tailets
-
స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా..!
బెంగళూరు: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావుకు చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్‌లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ వల్ల ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో అపరిశుభ్ర టాయిలెట్ ఫోటోలు తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీటిని బెంగుళూరు విమానాశ్రయ అధికారిక ట్విటర్ ఖాతాకు నిరుపమ ట్యాగ్ చేశారు. దీంతోపాటు ‘విరిగిన పోయిన టాయిలెట్ టబ్, నిండినపోయిన చెత్త క్యాన్లు ఉన్నాయి. ఇదేనా ‘స్వచ్ఛ భారత్’ అంటే.. ‘స్వచ్ఛ భారత్’ ఎక్కడ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఇలా ఉండటం బాధాకరం’ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సత్వరమే టాయిలెట్‌ను బాగు చేసి మళ్లీ తమ ట్విటర్లో ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టు ఆధికారులు స్పదించిన తీరుకు నిరుపమ సంతోషించారు. ఈ క్రమంలో త్వరగా స్పందించి.. ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమ మనసును గెలుచుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
మరుగుదొడ్లు నిర్మాణంలో జాప్యమేందుకు.?
ఖమ్మం మేయర్‌ను, అధికారులను ప్రశ్నించిన మంత్రి తుమ్మల గండుగులపల్లి(దమ్మపేట): మారుమూల గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి అవుతున్నాయని, ఖమ్మం కార్పొరేషన్, మిగిలిన మున్సిపాలిటీల్లో.. ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం మేయర్ పాపాలాల్‌ను, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మండల పరిధిలోని గండుగులపల్లి తన నివాసంలో ఉన్న మంత్రి తుమ్మలను మేయర్‌తోపాటు, జిల్లాలోని పలు శాఖల అధికారులు వచ్చి కలిశారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్నులు సక్రమంగా వసూలు చేయాలని, పన్నులు వసూళ్లుంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. పాలేరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లున్నాయని, వాటిని వెంటనే క్రమబద్ధీకరించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ రమేష్‌ను ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్ఈగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రమేష్ ఈ సందర్భంగా మంత్రిని కలిశారు. మంత్రి తుమ్మలను కలసిన వారిలో డీసీసీబీ డైరక్టర్ పాలా నర్సారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, డొడ్డాకుల రాజేశ్వరరావు, నాయకులు పోతినేని శ్రీరామవెంకటరావు, దొడ్డాకుల గోపాలరావు, పసుమర్తి చంద్రరావు, కాసాని నాగప్రసాద్, ఎండీ వలీపాష, కురిశెట్టి సత్తిబాబు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు తదితరులున్నారు.