రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య
వజ్రకరూర్ (అనంతపురం): రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం జయరామపురం గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తమెలా నాయక్ (60) తనకున్న ఐదెకరాల పొలం మీద తీసుకున్న రుణం మాఫీ కాలేదని మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం విషం తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నాయక్‌ను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమెలా నాయక్ చికిత్సపొందుతూ గురువారం మరణించాడు.