Tax Deduction
-
పన్ను ఆదా.. చేద్దాం ఇలా!
ఆదాయపన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిల్లో పెట్టుబడులకు నిరీ్ణత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితోపాటు రిస్‌్కను కూడా ఆహా్వనించాల్సి వస్తుంది. తమ లక్ష్యాలు, రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. ► రాబడులు 5–6 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆరి్థక లక్ష్యాలకు రక్షణ కలి్పంచే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే, బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసి తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని, టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్లలోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.12,000–14,000 ప్రీమియం కింద చెల్లించాలి. అదే వ్యక్తి రూ.50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.5 లక్షలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాల్లో వచ్చే పరిహారం, కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్‌పై పూర్తిగా పన్ను మిహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వా ర్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లు అయినా ఉండాలి. ► రాబడులు 7–8 % మధ్య ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు వీటిల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది. కానీ, రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తన ఆదాయంలో చూపించి, ఏ శ్లాబులో ఉంటే ఆ ప్రకారం రేటు చెల్లించాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5 శాతం కంటే తక్కువే. కాకపోతే వేగంగా, సులభంగా ఇన్వెస్ట్ చేసుకోగల సౌలభ్యం ఇందులో ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఎన్ఎస్సీలో పెట్టుబడిని ఐదేళ్లకు ముందే ఉపసంహరించుకోవడం కుదరదు. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే దీనికి మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత మెరుగ్గా వడ్డీ రేటు 7.7 శాతం ఉంది. ► ప్రస్తుత రాబడి 7.1% ► లాకిన్: 15 ఏళ్లు ఇది రిస్‌్కలేని డెట్ సాధనం. ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. పీపీఎఫ్ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఈ పథకంలో ప్రస్తుత రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ సాధనంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సీ కింద పూర్తి పరిమితి (రూ.1.5 లక్షలు) మేరకు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, రాబడిపైనా పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్యకు దీన్ని పరిశీలించొచ్చు. ఇందులో పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంటుంది. ప్రారంభించి ఐదేళ్లు నిండిన తర్వాత ఇందుకు అనుమతిస్తారు. ప్రముఖ బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో దీన్ని ప్రారంభించొచ్చు ► ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రిస్‌్కలేని రాబడి సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ప్రస్తుతం ఇందులో రాబడి 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రాబడి ఎక్కువ. పెట్టుబడి కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున కాల వ్యవధి పెంచుకుంటూ వెళ్లొచ్చు. పొడిగించుకునే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. ఒక వ్యక్తి ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపన్ను చట్టం కింద వృద్ధులకు ఉంది. అంటే రూ.6.25 లక్షల వరకు పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను మినహాయింపు అయిన రూ.50 వేలలోపే ఉంటుంది. 60 ఏళ్లు నిండిన వారు, ముందస్తు పదవీ విరమణ పొందిన వారు 58 ఏళ్ల తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ సిబ్బందికి వయో పరిమితి లేదు. ► గడిచిన ఐదేళ్లలో కనిష్ట రాబడి: 8.16% ► పెట్టుబడులకు లాకిన్: 60 ఏళ్లు వరకు పన్ను ఆదాకు మెరుగైన సాధనాల్లో ఇదీ ఒకటి. ఒకవైపు విశ్రాంత జీవనం కోసం నిధిని సమకూర్చుకూర్చుకుంటూ, మరోవైపు పన్ను ఆదా చేసుకునే ప్రయోజనంతో వస్తుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.2 లక్షల పెట్టుబడిపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ(1బి)కింద రూ.50వేలపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి పరిధిలోకే సెక్షన్ 80సీసీడీ (1) కూడా వస్తుంది. దీనికి అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ (1బి) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే.. ఉద్యోగి వేతనంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో యాక్టివ్ ఆప్షన్ కింద ఈక్విటీలకు గరష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదిలో పెట్టుబడుల కేటాయింపులను (ఈక్విటీ, డెట్, ఏఐఎఫ్) నాలుగు పర్యాయాలు సవరించుకోవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజర్లనూ మార్చుకోవచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ/క్రమానుగతంగా ఉపసంహరణ)ను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. దీనివల్ల గడువు తీరిన తర్వాత ఒకే విడత కాకుండా, నెలవారీగా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎన్పీఎస్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ ఇదే పనితీరు ఉంటుందని అంచనా. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స్ అధిక శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తాయి. కనుక రిస్క్ దాదాపు చాలా తక్కువ. ► ఐదేళ్లలో వార్షిక రాబడి 7–14 శాతం ► లాకిన్ పీరియడ్: రిటైర్మెంట్ వరకు బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే చార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పీఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్‌ల మాదిరి పనిచేస్తాయి. కానీ, ఎన్పీఎస్, యులిప్‌లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనం కలి్పంచాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పీఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే, మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొసాగాల్సి వస్తుంది. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ► రాబడులు: గత ఐదేళ్లలో 7–9 % ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విట్లీలోనే పెట్టేస్తాయి. కానీ, రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతోపాటు డెట్ సాధనాల్లోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కలి్పస్తుంది. సెక్షన్ 80సీ కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ రిస్‌్కతో, మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40 శాతంలోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ, విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ ఐదేళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చార్జీలు విధిస్తోంది. ► ఇందులో రాబడి ప్రస్తుతం 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఇటీవలే ఈ పథకంలో వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాదిరే వడ్డీ రేటు, కేంద్ర సర్కారు గ్యారంటీతో కూడిన రిస్క్ లేని సాధనం ఇది. తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరి పేరిట గరిష్టంగా ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పథకాన్ని ప్రారంభించాలంటే కుమార్తెల వయసు 10 లోపు ఉండాలన్నది నిబంధన. పోస్టాఫీసులు, బ్యాంక్‌ల్లో ఈ స్కీమ్ కింద ఖాతాను ప్రారంభించొచ్చు. ఆర్బీఐ వచ్చే ఆరి్థక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం ఆరంభంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర సర్కారు సవరిస్తుంటుంది. కనుక సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత రేటు 8.2 శాతం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశించరాదు. కాకపోతే ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేనందున, కుమార్తెల భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రిస్‌్కలేని ఈ పథకానికి కేటాయించుకోవచ్చు. ► గడిచిన ఐదేళ్ల కాలంలో కనిష్ట వార్షిక రాబడి 8.15 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు యూనిట్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యులిప్‌లు) పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈఎల్ఎస్ఎస్ మాదిరిగా పెట్టుబడులకు అంత సౌకర్యవంగా ఉండవు. పోర్ట్‌ఫోలియో వివరాలు తెలుసుకోవడం కూడా సౌకర్యంగా కష్టమే. కాకపోతే యులిప్‌ల నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆశించొచ్చు. పైగా పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. బీమా రక్షణ కూడా కొంత లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడిపై పన్ను మిననహాయింపు ఉంటుందే కానీ, లాభాల ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో లాభం రూ.లక్షకు మించితే 10 శాతం పన్ను చెల్లించాలి. కానీ, యులిప్‌లలో రాబడి ఎంత వచి్చనా కానీ, గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను ఉండదు. ఈ ప్రయోజనం కోసం చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ కనీసం 10 రెట్లు అధికంగా ఉండాలని సెక్షన్ 10(10డి) చెబుతోంది. యులిప్ పాలసీలోనూ ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య ఇన్వెస్టర్ తన స్వేచ్ఛ ప్రకారం పెట్టుబడుల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. అలా మార్చుకున్నప్పటికీ పన్ను బాధ్యత ఉండదు. యులిప్ ప్లాన్లలో ఐదేళ్ల తర్వాత నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ పరిమితంగానే ఉండడం ప్రతికూలం. వార్షిక ప్రీమియానికి 10–12 రెట్ల వరకే రక్షణ ఎంపిక చేసుకోగలరు. అంటే ఏడాదికి రూ.1–1.20 లక్షలు చెల్లించినా, లభించే రక్షణ రూ.10–12 లక్షలకు మించదు. కనుక తగినంత జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. యులిప్‌ను రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. ► గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటా సగటు రాబడి 17 శాతం ► లాకిన్ పీరియడ్: మూడేళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ కూడా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. కనుక సమీప కాలంలో వీటిల్లో రాబడులు మెరుగ్గానే ఉంటాయని అంచనా. రాబడులు, భద్రత, లాకిన్ పీరియడ్ తదితర అంశాల పరంగా చూస్తే ఎన్పీఎస్ తర్వాత, ఎన్‌పీఎస్‌తో సమానంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పైగా పారదర్శకత ఎక్కువ. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెట్టుబడికి లాకిన్ కేవలం మూడేళ్లుగానే ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్‌్కను సమర్థవంతంగా అధిగమించొచ్చు. సెక్షన్ 80సీ కింద ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో సగటు రాబడులు ఏడాది కాలంలో 19 శాతం, మూడేళ్లలో 18.50 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 15.46 శాతం, పదేళ్లలో ఏటా 16.60 శాతం చొప్పున ఉన్నాయి. -
ఎర్లీబర్డ్’..యమా సక్సెస్!
సాక్షి హైదరాబాద్: కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు మిగతా సంవత్సరమంతా ఎలా నెట్టుకురావాలా అన్న ఆలోచనలోనూ అధికారులున్నారు. ఎర్లీబర్డ్ పథకం పాత బకాయిలు లేని, కొత్త ఆర్థికసంవత్సరం(2022–23)ఆస్తిపన్ను చెల్లించేవారికి వర్తిస్తుంది. ఎర్లీబర్డ్ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలి. పాత బకాయిలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను అంచనా దాదాపు రూ.1500 కోట్లు. అంటే వచ్చే ఆస్తిపన్నులో దాదాపు సగం మొత్తం ఈ ఒక్కనెలలోనే వసూలైతే మిగతా 11 నెలలు ఎలా నెట్టుకురావాలన్నదే అధికారుల ఆలోచన. జీహెచ్ఎంసీకి ఉన్న ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నే. వీటిద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీతభత్యాల చెల్లింపులు తదితరమైనవి జరుపుతున్నారు. మున్ముందు వసూలయ్యే ఆస్తిపన్ను తగ్గనున్నందున ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. నేడు రాత్రి 10 గంటల వరకు సీఎస్సీలు పనిచేస్తాయి.. జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును ఆన్‌లైనా ద్వారా, మీసేవా కేంద్రాలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీలు)ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. ఎర్లీబర్డ్ అవకాశానికి చివరి రోజైన శనివారం ప్రజల సదుపాయార్థం జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలోని సీఎస్సీలు రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. గత రెండు సంవత్సరాల్లో కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎర్లీబర్డ్ అవకాశాన్ని ఏప్రిల్ నెలలోనే కాకుండా మే నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో రెండునెలల గడువు ఇచ్చినా ఏ ఒక్క సంవత్సరం కూడా రూ.600 కోట్లు వసూలు కాలేదు. (చదవండి: టైమ్‌సెన్స్ లేక..) -
ఉద్యోగాలు మారడాన్ని బట్టి పన్ను మినహాయింపు ఉంటుందా?
నేను 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారాను. మొదటి యజమాని దగ్గర 7 నెలలు, రెండో యజమాని దగ్గర 5 నెలలు పని చేశాను. ఇద్దరూ ఫారం 16 జారీ చేశారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఇచ్చారు. కానీ రిటర్ను నింపేటప్పుడు ఒక స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే చూపించాలంటున్నారు. ఇది కరెక్టేనా? – ఎ. సూర్యప్రకాశ్, హైదరాబాద్ మీరు అడిగిన ప్రశ్నకి మీ వయస్సుతో సంబంధం లేదు కానీ సాధారణంగా, వయస్సును బట్టి పన్నుభారం మారుతుంది. ఇక మీ సంశయానికి జవాబు ఏమిటంటే, ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలంలో ఎన్న ఉద్యోగాలు చేసినా, మారినా, ఆ ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ ఒక్కసారే .. ఒక మొత్తమే తగ్గించాలి. ఇది ఉద్యోగికి వర్తించే మినహాయింపే తప్ప యజమానులకు సంబంధించినది కాదు. రెండో యజమాని ఫారం 16 జారీ చేసేటప్పుడు, అంతకన్నా ముందు యజమాని ఇచ్చిన ఫారం 16ని చూడాలి. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ విషయంలోనూ ఇలాగే జరిగి ఉంటే రెండో యజమాని ఆ తప్పు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. మీకు మొత్తం మీద రూ. 50,000 మాత్రమే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రూ. 50,000 తగ్గింపు ఇవ్వరు. ఒకసారి మాత్రమే చూపించడం, క్లెయిం చేయడం కరెక్టు పని. ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగవు. నా వయస్సు 52 సంవత్సరాలు. నేను టీచర్ని. నా భార్య వయస్సు 49 సంవత్సరాలు. తను కూడా టీచరే. భువనగిరిలో చెరొక స్కూలులో పని చేస్తున్నాం. ఇది మా స్వస్థలం. మా నాన్నగారు (లేరు) కట్టించిన ఇంట్లో కలిసి కాపురం చేస్తున్నాం. అమ్మ మాతో ఉంటోంది. ఇంటద్దె క్లెయిం చేయవచ్చా? మీ ఇద్దరికీ వచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సు, ఇతరాలు మొదలైనవి ఉంటాయి. నిజంగా మీరు ప్రతినెలా అద్దె చెల్లించినట్లయితే, అలా చెల్లించినందుకు మీ ఆదాయపు లెక్కింపులో అర్హత ఉన్నంత మేరకు మినహాయింపుగా తగ్గిస్తారు. అలా తగ్గించినందు వలన ఆదాయం తగ్గి, పన్ను భారం తగ్గుతుంది. భార్యభర్తలు కలిసి ఒకే గూటి కింద కాపురం.. ఇద్దరూ అద్దె చెల్లించే ఉంటున్నారా? మీరు ఆ ఇంట్లో ఉంటున్నాం అంటున్నారు. అద్దె ఇవ్వడం లేదు. కాబట్టి మీ ఆదాయంలో నుంచి ఇంటద్దె అలవెన్స్‌కి క్లెయిం .. అంటే మినహాయింపు పొందకూడదు. ఇది సబబు కాదు. అయితే, ఒక విధంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. మీ నాన్నగారు కట్టించిన ఆ ఇంటికి వారసులెవ్వరు? మీ అమ్మగారు అనుకుందాం. అంటే మీ అమ్మగారు ఇంటి ఓనరు. ఆవిడ ఇంట్లో మీరు అద్దెకు ఉంటున్నట్లు చెప్పవచ్చు. మీ ఇద్దరిలో ఎవరి జీతం ఎక్కువో వారికి ఈ ప్లానింగ్ బాగుంటుంది. ఇద్దరి జీతం ఇంచుమించు సమానంగా ఉంటే ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు. అద్దె నెలకు రూ. 10,000 అనుకోండి. చెరి సగం మీ అమ్మగారికి ఇవ్వండి. పూర్తి బెనిఫిట్ రావడానికి తగినంతగా అద్దెను లెక్కించండి. మీ అమ్మగారి పాన్ తీసుకోండి. బ్యాంకు అకౌంటు తెరవండి. ఆ అకౌంటులో తూ.చా. తప్పకుండా ప్రతి నెలా అద్దెలు విడివిడిగా జమ చేయండి. ఇలా చేయడం వల్ల వ్యవహారానికి చట్టరీత్యా బలం ఏర్పడుతుంది. ఓనర్, అద్దె, బ్యాంకు ద్వారా చెల్లింపు, పాన్, ఇలా ఇవన్నీ గట్టి రుజువులే. 60 ఏళ్ల లోపు వారికైతే నెలసరి అద్దె రూ. 20,000 దాటితే తప్ప (మీ అమ్మగారికి ఇతరత్రా ఏ ఆదాయం లేదనుకుందాం), 60 సంవత్సరాలు దాటితే రూ. 25,000 వరకూ ఏ పన్ను భారం ఉండదు. మీరే ఆ ఇంటికి ఓనర్ అయితే ఇలా చేయవద్దు. మీరిద్దరూ మీ మొత్తం ఆదాయంలో ఇంటద్దె అలవెన్స్‌ని మినహాయింపుగా పొందవద్దు. తప్పుగా క్లెయిం చేసి ఎటువంటి కష్టాలు కొని తెచ్చుకోకండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు చదవండి : రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
పెట్రో సెగతో ధరల మంట!
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయ చర్య అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు. ఏఆర్‌సీలపై ప్రత్యేక దృష్టి మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యల గురించి ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీలు) విషయంలో నియంత్రణా యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయడంపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఎన్పీఏల సమస్య పరిష్కారం విషయంలో ఏఆర్‌సీలే కీలకమన్న సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మొండి బకాయిల నిర్వహణకు 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించిన ఆస్తుల (రుణాల) పునర్ నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ, ప్రస్తుత అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల క్రియాశీలతకు ఎటువంటి అంతరాయం కలగని రీతిలోనే ప్రతిపాదిత ఏఆర్సీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. మొండి బకాయిల సమస్యను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై బ్యాంకింగ్‌లో అవగాహన, చైతన్యం పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎన్పీఏలకు సంబంధించి తగిన కేటాయింపులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యవేక్షణ విధానాలకు ఆర్బీఐ మరింత పదును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్పీఏల విషయంలో బ్యాంకింగ్ అంతర్గత అంశాలనూ ఆర్బీఐ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. లిక్విడిటీ చర్యల వల్ల ఇబ్బంది లేదు అసెట్ పర్చేజింగ్సహా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్న అంచనాలు సరికాదన్నారు. ఇటువంటి ఇబ్బంది ఏదీ తలెత్తబోదని ఆయన స్పష్టంచేస్తూ, సెంట్రల్ బ్యాంకింగ్ మౌలిక సూత్రాల విషయంలో రాజీ ఉండబోదని అన్నారు. ఎటువంటి రిస్క్ సమస్యలు లేని సావరిన్ (ప్రభుత్వ) బాండ్ల కొనుగోలుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ‘అసెట్ పర్చేజ్’ కార్యక్రమం పరిమితమవుతుందని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు డిజిటల్ (క్రిప్టో) కరెన్సీకి సంబంధించి పలు అంశాల్లో ఆర్బీఐలో అంతర్గతంగా పటిష్ట మదింపు జరుగుతోందని అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రతిపాదిత పత్రాలను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ఆర్బీఐకి ఈ అంశంపై పలు ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆయా అంశాలను కేంద్రంతో చర్చించినట్లు వెల్లడించారు. ఎగుమతులు పెంచాలి... దేశ ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వ్యూహాత్మక ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. దేశీయంగా పటిష్టతేకాకుండా, అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకోడానికి కూడా ఎఫ్‌టీఏలు దోహదపడతాయని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల నేపథ్యలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వేర్వేరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల బహుళవిధ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!
ఒకప్పుడు ఏ కొద్ది మందికో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే ఉద్యోగ విధులు) భాగ్యం ఉండేది. కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అన్నది ఐటీ ఉద్యోగులకు పరిచయమే. కానీ, కరోనా మహమ్మారి వచ్చి.. ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేసుకునేలా చేసింది. తప్పనిసరైన ఏ కొద్ది మందో తప్పించి మిగిలినవారు ప్రస్తుతానికి ఈ విధానంలోనే కొనసాగుతున్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగుల జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీలు, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ ఇందుకు అనుకూలిస్తున్నాయి కూడా. కానీ, నాణేనికి రెండో కోణం కూడా ఉన్నట్టే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించడమే కాదు.. పన్ను పరమైన అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం వల్ల తీసుకుంటున్న కొన్ని రకాల అలవెన్స్‌లు ఇంటి నుంచి చేయడం కారణంగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపులు, వివరణలు వస్తే తప్ప పన్ను చెల్లింపుల బాధ్యత ఉద్యోగులపై ఉంటుంది. ఈ అంశాల గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి అందుకుంటున్న వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) అన్నవి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు కలిగినవి. కానీ, బయటకు వెళితే కరోనా రిస్క్ ఉంటుందన్న కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నప్పుడు.. పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి రోజువారీ రవాణా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మినహాయింపులపై ప్రభావం.. వేతనంలో హెచ్ఆర్ఏ ఒక భాగం. ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటూ.. అద్దె చెల్లింపులు చేస్తున్నట్టయితే నిర్దేశిత పరిమితి మేరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతనంలో నిర్ణీత శాతం, వాస్తవంగా తీసుకున్న హెచ్ఆర్ఏ, వాస్తవంగా చెల్లించిన అద్దె వీటిల్లో ఏది తక్కువ అయితే దానిని మినహాయింపుగా చూపించుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారికి మూల వేతనంలో 50 శాతం, ఇతర పట్టణాల్లో ఉంటున్నట్టు అయితే మూల వేతనంలో 40 శాతాన్ని క్లెయిమ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కారణంగా చాలా మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో.. వారికి ఈ వెసులుబాటు లభించింది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాస్తంత రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వారిది. సొంత ఇల్లు... హెచ్ఆర్ఏ! కొందరు ఇప్పటి వరకు ఉంటున్న అద్దె ఇళ్ల నుంచి తక్కువ అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. హెచ్ఆర్ఏ తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండని వారు కచ్చితంగా ఆ మొత్తంపై పన్ను చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు చెల్లించిన అద్దెతో పోలిస్తే తక్కువ అద్దెకు మారిన వారిపైనా పన్ను భారం ఆ మేరకు పడుతుంది. అలాగే, తమ నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చుకున్న వారి విషయంలోనూ నిబంధనలు మారిపోతాయి. ఎందుకంటే మెట్రో నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వారికి మినహాయింపుల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాలి. ట్రూఅప్ౖపై దృష్టి... ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే సంబంధిత సంవత్సరంలో ఉద్యోగి పన్ను బాధ్యతను కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పన్ను మొత్తాన్ని నెలవాయిదాల రూపంలో వేతనం నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగి సమర్పించిన డిక్లరేషన్.. అదే విధంగా ఆర్థిక సంవత్సరం చివర్లో (జనవరి తర్వాత) ఉద్యోగి ఇచ్చే తుది డిక్లరేషన్, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అదనంగా పన్ను వసూలైందా లేక తక్కువ పన్ను వసూలైందా అన్న నిర్ధారణకు వస్తాయి. దీన్నే ట్రూఅప్‌గా పేర్కొంటారు. కనుక ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఉద్యోగి తప్పకుండా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంటి అద్దెలో మార్పులు జరిగినా లేక నివాసిత ప్రాంతం మారిపోయినా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్ను వసూలు పరంగా మార్పులు, చేర్పులకు వీలు కలుగుతుంది. ఎల్‌టీఏ... ప్రయోజనం పోయినట్లే! ఎల్‌టీఏ విషయంలో నాలుగు సంవత్సరాలను ఒక బ్లాక్‌గా పరిగణి స్తారు. ఒక బ్లాక్ కాలంలో రెండు పర్యటనల కోసం వాస్తవంగా చేసిన ఖర్చుకు పన్ను మినహాయింపును కోరొచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018–2021గా అమల్లో ఉంది. ఎల్‌టీఏ మినహాయింపును ఒక బ్లాక్‌లో వినియోగించుకోని పరిస్థితుల్లో తదుపరి బ్లాక్‌కు దాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే తదుపరి బ్లాక్‌లో మొదటి సంవ్సరంలోనే దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ.. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనల పట్ల ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, కరోనా ఎప్పుడు సమసిపోతుందో తెలియని పరిస్థితుల్లో.. సమీప కాలానికీ పర్యటనల ప్రణాళికలు పెట్టుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా.. అనువైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కరెంటు, ఇంటర్నెట్ వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ల రూపంలో మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ, ఇటువంటి ప్రోత్సాహకాల గురించి ఆదాయపన్ను చట్టంలో స్పష్టంగా ఇప్పటి వరకు అయితే నిర్దేశించలేదు. కనుక ఈ విధమైన అలవెన్స్‌లు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. -
అన్నం లేదు.. ఆవకాయే
ఏ బడ్జెట్లో అయినా అందరినీ ఆకర్షించేది ఆదాయపు పన్నే!!. ఎందుకంటే అంతిమంగా తన జేబులో ఎంత మిగులుతుందన్నదే వేతనజీవి వెదుక్కుంటాడు. అలాంటి వేతనజీవికి... పన్ను రేట్లు తగ్గిస్తున్నామంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చక్కని విందు భోజనంలా కనిపించింది. ఎంత మమకారమో... అనుకున్నాడు. కానీ... తగ్గింపు రేట్లు కావాలనుకునేవారికి పన్ను మినహాయింపులేవీ ఉండవని ఆమె చెప్పేసరికి.. అన్నం లేకుండా ఆవకాయ వడ్డించినట్లయింది. అమ్మో... కారం!!. పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక పక్కన ప్రకటిస్తూనే.. మరో పక్క పన్ను మినహాయింపులను భారీగా తొలగించడం ద్వారా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వేతనజీవుల్ని దొంగ దెబ్బ తీశారు. కొన్ని ఆదాయవర్గాలకు సగానికి సగం పన్ను తగ్గినట్లు చూపించినా.. స్టాండర్డ్ డిడక్షన్, ఇంటి అద్దె అలవెన్స్, చాప్టర్ 6 –ఎ కింద లభించే సెక్షన్ 80–సీ వంటి మినహాయింపులు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ వంటి కీలక మినహాయింపులను తొలగించారు. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థికమంత్రి ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులను ప్రతిపాదించారు. రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఏడు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గతంలో మాదిరే 5 శాతం పన్ను ఉన్నా దానిపై పూర్తిస్థాయి పన్ను రిబేటు లభిస్తుందని సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి... పాత విధానం ప్రకారం వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపు ప్రయోజనాలు ఉండవని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. అయితే కొత్త విధానానికి మారాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? అన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమంటూ... నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా వారికే వదిలిపెట్టారు. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేసే విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 100 మినహాయింపుల్లో 70 తొలగించినట్లు మంత్రి ప్రకటించారు. పన్ను రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు తెలియజేశారు. ‘‘పన్ను మినహాయంపులు వేటినీ లెక్కించకపోతే రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో రూ.78,000 ప్రయోజనం లభిస్తోంది. పాత విధానంలో వారు రూ.2.73 లక్షల పన్ను కట్టాల్సి వస్తే కొత్త విధానంలో రూ.1.95 లక్షలు కడితే సరిపోతుంది’’అని నిర్మల చెప్పారు. కానీ వాస్తవంగా పాత విధానంలో మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే కొత్త విధానంలో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుందని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. తొలగించిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులివే... వివాద్ సే విశ్వాస్ ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్ సే విశ్వాస్’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించి 4.83 లక్షల కేసులు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించుకోవాలనుకునే వారు ఈ పథకం కింద వివాదంలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలునని స్పష్టంచేశారు. ‘‘మార్చి 31, 2020లోగా చెల్లించేవారికి పెనాల్టీలు, వడ్డీలు వంటివేమీ ఉండవు. అప్పటి నుంచి జూన్ 30, 2020లోగా చెల్లించే వారు మాత్రం కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత మాత్రం ఈ పథకం అమల్లో ఉండదు’’అని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది బడ్జెట్లో పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్కా వికాస్ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 1.89 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, వీటి ద్వారా రూ.39,000 కోట్ల బకాయిలను వసూలు చేశామని వివరించారు. ఈ–కామర్స్ లావాదేవీలపై 1% టీడీఎస్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ–కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ ఉన్న పక్షంలో ఈ నిబంధన వర్తించదు. దీన్ని అధ్యయనం చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించగా .. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ స్పందించలేదు. -
కార్పొరేట్ పన్ను కోతకు బిల్లు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్ పన్ను తగ్గింపునకు ఉద్దేశించిన ఈ బిల్లును అంతక్రితం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టారు. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతం ఇవ్వడానికి కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ, సెప్టెంబర్ 20వ తేదీన కేంద్రం ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్, 2019ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఐఎఫ్ఎస్సీ అథారిటీ దిశలో... కాగా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ) అధారిటీ బిల్లు, 2019ని కూడా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐఎఫ్‌ఎస్‌సీలకు సంబంధించి ఏకీకృత ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఏర్పాటు ఈ బిల్లు లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏర్పాటయ్యే అథారిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. చైర్మన్ నేతృత్వంలో పనిచేసే అథారిటీలో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఇద్దరు ప్రభుత్వ నామినీలు ఉంటారు. సెలెక్ట్ కమిటీ సిఫారసులతో మరో ఇరువురినీ ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అన్ని ఫైనాన్షియల్ సేవల ఏకీకృత నియంత్రణ ప్రతిపాదిత అథారిటీ ఏర్పాటు లక్ష్యం. ఐఎఫ్‌ఎస్‌సీల్లో ప్రస్తుతం బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, బీమా రంగాలు ఉంటే, వాటని ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ వంటి విభిన్న రెగ్యులేటర్లు నియంత్రిస్తున్నాయి. సెంట్రల్ జీఎస్టీ @ రూ.3.26 లక్షల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లని వివరించారు. -
మార్కెట్ పంచాంగం
కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం విక్రయిస్తున్నారు. ఈ రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగితే...వీటికే సూచీల్లో అధిక వెయిటేజీ వున్నందున, మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం వుంటుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,923 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 37,633 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 1150 పాయింట్ల భారీ నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 37,950 పాయింట్ల తొలి అవరోధాన్ని అధిగమించి, స్థిరపడితేనే డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుంది. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే 38,300–38,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది. ఈ వారం సెన్సెక్స్ తొలి అవరోధంపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,540 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 37,305 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 11,260 గతవారం ప్ర«థమార్థంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,554 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన తర్వాత ... చివరిరోజున 11,158 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 337 పాయింట్ల నష్టంతో 11,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల సమీపంలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితేనే మార్కెట్ క్షీణతకు అడ్డుకట్టపడుతుంది. అటుపైన 11,370–11,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 11,500 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 11,110 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,060 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
పన్ను మినహాయింపులకు స్వస్తి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపునకు రంగం సిద్ధమయ్యింది. వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను క్రమేపీ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి వీలుకల్పిస్తూ... ఇతర పన్ను మినహాయింపుల్ని రద్దుచేయడానికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తయారు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్లోనే కార్పొరేట్ టాక్స్ తగ్గింపును ప్రతిపాదించారు. ఇదే సమయంలో కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను క్రమేపీ ఉపసంహరించనున్నట్లు కూడా ప్రకటించారు. సీబీడీటీ తాజా ముసాయిదా ప్రకారం కంపెనీలు పొందుతున్న ప్రత్యేక రాయితీలకు (సన్‌సెట్ క్లాజ్ కింద) తుది గడువును మార్చి 31, 2017గా నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ ప్రత్యేక మినహాయింపులను పునరుద్ధరించడం, పొడిగించడం జరగదు. తుది గడువు (టెర్మినల్ డేట్) లేకుండా పొందుతున్న పన్ను మినహాయింపులకు కూడా మార్చి 31, 2017నే తుది గడువు. కొన్ని రంగాలను ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని పత్యేక పన్ను మినహాయింపులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్ఫ్రా రంగం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, వాణిజ్యపరంగా సహజ, ఖనిజ చమురును ఉత్పత్తి చేసే సంస్థలు ఈ సన్‌సెట్ క్లాజ్ కింద ప్రత్యేక పన్ను మినహాయింపులు పొందుతున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించనుండటంతో ఆ మేరకు ఈ పన్ను మినహాయింపులకు మంగళం పాడాలని కేంద్రం ఆలోచన. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కంపెనీలు చేసే వివిధ వ్యయాలపై లభించే పన్ను మినహాయింపులు ఆగిపోతాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆస్తుల తరుగుదలపై లభించే 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపును 60 శాతానికి, పరిశోధనలకు చేసే వ్యయంపై లభించే 200 శాతం తరుగుదలను 100 శాతానికి, అలాగే వివిధ వ్యవసాయ గిడ్డంగులు, చౌక గృహాలకు ఇచ్చే 150 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను పూర్తిగా రద్దు కానున్నాయి. ఈ ప్రతిపాదనలపై 15 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను తెలపవచ్చని సీబీడీటీ తెలిపింది. దేశీయ పన్నుల విధానాన్ని సరళంగా, మరింత పారదర్శకంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ మినహాయింపులు పొందే విషయంలో కంపెనీలకు సీబీడీటీ మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో వీటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. కానీ ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఇప్పటి వరకు లభిస్తున్న పన్ను రాయితీలు రద్దు కానుండటంతో వీటి భవిష్యత్తుపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలు తగ్గుతాయ్.. పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించడం వల్ల వివాదాలు, కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీని వల్ల పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఇతర దేశాలతో మరింతగా పోటీపడగలదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో తెలిపారు. -
ఎప్పుడూ పన్ను గొడవేనా?
- అదే ఆలోచనతో ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు వద్దు - మినహాయింపు వర్తించేంతవరకే పెట్టుబడి - దాన్ని మించి ఇన్వెస్ట్ చేసినా లాభం ఉండదు రమేష్‌కు ఎప్పుడూ పన్ను మినహాయింపుల గొడవే. ఏది కొన్నా... ఎందులో ఇన్వెస్ట్ చేసినా... దీనివల్ల పన్ను ఆదా అవుతుందా? ఇలాగైతే ఐటీ నుంచి మినహాయింపు ఉంటుందా? అని ఆలోచిస్తుంటాడు. నిజానికి ఏడాదికి లక్ష రూపాయలవరకూ పన్ను కోత పడుతోంది కనక రమేష్ అలా ఆలోచించటంలో అర్థం లేకపోలేదు. కాకపోతే ఏ పనిచేసినా దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయటం వల్ల... ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశమూ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.. ఎవ్వరికైనా కట్టాల్సిన పన్ను గురించి మాత్రమే కాదు.. మినహాయింపులు పొందేందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే, ఆఖరు నిమిషం హడావుడిలో ఒకోసారి పన్ను ప్రయోజనాలకు మించి పెట్టుబడులు పెట్టి ఇరుక్కుపోయే ప్రమాదముంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద వివిధ సాధనాల్లో దాదాపు రూ.1.5 లక్షల దాకా చేసే ఇన్వెస్ట్మెంట్లకు మినహాయింపు లభిస్తుంది. ఈ పూర్తి మొత్తానికి సరిపడా పెట్టుబడులు పెట్టి, మినహాయింపు పొందగలిగితే మంచిదే. కానీ అలా జరగకుంటేనే చిక్కు. ఎంతో కొంత ప్రయోజనం వస్తుంది కదాని... అనువు కాని సాధనాలను ఎంపిక చేసుకుంటే.. ఏటా భారీ మొత్తాలు కట్టుకుంటూ పోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఆర్థిక ప్రణాళిక దెబ్బ తినొచ్చు. అలా జరగకుండా ముందునుంచే కొంత ప్లానింగ్ ఉంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు. ఏటేటా కొనసాగించాల్సిన పెట్టుబడులు.. కొన్ని సార్లు పన్ను మినహాయింపులు పొందే ప్రయత్నంలో అనుకోకుండా.. తప్పనిసరిగా కొనసాగించాల్సిన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. దీనివల్ల మిగతావి ఎలా ఉన్నా సరే ముందు పెట్టిన పెట్టుబడి పోకుండా చూసుకునేందుకు ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంటుంది. దీంతో లక్ష్యానికి మించి పెట్టుబడులు పెట్టాల్సి రావడం వల్ల ఆర్థిక భారం పెరిగిపోతుంటుంది. అవసరమైన కవరేజీకి మించిన జీవిత బీమా ప్రీమియంలు మొదలైనవి దీనికి ఉదాహరణలు. కాబట్టి, అనవసర భారం పడకుండా.. అవసరమైనంత కవరేజీకి మాత్రమే ప్రీమియాలు, పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. ప్లానింగ్ కీలకం.. సరైన ప్లానింగ్ అంటూ లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సెక్షన్ 80సీ కింద దక్కే మినహాయింపులు పొందడం సాధ్యపడదు. వాస్తవానికి మనం గుర్తించని కొన్ని సాధనాలు వాటంతటవే పన్ను పరమైన ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి) కూడా ఒకటి. కానీ మనం లెక్కలు వేసుకునేటప్పుడు సాధారణంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోతుంటాం. మినహాయింపు కోసం ఇంకా భారీ మొత్తాలు కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందేమోనని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి చిన్న వాటిని కూడా గుర్తుపెట్టుకుని ప్లానింగ్‌లో భాగం చేయగ లిగితే అనవసరమైన అధిక పెట్టుబడులు పెట్టే సమస్య ఉండదు. సమీక్షించుకోవటం ముఖ్యం.. సంవత్సరం చివర్లో కాకుండా మధ్య మధ్యలో సెక్షన్ 80సీ ప్రయోజనాలకు అనువైన పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి. దీనివల్ల మనం ఇప్పటిదాకా చేసిన పెట్టుబడికి ఎంత మినహాయింపులు వస్తాయి, మనపై భారం పడకుండా భవిష్యత్‌లోనూ ప్రయోజనాలు చేకూర్చే సాధనాల్లో ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లాంటివి తెలుస్తాయి. అప్పుడు ఆఖరు నిమిషంలో హడావుడి పడనక్కర్లేదు. కొంత మొత్తం పన్ను ప్రయోజనాలు పొందేందుకు భారీ మొత్తాలను అనవసరమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా.. మెరుగైన రాబడులు ఇచ్చే వాటిల్లో పెట్టుబడులు పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. రిస్కులూ తగ్గుతాయి.