్రిదిని పాక్ టీ-20 జట్టు కెప్టెన్ పదవి నుంచి తొలగిస్తామని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ సోమవారం తేల్చి చెప్పారు. క్రికెటర్ గా కూడా అతను రిటైరవ్వనున్నారని చెప్పారు. టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతా లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై దేశంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోల్ కతా నుంచి స్వదేశం వెళ్లిన పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్ లో విలేకరులతో మాట్లాడారు. పీసీబీకి ఆఫ్రిదికి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం వరల్డ్ కప్ కాగానే అతను రిటైర్ అవుతాడని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్ కప్ వరకే ఆఫ్రిది కెప్టెన్ గా ఉంటాడని చెప్పారు. ఆయన తన నిర్ణయం మార్చుకొని క్రికెటర్ గా కొనసాగాలని భావించినా.. అతన్ని ఒక ఆటగాడిగా జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ఆలోచిస్తామని ఖాన్ తేల్చిచెప్పారు. అయితే పాక్ టీ20 జట్టు కెప్టెన్ గా ఆఫ్రిదిని నియమించడంలో బోర్డు తప్పిదం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఆఫ్రిది ఐకానిక్ ఆటగాడని, తన సొంత ప్రతిభతో ఎన్నో మ్యాచులను అతను గెలిపించాడని ఆయన తెలిపారు. కెప్టెన్ గా ఆయన ఎంపిక సరైనదేనని, పెద్ద మ్యాచుల్లో జట్టు ఓడినప్పుడు విమర్శలు సహజమేనని వివరించారు. ప్రస్తుతం జట్టు కోచ్ గా ఉన్న వకాన్ యూనిస్ ను కూడా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఆ పిచ్ 'యాంటీ నేషనలా'?
వరుస విజయాలు, భారీ అంచనాలు, ఫేవరెట్ అన్న ట్యాగ్, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న అడ్వాంటేజ్.. ఇన్ని తోడున్న టీమిండియాను అద్భుతమైన పోరాటపటిమతో బోల్తా కొట్టించింది కివీస్ జట్టు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 47 పరుగులతో ధోనీసేనను చిత్తుచేసింది న్యూజిలాండ్ జట్టు. 126 పరుగుల లక్ష్య ఛేదనలో 79 పరుగులకే టీమిండియా చేతులెత్తేయడం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా రూపొందిన నాగ్‌పూర్ పిచ్‌పైనా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోమ్ టీంకు అనుగుణంగా పిచ్ లేదని కొందరు పెదవి విరుస్తుండగా.. ఇటు ధోనీ సేన చెత్త ప్రదర్శనపై నెటిజన్లు సెటైరికల్ వ్యాఖ్యలతో ట్విట్టర్‌ను ముంచెత్తారు. ప్రపంచంలోనే స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొనే జట్టయిన టీమిండియా.. స్పిన్ బౌలింగ్ ను ఎలా ఆడకూడదో చూపిందని పలువురు విమర్శించారు. నాగ్‌పూర్ పిచ్ యాంటీ నేషనల్ అయి ఉంటుందని, అందుకే లక్షఛేదనలో 47 పరుగులకు ముందే టీమిండియాకు కళ్లెం వేసిందని ఒక నెటిజన్ అభిప్రాయపడగా.. పిచ్ క్యూరేటర్ జెఎన్యూలో చదివి ఉంటాడని, అందుకే పిచ్ సహకరించలేదని మరో నెటిజన్ చమత్కరించాడు. బీసీసీఐ అంటే 'బోరెడ్ ఆఫ్ క్రికెట్ కొలాప్స్ ఇన్ ఇండియా' అని ఒకరు నిర్వచనమివ్వగా.. ఈ ఓటమికి శిక్షగా ఆటగాళ్లకు 'తేరా సురూర్' సినిమాను బీసీసీఐ చూపించాలంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు. -
అతను చాలా ప్రమాదకరమైన క్రికెటర్!
యంగ్‌స్టర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దూకుడు మీద ఉండటం.. ధోనీ సేన మీద చాలా ఆశలు రేపుతోందని అంటున్నాడు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్. మరోసారి పొట్టికప్పును ధోనీ సేన కైవసం చేసుకొని చరిత్ర తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలోఈ ఆల్‌రౌండర్ కూడా సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ సేన ఫామ్, యువత, అనుభజ్ఞులతో జట్టు మంచి సమతుల్యంతో ఉందని, దీనికితోడు స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే విషయమని యూసఫ్ పఠాన్ విశ్లేషించాడు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్‌లలో, ఆసియా కప్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరు కనబర్చిందని కొనియాడాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో నిస్సందేహంగా ఇండియానే ఫేవరెట్ జట్టు అని, ఈ మెగా టోర్నమెంటులో డాషింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుకు స్టార్ ఫర్ఫార్మెర్లుగా నిలువనున్నారని పేర్కొన్నాడు. 'టీ20 ఫార్మెట్లో కోహ్లి చాలా ప్రమాదకరమైన క్రికెటర్. అతని ఆటతీరు చూడటం నిజంగా కనులకు పండుగే. రోహిత్, కోహ్లి ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లే. తమదైన శైలిలో ఆడుతూ.. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు' అని పఠాన్ పేర్కొన్నాడు. 33 ఏళ్ల యూసఫ్ పఠాన్ ప్రస్తుతం జట్టులో లేకపోవడం నిరాశ కలిగిస్తున్నదని చెప్పాడు. భవిష్యత్తులో జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. -
ధోనీ బ్యాట్ సౌండే.. భారత్‌కు విజయఢంకా!
న్యూఢిల్లీ: ఇటీవల ఆసియా కప్‌లో మహేంద్రసింగ్ ధోనీ ఆడుతుండగా.. ఆయన బ్యాటు నుంచి వచ్చిన 'సౌండ్' విన్నారా? ధాటిగా, దీటుగా వెలువడిన ఆ శబ్దం.. ధోనీ పాజిటివ్ మైండ్‌సెట్‌కు (సానుకూల దృక్పథానికి) నిదర్శనమని, టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇందెంతో శుభసంకేతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా భారత సారథి ధోనీకి మంచి పేరుంది. అయితే నిన్నమొన్నటివరకు ఫామ్‌లో లేక ఈ కూల్ కెప్టెన్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆసియా కప్‌లో మళ్లీ దూకుడుగా ఆడుతూ బెస్ట్ ఫినిషర్ అని తనను ఎందుకంటారో మరోసారి నిరూపించుకున్నాడు మహీ. ఈ నేపథ్యంలో సచిన్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ ' ప్రపంచంలో ఏ ఆటగాడైనా తన కెరీర్ మొత్తం మంచి ఫామ్‌లో కొనసాగాలంటే కుదరదు. ఎందకంటే ఆటగాళ్లు యంత్రాలు కాదు. ధోనీ బ్యాటును బంతి తాకినప్పుడు వచ్చిన శబ్దాన్ని నేను విన్నప్పుడు.. అది విభిన్నమైన శబ్దంగా నాకు అనిపించింది. బ్యాట్స్‌మన్ భిన్నమైన మైండ్‌సెట్‌తో ఉన్నాడని చెప్పేందుకు ఆ సౌండ్ నిదర్శనం' అని అన్నాడు. 'ధోనీకి ఉన్న అతిపెద్ద ఆస్తి.. అతడు ఒత్తిడిని అవలీలగా పీల్చుకోగలగడమే. అదే అతన్ని మంచి కెప్టెన్‌ను చేసింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ అతను మరింత పరిణతి సాధిస్తున్నాడు. ఒత్తిడిలో ఉన్నట్టు అతను ఎప్పుడూ కనబడడు. ఇది జట్టుకు మంచి సంకేతం. కెప్టెన్ కోపం ప్రదర్శించడం లేదా నెర్వెస్‌గా ఫీలవ్వడం జట్టులో భయాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి ధోనీతో రాదు' అని సచిన్ విశ్లేషించాడు. ధోనీ ఫామ్‌లోకి రావడం, యువీ తిరిగి సత్తా చాటుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని, అయితే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు 'గేమ్ చేంజర్'గా జస్ప్రీత్ బూమ్రా నిలిచే అవకాశముందని, అతను డిసెప్టివ్ యాక్షన్‌తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడని సచిన్ చెప్పాడు. ఫ్లెక్సిబిలిటీయే భారత జట్టులో బెస్ట్ అంశమని పేర్కొన్నాడు. -
అఫ్రిదీ 'ప్రేమ' వ్యాఖ్యలతో చిక్కులు!
లాహోర్: పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఓ న్యాయవాది అఫ్రిదీకి లీగల్ నోటీసులు పంపాడు. లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ నోటీసులు జారీచేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమ, మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అంటూ వ్యాఖ్యానించాడు. అఫ్రిదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాక్ లాయర్ లీగల్ నోటీసులు పంపారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కూడా అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించారు. అఫ్రిది మాటలు నన్ను షాక్‌కు గురి చేశాయి.. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.